విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ | Malaysia Prime Minister Najib Razak's step-grandmother was on MH17 | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ

Published Sat, Jul 19 2014 10:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ

విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ

ఎమ్హెచ్ 17 విమాన ప్రమాదంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ మృతి చెందారు. ఆ విషయాన్ని మలేషియా దేశ రక్షణ మంత్రి, ప్రధాని నజీబ్ రజాక్ సోదరుడు హిషమ్ముద్దీన్ హుస్సేన్ వెల్లడించారు. తమ సవతి అమమ్మ విమాన ప్రమాదంలో మరణించారని వెల్లడిస్తూ ఆమె ఫొటోను హుస్సేన్ ట్విట్టర్ పెట్టారు. అమీరహ్ స్వస్థలం ఇండోనేషియా అని చెప్పారు. ఇండోనేషియాలోని జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు ఆమె ఒంటరిగా ఆమ్స్టర్డామ్లో విమానం ఎక్కారని తెలిపారు. 

 

రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో... బంధు మిత్రులతో ఆనందంగా ఆ పండగ చేసుకునేందుకు వస్తున్న తరుణంలో ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. శ్రీసిటి అమీరహ్ను తమ తాత మహ్మద్ నవోహ్ ఒమర్ రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. తాను తన సోదరుడు నజీబ్ రజాక్ కజిన్స్ అని ఈ సందర్బంగా హిషమ్ముద్దీన్ హుస్సేన్ వివరించారు.

 

ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement