West Australian coast
-
విమానం కోసం 'రెండింతల' గాలింపు!
కౌలాలంపూర్:ఎమ్ హెచ్ 370.. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం. మార్చి 8, 2014న ఐదుగురు భారతీయులతో సహా 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరిన ఆ విమానం అదృశ్యమై సంవత్సరం పైగా కావొస్తున్నా.. ఇప్పటి వరకూ ఆచూకీ అయితే లేదు. ఎమ్ హెచ్ 370 విమాన అదృశ్య ఘటనకు సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. ఆ విమాన జాడ కనిపెట్టేందుకు మలేషియా ప్రభుత్వం మాత్రం తమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తోంది. విమాన శకలాలను కనుగొనేందుకు ప్రపంచ దేశాల సహాయం తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మిగలడంతోమరో అడుగు ముందుకేయాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటివరకూ దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమిటర్ల మేర విమాన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో.. అదనంగా మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమాన ఆచూకీ మే నెల లోపు దొరకపోతే మాత్రం ఈ మేరకు ప్రయాత్నాలు చేపట్టాలని మలేషియా యోచిస్తోంది. అందుకు మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనాలు మరోసారి భాగస్వామ్యం కావడానికి సన్నద్ధమవుతున్నాయి. -
ఎమ్హెచ్ 370 కోసం మళ్లీ వేట
మెల్బోర్న్: ఆరునెలల కిత్రం గల్లంతైన ఎమ్హెచ్ 370 మలేసియా విమానం కోసం మరోసారి వేట ప్రారంభకానుంది. అందుకోసం రెండు నౌకలు రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఆ రెండు నౌకలు వేర్వేరుగా బంగాళాఖాతంలో అణువణువు జల్లెడ పట్టనున్నాయి. ఫీనిక్స్ నౌక రేపు పశ్చిమ ఆస్ట్రేలియా తీరం నుంచి ప్రారంభంకానుంది. అలాగే మరో నౌక ఫుగ్రో డిస్కవరీ కూడా తన పని ప్రారంభించి అక్టోబర్ మాసం చివరినాటికి సముద్రం అడుగుభాగంలో పూర్తిగా తనిఖీ చేసి నివేదిక అందించనుంది. అయితే శాటిలైట్ నివేదిక ఆధారంగా విమానం దక్షిణ ప్రాంతంలోనే అదృశ్యమైన నేపథ్యంలో... ఆ ప్రాంతంలోనే గాలింపు చర్యలు తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే మలేసియా ప్రభుత్వం నౌకలతో ఒప్పందం కుదుర్చుకుంది. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా నుంచి బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. విమానం ఎమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం తెలియక సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. విమాన ఆచూకీ కనుగోనడంలో విఫలమైందంటూ వారు మలేసియా ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌లో విమాన ప్రమాదాలపై విచారణాధికారి ఇవాన్ విల్సన్ 'గుడ్ నైట్ మలేసియా 370: ద ట్రూత్ బిహైండ్ ద లాస్ ఆఫ్ ఫ్లైట్ 370' పేరిట ఓ పుస్తకం రాశాడు. అందులో ఎమ్హెచ్ 370 పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకున్నాడని అందువల్లే ఆ విమానం గల్లంతైందని పేర్కొన్నారు. విమానంపై సస్పెన్స్ కు తెరదించాలని స్థానిక ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. , దీంతో మలేసియా విమానం ఆచూకీ కోసం నౌకలు రంగంలోకి దిగాయి.