Hishammuddin Hussein
-
విమాన ప్రమాదం మృతుల్లో ప్రధాని అమ్మమ్మ
ఎమ్హెచ్ 17 విమాన ప్రమాదంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ మృతి చెందారు. ఆ విషయాన్ని మలేషియా దేశ రక్షణ మంత్రి, ప్రధాని నజీబ్ రజాక్ సోదరుడు హిషమ్ముద్దీన్ హుస్సేన్ వెల్లడించారు. తమ సవతి అమమ్మ విమాన ప్రమాదంలో మరణించారని వెల్లడిస్తూ ఆమె ఫొటోను హుస్సేన్ ట్విట్టర్ పెట్టారు. అమీరహ్ స్వస్థలం ఇండోనేషియా అని చెప్పారు. ఇండోనేషియాలోని జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు ఆమె ఒంటరిగా ఆమ్స్టర్డామ్లో విమానం ఎక్కారని తెలిపారు. రంజాన్ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో... బంధు మిత్రులతో ఆనందంగా ఆ పండగ చేసుకునేందుకు వస్తున్న తరుణంలో ఆమె మృతి చెందారని పేర్కొన్నారు. శ్రీసిటి అమీరహ్ను తమ తాత మహ్మద్ నవోహ్ ఒమర్ రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. తాను తన సోదరుడు నజీబ్ రజాక్ కజిన్స్ అని ఈ సందర్బంగా హిషమ్ముద్దీన్ హుస్సేన్ వివరించారు. ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
విమానం ఏమైందో... ఆచూకీ తెలిసే వరకు...
ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన విమానం ఏమైందో అర్థంకావడం లేదని... అయితే ఆ విమానం జాడ కనుగొనే వరకు విశ్రమించేది లేదని మలేషియా ప్రభుత్వం స్సష్టం చేసింది. విమానం అదృశ్యమై వంద రోజులు పూరైన సందర్బంగా ఆ దేశ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఈ మేరకు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల అదృశ్యంతో వారి బంధువులు తీవ్ర వేదనతో చెందుతున్నారని.... ఆ విషయాన్ని తమ ప్రభుత్వం మనస్పూర్తిగా అర్థం చేసుకుందని ఆ దేశ రవాణశాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ వివరించారు. అయితే విమానం అదృశ్యమై ఇంత కాలమైన తమ బంధువులు ఏమైయ్యారో అర్థం కావడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలేషియా విమానం జాడ కనుక్కోవడం మలేషియా ప్రభుత్వ తీవ్ర వైఫల్యమేనని ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 227 మంది ప్రయాణికులు... 12 మంది సిబ్బందితో మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. అయితే కొన్ని గంటల వ్యవధిలో ఆ విమానం మలేషియా ఎయిర్పోర్ట్ ఏటీసీతో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అనాటి నుంచి జాడ తెలియకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయు ఉన్న విషయం విదితమే.