indian ocean
-
2 లక్షల మందిని మింగేసిన రాకాసి అల
-
భాగ్య నగర కీర్తి ‘కెరటం’.. ఇంకాయిస్
హిందూ మహాసముద్రంతో అనుబంధం ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన భాగ్యనగరం నుంచే వెళ్తుంటాయి. సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక, సముద్రపు అలల ఎత్తు, వేగం, వాటి తీవ్రత ఏమేర ఉంటుందో క్షణాల్లో భారత్‌తోపాటు ఆయా దేశాలకు చేరవేసే విజ్ఞాన వాహిని భాగ్యనగర సొంతం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్’ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢవిల్లుతోంది.సనత్‌నగర్ (హైదరాబాద్): ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్‌లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేసియా,ఆ్రస్టేలియాలో ఉన్నాయి. 2004 హిందూమహాసముద్ర సునామీ 20వ వార్షికోత్సవాన్ని గురువారం ప్రగతినగర్‌లోని ఓషన్ వ్యాలీలో గల ఇంకాయిస్లోజరపనున్నారు. దీనికి కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నాటి సునామీలో ప్రాణాలు విడిచిన వారికి నివాళులు అర్పించనున్నారు.ఈ సందర్భంగా ఇంకాయిస్ అందిస్తున్నసేవలపై ప్రత్యేక కథనం.తొలుత మత్స్యకారుల సేవల కోసం..1999లో మత్స్యకారులకు సేవలు అందించేందుకు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పీఎఫ్జెడ్)గా ఇంకాయిస్ ఆవిర్భవించింది. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి సమాచారాన్ని వారికి చేరవేసే కేంద్రంగానే ఉండేది. ఆ తరువాత కొద్దికాలానికి సముద్రంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఓషియన్ స్టేట్ ఫోర్కాస్ట్ సేవలకు అంకురార్పణ చేసింది. 2004కు ముందు వరకు సునామీ అంటే భారత్‌కు పరిచయం లేని పదం. 2004లో వచ్చిన సునామీతో 2,40,000 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. 14 దేశాలపై సునామీ ప్రభావం పడింది. ఆ సమయంలోనే సునామీ అంటే ఏంటో అందరికీ తెలిసింది. అప్పటివరకు సునామీ వస్తుందన్న ముందస్తు సమాచారం ఇచ్చే కేంద్రం ప్రపంచదేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహాసముద్ర సమాచార సేవలు అందుతుండటంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005లో ప్రక్రియ ప్రారంభించి 2007లో పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్ర సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రంగా అవతరించింది.సునామీలు ఎలా ఏర్పడతాయంటే..? సముద్రంలో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో సునామీలు ఉత్పన్నమవుతాయి. అయితే ఎక్కువ శాతం భూకంపాల ద్వారానే సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భూకంప తీవ్రత 6.5 కంటే ఎక్కువ ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ సమయంలో సముద్రం మధ్య భాగంలో వాయువేగం గంటకు 800 కి.మీ., కెరటాల ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగా ఉంటాయి. అదే తీరప్రాంతాన్ని తాకే సమయంలో వాయువేగం గంటకు 30 కి.మీ.కు పడిపోయి అలల ఎత్తు మాత్రం 30 మీటర్లకు పెరిగిపోతుంది. అందుకే సునామీ వచ్చే ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తారు. తీరాన్ని తాకుతున్న కొద్దీ అలల ఎత్తు పెరుగుతుంది. సునామీ రాకను సామాన్య ప్రజలు కూడా గుర్తించవచ్చు. ఆ సమయంలో సముద్రం వెనుకకు వెళ్లిపోతుంది. అలల శబ్ద తరంగాల్లో మార్పు గమనించవచ్చు. ఇంకాయిస్ ఎలా గుర్తిస్తుందంటే.. సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్‌కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూప్రకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్‌కు చేరుతుంది. ఆ తరువాత భూకంపం ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టిసారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్ నెట్వర్క్’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. సాధారణ రోజుల్లో బోయ్ నెట్వర్క్ పరికరాలు శాటిలైట్ ద్వారా 15 నిమిషాలకో మారు అలలు, సముద్ర స్థితిగతులకు సంబంధించిన సమాచారం ఇంకాయిస్‌కు చేరవేస్తుంది.అదే సునామీ వస్తుందంటే నిమిషానికోమారు సందేశం పంపుతుంది. దాని ఆధారంగా సునామీని పసిగడతారు. ఒక్కో బోయ్ నెట్వర్క్ పరికరం రూ.6 కోట్ల వరకు ఉంటుంది. నిమిషాల్లో సమాచారం...ఇంకాయిస్ సేకరించిన సమాచారాన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉండే విపత్తు నిర్వహణ కేంద్రాలకు, భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు వెబ్సైట్, మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడుస్థాయిల్లో ఇంకాయిస్ సమాచారం అందిస్తోంది. వార్నింగ్, అలర్ట్, వాచ్ స్థాయిల్లో సందేశం పంపుతుంది. వార్నింగ్ అని సందేశం పంపారంటే తీవ్రత అధికంగా ఉన్నట్లు అర్ధం. సాధారణంగా భూ ప్రకంపనలు జరిగిన తరువాత సునామీ తీరాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది.ఆ లోపు సునామీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఒక్క అండమాన్ దగ్గర సునామీ ఏర్పడితే మాత్రం 20 నిమిషాల వ్యవధిలోనే తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునెస్కో ఆదేశాల మేరకు 2011 నుంచి సునామీకి సంబంధించిన సమాచారాన్ని హిందూ మహాసముద్రానికి అనుబంధంగా ఉన్న 28 దేశాలకు ఇంకాయిస్ చేరవేస్తుంది. ఆయా దేశాల ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. -
తీర భద్రతా 'నిర్దేశక్'
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాగర గర్భంలో ఏం జరుగుతోంది? ఉపరితలంపై ముంచుకొస్తున్న మప్పు ఏంటి? సముద్రంలో శత్రుదేశాల నుంచి తలెత్తే ఆపదలేంటి? ఇలా సుదీర్ఘ భారత సముద్ర తీరంలో అణువణువూ సర్వే చేసి... నావికాదళానికి అందించేందుకు నిర్దేశకుడు వస్తున్నాడు. సంధాయక్ క్లాస్‌లో రెండో అతి పెద్ద సర్వే వెసల్‌గా ఐఎన్ఎస్ నిర్దేశక్ బుధవారం జల ప్రవేశం చేసింది. 2014 వరకూ సేవలందించిన నౌక నిర్దేశక్‌ను గుర్తుచేసుకుంటూ ఈ కొత్త నౌకకూ అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం నుంచి సేవలందించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ సిద్ధమవుతోంది. కోల్‌కతాలో రూపుదిద్దుకున్న నిర్దేశక్... విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో...! దేశంలోనే అతిపెద్ద సర్వేనౌక ఐఎన్ఎస్ సంధాయక్ తర్వాత... రెండో అతి పెద్ద సర్వే వెసల్ ఐఎన్ఎస్ నిర్దేశక్ భారత నౌకాదళంలో ప్రవేశించింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) సంస్థ 2020లో దీని తయారీ ప్రారంభించింది. నౌకాదళం కోసం జీఆర్ఎస్ఈ తయారుచేస్తున్న నాలుగు అధునాతన సర్వే నౌకల్లో నిర్దేశక్ రెండోది కావడం విశేషం. ఓడరేవులు, నావిగేషనల్ ఛానెళ్లు, ఎకనమిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుంది. దీంతోపాటు శోధన– రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తు సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్‌గానూ నిర్దేశక్‌ను తయారు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో బలీయమైన శక్తిగా తూర్పు నౌకాదళం ఎదుగుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక సర్వే వెసల్ని విశాఖపట్నం కేంద్రంగా సేవలందించేందుకు కేటాయించాలని భారత నౌకాదళం నిర్ణయించినట్టు సమాచారం. అయితే.. తొలి షిప్ సంధాయక్ ఇప్పటికే విశాఖ కేంద్రంగా సేవలందిస్తున్న నేపథ్యంలో రెండింటిలో ఒక నౌకని పశ్చిమ నౌకాదళానికి కేటాయించే అవకాశం ఉందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. రూ.2,435 కోట్లతో 4 సర్వే వెసల్స్ నిర్మాణం 1968 నుంచి సంధాయక్ సర్వే వెసల్ భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి 2021లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఇండియన్ నేవీకి సర్వే నౌకలు అవసరమని భావించిన రక్షణ మంత్రిత్వ శాఖ 2017లోనే నాలుగు సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రూ.2,435.15 కోట్లతో బిడ్‌ను జీఆర్ఎస్ఈ దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ షిప్‌లను నిర్మిస్తున్నారు. ఈ క్లాస్ షిప్‌లలో మొదటిది జే18 పేరుతో ఐఎన్ఎస్ సంధాయక్‌ను 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించగా... జే 19 పేరుతో ఐఎన్ఎస్ నిర్దేశక్ని 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తర్వాత ఐఎన్ఎస్ ఇక్షక్, ఐఎన్ఎస్ సంశోధక్ షిప్‌లు 2025 నాటికి భారత నౌకాదళంలోకి చేరనున్నాయని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. నిర్దేశక్కు గుర్తుగా...!గతంలో నిర్దేశక్ పేరుతో సర్వే నౌక దేశానికి సుదీర్ఘంగా 31 ఏళ్ల పాటు సేవలందించింది. అనంతరం దీన్ని 2014 డిసెంబర్ 19న ఉపసంహరించారు. 1983 అక్టోబర్ 4న దీన్ని జాతికి అంకితం చేశారు. కేవలం సర్వే సేవలతో పాటు ఆపద సమయాల్లో ఇది ఆస్పత్రి నౌకగా కూడా మారిపోయింది. ప్రధానంగా కాండ్లాలో వచ్చిన భూకంపం సమయంలో, శ్రీలంకలో సంభవించిన సునామీ సమయంలో ఈ నౌక విశేష సేవలందించింది. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ కేంద్రంగా ఇది పనిచేసింది. 18 మంది అధికారులతో పాటు 160 మంది సిబ్బంది ఇందులో సేవలందించేవారు. 1980 టన్నుల బరువు, 87.8 మీటర్ల పొడవైన ఈ నౌక... గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే పేరుతో వస్తున్న కొత్త నౌక మాత్రం 3,800 టన్నుల బరువు కలిగి ఉండటంతో పాటు 110 మీటర్ల పొడవు ఉంది. ఇది గంటకు 33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. జాతికి అంకితంవిశాఖ సిటీ: హిందూ మహాసముద్రంలో భారత్ తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక సేవలు దోహదపడతాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ పేర్కొన్నారు. భారీ అత్యాధునిక సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను ఆయన బుధవారం విశాఖలోని నేవల్ డాక్ యార్డ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్–ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించిందని చెప్పారు. ఈ నౌకలో మల్టీ బీమ్ ఎకో సౌండర్‌లు, సైడ్ స్కాన్ సోనార్లు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ వంటి అధునాతన హైడ్రోగ్రాఫిక్ సిస్టమ్‌లు పొందుపరిచినట్టు వెల్లడించారు. ఓడరేవులు, నావిగేషనల్ చానల్స్, ఎకనావిుక్ ఎక్స్‌క్లూజివ్ జోన్లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహణ, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుందని వివరించారు. శోధన–రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తుల సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్‌గానూ సేవలు అందించనుందని చెప్పారు. ఈ నౌక హిందూ మహాసముద్రంలో భద్రతతోపాటు పర్యావరణ, శాస్త్రీయ అన్వేషణ, శాంతి పరిరక్షక కార్యక్రమాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. అత్యాధునిక సర్వే సాంకేతికతతూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ మాట్లాడుతూ.. 110 మీటర్ల పొడవున్న నిర్దేశక్ నౌక అత్యాధునిక సర్వే సాంకేతికతను కలిగి ఉందని తెలిపారు. హిందూ మహా సముద్ర పరిసర ప్రాంతాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేస్తూ భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఈ నిర్దేశక్ నౌక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2025 నాటికి మరో రెండు నౌకలు భారత నౌకాదళంలోకి చేరనున్నాయని వెల్లడించారు. -
‘ఐఎన్ఎస్ సంధాయక్’ జాతికి అంకితం
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్‌గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ సంధాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్ఎస్ సంధాయక్’ను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి రాజ్‌నాథ్ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘దేశీయంగా తయారు చేస్తున్న నాలుగు భారీ సర్వే వెసల్స్‌లో సంధాయక్ మొదటిది. భారత నౌకాదళానికి ఇదొక చరిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధనౌకల తయారీలో చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సంధాయక్ ఉపయోగపడుతుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళం సొంతం. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒకప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి.. నేడు ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించేస్థాయికి భారత్ ఎదిగింది. స్నేహపూర్వక దేశాలను కూడా రక్షించుకునే సామర్థ్యం భారత్ సొంతం. హిందూ మహా సముద్రంలో పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు దొంగల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. సముద్రపు దొంగలను ఎట్టి పరిస్థితిలోనూ సహించం. భారత సముద్ర జలాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇటీవల పలువురు మత్స్యకారులు, మెరైన్లను రక్షించడంతో పాటు దాడులకు గురైన నౌకలకు సాయం అందించిన భారత నౌకాదళాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్, కలెక్టర్ డా.మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సంధాయక్ షిప్ విశేషాలు ► నాలుగు భారీ సర్వే వెసల్స్ నిర్మాణంలో భాగంగా 2019లో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ)లో ఐఎన్ఎస్ సంధాయక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ► 2021 నాటికి నౌక నిర్మాణం పూర్తయింది. 2023 డిసెంబర్ 4న భారత నౌకాదళానికి షిప్‌ని అప్పగించారు. ► దీని పొడవు 110 మీటర్లు. వెడల్పు 16 మీటర్లు. బరువు 4,130 టన్నులు. ప్రయాణ వేగం గంటకు 18 నాటికల్ మైళ్లు. ► 3.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది. ► 80 శాతానికి పైగా దేశీయ సాంకేతిక సామర్థ్యంతో రూపుదిద్దుకున్న యుద్ధనౌక ఇది. ► సముద్ర జలాలు, అంతర్జాతీయ ప్రాదేశిక సరిహద్దులు నిర్ణయించేందుకు ఈ నౌకను వినియోగించనున్నారు. ► ఇతర దేశాల నౌకల మ్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించనుంది. ► అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, సర్వే మోటర్ బోట్స్, డిజిటల్ సైడ్ స్కానర్ సోనార్, రిమోట్ ఆపరేటింగ్ వెహికల్స్ ఇందులో ఉంటాయి. ► సముద్రగర్భంలో వెయ్యి మీటర్ల లోతులో అతి సున్నితమైన, కీలకమైన సూక్ష్మ సమాచారాన్ని గ్రహించగల సామర్థ్యంగల పరికరాలు అమర్చారు. ► అండర్ వాటర్ వెహికల్స్, వెపన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ► సముద్రజలాల సర్వే మ్యాప్ కోసం అవసరమైన మల్టీ బీమ్ ఎకో సౌండర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ► అత్యవసర సమయాల్లో పరిమిత సౌకర్యాలతో హాస్పిటల్ షిప్గాను సేవలందించగలదు. ► పరిశోధన, రెస్క్యూ, డిజాస్టర్ రిలీఫ్ పాత్రల్ని కూడా సంధాయక్ సులువుగా నిర్వర్తించగలదు. ► సంధాయక్ నౌకకు మొదటి కమాండింగ్ అధికారి కెప్టెన్ ఆర్.ఎం.థామస్. దేశీయంగానే సబ్మెరైన్ల తయారీ అంతర్జాతీయ, దేశీయ జలాల మ్యాపింగ్‌లో సంధాయక్ కీలక పాత్ర పోషించనుంది. హైడ్రోగ్రాఫిక్ సహాయకారిగా అంతర్జాతీయ నౌకలకు కూడా ఇది ఉపయోగపడాలన్నది ప్రధాని మోదీ లక్ష్యం. హిందూ మహాసముద్రంలో శాంతి పరిరక్షణే మన ప్రధానమైన లక్ష్యం. 66 షిప్‌లు, సబ్మెరైన్లలో దేశీయంగానే 64 తయారు చేస్తున్నాం.– అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఇండియన్ నేవీ చీఫ్ -
ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది. 12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. -
నేవీ షిప్‌పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్‌పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్‌కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్‌గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
చైనా ‘జియాన్-6’తో భారత్‌పై నిఘా పెట్టిందా? హిందూ మహాసముద్రంలో ఏం జరుగుతోంది?
చైనా తన మరో గూఢచార నౌక జియాన్-6ను హిందూ మహాసముద్రంలోకి దింపింది. ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది. ఇది నిరంతరం శ్రీలంక వైపు కదులుతోంది. ఇది భారత్‌కు ముప్పుగా పరిణమించినున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2022 నవంబర్‌లో భారతదేశం బంగాళాఖాతంలో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించాలనుకుంది. క్షిపణిని పరీక్షించబోయే ప్రాంతంలో నో ఫ్లై జోన్ హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే అదే సమయంలో చైనా తన గూఢచార నౌక యువాన్ వాంగ్-6ను హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రయోగించింది. ఈ చైనా నౌక కారణంగా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష తేదీని భారత్ కొన్ని రోజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే అక్టోబర్ 2023లో భారత్ బంగాళాఖాతంలో మరో క్షిపణిని పరీక్షించబోతోంది. ఈ నేపధ్యంలో అక్టోబర్ 5 నుండి 9 వరకు సుదీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కోసం బంగాళాఖాతం నుండి హిందూ మహాసముద్రం వరకు హెచ్చరిక జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పరీక్షకు ముందే హిందూ మహాసముద్రంలో చైనా మరో గూఢచార నౌక జియాన్-6ను ప్రయోగించింది. ఈ నౌక హిందూ మహాసముద్రం మధ్యలో 90 డిగ్రీల తూర్పు రేఖాంశ శిఖరంపై ఉంది. జియాన్-6 అనేది చైనీస్ పరిశోధన నౌక. చైనా తెలిపిన వివరాల ప్రకారం ఈ నౌక నేషనల్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (నారా)తో కలసి పరిశోధనలు సాగిస్తుంది. అయితే ఇది చైనా గూఢచార నౌక అని నిపుణులు భావిస్తున్నారు. జియాన్-6 సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడానికి చైనా 13వ పంచవర్ష ప్రణాళికలో కీలకమైన ప్రాజెక్ట్. ఇది ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత, ఓడ 2022లో తూర్పు హిందూ మహాసముద్రంలో తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా చేసింది. శ్రీలంకకు చెందిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం అక్టోబర్‌లో కొలంబో నౌకాశ్రయంలో ఈ చైనా పరిశోధన నౌకను డాక్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ చైనా గూఢచార నౌక హిందూ మహాసముద్రంలో భారత్ బాలిస్టిక్ క్షిపణిని యూజర్ ట్రయల్ నిర్వహించబోతున్న సమయంలో ల్యాండ్ అయింది. అటువంటి పరిస్థితిలో భారతదేశం పరీక్ష నిర్వహిస్తే.. ఈ గూఢచార నౌక భారత క్షిపణి అందించే నిఘా సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది. ఈ క్షిపణి వేగం, పరిధి, కచ్చితత్వాన్ని చైనా తెలుసుకోగలుగుతుంది. ఈ విధంగా భారత్‌ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఈ చర్యతో స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో సైనిక ఘర్షణ జరిగినప్పటి నుండి భారతదేశం - చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు హిందూ మహాసముద్రంపై పెరుగుతున్న చైనా ఆధిపత్య ప్రభావం భారత్‌కు శాశ్వత సవాలుగా నిలవనుంది. చైనా తన సముద్ర సరిహద్దులో చాలా బలమైన ఉనికిని కలిగి ఉంది. అటువంటి పరిస్థితిలో విస్తరణవాద విధానాన్ని అనుసరిస్తున్న చైనా విషయంలో భారతదేశం ఆందోళన చెందక తప్పదని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? -
అండమాన్‌ను కుదిపేసిన భూకంపం
ఢిల్లీ: అండమాన్ నికోబార్‌ను ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. పది కిలోమీటర్ల లోతున.. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో నమోదు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. హిందూ మహాసముద్రంలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలుస్తోంది. అండమాన్‌తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. 2 #earthquakes in the Indian Ocean, magnitude 6.1 Andaman Is, & mag 5.9 southwest Indian Ridge nearer to Africa. @rrichcord @LaytenHolland pic.twitter.com/1W2Vk7blFs — Cecilia Sykala (@CeciliaSykala) July 28, 2023 -
భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన చేపల ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఓడలోని మిగతా 37 మంది నావికులను కాపాడేందుకు భారత నేవీ రంగంలోకి దిగి సాయం చేసింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని చైనాకు ఆపన్నహస్తం అదించింది. దీంతో భారత్ సహా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని తమ వంతు సాయం అందించించిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవ్‌కు చైనా విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో సాయం చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించింది. చైనాకు చెందిన లుపెంగ్ యువాన్యు 028 చేపల ఓడ మంగళవారం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఇందులో మొత్తం 39 మంది నావికులు ఉన్నారు. వీరిలో చైనాకు చెందన వారు 17 మంది, ఇండోనేషియాకు చెందినవారు 17 మంది, ఫిలిప్పైన్స్కు చెందిన ఐదుగురు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చైనాకు చెందిన 10 ఓడలు ఆ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. ఇంకా మరిన్ని ఓడలను ఘటనా స్థలానికి చేర్చుతున్నారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఓడను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు అతిపెద్ద విజయం.. ‘రాణాను అప్పగించండి’ -
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరుపుతారు. -
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
హిందూ సాగరంలోకి చైనా నిఘా నౌక.. భారత క్షిపణి పరీక్ష వాయిదా!
న్యూఢిల్లీ: చైనాకు చెంది నిఘా నౌక యువాన్ వాంగ్-5 ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టుకు చేరుకున్న క్రమంలో భారత్-చైనాల మధ్య దౌత్యపరమైన సమస్య తలెత్తింది. ఇప్పుడు మళ్లీ చైనాకు చెందన మరో నిఘా నౌక వల్ల భారత్ చేపట్టబోయే క్షిపణి పరీక్షపై ప్రభావం పడుతోంది. డ్రాగన్‌కు చెందన నిఘా నౌక హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిందని, దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. నవంబరు 10-11 తేదీల్లో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు ఇటీవలే నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసింది భారత్. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. అయితే నోటమ్ జారీ చేసిన తర్వాత చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే నిఘా, పరిశోధక నౌక.. హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత క్షిపణులు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఆ నిఘా నౌకకు ఉండటమే అందుకు కారణం. ఈ నౌక ఇండోనేషియాలోని బాలీ తీరం నుంచి శుక్రవారం ఉదయమే బయల్దేరింది. భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను హిందూ మహా సముద్రంలోకి పంపించడం.. మన ఆయుధ పాటవంపై కన్నేసి ఉంచడానికే డ్రాగన్ చేసిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాలు.. ఓపీఎస్ పునరుద్ధరణ.. మహిళలకు రూ.1,500: కాంగ్రెస్ హామీల వర్షం -
చైనాకు చెక్ పెట్టడంలో ‘భారత్’ కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్ మైక్ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్‌పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ సెమినార్లో ఈ మేరకు అమెరికా-భారత్ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్ అడ్మిరల్ మైక్ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్‌లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు.. భారత్-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్నాయి. ఇదీ చదవండి: తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు -
భారత్ టార్గెట్‌గా చైనా స్పెషల్ ఆపరేషన్.. జిన్‌పింగ్ అసలు ప్లాన్ ఇదే!
China's New 'Mission Indian Ocean'.. చైనా.. ఈ పేరు వింటేనే అందరిలో కయ్యానికి కాలుదువ్వే దేశం అని గుర్తుకు వస్తుంది. ఇటీవలే తైవాన్‌పై దాడులకు తెగబడిన డ్రాగన్ కంట్రీ.. భారత్‌ను కూడా కవ్విస్తోంది. హిందూ మహాసముద్రంపై ఫోకస్ పెట్టి భారత్‌ను రెచ్చగొడుతోంది. అయితే, హిందూ మహాసముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా చైనా.. ఓ స్పెషల్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం. ‘మిషన్ ఇండియన్ ఓషన్’ పేరుతో సైనిక కార్యకలాపాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక, చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన సంగతి తెలిసిందే. కాగా, చైనా 590 మిలియన్ డాలర్లతో 2016లో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో నౌకా స్థావరాన్ని నిర్మించింది. అయితే, ఈ స్థావరం.. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాలువ మార్గంలో ఉంది. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ను వేరుచేసే వ్యూహాత్మక బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి వద్ద చైనా మాస్టర్ ప్లాన్‌తో ఈ స్థావరాన్ని నిర్మించింది. ఇక, ఈ ప్రాంతంలోనే తాజాగా చైనా.. యుజావో యుద్ధనౌకను మోహరించినట్లు శాటిలైట్ ఫొటోల ఆధారంగా తెలుస్తోంది. ఈ స్థావరంలో నౌకపై భారీ సైనిక సామర్థ్యం గల వాహనాలతో పాటు జెట్ ఫైటర్లను చైనా మోహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నౌక ద్వారా భారత్ కు సంబంధించిన కీలక ఉపగ్రహ సమాచారాన్ని చైనా సేకరించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన విషయం తెలిసిందే. -
క్వాడ్‌తో మనకు ఒరిగేదేమిటి?
క్వాడ్ సభ్యదేశాలకు చెందిన ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట అమెరికా వంటి ప్రాంతీయేతర శక్తులు విహరించడాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్‌కు హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడినుంచే జరుగుతున్నాయి. విదేశీ ఆధిపత్య శక్తుల ద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో సైనికీకరణ, పోటీ నెలకొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంత సమీప దేశాల ప్రయోజనాలను కాపాడటంలోనూ భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో, ఇటీ వలే జపాన్‌లో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా మధ్య ముగిసిన నాలుగుదేశాల సంభాషణ లేదా క్వాడ్ సదస్సు పలువురు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులను విశేషంగా ఆకర్షించింది. తైవాన్‌పై చైనా దాడిచేస్తే సైనికపరంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. సదస్సు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటన... 2021 మార్చ్ 12న జరిగిన తొలి సదస్సులో చేసిన ప్రకటనలోని క్వాడ్ స్ఫూర్తిని నొక్కి చెప్పింది. అమెరికా ఇంతవరకూ 1982 నాటి సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌ను ఆమోదించలేదు కానీ 1958 నాటి నడి సము ద్రంపై కన్వెన్షన్ (సీహెచ్ఎస్)లో మాత్రం భాగం పుచ్చుకుంది. అయితే నడిసముద్రంపై కన్వన్షన్ని తదుపరి వచ్చిన సముద్ర చట్టాలపై ఐరాస కన్వెన్షన్ తోసిపుచ్చిందనుకోండి! అమెరికా దీన్నే లాంఛనప్రాయమైన అంతర్జాతీయ చట్టంగా గుర్తించినప్పటికీ, 1982 నాటి తాజా కన్వెన్షన్‌ని అమెరికా ఇంకా ఆమోదించకపోవడం వల్ల యూఎన్సీఎల్ఓఎస్ ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఈఈజెడ్) భావనకు గణనీయంగా సవాలు ఎదురవుతోంది. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్ర అన్వేషణలపై, సముద్ర వనరుల ఉపయోగంపై, నీటినుంచి, గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తిపై ఆయా దేశాలకు ఉండే ప్రత్యేక హక్కులను ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల భావన గుర్తిస్తోంది. గత సంవత్సరం క్వాడ్ దేశాల మధ్య తొలి సదస్సు జరిగిన నెల రోజుల్లోపే అంటే 2021 ఏప్రిల్ 7న అమెరికా భారత్‌కు నిజంగానే షాక్ కలిగించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉండే లక్షద్వీప్ దీవుల సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి జలాల లోపలికి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ (ఎఫ్ఓఎన్ఓఎఫ్) పేరిట తన భారీ నౌకను పంపించినట్లు అమెరికా తెలిపింది. అయితే తీరప్రాంత దేశం సమ్మతి లేకుండా అలాంటి విన్యాసం నిర్వహించడం చట్టవిరుద్ధమని భారత్ తీవ్రంగానే స్పందించింది. సముద్ర మండళ్ల చట్టం 1976 ప్రకారం తన ప్రాదేశిక జలాల్లోకి, ప్రత్యేక ఎకనమిక్ జోన్లోకి విదేశీ నౌకలు ప్రత్యేకించి సైనిక నౌకలు ప్రవేశించాలంటే ముందస్తు సమా చారం, అనుమతి తీసుకోవాలని భారత్ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే అమెరికా చేపట్టిన నౌకా విన్యాసం సముద్ర చట్టాలపై ఐక్య రాజ్య సమితి కన్వెన్షన్‌ని మాత్రమే కాదు, భారత జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించినట్లే అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అన్ని దేశాలకూ వర్తిస్తుందనీ, క్వాడ్ డిక్లరేషన్ ఏ ప్రత్యేక దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదని చెబుతూనే, చైనాకు బలమైన సందేశాన్ని పంపడంలో భాగంగా అమెరికా అలాంటి చర్యకు పాల్పడిందని కొంతమంది పరిశీలకులు సమర్థిస్తుండవచ్చు. అమెరికా పాదముద్రల్లో నడిచి, చైనాతో సహా ఇతర విదేశీ శక్తులు కూడా ఇదే వాదన వినిపించి భారత ప్రత్యేక ఆర్థిక జోన్లోకి స్వేచ్ఛగా తమ నౌకలను పంపిస్తే, భారత్‌కు ఇది తక్షణ ఆందోళన కలిగించక మానదు. ఈ అర్థంలో క్వాడ్ ప్రకటన స్థూలంగానే భారత భద్రతా పరమైన ఆందోళనలను విస్మరించిందనే చెప్పాలి. అంతేకాకుండా యూరేషి యన్ భౌగోళిక వ్యూహాన్ని దక్షిణాసియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతంతో సహా ఓ ఒక్క శక్తీ లేదా సంకీర్ణ శక్తులు కూడా డామినేట్ చేయడాన్ని అనుమతించకూడదనే అమెరికన్ వ్యూహాన్ని మాత్రమే క్వాడ్ ప్రకటన సంతృప్తి పర్చనుంది. ‘చైనా–ఇండియా గ్రేట్ పవర్ కాంపిటీషన్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజియన్ ఇష్యూస్ ఫర్ కాంగ్రెస్’ శీర్షికతో అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ పేపర్ని 2018లో ట్రంప్ పాలనా కాలంలో ప్రచురించారు. భారత్, చైనా మధ్య పోటీ, శత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఒక సమతుల్య శక్తిగా అమెరికా వ్యవహరించాలని ఈ పత్రం స్పష్టం చేసింది. తమ హిందూ మహాసముద్ర తీర ప్రాంత వ్యూహంలో భారత్ అతిముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటని ట్రంప్, బైడెన్ పాలనా యంత్రాంగాలు రెండూ ప్రకటించాయి గానీ, భారత ప్రత్యేక ఆర్థిక జోన్లో అమెరికా యుద్ధ నౌకా విహారం దాని విశ్వసనీయతకు తూట్లు పొడిచింది. అలాగే ఒక ప్రాంతీయ శక్తిగా ఈ మొత్తం రీజియన్ ప్రయోజనాలను పరిరక్షించే మాట దేవుడెరుగు, భారత్ తన సొంత ప్రయోజనాలనైనా కాపాడుకునే సామర్థ్యం కలిగివుందా అనే సందేహాలను ఇతర తీరప్రాంత దేశాల్లో పెంచి పోషించింది. తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ఇతరులు ప్రవేశించడానికి భారత్ తీసుకున్న వైఖరి లాగానే, ఇతర దేశాలు కూడా తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ప్రవేశించడానికి ముందుగా అనుమతి తీసుకోవలసి ఉందని చైనా పేర్కొంటోంది. అయితే ఈ ప్రత్యేక ఆర్థిక మండలి తనదే అని చైనా చెబుతుండటం వల్ల జపాన్, దక్షిణ కొరియా, పిలిఫ్పైన్స్, వియత్నాంతో దానికి వివాదాలు ఎదురవుతున్నాయి. అమెరికాకు ఈ దేశాలతో భద్రతాపరమైన బాధ్యతలు ఉంటున్నాయి. ప్రస్తుతానికి అయితే తూర్పు, దక్షిణ తీర ప్రాంతంలో భారత్ తన ఉనికిని ప్రదర్శించుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి చైనా తీరప్రాంతంపై క్వాడ్ చేసిన ప్రకటన భారత్‌కు ఉపకరించదు. అదే సమయంలో అమెరికాకు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని తన పొత్తుదారుల ప్రయోజనాలను మాత్రమే ఈ ప్రకటన నెరవేరుస్తుందని గ్రహించాలి. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని లేదా ఇండో పసిఫిక్ రీజియన్‌లోని భౌగోళిక ప్రాంతాన్ని క్వాడ్ గుర్తించడం లేదు. 2017 నాటి జాతీయ భద్రతా వ్యూహం ప్రకారం, భారత పశ్చిమ తీర ప్రాంతం నుంచి అమెరికా పశ్చిమ తీరప్రాంతం వరకు వ్యాపించిన ప్రాంతాన్ని ఇండో–పసిఫిక్ ప్రాంతమని అమెరికా నిర్వచించింది. కాగా, ఆఫ్రికా కొమ్ము అని చెబుతున్న ప్రాంతం నుంచి పసిఫిక్ రీజియన్ తీరం వరకు ఉన్నదే ఇండో–పసిఫిక్ ప్రాంతమని భారత్ భావిస్తోంది. ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు చాలావరకు ఆగ్నేయాసియా దేశాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ పేరిట పెరుగుతున్న చైనా మదుపు ప్రాజెక్టులు, మిలిటరీ వ్యవస్థల నిర్మాణం భారత్ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలకు ప్రత్యక్ష ప్రమాదంగా మారుతున్నాయి. భారతీయ హిందూ మహాసముద్ర వ్యూహంలో రెండు కీలక అంశాలున్నాయి. ఒకటి, భారత ప్రాంతీయ నౌకల ఉనికిని బలోపేతం చేయడం. దీనివల్ల విదేశీ శక్తుల ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చు. రెండు, ఆర్థిక, సాంకేతిక సహకార చర్యలను ప్రోత్సహించడం. సభ్యదేశాలకు చెందిన ప్రత్యక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట ప్రాంతీ యేతర శక్తులు విహరించడాన్ని సామూహికంగా అడ్డుకునేందుకు ఇంతవరకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్‌కు సంబంధించినంతవరకూ హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఈ ప్రాంతం ద్వారానే జరుగుతున్నాయి. విదేశీ శక్తుల ద్వారా హిందూ మహాసముద్ర రీజియన్‌లో సైనికీకరణ, పోటీ నెల కొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడు కోవడం కోసమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంతం సమీప దేశాల ప్రయోజనాలను కూడా కాపాడటంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. దీనికోసం స్వతంత్ర హిందూ మహాసముద్ర వ్యూహాలను భారత్ బలోపేతం చేసుకోవలసి ఉంది. అప్పుడే ఈ రీజి యన్‌లో నిజమైన నికర భద్రతా ప్రదాతగా భారత్ ఆవిర్భవిస్తుంది. వ్యాసకర్త: డాక్టర్ గద్దె ఓంప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ మొబైల్: 79089 33741 -
చైనా నీడలో హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం చైనా ప్రభావిత ప్రాతంగా శరవేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కెన్యా, కమరోజ్, సీషెల్స్ లాంటి హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో సంబంధాలకు చైనా విశేష ప్రాధాన్యమిస్తోంది. అలాగే తమ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల నిమిత్తం చైనా పెట్టుబడుల కోసం శ్రీలంక, మాల్దీవులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారతదేశం నుంచి కూడా ఇవి మద్దతు కోరుకుంటున్నాయి. తన భద్రతా ప్రయోజనాలను అడ్డుకోనంతవరకు, ఈ రెండు దేశాలతో ఆర్థిక సంబంధాలు భారత్‌కు ఆమోదనీయమే అవుతాయి. అయితే సరైన ప్రతిస్పందనలు కరువైనప్పుడు ఈ అవగాహన పూర్తిగా నీరుగారిపోవచ్చు కూడా! ఏమైనా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా చొరబాటు వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో భారత్‌కు కీలక పాత్ర ఉంటుంది. పశ్చిమ హిందూ మహా సముద్ర ప్రాంతంలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత 32 సంవత్సరాలుగా చైనా విదేశాంగమంత్రి నూతన సంవత్సర సఫారీ, ఆఫ్రికాకే పరిమితమై ఉంటూ వస్తోంది. సాధారణంగా అయిదు ఆఫ్రికా దేశాలను చైనా విదేశీ మంత్రి సందర్శించేవారు. కానీ ఈ ఏడాది ఆయన సందర్శన జాబితాలో మరికొన్ని దేశాలు వచ్చి చేరాయి. ఎరిత్రియా, కెన్యా, కమరోజ్ దేశాలతోపాటు మాల్దీవులు, శ్రీలంకను కూడా చైనా విదేశీ మంత్రి వాంగ్ యీ సందర్శించడం విశేషం. ఈ సంవత్సరం చైనా మంత్రి సందర్శించిన దేశాల్లో నాలుగు హిందూ మహాసముద్ర ప్రాంతానికి చెందినవి. అంటే చైనా సఫారీ ఆఫ్రికాకు మాత్రమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతానికి కూడా విస్తరించింది. కమరోజ్, కెన్యా ఇప్పటికే ఈ ప్రాంతానికి చెంది ఉన్నాయి. 2021 జనవరిలో వాంగ్ యీ సీషెల్స్‌తో సహా హిందూ మహా సముద్ర ప్రాంతంలోని అయిదు ఆఫ్రికన్ దేశాలను సందర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా పాదముద్రలు ఇతర దేశాల ప్రభావానికి సవాల్ విసురుతున్నాయి. 2008లో గల్ఫ్ ఆఫ్ ఈడెన్ చుట్టూ చైనా సముద్ర బందిపోట్ల వ్యతిరేక నావికా బలగాల మోహ రింపుతో ఇది ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ ప్రాంతంలో ఓడలకు రవాణా పరమైన మద్దతుకోసం అది రిహార్సల్స్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో భాగంగా దాని నీలిరంగు నావికా బలగాలు చాలా దూరం పయనించాయి. తన తొలి ఆఫ్రికన్ సైనిక స్థావరాన్ని చైనా 2017లో జిబూతిలో ప్రారంభించింది. జిబూతి ఆఫ్రికా కొమ్ము అని పిలిచే ప్రాంతంలో వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, జపనీస్ స్థావరాలు ఉంటున్నాయి. చైనా ఇప్పుడు అట్లాంటిక్ తీరప్రాంతంలోని ఈక్వేషనల్ గినియాలో కూడా సైనిక స్థావరం ఏర్పర్చుకున్నట్లు వార్తలు వస్తు న్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రం గుండా చైనా సరఫరా మార్గాలకు ఇదెంతో అవసరం. ఈ కోణంలో కమరోజ్, సీషెల్స్ దేశాలతో సంబంధాలు చైనాకు చాలా ముఖ్యం. హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల్లో చైనా విదేశీమంత్రి ఇటీవలి సందర్శన ప్రభా వాన్ని అంచనా వేయడానికి కెన్యా స్పష్టమైన ముఖచిత్రాన్ని ఇస్తుంది. తన కెన్యా సందర్శనలో వాంగ్ యీ, మొంబాసా రేవులో చమురు టెర్మినల్ని ప్రారంభించారు. హిందూ మహసముద్ర తీరంలో ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. మొంబాసా–నైరోబీ రైల్వే మార్గం కోసం 3.5 బిలియన్ డాలర్లను చైనా విరాళమిచ్చింది. చైనా నిర్మిస్తున్న బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో కెన్యాకు కీలక స్థానముంది. పైగా మౌలిక వసతుల కల్పనకు చైనానుంచి సహాయం కోసం కెన్యా చూస్తోంది. అయితే చాలా సంవత్సరాల తర్వాత కమరోజ్ దేశాన్ని చైనా మంత్రి సందర్శించడం అసాధారణమే. చైనా విరాళాలను భరాయిం చుకునే సామర్థ్యం కమరోజ్కు తక్కువే. అయినా ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ దేశం చూస్తోంది. 2030 నాటికి సార్వత్రిక రోగనిరోధక శక్తిని పెంచడం, మలేరియా నిర్మూలన లాంటి కమరోజ్ ప్లాన్ కోసం రెండు దేశాలు పథక రచన చేస్తున్నాయి. పైగా సెనెగల్‌లో నిర్వహించిన చైనా, ఆఫ్రికా సహకార వేదిక భేటీలో తొమ్మిది కీలక మైన పథకాలను కూడా చైనా 2021 డిసెంబర్లో కుదుర్చుకుంది. అయితే కమరోజ్ దేశాన్ని చైనా మంత్రి సందర్శించడం ఈ ప్రాంతంలో ఫ్రాన్స్ ప్రభావాన్ని సవాలు చేస్తోంది. ఈ యేడు ఇతర ఆఫ్రికన్ దేశాలను సందర్శించడానికి బదులుగా, మాల్దీవులతో సంబంధాలు ఏర్పర్చుకుని 50 సంవత్సరాలైన సంద ర్భంగా వాంగ్, ఆ దేశాన్ని సందర్శించారు. ఇక శ్రీలంకతో రబ్బర్–రైస్ ఒడంబడిక కుదుర్చుకుని 70 ఏళ్లు పూర్తి చేసుకోవడం, దౌత్య సంబంధాలు కుదుర్చుకుని 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ దేశాన్ని కూడా చైనా మంత్రి సందర్శించారు. కాబట్టి హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ సంవత్సరం చైనా సఫారీ కేంద్రీకరించింది. ఇప్పటికే తమ ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల నిమిత్తం చైనా పెట్టుబడుల కోసం శ్రీలంక, మాల్దీవులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో భారతదేశం నుంచి కూడా ఇవి మద్దతు కోరుకుంటున్నాయి. ఇండియాను ఒక పొరుగు దేశంగా, చైనాను ఎదుగుతున్న అగ్రరాజ్యంగా భావిస్తూ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలను ఎలా కొనసాగించాలో ఇవి పాఠాలు నేర్చుకుం టున్నాయి. తన భద్రతా ప్రయోజనాలను అడ్డుకోనంతవరకు, ఈ రెండు దేశాలతో ఆర్థిక సంబంధాలు భారత్‌కు ఆమోదనీయమే అవు తాయి. అయితే సరైన ప్రతిస్పందనలు కరువైనప్పుడు ఈ అవగాహన పూర్తిగా నీరుకారిపోవచ్చు కూడా. ఈ పొరుగు ద్వీపదేశాలకు చెందిన రాజకీయ నేతలు ఒక విధానంగా భారత్‌కు మద్దతు నివ్వాలని సూచిస్తూ వస్తున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా చొరబాటుతో ఎదుర్కోవాలంటే భారత్ చేయవలసింది చాలానే ఉంది. అందుకే మారిషస్, సీషెల్స్, మడగాస్కర్తో పాటు శ్రీలంక, మాల్దీవులు, కమరోజ్ వంటి తీరప్రాంత దేశాలను కూడా భారత్ నిరం తరం బలపరుస్తూ వస్తోంది. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్న ఈ దేశాల్లో చైనా బలంగా పాతుకుపోతోందని ఆధారాలు చెబుతున్నాయి. మరి హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రమేయాన్ని భారత్ ఎలా ఎదుర్కోవాలి? మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో కరెన్సీ సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు ద్వైపాక్షిక తోడ్పాటును ఇండియా గణనీయ స్థాయిలో విస్తరిస్తోంది. కుట్ర ప్రయత్నం, ఉగ్రదాడి, నీటి సంక్షోభం, మహమ్మారి వంటి సంక్షోభం పరిస్థితుల్లో భారత్ ఈ దేశాలను ఆదుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల శ్రీలంకకే ఎక్కువ ప్రయోజనం కలిగేలా రెండు దేశాల భాగస్వా మ్యంలో మార్పు వచ్చింది. కమరోజ్లో ఒక ఒకేషనల్ శిక్షణా కేంద్రాన్ని, విద్యుత్ ప్లాంట్‌ని నిర్మిచడంలో భారత్ తోడ్పడింది. కానీ ఇవి ఇంకా పూర్తి కాలేదు. ఇక భారత సంతతి ప్రజలపై కెన్యా బలమైన ఆర్థిక ప్రభావం కలిగి ఉంది. కెన్యాతో పెట్టుబడి ఆధారిత సంబంధాలను భారత్ కొనసాగిస్తోంది. రివాటెక్స్ బట్టల మిల్లు పునరుద్ధరణ కోసం కెన్యా భారత్ నుంచి రుణం స్వీకరించింది. అయితే ఈ దేశాల్లో భారత్, చైనా మధ్య పోలికల గురించి చర్చ ప్రారంభమైంది. కాబట్టి ఈ దేశాలకు ఎలాంటి మంచి తలపెట్టాలి, ఏం చేయగలగాలి అనేది ఇండియానే తేల్చు కోవల్సి ఉంది. చైనా రుణకల్పనకు ప్రత్యామ్నాయాన్ని అందించేం దుకు విస్తారమైన పొత్తులను ఇండియా రూపొందించాల్సి ఉంది. భారత్, పసిఫిక్ సాగర విధానంలో వాయవ్య హిందూ మహాసముద్ర ప్రాంతం ఒక భాగం. జపాన్, ఫ్రాన్స్, అమెరికా కూడా హిందూ మహాసముద్రాన్ని ప్రభావితం ప్రాంతంగా చూస్తున్నాయి. కాబట్టే 1997లోనే భారత్ 14 దేశాలను కలుపుకొని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్‌ని ఏర్పర్చింది. ఇప్పుడు వీటి సంఖ్య 23కి చేరింది. ప్రారంభంలో ఆర్థిక సహకారంపైనే దృష్టి సారించినప్పటికీ ఈ కూటమి సముద్ర భద్రత, సాంప్రదాయేతర భద్రతా ప్రమాదాల వరకు విస్తరించింది. ఈ కూటమిలో ఫ్రాన్స్ కూడా భాగస్వామి. చైనా ఒక సంభాషణా భాగస్వామిగా ఉంటోంది. పాకిస్తాన్‌ని మినహాయిం చిన ఈ కూటమి భారత్‌కు అధిక అవకాశాలను అందజేస్తోంది. ఇండో–పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్‌ని కూడా భారత్ ఉపయో గించుకుని ఈ ప్రాంతంపై తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. దీన్ని 2019లో భారతదేశమే ప్రకటించింది. అలాగే క్వాడ్ దేశాల కూటమిని కూడా భారత్ ఆహ్వానించడంలో ముందంజ వేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతం, ఫసిఫిక్ ప్రాంతంలో చైనా చొర బాటు వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాన్ని రూపొందిం చడంలో భారత్‌కు కీలక పాత్ర ఉండబోతోంది. – గుర్జీత్ సింగ్ భారత మాజీ రాయబారి -
భారత్‌కు కరువు, వడగాల్పుల ముప్పు
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రం వేగంగా వేడెక్కుతోందని వాతావరణ మార్పుపై విడుదల చేసిన ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావంతో భారత్‌లో వడగాలులు, వరదలు పెచ్చురిల్లుతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రం వేడెక్కడంతో దేశం చుట్టూ ఉన్న సముద్ర మట్టాలు పెరుగుతాయని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు భారీ వరదలు, ముంపునకు గురవుతాయని, నేలలో తేమ తగ్గడంతో పలు చోట్ల కరువు సంభవిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇండియా లాంటి జనసాంద్రత అధికంగా ఉన్న దేశంలో వడగాలులు పెరగడాన్ని ఏరోసాల్స్(గాలిలో ఉండే సూక్ష్మమైన ధూళి కణాలు) కొంతవరకు అడ్డుకుంటాయని, అయితే దీనివల్ల గాలిలో నాణ్యత లోపిస్తుందని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశంలో వానలు, వరదలు పెరగడం, హిమనీ నదాలు కరిగిపోవడం, ఇదే సమయంలో సముద్ర మట్టాలు పెరగడం కలగలిపి భారీ ఇక్కట్లు కలగజేస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంత తొందరగా ఆగకపోవచ్చని నివేదిక రూపకర్తలో ఒకరైన ఫ్రెడరిక్ ఒట్టో చెప్పారు. దేశీయంగా సముద్ర మట్టాల పెరుగుదలకు 50 శాతం కారణం అధిక ఉష్ణోగ్రతలేనని మరో సైంటిస్టు స్వప్న చెప్పారు. 21 శతాబ్దమంతా భారత్ చుట్టూ సముద్ర మట్టాలు పెరగడాన్ని గమనించవచ్చని, అలాగే వందల సంవత్సరాలకు ఒకమారు వచ్చే సముద్ర బీభత్సాలు ఈ శతాబ్దం చివరకు సంభవించవచ్చని అంచనా వేశారు. వచ్చే 20– 30 ఏళ్లలో భారత్‌లో వర్షపాతం పెద్దగా మారకపోవచ్చని కానీ శతాబ్దాంతానికి తేడా వస్తుందని పేర్కొంది. భారత్, దక్షిణాసియాల్లో అసాధారణ రుతుపవన గమనాలుంటాయని ఐపీసీసీ తెలిపింది. దీనివల్ల స్వల్పకాలిక వర్షపాత దినాలు ఎక్కువైతాయని, దీర్ఘకాలిక వర్షదినాలు తగ్గుతాయని తెలిపింది. పట్టణీకరణ(అర్బనైజేషన్)తో పెరుగుతున్న ప్రమాదాలను వివరించింది. మానవ తప్పిదాలే ఈ పరిస్థితులకు కారణమని నివేదిక తెలిపింది. 1970 నుంచి మానవ చర్యల కారణంగా సముద్ర పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని, 1990తో పోలిస్తే ఆర్కిటిక్ సముద్రం 40 శాతం కుంచించుకుపోయిందని తెలిపింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించకపోతే ఊహించని ప్రమాదాలు తప్పవని, ఇప్పటినుంచే మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. -
భూమ్మీద మరో మహా సముద్రం.. ఇది చాలా డిఫరెంట్!
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమి ఉపరితలంపై 70% నీళ్లేనని, నాలుగు మహా సముద్రాలు ఉన్నాయని చిన్నప్పుడు బడిలో వల్లెవేసే ఉంటాం. వాటి పేర్లు బట్టీపట్టే ఉంటాం. మరి ఆ నాలుగు మహా సముద్రాలకు తోడుగా ఇప్పుడు ఇంకో మహా సముద్రం వచ్చి కలిసింది తెలుసా? ఆ నాలుగింటికి భిన్నంగా ఉండే ఈ కొత్త మహా సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు, దానితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మహా సముద్రం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఇప్పటిదాకా ఆ నాలుగే.. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్టు పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్.. ఈ నాలుగూ మహా సముద్రాలు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య నిలువుగా ఉండేది అట్లాంటిక్ మహా సముద్రం.. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య హిందూ మహా సముద్రం.. ఆసియా, ఆస్ట్రేలియాలకు, ఉత్తర, దక్షిణ అమెరికాలకు మధ్య అత్యంత భారీగా ఉండేది పసిఫిక్ మహా సముద్రం.. పైన ఉత్తర ధ్రువం ప్రాంతంలో ఉండేది ఆర్కిటిక్ మహా సముద్రం.. ఇప్పుడు కొత్తగా గుర్తించినది దక్షిణ (సదరన్) మహా సముద్రం. భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ ఆవరించి ఉంది. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీనే నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ దీనిని కొత్త మహా సముద్రంగా గుర్తిస్తూ.. మ్యాప్‌లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ఈ మహా సముద్రం.. చాలా డిఫరెంట్.. నిజానికి వివిధ ఖండాల మధ్య సువిశాల నీటి భాగాలను మహా సముద్రాలుగా గుర్తించారు. ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ మహా సముద్రం కూడా భూభాగాల మధ్యనే ఉంటుంది. కానీ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని సదరన్ మహా సముద్రానికి మాత్రం సరిహద్దులుగా భూభాగాలు లేవు. చుట్టూ సముద్రాలే సరిహద్దులు. ఇదేగాక మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏ మహా సముద్రానికి కూడా మధ్యలో చిన్నా, పెద్ద దీవులు తప్ప ఖండాల వంటి భారీ భూభాగాలు లేవు. కానీ సదరన్ మహా సముద్రానికి మధ్యలో అంటార్కిటిక్ ఖండం ఉంటుంది. కొత్త సముద్రం.. సరిహద్దులు ఎలా? ప్రతి మహా సముద్రాన్ని ఖండాల మధ్య సరిహద్దులతో గుర్తిస్తే.. సదరన్ మహా సముద్రాన్ని దాని చుట్టూ ఉండే భారీ సముద్ర ప్రవాహాం (ఓసియన్ కరెంట్)తో నిర్ధారించారు. అంటార్కిటిక్ ఖండానికి రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో చుట్టూ.. పైన ఉపరితలం నుంచి సముద్రం అడుగు వరకు అత్యంత భారీ ప్రవాహం తిరుగుతూ ఉంటుంది. దానిని ‘అంటార్కిటిక్ సర్కమ్‌పోలార్ కరెంట్ (ఏసీసీ)’అంటారు. పసిఫిక్, హిందూ, అట్లాంటి మహా సముద్రాల నుంచి చిన్న ప్రవాహాలు దీనిలో కలిసిపోతాయి. ఈ భారీ ప్రవాహం నుంచి మధ్యలో పాయలు పాయలుగా చిన్న ప్రవాహాలు ఏర్పడి బయటికి వెళతాయి. ఈ ఏసీసీ మాత్రం కిలోమీటర్ల కొద్దీ వెడల్పుతో.. వేల కిలోమీటర్ల పొడవున తిరుగుతూనే ఉంటుంది. భూమ్మీద వేడి, చలువ సమస్థితికి కారణమిదే.. ఏసీసీ ప్రవాహానికి బయట పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల్లో నీళ్లు బాగా ఉప్పగా, కాస్త వేడిగా, తేలికగా ఉంటే.. ప్రవాహానికి లోపల సదరన్ మహా సము ద్రంలో నీళ్లు తక్కువ ఉప్పగా, బాగా చల్లగా, కాస్త మందంగా ఉంటాయి. భూమ్మీద ఎక్కువ ఉపరితలాన్ని ఆక్రమించిన మూడు సముద్రాల నుంచి వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న నీళ్లు ఏసీసీ ప్రవాహంలో కలిసిపోతాయి. ప్రవాహంలో సమాన ఉష్ణోగ్రతకు చేరిన నీళ్లు.. మధ్యలో చిన్న పాయలుగా ఈ సముద్రాల్లోనే కలుస్తాయి. దీనివల్ల వేడిగా ఉన్న నీళ్లు చల్లగా, చల్లగా ఉన్న నీళ్లు వేడిగా మారుతూ.. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి కారణమవుతాయి. దీనిద్వారా మొత్తం భూమి మీద ఉష్ణోగ్రతల్లో స్థిరత్వం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రవాహం లేకుంటే.. ప్రమాదమే.. అంటార్కిటిక్ కరెంట్ సముద్రాల్లో స్థిర ఉష్ణోగ్రతలకు తోడ్పటమే కాకుండా.. భూవాతావరణంపై చాలా ప్రభావం చూపుతుందని, అది లేకుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏసీసీ మిగతా సముద్రాల్లోని వేడి నీళ్లు అం టార్కిటికా ఖండానికి చేరకుండా ఆపు తుంది. అది లేకుంటే వేడి నీళ్లు చేరి అం టార్కిక్ మంచు వేగంగా కరిగిపోతుంది. అంటార్కిక్ ప్రాంతంలోని మంచు, నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వంటివి అక్కడి సముద్రపు లోతుల్లో భారీ స్థాయిలో కార్బన్ నిక్షేపం అవడానికి కారణమయ్యా యి. అలాకాకుండా ఉంటే భూవాతావరణంలో కార్బన్ వాయువుల శాతం పెరిగి.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరుగుతుంది. మంచు కరగడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగితే.. వరదలు, తుఫాన్లు, లోతట్టు ప్రాం తాలు మునిగిపోవడం, అధిక ఉష్ణోగ్రతలు వంటి సమస్యలకు కారణమవుతాయి. ‘గుర్తింపు’పై గొడవలెన్నో.. నిజానికి దక్షిణ మహా సముద్రానికి 1937లోనే ఈ గుర్తింపు ఇచ్చారు. కానీ ప్రపంచ దేశాల మధ్య కొన్ని వివాదాలు తలెత్తడంతో 1953లో ఆ హోదా తొలగించారు. కేవలం ఓ సముద్ర భాగంగానే పరిగణించారు. దీనికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో మహా సముద్రంగా గుర్తించాలని, ఆ ప్రాంతంలోని జీవజాతుల రక్షణ, ఇతర అంశాలకు అది తోడ్పడుతుందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన జియోగ్రఫిక్ నేమ్స్ బోర్డ్.. 1999లో దీనికి మహా సముద్రంగా గుర్తింపు ఇచ్చింది. తాజాగా నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ మ్యాప్‌లలో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, ఇతర జల భాగాలకు గుర్తింపు ఇచ్చే ‘ఇంటర్నేషనల్ హైడ్రోఫోనిక్ ఆర్గనైజేషన్ (ఐహెచ్ఓ)’ఓకే చేయాల్సి ఉంది. చదవండి: చైనాలో మరో విపత్తు! -
హమ్మయ్య.. గండం తప్పింది
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనకు గురిచేసిన చైనా లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ శకలాల కథ సుఖాంతమయ్యింది. ఈ శకలాలు ఆదివారం హిందూ మహా సముద్రంలో మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. శకలాలన్నీ సురక్షితంగా సాగర గర్భంలోకి చేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ విషయాన్ని అంతరిక్ష సంస్థ అధికారికంగా ప్రకటించింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం.. లాంగ్‌మార్చ్ రాకెట్ శకలాలు ఆదివారం ఉదయం 10.24 గంటలకు భూవాతావరణంలోకి ప్రవేశించాయి. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం(లాంగీట్యూడ్), 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం(లాటీట్యూడ్) వద్ద సముద్రంలో కూలిపోయినట్లు చైనా స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ వెల్లడించింది. చాలా శకలాలు భూవాతావరణంలో మండిపోయి, నీళ్లల్లో కూలాయి. ఇక రిలాక్స్ కావొచ్చు చైనా రాకెట్ శకలాల కథ సుఖాంతం కావడాన్ని నాసా కూడా ధ్రువీకరించింది. లాంగ్‌మార్చ్ 5బీ పునరాగమనాన్ని ఉత్కంఠతో పరిశీలిస్తున్నవారంతా ఇక రిలాక్స్ కావొచ్చని, రాకెట్ సముద్రంలో కూలిపోయిందని స్పష్టం చేసింది. ఈ గండం నుంచి చైనా ఇప్పటికిప్పుడు గట్టెక్కింది గానీ దాని నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదని హార్వర్డ్ వర్సిటీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ జోనాథన్ మెక్‌డొవెల్ తప్పుపట్టారు. చైనా ప్రభుత్వం తియాన్‌గాంగ్ పేరిట అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 29న హైనన్ ప్రావిన్స్‌లోని వెన్చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి లాంగ్‌మార్చ్ 5బీ (సీజెడ్–5బీ) రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రానికి అవసరమైన కీలక భాగాన్ని (కోర్ మా డ్యుల్) ఈ రాకెట్ మోసుకెళ్లింది. అయితే, మా డ్యుల్ను విజయవంతంగా రోదసీలో ప్రవేశపెట్టాక నియంత్రణ కోల్పోయింది. అంతరిక్షంలోనే పేలి పోయింది. దాని శకలాలు మళ్లీ భూమి పైకి దూసుకొచ్చాయి. అవి ఎక్కడ పడతాయన్న దాని పై భిన్న వాదనలు వినిపించాయి. ఒక దశలో ఇం డియా రాజధాని ఢిల్లీని ఢీకొట్టడం ఖాయమన్న పుకార్లు కూడా వినిపించాయి. చివరకు సముద్రంలో కూలిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్ శకలాలకు సంబంధించి బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రతినిధి బిల్ నెల్సన్ విమర్శించారు. -
హిందూ మహా సముద్రలో పడిన చైనా రాకెట్ శకలాలు
-
తప్పిన ముప్పు: హిందూ మహాసముద్రంలో రాకెట్ శకలాలు
న్యూఢిల్లీ: ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5-బీ రాకెట్ ముప్పు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా అని టెన్షన్ పెట్టిన చైనా రాకెట్ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి. అవి పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు. ఈ రాకెట్ శకలాలు సముద్రంలో కూలడం కంటే ముందే దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్ 29న చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ అనే భారీ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ పడతాయని అందరూ టెన్షన్ పడిన సంగతి తెలిసిందే. అమెరికా మిలిటరీ మాత్రం.. ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలాలు పూర్తిగా బూడిద అయిపోతాయిని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలాలు తుర్కిమెనిస్తాన్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతాయిని చెప్పాయి. కానీ చివరికి హిందూ మహా సముద్రంలో ఆ రాకెట్ శకలాలు పడిపోవటం గమనార్హం. ( చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా ) -
అమెరికా అవాంఛనీయ చర్య
ముందస్తు అనుమతి లేకుండా హిందూ మహాసముద్ర జలాల్లోని మన ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్) సమీపంలోకి అమెరికా నావికా దళం ఈ నెల 7న సంచరించింది. పైగా అదొక ఘన కార్యమన్నట్టు చాటింపు వేసుకుంది. పర్యాటక ఆసక్తితో దేశాలు సందర్శించేవారికి సైతం వర్తమాన ప్రపంచంలో నిబంధనలున్నాయి. అక్కడి ప్రభుత్వాలు రూపొందించుకున్న నిబంధనలు అనుమ తించినమేరకు మాత్రమే ఆ దేశాలు పర్యటించటానికైనా, అక్కడ శాశ్వత నివాసం ఏర్పరుచు కోవటానికైనా అవకాశం వుంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన నౌక సాధారణమైనది కాదు. అది అమెరికా నావికా దళంలోని సప్తమ విభాగానికి చెందిన యుద్ధ నౌక. దానికి క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యముంది. యుద్ధకాలంలో మినహా ఇతరత్రా సమయాల్లో మిత్ర దేశమైనా, శత్రు దేశ మైనా వేరొకరి గగనతలంలోకి లేదా వారి సముద్ర జలాల పరిధి సమీపంలోకి ప్రవేశించదల్చుకున్న ప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వటం ఆనవాయితీ. ఇందువల్ల అనవసర ఘర్షణలు నివారిం చటం లేదా దౌత్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడటం వీలవుతుంది. హిందూ మహా సముద్రంలోని లక్షద్వీప్ సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లటం ఈ కోణంలో అవాంఛనీయమైనది. ఈ నెల 7న తాము ఇటువైపుగా వచ్చామని అమెరికా నావికా దళం మరో మూడురోజుల తర్వాత ప్రకటించేవరకూ ఆ విషయం మన దేశ పౌరులెవరికీ తెలియదు. మన విదే శాంగ శాఖ ఆ యుద్ధ నౌక కదలికల గురించి ముందే కన్నేసివుంచామని ప్రకటించింది. అది పర్షి యన్ జలసంధి నుంచి మలకా జలసంధిలోకి వెళ్లేవరకూ నిరంతరాయంగా దాని కదలికలను పర్య వేక్షించామని, దౌత్య మార్గాల్లో నిరసన ప్రకటించామని తెలిపింది. ఆ సంగతిని మన ప్రభుత్వం అమెరికా ప్రకటనకన్నా ముందే వెల్లడించివుంటే బాగుండేది. మనం ఐక్యరాజ్యసమితి సముద్ర ఒడంబడికకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని, దాని ప్రకారమే సముద్ర జలాల్లో 12 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలుగా, మరో 24 మైళ్ల ప్రాంతాన్ని ప్రాదేశిక జలాలకు ఆనుకొని వుండే ప్రాంతంగా, దాన్నుంచి 200 మైళ్ల వరకూ ఈఈజడ్‌గా పరిగణిస్తున్నామని, ఒక సార్వభౌమాధికార దేశంగా అది మన హక్కని విశ్వసిస్తున్నప్పుడు అమెరికా వైఖరి తప్పని ఆ క్షణమే బహిరంగంగా ప్రక టించాల్సింది. కానీ ఒడంబడికను ఉల్లంఘించిన దేశం ఆ పని చేసి మన నిస్సహాయతను చాటింది. అంతర్జాతీయ ఒడంబడికపై మన అవగాహనకూ, అమెరికా అవగాహనకూ తేడావుంది. ఈ విషయంలో మనకే కాదు... ప్రపంచంలోని వేరే దేశాలకు కూడా అమెరికాతో విభేదాలున్నాయి. ఈ జాబితాలో అమెరికా మిత్ర, అమిత్ర దేశాలు రెండూ వున్నాయి. గత డిసెంబర్ 24న దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కాన్ దావో దీవుల సమీప జలాల గుండా అమెరికా యుద్ధ నౌక వెళ్లింది. మొన్న ఫిబ్రవరిలో మరో యుద్ధ నౌక అక్కడే స్పార్టీ. దీవుల సమీపం నుంచి వెళ్లింది. మార్చి 31న దక్షిణ కొరియాకు చెందిన కుక్–టో దీవుల సమీపంనుంచి, ఈ నెల 3న శ్రీలంక సముద్ర జలాల పరిధి మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించాయి. ఈనెల 7న మనతోపాటు మాల్దీవుల హక్కును కూడా అది ధిక్కరించింది. 1995లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికను వాస్తవానికి అమెరికా ఇంతవరకూ ధ్రువీకరించలేదు. దాన్ని ధ్రువీకరించిన మన దేశం అందుకొక షరతు విధిం చింది. ఈఈజడ్ పరిధిలోకి విదేశీ యుద్ధ నౌకలు ప్రవేశించాలంటే ముందస్తుగా భారత్‌కు తెలియ జేయాలన్నది దాని సారాంశం. వాణిజ్య నౌకలకు ఈ నిబంధన వర్తించదు. చైనా మాత్రం తమ ఈఈజడ్ పరిధిలోకి అనుమతిలేకుండా అన్యులెవరూ రాకూడదని నిర్దేశించింది. అన్నిరకాల నౌక లకూ ఇది వర్తిస్తుంది. అంతేకాదు... విశాల సముద్ర ప్రాంతం తన ఈఈజడ్‌గా చెప్పుకోవటం కోసం అది కృత్రిమంగా పగడాల దిబ్బలు నెలకొల్పింది. దాంతో ఆ ప్రాంతంలో వేరే దేశాల వాణిజ్య నౌకల గమనానికి అవకాశం వుండటంలేదు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో చైనాకూ, అమెరి కాకూ నడుస్తున్న లడాయి అదే. ఇందుకు మన దేశం కూడా మద్దతునిస్తోంది. అసలంటూ అంత ర్జాతీయ ఒడంబడిక వున్నప్పుడు ఏ దేశానికా దేశం దానికి తూట్లు పొడిచేలా సొంత నిబం ధనలు ఏర్పాటు చేసుకోవటం ఏమిటన్నది అమెరికా ప్రశ్న. కానీ ఇలా ప్రశ్నించడానికి నైతికంగా తన కేమి హక్కుందో ఆ దేశం తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ ఒడంబడికను పాతికేళ్లుగా ధ్రువీకరించ కుండా కాలక్షేపం చేస్తున్న అమెరికా... దాన్ని ధ్రువీకరిస్తూనే తమ తమ అవసరాలకు అనుగుణంగా ఒకటి రెండు షరతులు విధిస్తున్న దేశాలను తప్పు పట్టడం పరమ విడ్డూరం. అమెరికా తూర్పు ప్రాంతాన అట్లాంటిక్ మహా సముద్రం వుంది. దాని పడమరన పసిఫిక్ మహాసముద్రముంది. ఆ ప్రాంతాల్లోకి వేరే దేశానికి చెందిన యుద్ధ నౌక సంగతలావుంచి, వాణిజ్య నౌకనైనా అమెరికా అను మతించకపోవచ్చు. అదేమంటే...అంతర్జాతీయ ఒడంబడికను ధ్రువీకరించలేదని చెప్పవచ్చు. కానీ వేరే దేశాల విషయానికొచ్చినప్పుడు ‘ధ్రువీకరించాక సొంతంగా నిబంధనలెందుకు విధిస్తార’ని ప్రశ్నించవచ్చు. ఈ తర్కంతో ఒకపక్క స్వప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే మరోపక్క దబా యించటం అమెరికాకే చెల్లింది. అనుమతిలేకుండా మన ఈఈజడ్ పరిధి సమీపంలోకి రావటం ఎంత తప్పో, దాన్ని సమర్థించుకుంటూ అది చేసిన ప్రకటన కూడా అంతే తప్పు. అందులో మిత్ర స్వరం లేదు. స్వేచ్ఛాయత నౌకా హక్కును చాటడం కోసంభారత్తోసహా ఎక్కడైనా మున్ముందు కూడా ఇలాగే చేస్తామని ఆ ప్రకటన చెబుతోంది. దేశాల మధ్య మిత్ర సంబంధాలు పరస్పర గౌరవ మర్యాదల ప్రాతిపదికగా వుండాలి. ఇచ్చిపుచ్చుకునే వైఖరితో మెలగాలి. పెద్దన్న పాత్ర పోషిస్తా మని, పెత్తనం చలాయిస్తామని... దానికి అందరూ తలొగ్గి వుండాలని భావిస్తే అది చెల్లదని అమె రికా గుర్తెరిగేలా చేయటం మన తక్షణ కర్తవ్యం. -
సాగర గర్భంలో శోధన
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో కంటికి కనిపించే వివిధ రకాల జీవరాశుల గురించి మనకు తెలుసు. మరి అవి కాకుండా సాగర గర్భంలో ఇంకా ఏముంది? అక్కడి జీవ వైవిధ్యం.. వాతావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? తదితర అంశాలను అన్వేషించేందుకు విశాఖ నుంచి శాస్త్రవేత్తల బృందం ఈ నెల 15న బయల్దేరింది. ఆర్వీ సింధు సాధన నౌకలో వెళ్లిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(సీఎస్ఐఆర్–ఎన్ఐవో)కి చెందిన 30 మంది శాస్త్రవేత్తల బృందం హిందూ మహా సముద్ర గర్భంలోని విశేషాలను అన్వేషిస్తున్నారు. ఇతర మహా సముద్రాలతో పోలిస్తే హిందూ సముద్రంలో పరిశోధనలు చాలా తక్కువగా జరిగాయి. అందుకే ఇక్కడ సముద్ర గర్భంలో ఏం దాగుందో అన్వేషించే బాధ్యతను సీఎస్ఐఆర్–ఎన్ఐవో భుజానికెత్తుకుంది. జీవుల జన్యు వైవిధ్య మ్యాపింగ్.. సీఎస్ఐఆర్–ఎన్ఐవో సముద్ర గర్భంలోని జీవుల జన్యు వైవిధ్యాన్ని మ్యాపింగ్ చేయడమే లక్ష్యంగా ప్రాజెక్టును ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో కంటికి కనిపించని జీవరాశులు ఎన్ని రకాలున్నాయి, లోహాలు, వాతావరణ పరిస్థితులు, బ్యాక్టీరియా తదితరాలను అన్వేషించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘ట్రేస్ బయోమీ’ అని పేరు పెట్టారు. ► 30 మంది శాస్త్రవేత్తల బృందం 90 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించనుంది. వీరి యాత్ర దాదాపు 9,000 నాటికల్ మైళ్ల దూరం సాగనుంది. మే నెలలో గోవాలో వీరి పరిశోధన ముగియనుంది. ► ఒక జీవి పుట్టుక, పెరుగుదల, జీవితచక్రం విశేషాలపై పరిశోధన, నీటిలో ఉన్న లోహనిక్షేపాల వివరాలతో పాటు అవక్షేపాలు ఎంత మేర ఉన్నాయనే దానిని పరిశీలిస్తారు. ► అలాగే సముద్ర గర్భంలోని నీటి సాంద్రత, ఫ్లోరైడ్, వాటర్ టోటల్ హార్డ్నెస్, పీఏ లెవల్స్ ఎంతమేర ఉన్నాయి? జీవరాశులకు అవసరమైన ఆహారముందా? లేదా? మొదలైన వాటిపై పరిశోధనలు నిర్వహిస్తారు. ► హిందూ మహాసముద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నీరు, పాచి, జీవరాశుల విస్తృత నమూనాల్ని సేకరించి అధ్యయనం చేస్తారు. ఇందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ► సేకరించిన నమూనాల్లో ఉన్న లోహాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ జీవుల దశలు.. మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తారు. ముఖ్యంగా గ్లోబల్ ట్రాన్‌్రస్కిప్టోమ్, మెటాజెనోమ్ విశ్లేషణలు నిర్వహిస్తారు. ► మనకు కావల్సిన మెడిసిన్లకు అవసరమైన బ్యాక్టీరియా, శిలీంద్రాల పరిశోధన జరగనుంది. భవిష్యత్‌లో వాతావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని తెలుసుకోడానికి కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. సాగర గర్భ లోతుల్ని అన్వేషిస్తాం.. హిందూ మహా సముద్రం అడుగు భాగంలో అతి తక్కువ పరిశోధనలు జరిగాయి. ఇప్పటివరకు ఉపరితలంపైనా.. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే పరిశోధనలు చేశారు. ఈసారి మా శాస్త్రవేత్తల బృందం సాగర గర్భ లోతుల్ని అన్వేషించనుంది. సముద్ర జీవుల్లో జన్యు పరమైన మార్పులు, వాటి ప్రత్యేకతలు, ఆ జీవుల వల్ల కలిగే లాభనష్టాల్ని పరిశోధిస్తాం. సముద్ర గర్భంలోని వాతావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్‌లో వచ్చే మంచి, చెడులపైనా సమాచారం సిద్ధం చేస్తాం. 90 రోజుల్లో ఈ యాత్ర పూర్తయినా.. ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి మాత్రం మూడేళ్లు పడుతుంది. – డా.జి.ప్రభాకర్ ఎస్ మూర్తి, సీఎస్ఐఆర్–ఎన్ఐవో చీఫ్ సైంటిస్ట్ -
హిందూ మహాసముద్రంలో వింత జీవి
మహాసముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో రకమైన సముద్ర జీవులు, రకరకాల జంతు జాతులు ఉంటాయి. ఇలాంటి మహాసముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవడానికి కొందరు ఔత్సహికులు ప్రయత్నిస్తారు. కానీ, కొన్నిసార్లు వారి అన్వేషణలో సైతం తెలియని మిస్టీరియస్ వండర్స్ ఎన్నో ఉంటాయి. రీసెర్చర్లకు, జంతు నిపుణులకు సైతం ఇవి అంతు బట్టవు. తాజాగా హిందూ మహాసముద్రంలో సుమారు 3,700 అడుగుల లోతున కనీవినీ ఎరుగని ఒక విచిత్ర జీవి కనబడి అందరిని ఒకింత ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఈ వింత జీవి కదిలికలు అన్ని కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది పలు రకాల షేపులు మారుస్తూ, అతి వేగంగా లోతుగా నీటి అడుగు భాగానికి వెళ్లి అక్కడ తన ఆకారాన్ని మార్చుకుని అకస్మాత్తుగా ఒక చిన్న నల్ల బంతి ఆకారంలో మళ్ళీ పైకి వచ్చిన వెంటనే తన షేపు మారుస్తూ కనిపించింది. కొందరు దీన్ని సముద్ర ‘ఏలియన్’ అని అంటే మరికొందరు ఇది చేప లేదా తిమింగలం జాతికి చెందిన కొత్తరకం జీవి అంటున్నారు. కొంతమంది జేమ్స్ కేమరూన్ మూవీ ‘ఏలియన్’ని గుర్తు చేస్తున్నారు. ఇది రకరకాల విన్యాసాలు చేయడాన్ని ఇంత లోతున రీసెర్చర్లు అమర్చిన రిమోట్ కెమెరా క్యాప్చర్ చేసింది. ఈ క్లిప్ ను 2013లో ఆన్లైన్లో ప్రసారం చేసినప్పటికీ ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆఫ్రికా తూర్పు తీరంలో తీయబడింది. ఇప్పుడు యూట్యూబ్‌లో దీనిని 1.5 మిలియన్లకు పైగా చూశారు. నాటి నుంచి నేటి వరకు ఈ విచిత్ర జీవి ఏమిటో అనేది ఎవరు చెప్పలేక పోతున్నారు. చదవండి: గడ్డకట్టే చలిలో డాన్స్ అంటే మాటలా...