విమానం ఏమైందో... ఆచూకీ తెలిసే వరకు...
ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన విమానం ఏమైందో అర్థంకావడం లేదని... అయితే ఆ విమానం జాడ కనుగొనే వరకు విశ్రమించేది లేదని మలేషియా ప్రభుత్వం స్సష్టం చేసింది. విమానం అదృశ్యమై వంద రోజులు పూరైన సందర్బంగా ఆ దేశ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఈ మేరకు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల అదృశ్యంతో వారి బంధువులు తీవ్ర వేదనతో చెందుతున్నారని.... ఆ విషయాన్ని తమ ప్రభుత్వం మనస్పూర్తిగా అర్థం చేసుకుందని ఆ దేశ రవాణశాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ వివరించారు. అయితే విమానం అదృశ్యమై ఇంత కాలమైన తమ బంధువులు ఏమైయ్యారో అర్థం కావడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలేషియా విమానం జాడ కనుక్కోవడం మలేషియా ప్రభుత్వ తీవ్ర వైఫల్యమేనని ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చి 8వ తేదీన 227 మంది ప్రయాణికులు... 12 మంది సిబ్బందితో మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. అయితే కొన్ని గంటల వ్యవధిలో ఆ విమానం మలేషియా ఎయిర్పోర్ట్ ఏటీసీతో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అనాటి నుంచి జాడ తెలియకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయు ఉన్న విషయం విదితమే.