Malaysia Airlines Flight
-
ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
-
శిథిలాలను పరీక్షిస్తున్న ఎమ్హెచ్ 370 శోధన బృందం
సిడ్నీ : అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎమ్హెచ్ 370 విమానం మిస్టరీ ఛేదించేందుకు ఆస్ట్రేలియా నిరంతరాయంగా శోధన కొనసాగిస్తుంది. అందులోభాగంగా ఇటీవల నూతనంగా దొరికిన శిథిలాలను ఆస్ట్రేలియా శోధన బృందం పరిశీలిస్తుందని ఆ దేశ ట్రాన్స్‌ఫోర్ట్ సేఫ్టీ బ్యూరో అధికార ప్రతినిధి శుక్రవారం సిడ్నీలో వెల్లడించారు. మెడగాస్కర్‌లో లభించిన శిథిలాలను ఇప్పటికే పరిశీలించినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలోని దక్షిణ కోస్తా తీరంలో దొరికిన ఓ శిథిలం పూర్తిగా శిథిలమైందని పేర్కొన్నారు. ఆ మూడు శిథిలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు ఎనిమిది శిథిలాలు లభించాయని... అవన్నీ పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోనివే అని స్పష్టం చేశారు. వాటిలో ఐదు మాత్రం ఈ విమానానికి చెందినవి అయి ఉండవచ్చు అని అన్నారు. మరో మూడు శిథిలాలను మాత్రం పరీక్ష చేస్తున్నట్లు చెప్పారు. 2014 మార్చి 8వ తేదీన 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. ఆ విమానంలో బయలుదేరిన కొద్ది సేపటికే గల్లంతైంది. ఆ విమాన ఆచూకీ కోసం ప్రపంచ దేశాలు కలసి జల్లెడ పట్టిన ఇప్పటి వరకు వీసమెత్తు ఆచూకీ కూడా కనుక్కోలేకపోయిన సంగతి తెలిసిందే.ఈ విమాన ఆచూకీ కోసం ఆస్ట్రేలియా శోధన బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. -
ఆ శిథిలాలు... ఆ విమానానివే !
కౌలాలంపూర్ : దక్షిణాఫ్రికా, మారిషస్‌లో దొరికిన శిథిలాలు రెండేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎమ్హెచ్ 370 విమానానివే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మలేషియా రవాణా శాఖ మంత్రి లీవో టింగ్ లాయి గురువారం మాట్లాడుతూ.... సదరు విమాన శిథిలాలను అంతర్జాతీయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. అవి గల్లంతైన ఎమ్హెచ్ 370 విమాన శిథిలాలేనని వారు పేర్కొన్నారని తెలిపారు. అలాగే ఈ శిథిలాలను దాదాపు 13 దర్యాప్తు బృందాలు పరిశీలించాయని కూడా తెలిపారు. ఈ ఏడాది మార్చిలో మొజాంబిక్‌లో దొరికిన శిథిలాలను పరిశీలించగా అవి ఎమ్హెచ్ 370 విమానంకు చెందినవే గుర్తించినట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో దొరికిన ఇంజన్‌లోని పరికరంపై రోల్స్ రాయిస్ సంస్థ గుర్తు ఉందని.... అలాగే రోడ్రిగస్ ద్వీపంలో విమాన క్యాబిన్‌లోని అంతర్గత ప్యానల్ ముక్క దొరికిందని మంత్రి లీవో గుర్తు చేశారు. ఆ రెండు శిథిలాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. ఈ మేరకు మలేషియాన్ స్టార్ వెల్లడించింది. 2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... నాటి నుంచి ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన సంగతి తెలిసిందే. -
ఆ విమాన శిథిలాలు అక్కడే దొరకవచ్చు !
వాషింగ్టన్ : రెండేళ్ల క్రితం ఆదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన శకలాలు పశ్చిమ ఆఫ్రికా తీరంలో దొరికే అవకాశం ఉందని ఎన్బీసీ వార్తా సంస్థ గురువారం వాషింగ్టన్లో తన నివేదికలో వెల్లడించింది. ఆ విమాన శకలాలు ముంజాబిక్, మెడాగస్కర్ మధ్య లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సదరు ప్రాంతంలో ఆ విమానానికి సంబంధించిన శిథిలాలకు సంబంధించిన చిత్రాలను యూఎస్, మలేషియా, ఆస్ట్రేలియాన్ నావికులు గుర్తించినట్లు తెలిపింది. ఇదే ప్రాంతంలో ఎంహెచ్ 370 కి చెందిన పోడవైన విభాగంకు చెందిన వస్తువును ఎన్బీసీ పేర్కొంది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ మాత్రం ధృవపరచలేదు. మొజాంబిక్ అధికారులు కూడా సదరు ప్రాంతాంలో విమాన శిథిలాలు దొరికినట్లు సమాచారం లేదని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దీంతో అదృశ్యమైన విమానం మిస్టరీ ఎప్పటికీ వీడేనో. -
సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
చెన్నై: 230 మంది ప్రయాణికులతో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేసియా ఎయిర్ లైన్స్ విమానంలో గురువారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. ఆ విషయాన్ని గమనించిన పైలెట్ వెంటనే మలేసియా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించాడు. దాంతో వారు వెంటనే భారత్‌లోని చెన్నై విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. సదరు విమానాన్ని దింపేందుకు చెన్నై విమానాశ్రయ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో మలేసియా విమానం చెన్నై విమానాశ్రయంలో దిగింది. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని చెన్నై అధికారులు సరి చేశారు. ఆ తర్వాత విమానం కౌలాలంపూర్ బయలుదేరి వెళ్లిందని చెన్నై విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మలేసియా ఎయిర్ లైన్స్ విమానం సాంకేతిక లోపం ఏర్పడిన సమయంలో భారత గగన తలంపై ఉందని చెప్పారు. -
అసలు ఆ విమానం జాడ తెలిసేనా ?
అదేమిటోగాని చూడబోతే 'విధి చేయూ వింతలన్నీ మతిలేని చేష్టలు' లాగానే ఉన్నాయి. నిన్న గాక మొన్న ఇండోనేసియాలో 54 మందితో వెళ్తు కుప్పకూలిన విమానం ఆచూకీ 12 గంటల్లో ఆచూకీ కనుగొన్నారు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న విమానం, హెలికాప్టర్ కానీ ఆదృశ్యమైనా... ఇట్టే గాలింపు జరిపి అట్టే ఆచూకీ కనుగొంటున్నారు. కానీ గతేడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ మాత్రం ఇప్పటికీ అతీగతి లేదు. గత నెలలో ఫ్రెంచ్ ద్వీపం రీయూనియన్ వద్ద కనుగొన్న విమాన శకలాలు సదరు విమానానివే అంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. దాంతో గల్లంతైన విమాన ప్రయాణికుల బంధువుల్లో ఆశలు చిగురించాయి. ఇంతలో విమాన శకలాల కోసం మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందితో రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించాయి. దాదాపు 10 రోజుల పాటు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చిన్న ముక్క కూడా కనుక్కోలేకపోయారు. దాంతో విసుగొచ్చిందో ఏమో... ఆ విమానాన్ని వెతుకులాడేందుకు చేపట్టిన చర్యలను తగ్గించేస్తున్నట్లు ఫ్రాన్స్ సోమవారం ప్రకటించింది. ఈ వార్త విని ఎంహెచ్ 370 విమాన ప్రయాణికుల బంధువులు మళ్లీ తీవ్ర నిరాశలోకి కురుకుపోయారు. ప్రమాదం జరిగిన అన్నిలోహవిహంగాల సమాచారం దొరుకుతున్నాయే కానీ... గగనంలోకి ఎగిరిన ఈవిమానం జాడ మాత్రం అంతుచిక్కడం లేదు... ఇవాళ కాకుంటే రేపైనా...రేపు కాకుంటే ఎల్లుండైనా... విమాన ఆచూకి తెలుస్తుందని వారంతా చిగురంత ఆశతో బతుకుతున్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎంహెచ్ 370 విమానం గతేడాది మార్చి 8న మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే మలేసియా విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచ దేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. అసలు ఆ విమానం ఏమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా ? లేక మరణించారా ? ఆ విమానం జాడ తెలుస్తోందా ? అనే ప్రశ్నలతో సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఎంహెచ్ 370 విమానంలోని ప్రయాణికులంతా మరణించారని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వ ప్రకటనను ప్రయాణికుల బంధువులు మాత్రం విశ్వసించడం లేదు. దీనిపై తమకు పూర్తి ఆధారాలు కావాలని వారు పట్టుబడుతున్న విషయం విదితమే. -
విమానం కోసం 'రెండింతల' గాలింపు!
కౌలాలంపూర్:ఎమ్ హెచ్ 370.. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం. మార్చి 8, 2014న ఐదుగురు భారతీయులతో సహా 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరిన ఆ విమానం అదృశ్యమై సంవత్సరం పైగా కావొస్తున్నా.. ఇప్పటి వరకూ ఆచూకీ అయితే లేదు. ఎమ్ హెచ్ 370 విమాన అదృశ్య ఘటనకు సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. ఆ విమాన జాడ కనిపెట్టేందుకు మలేషియా ప్రభుత్వం మాత్రం తమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తోంది. విమాన శకలాలను కనుగొనేందుకు ప్రపంచ దేశాల సహాయం తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మిగలడంతోమరో అడుగు ముందుకేయాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటివరకూ దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమిటర్ల మేర విమాన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో.. అదనంగా మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమాన ఆచూకీ మే నెల లోపు దొరకపోతే మాత్రం ఈ మేరకు ప్రయాత్నాలు చేపట్టాలని మలేషియా యోచిస్తోంది. అందుకు మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనాలు మరోసారి భాగస్వామ్యం కావడానికి సన్నద్ధమవుతున్నాయి. -
ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చేపట్టండి ... ప్లీజ్
బీజింగ్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని ... ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 239 మంది ప్రయాణికులు మరణించారని మలేసియా ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద ఘటనపై చైనా ప్రభుత్వం శుక్రవారం స్పందించింది. విమాన ఆచూకీ కనుగొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మలేసియా ప్రభుత్వానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ విజ్ఞప్తి చేశారు. విమాన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బంగాళాఖాతంలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్లు మేర ప్రపంచ దేశాల సహాయంతో విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయిందని లీ కెకియాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం ఇంకా గాలింపు చర్యలు జరుపుతూనే ఉందని గుర్తు చేశారు. మలేసియా కూడా గాలింపు చర్యల చేపడితే విమాన జాడ కనుక్కోవచ్చని చైనా ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఫ్రెంచ్ ప్రధాని ఎం వాల్స్ కూడా పాల్గొన్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు ఉన్న సంగతి తెలిసిందే. -
ఎంహెచ్17 మృతురాలికి మాస్టర్ డిగ్రీ!
కౌలాలంపూర్: మలేషియా ఎయిర్ లైన్స్ విమాన (MH17) దుర్ఘటనలో మరణించిన ఎలిజబెత్ ఎన్ జీ లే తి అనే విద్యార్ధికి మాస్టర్ డిగ్రీని మంగళవారం కౌలాలంపూర్ యూనివర్సిటీ ప్రధానం చేసింది. ఎలిజబెత్ తరపున సోదరి షి యాన్ మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఎలిజబెత్ మాస్టర్ డిగ్రీని 80 శాతం చేశారని, ఆ డిగ్రీని అందుకోవడానికి ఆమె అన్ని రకాలుగా అర్హత సాధించిందని యూనివర్సిటీ డీన్ నాజ్రీ ఇస్మాయిల్ తెలిపారు. మాస్టర్ డిగ్రీ పొందడానికి ఒక సబ్జెక్ట్, మరో రీసర్చ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిబంధనల ప్రకారం 80 శాతం పూర్తి చేసి.. మరణించిన వారికి యూనివర్సిటీ డిగ్రీని అందచేస్తుంది. -
ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట
మెల్బోర్న్: ఆరునెలల కిత్రం గల్లంతైన ఎమ్హెచ్ 370 మలేసియా విమానం కోసం మరోసారి వేట ప్రారంభకానుంది. అందుకోసం రెండు నౌకలు రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆ రెండు నౌకలు వేర్వేరుగా బంగాళాఖాతంలో అణువణువు జల్లెడ పట్టనున్నాయి. ఫీనిక్స్ నౌక రేపు పశ్చిమ ఆస్ట్రేలియా తీరం నుంచి ప్రారంభంకానుంది. అలాగే మరో నౌక ఫుగ్రో డిస్కవరీ కూడా తన పని ప్రారంభించి అక్టోబర్ మాసం చివరినాటికి సముద్రం అడుగుభాగంలో పూర్తిగా తనిఖీ చేసి నివేదిక అందించనుంది. అయితే శాటిలైట్ నివేదిక ఆధారంగా విమానం దక్షిణ ప్రాంతంలోనే అదృశ్యమైన నేపథ్యంలో... ఆ ప్రాంతంలోనే గాలింపు చర్యలు తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే మలేసియా ప్రభుత్వం నౌకలతో ఒప్పందం కుదుర్చుకుంది. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌లో విమాన ప్రమాదాలపై విచారణాధికారి ఇవాన్ విల్సన్ 'గుడ్ నైట్ మలేసియా 370: ద ట్రూత్ బిహైండ్ ద లాస్ ఆఫ్ ఫ్లైట్ 370' పేరిట ఓ పుస్తకం రాశాడు. అందులో ఎమ్హెచ్ 370 పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకున్నాడని అందువల్లే ఆ విమానం గల్లంతైందని పేర్కొన్నారు. విమానంపై సస్పెన్స్ కు తెరదించాలని స్థానిక ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. , దీంతో మలేసియా విమానం ఆచూకీ కోసం నౌకలు రంగంలోకి దిగాయి. -
370... 130... 17
అదేంటో గాని మలేషియా ఎయిర్ లైన్స్ విమానాలని ప్రమాదాలు నిడలా వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం మన జ్ఞాపకాల దొంతర నుంచి చెరిగిపోక మునుపే గురువారం సాయంత్రం ఎమ్హెచ్ 17 విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానంలోని మృతుల్లో అత్యధికులు అంటే సగానికి సగం మంది డచ్ దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దాంతో తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమాన ప్రయాణికుల బంధువులు స్నేహితులు మలేషియా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మలేషియా ప్రభుత్వానికి ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కనుగోవడం పెద్ద తల నొప్పిగా తయారైంది. అంతలో నిన్న సాయంత్రం మరో విమానం ప్రమాదం జరగడంతో మలేషియా ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ రెండు విమాన ప్రమాదాలు కేవలం 130 రోజులు తేడాలో జరిగాయి. -
విమానం ఏమైందో... ఆచూకీ తెలిసే వరకు...
ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన విమానం ఏమైందో అర్థంకావడం లేదని... అయితే ఆ విమానం జాడ కనుగొనే వరకు విశ్రమించేది లేదని మలేషియా ప్రభుత్వం స్సష్టం చేసింది. విమానం అదృశ్యమై వంద రోజులు పూరైన సందర్బంగా ఆ దేశ ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఈ మేరకు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల అదృశ్యంతో వారి బంధువులు తీవ్ర వేదనతో చెందుతున్నారని.... ఆ విషయాన్ని తమ ప్రభుత్వం మనస్పూర్తిగా అర్థం చేసుకుందని ఆ దేశ రవాణశాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ వివరించారు. అయితే విమానం అదృశ్యమై ఇంత కాలమైన తమ బంధువులు ఏమైయ్యారో అర్థం కావడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మలేషియా విమానం జాడ కనుక్కోవడం మలేషియా ప్రభుత్వ తీవ్ర వైఫల్యమేనని ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన 227 మంది ప్రయాణికులు... 12 మంది సిబ్బందితో మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విమానం చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. అయితే కొన్ని గంటల వ్యవధిలో ఆ విమానం మలేషియా ఎయిర్పోర్ట్ ఏటీసీతో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అనాటి నుంచి జాడ తెలియకుండా పోయిన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ విమాన ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయు ఉన్న విషయం విదితమే. -
వచ్చే ఏడాదిలోనే 'మలేషియా విమానం' ఆచూకీ
అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ తెలుసుకోవాలంటే మరింత సమయం పట్టనుందా అంటే అవుననే అంటున్నారు ఆ దేశ ఉన్నతాధికారులు. గల్లంతైన విమాన కోసం కనిష్టంగా 8 నుంచి గరిష్టంగా12 నెలలు సమయం పడుతుందని సదరు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన బృందానికి నాయకత్వం వహించిన రిటైర్డ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అన్ఘుస్ హ్యూస్టన్ వెల్లడించారు. శుక్రవారం కౌలాలంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానం కోసం గాలింపు చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే విమాన జాడ కనుక్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఇప్పటికే విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో హ్యుస్టన్ ప్రకటనతో ప్రయాణికుల బంధువుల ఆగ్రహనికి అగ్నికి అజ్యం పోసినట్లు అయింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్‌తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే. -
అదృశ్యమైన విమానం జాడ ఒక్క సెకండ్లోనా.... ఎట్లా?
గత నెలలో అదృశ్యమైన మలేసియా విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన జాడ కోసం ఇతరదేశాల సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకుంటున్నామని తెలిపారు. తానే దేశ ప్రధాని అయి ఉంటే అదృశ్యమైన విమానం జాడ ఒక్క నిముషంలో కనుక్కోనే వాడినంటూ మలేసియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం వ్యాఖ్యలను నజీబ్ ఖండించారు. అన్వర్ వ్యాఖ్యలు మతిలేనివిగా ఆయన అభివర్ణించారు. విమానం ఆచూకీ కోసం ఇప్పటికి చేయని ప్రయత్నం లేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఈ నెల 5న మలేషియా ప్రతిపక్ష నేత చైనా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ... తాను దేశ ప్రధాని అయి ఉంటే ఒక్క నిముషంలో అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టేవాడి నంటూ చెప్పారు. ఆ వ్యాఖ్యపై ప్రధాని నజీబ్ రజాక్‌పై విధంగా స్పందించారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్‌తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే. -
మలేషియా విమాన శకలాలను గుర్తించిన చైనా శాటిలైట్లు
కౌలాలంపూర్(ఐఏఎన్ఎస్): తప్పిపోయిన మలేషియా విమాన శకలాలను చైనా శాటిలైట్లు గుర్తించాయి. కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్370 ఈ నెల 8వ తేది అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం తప్పిపోయినప్పటి నుంచి దాని కోసం దాదాపు 26 దేశాలు గాలిస్తూనే ఉన్నాయి. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారని, ప్రమాదానికి గురైందని ...పలు రకాల కథనాలు వినవచ్చాయి. ఈ నేపధ్యంలో విమాన శకలాలను తమ శాటిలైట్లు గుర్తించాయని చైనా చెప్పినట్లుగా మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు రెండు వారాలుగా కనిపించకుండాపోయిన మలేషియా విమానం ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. ఎమ్హెచ్-370 విమానం భాగాలు చైనా దక్షిణ ప్రాంతంలో కనిపించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. హిందూమహాసముద్రంలో తేలుతున్న ఒక పెద్ద శకలం మలేషియా విమానానికి చెందినదిగా భావిస్తున్నారు. ఆ శకలం ఫొటోలను కూడా చైనా టెలివిజన్ విడుదల చేసింది. -
విమానం అదృశ్యం వెనుక ఉగ్రవాదుల పాత్రపై ఆరా
కౌలాలంపూర్/బీజింగ్: మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ వెళుతూ శనివారం అదశ్యమైన బోయింగ్ విమాన ఘటనలో ఉగ్రవాదుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల పాత్రపై ఆరా తీయాలని అధికారులను మలేసియా ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. 239 ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న ఆ విమానంలో ఇద్దరు దొంగిలించిన(ఒకటి ఇటలీవాసిది, రెండోది ఆస్ట్రియావాసిది) పాస్ పోర్టులతో ఎక్కారని తేలిన నేపథ్యంలో.. ఉగ్రవాద చర్యపై ప్రభుత్వం దష్టి సారించింది. కాగా అదశ్యమైన విమానం కోసం పలు దేశాలు చేపట్టిన గాలింపు రెండో రోజు కూడా ఎలాంటి ఆశావహ ఫలితాలనివ్వలేదు. బహుశా ఆ మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం వెనక్కు వచ్చేసి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చైనా, బీజింగ్, వియత్నాం దేశాలతోపాటు అమెరికా 22 విమానాలు, 40 ఓడలను రంగంలోకి దిగి ఇప్పటికే గల్లంతైన విమానం కోసం అన్వేషణను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. విమాన ఆచూకీ కోసం కనుగొనే క్రమంలో ఇండోనేషియా సహకారాన్ని కూడా కోరామని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. -
గల్లంతైన విమానం... తిరిగి వస్తుంది !
కాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తు మొన్న అర్థరాత్రి అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం తిరిగి వస్తుందని మలేషియా పౌర విమానాయానశాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన విమానం తిరగి కౌలాలంపూర్ వస్తుందని మిలటరీ రాడార్ సూచనలు చేస్తుందని తెలిపారు. చైనా, బీజింగ్, వియత్నాం దేశాలతోపాటు అమెరికా 22 విమానాలు, 40 ఓడలను రంగంలోకి దిగి ఇప్పటికే గల్లంతైన విమానం కోసం అన్వేషణను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. విమాన ఆచూకీ కోసం కనుగొనే క్రమంలో ఇండోనేషియా సహకారాన్ని కూడా కోరామని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. విమానం ఓ వేళ సముద్రంలో కూలిపోయి ఉంటే విమాన శకలాలు లేకుంటే ప్రయాణికుల వస్తువులు నీటిపై తేలియాడుతూ ఉండేవన్నారు. విమానం అదృశ్యమై 24 గంటలు గడిచిన అంటువంటి ఏవి సముద్రం నీటిపై కనిపించిన దాఖలాలు లేవని గాలింపు చేపట్టిన సిబ్బంది వెల్లడించారని తెలిపారు. అయితే విమాన ప్రయాణికుల జాబితాపై దృష్టి సారించామని, అందులో నకిలీ పాస్‌పోర్ట్‌లతో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఆ ఇద్దరిలో ఒకరిది ఇటలీ కాగా, మరోకరిది ఆస్ట్రేయా దేశానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కోలాలంపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి విమానం బీజింగ్ బయలుదేరింది. రెండు గంటల అనంతరం ఆ విమానం మలేషియా విమానాశ్రయంలోని ఎటీసీ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం అదృశ్యం కావడంతో ఆ ఇరుదేశాల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తు గాలింపు చర్యలు చేపట్టారు. వియత్నాం సమీపంలో ఆ విమానం కూలిపోయిందని శనివారం వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే గాలింపు చర్యలలో ఎక్కడ ఎటువంటి శకలాలు లభ్యం కాకపోవడంతో మలేషియా పౌర విమానాయానశాఖ విమానం తప్పక తీరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విమానం అదృశ్యం కావడంతో ప్రయాణీకుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.