Malaysia Prime Minister
-
అలనాటి సూపర్ హిట్ సాంగ్ పాడి అలరించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత సినిమాకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపే వేరు. అది ఈ మధ్యకాలంలోనే దక్కుతుందని అనుకుంటే పొరపాటే. దశాబ్దాల క్రితమే మన సినిమా ఖండాంతరాలు దాటిపోయింది. ముఖ్యంగా.. పొరుగు దేశాల్లో మన చిత్రాల దక్కే ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా భారత పర్యటనకు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. ఆ అభిమానమే ప్రదర్శించారు. మలేషియా ప్రధాని హోదాలో ఇబ్రహీం తొలిసారి భారత్‌కు వచ్చారు. మూడు రోజుల పర్యటన ముగియడంతో.. ఢిల్లీ తాజ్ మహల్ హోటల్లో ఆయనకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో 60వ దశకం నాటి పాపులర్ పాటను ఆలపించారాయన. రాజ్ కపూర్ ‘సంగమ్’(1964) కోసం గాయకుడు ముకేష్ ఆలపించిన ‘దోస్త్ దోస్త్ నా రహా’.. ఈనాటికీ గుర్తుండిపోయింది. ఆ పాటనే మలేషియా ప్రధాని ఇబ్రహీం పాడి వినిపించారు. మ్యూజిక్ సిబ్బంది భుజాలపై చేతులు వేసి మరీ సరదాగా పాడి అక్కడున్నవాళ్లను అలరించారాయన.Watch: Malaysian PM #AnwarIbrahim sings the famous song 'Dost Dost Na Raha' from the movie Sangam during his first visit to India as Prime Minister.#ViralVideo #Viral #Malaysia pic.twitter.com/NMrafjHBKG— TIMES NOW (@TimesNow) August 22, 2024 Video Credits: TIMES NOW -
Malaysia PM: సాక్ష్యాధారాలు సమర్పిస్తే జకీర్ నాయక్‌ను అప్పగిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే విషయంలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సానుకూలంగా స్పందించారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్‌కు అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. భారత్‌లో పర్యటిస్తున్న ఇబ్రహీం బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మలేషియాలో జకీర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ దేశ భద్రతకు జకీర్ వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనంతవరకు, ఎలాంటి సమస్యలు రానంత వరకు అతడి విషయంలో తాము కలుగజేసుకోబోమని తెలిపారు. అయితే, తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టప్రకారం భారత్ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. -
కరోనా: క్వారెంటైన్‌లోకి మరో ప్రధాని
కౌలాలంపూర్: కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ఆగేలా కనబడటం లేదు. తాజాగా మరో ప్రధానమంత్రి కరోనా ధాటికి క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మలేసియా ప్రధాన మంత్రి ముహిద్దీన్ యాసిన్ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటారని ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ వారం ఆయనతో జరిగిన సమావేశానికి హాజరైన ఒక అధికారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణయింది. దీంతో గృహ నిర్బంధంలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ముహిద్దీన్ యాసిన్‌కు కరోనా వైరస్ సోకలేదని వైద్య పరీక్షల్లో తేలింది. అయితే సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ స్క్రీనింగ్ చేయించుకుని, హోమ్ క్వారైంటన్లో ఉండాలని ఆదేశించినట్టు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇంతకుముందు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(55) కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ముందుగా హోం క్వారంటైన్లోకి వెళ్లిన ఆయన తర్వాత వ్యాధి ముదరడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించడంతో బోరిస్ జాన్సన్ కోలుకున్నారు. కాగా, కోవిడ్-19 సోకడంతో స్పానిష్ రాణి మారియా థెరిసా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. (ఊరట: కోవిడ్-19 మరణాల రేటు తగ్గుదల) -
విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ
ఎమ్హెచ్ 17 విమాన ప్రమాదంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ మృతి చెందారు. ఆ విషయాన్ని మలేషియా దేశ రక్షణ మంత్రి, ప్రధాని నజీబ్ రజాక్ సోదరుడు హిషమ్ముద్దీన్ హుస్సేన్ వెల్లడించారు. తమ సవతి అమమ్మ విమాన ప్రమాదంలో మరణించారని వెల్లడిస్తూ ఆమె ఫొటోను హుస్సేన్ ట్విట్టర్ పెట్టారు. అమీరహ్ స్వస్థలం ఇండోనేషియా అని చెప్పారు. ఇండోనేషియాలోని జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు ఆమె ఒంటరిగా ఆమ్‌స్టర్‌డామ్‌లో విమానం ఎక్కారని తెలిపారు. రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో... బంధు మిత్రులతో ఆనందంగా ఆ పండగ చేసుకునేందుకు వస్తున్న తరుణంలో ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. శ్రీసిటి అమీరహ్ను తమ తాత మహ్మద్ నవోహ్ ఒమర్ రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. తాను తన సోదరుడు నజీబ్ రజాక్ కజిన్స్ అని ఈ సందర్బంగా హిషమ్ముద్దీన్ హుస్సేన్ వివరించారు. ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే.