అలనాటి సూపర్‌ హిట్‌ సాంగ్‌ పాడి అలరించిన ప్రధాని | Malaysia PM Sings Indian Song Dost Dost Na Raha, Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: మలేషియా ప్రధాని నోట భారతీయ పాట

Published Fri, Aug 23 2024 8:00 AM | Last Updated on Fri, Aug 23 2024 8:22 AM

Malaysia PM Sings Indian Song Dost Dost Na Raha, Video Goes Viral

న్యూఢిల్లీ: భారత సినిమాకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపే వేరు. అది ఈ మధ్యకాలంలోనే దక్కుతుందని అనుకుంటే పొరపాటే. దశాబ్దాల క్రితమే మన సినిమా ఖండాంతరాలు దాటిపోయింది. ముఖ్యంగా.. పొరుగు దేశాల్లో మన చిత్రాల దక్కే ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా భారత పర్యటనకు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం.. ఆ అభిమానమే ప్రదర్శించారు. 

మలేషియా ప్రధాని హోదాలో ఇబ్రహీం తొలిసారి భారత్‌కు వచ్చారు. మూడు రోజుల పర్యటన ముగియడంతో.. ఢిల్లీ  తాజ్‌ మహల్‌ హోటల్‌లో ఆయనకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో 60వ దశకం నాటి పాపులర్‌ పాటను ఆలపించారాయన. 

రాజ్‌ కపూర్‌ ‘సంగమ్‌’(1964) కోసం గాయకుడు ముకేష్‌ ఆలపించిన ‘దోస్త్‌ దోస్త్‌ నా రహా’.. ఈనాటికీ గుర్తుండిపోయింది. ఆ పాటనే మలేషియా ప్రధాని ఇబ్రహీం పాడి వినిపించారు. మ్యూజిక్‌ సిబ్బంది భుజాలపై చేతులు వేసి మరీ సరదాగా పాడి అక్కడున్నవాళ్లను అలరించారాయన.

 Video Credits: TIMES NOW 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement