బీజింగ్ : భారత్-చైనాల మధ్య డోక్లాం తరువాత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్, వంటి వివాదాలు ఇరు దేశాల మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో చైనా సంబంధాలను మరీ బలోపేతం చేసుకోవడం కూడా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య హిందూమహాసముద్రం వేదికగా మరిన్ని కొత్త వివాదాలు ఏర్పడనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత్, చైనా మధ్య హిమాలయాలకంటే అధికంగా హిందూ మహాసముద్రమే వివాదాలకు, ఒకరకంగా చెప్పాలంటే యుద్ధానికి కూడా కారణమవుతుందని చైనాకు చెందిన ప్రముఖ విశ్లేషకుడు బ్రెర్టిల్ లిన్టర్ చెబుతున్నారు. బ్రెటిల్ తాజాగా రచించిన ‘చైనాస్ ఇండియా వార్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలను కలుపుతూ చైనా నిర్మిస్తున్న ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్, సిల్క్ రోడ్‌లు ఇందుకు కారణంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.
సముద్రంపై చైనా అసక్తి
చైనా దాదాపు 60 ఏళ్లుగా హిందూ మహాసముద్రంపై పట్టు సాధించలేదు. అయితే ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంతో పాటు.. హిందు మహాసముద్రంపై చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హిమాలయాలకన్నా.. చైనాకు ఇప్పుడు హిందూమహాసముద్రమే చాలా విలువైంది.
1959లో యుద్ధం జరగాల్సింది!
భారత్‌పై చైనా 1959లోనే యుద్ధం చేయాలని భావించినట్లు ఆయన తన పుస్తకంలో తెలిపారు. అయితే భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ.. సరిహద్దు సమస్యలపై చైనాతో చర్చించడంతో యుద్ధాన్ని వాయిదా వేసుకుంది. అయితే 1962లో మాత్రం చైనా యుద్ధానికి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment