ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట | Search for missing flight MH370 to resume | Sakshi
Sakshi News home page

ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట

Published Tue, Sep 30 2014 10:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట

ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట

మెల్బోర్న్: ఆరునెలల కిత్రం గల్లంతైన ఎమ్హెచ్ 370 మలేసియా విమానం కోసం మరోసారి వేట ప్రారంభకానుంది. అందుకోసం రెండు నౌకలు రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆ రెండు నౌకలు వేర్వేరుగా బంగాళాఖాతంలో అణువణువు జల్లెడ పట్టనున్నాయి. ఫీనిక్స్ నౌక రేపు పశ్చిమ ఆస్ట్రేలియా తీరం నుంచి ప్రారంభంకానుంది.

అలాగే మరో నౌక ఫుగ్రో డిస్కవరీ కూడా తన పని ప్రారంభించి అక్టోబర్ మాసం చివరినాటికి సముద్రం అడుగుభాగంలో పూర్తిగా తనిఖీ చేసి నివేదిక అందించనుంది. అయితే శాటిలైట్ నివేదిక ఆధారంగా విమానం దక్షిణ ప్రాంతంలోనే అదృశ్యమైన నేపథ్యంలో... ఆ ప్రాంతంలోనే గాలింపు చర్యలు తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే మలేసియా ప్రభుత్వం నౌకలతో ఒప్పందం కుదుర్చుకుంది.

 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరింది.  బయలుదేరిన కొద్దిసేపటికే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే న్యూజిలాండ్లో విమాన ప్రమాదాలపై విచారణాధికారి ఇవాన్ విల్సన్ 'గుడ్ నైట్ మలేసియా 370: ద ట్రూత్ బిహైండ్ ద లాస్ ఆఫ్ ఫ్లైట్ 370' పేరిట ఓ పుస్తకం రాశాడు. అందులో ఎమ్హెచ్  370 పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకున్నాడని అందువల్లే ఆ విమానం గల్లంతైందని పేర్కొన్నారు. విమానంపై సస్పెన్స్ కు తెరదించాలని  స్థానిక ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ,  దీంతో మలేసియా విమానం ఆచూకీ కోసం నౌకలు రంగంలోకి దిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement