China's New 'Mission Indian Ocean'.. చైనా.. ఈ పేరు వింటేనే అందరిలో కయ్యానికి కాలుదువ్వే దేశం అని గుర్తుకు వస్తుంది. ఇటీవలే తైవాన్‌పై దాడులకు తెగబడిన డ్రాగన్ కంట్రీ.. భారత్‌ను కూడా కవ్విస్తోంది. హిందూ మహాసముద్రంపై ఫోకస్ పెట్టి భారత్‌ను రెచ్చగొడుతోంది.
అయితే, హిందూ మహాసముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా చైనా.. ఓ స్పెషల్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం. ‘మిషన్ ఇండియన్ ఓషన్’ పేరుతో సైనిక కార్యకలాపాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక, చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన సంగతి తెలిసిందే.
కాగా, చైనా 590 మిలియన్ డాలర్లతో 2016లో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో నౌకా స్థావరాన్ని నిర్మించింది. అయితే, ఈ స్థావరం.. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాలువ మార్గంలో ఉంది. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ను వేరుచేసే వ్యూహాత్మక బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి వద్ద చైనా మాస్టర్ ప్లాన్‌తో ఈ స్థావరాన్ని నిర్మించింది.
ఇక, ఈ ప్రాంతంలోనే తాజాగా చైనా.. యుజావో యుద్ధనౌకను మోహరించినట్లు శాటిలైట్ ఫొటోల ఆధారంగా తెలుస్తోంది. ఈ స్థావరంలో నౌకపై భారీ సైనిక సామర్థ్యం గల వాహనాలతో పాటు జెట్ ఫైటర్లను చైనా మోహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నౌక ద్వారా భారత్ కు సంబంధించిన కీలక ఉపగ్రహ సమాచారాన్ని చైనా సేకరించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment