Satellite images
-
50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. జాగోరా, టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
గంజాయిపై శాటిలైట్!
సాక్షి, హైదరాబాద్: ‘నిషా ముక్త్ తెలంగాణ’లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గంజాయితోపాటు డ్రగ్స్‌కు చెక్ చెప్పడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తరహాలో ఎడ్రిన్ మ్యాప్స్, మ్యాప్ డ్రగ్ యాప్ టెక్నాలజీని వాడుతోంది. వీటికి సంబంధించి టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ విధానంలో నలుగురు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మండలాలు తెలిసినా ప్రాంతాలపై అస్పష్టత తెలంగాణతోపాటు ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలకు సరఫరా అవుతున్న గంజాయిలో అత్యధిక శాతం ఆంధ్ర–ఒడిశా సరిహద్దులతో (ఏఓబీ) పాటు విశాఖ ఏజెన్సీ నుంచే వస్తోంది. అక్కడి వ్యాపారులు వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తూ రైతులను ప్రలోభాలకు గురి చేసి గంజాయి పంట పండించేలా ప్రోత్సహిస్తున్నారు. ఏజెన్సీలోని ఏఏ మండలాల్లో గంజాయి సాగు జరుగుతోందో పోలీసులకు తెలుసు.. కానీ ఏ ప్రాంతంలో ఉందో కచి్చతంగా తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఏజెన్సీతోపాటు ఏఓబీలో సైతం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో గంజాయి పంటను గుర్తించేందుకు కూంబింగ్ తరహా ఆపరేషన్స్ చేపట్టడానికి పోలీసులు సాహసం చేయలేకపోతున్నారు. ఇదే అదనుగా ఈ పంట పండించే వాళ్లు నానాటికీ విస్తరిస్తున్నారు.ఉపగ్రహ ఛాయా చిత్రాలతో స్పష్టతకొన్నేళ్లుగా గంజాయిపై రాష్ట్ర పోలీసు విభాగాలతోపాటు ఎన్సీబీ సైతం దృష్టి పెట్టింది. తక్కువ ధరకు తేలిగ్గా లభిస్తూ వేగంగా విస్తరిస్తున్న ఈ మాదకద్రవ్యం పండించడం, విక్రయించడం, రవాణా, వినియోగం తదితరాలు లేకుండా చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. అందులో గంజాయి పంటను గుర్తించేందుకు శాటిలైట్ సాంకేతికత వాడకం ప్రధానమైంది. దీనికోసం ఎన్సీబీ అధికారులు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎడ్రిన్) సహాయం తీసుకుంటున్నారు.ఎడ్రిన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం... గంజాయి పండించే ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఎన్సీబీకి ఇస్తుంది. వీటిని విశ్లేషించే అధికారులు ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు, పరిపాలన విభాగాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. టీజీ ఏఎన్‌బీ కూడా ఇదే మాదిరిగా చేయడంతోపాటు ఆ ప్రాంతాలకు సంబంధించిన రూట్లలో ప్రత్యేక సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయనుంది.మ్యాప్ డ్రగ్‌తో మరింత సమన్వయం మాదకద్రవ్యాలను ఓ ప్రాంతంలో తయారు చేయడం, పంపడం జరిగితే... అవి ఒక ప్రాంతం మీదుగా ఇంకోచోటుకు చేరి అక్కడ వినియోగం అవుతుంటాయి. ఏజెన్సీలో గంజాయి, హష్ ఆయిల్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో నల్లమందు, మరికొన్ని చోట్ల ఎఫిడ్రిన్... ఇలా తయారై దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ విదేశాల నుంచి అక్రమ రవాణా అయి, గోవా, బెంగళూరు, ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయి.ఈ నేపథ్యంలోనే గంజాయితోపాటు ఇతర డ్రగ్స్ కట్టడికి సమన్వయం చాలా కీలకం. ఏఏ ప్రాంతాల్లో ఏ డ్రగ్స్ ఉంటున్నాయి? ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఏ మార్గాల్లో రవాణా అవుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుంటేనే సమన్వయం సాధ్యం. దీనికోసం మ్యాప్ డ్రగ్ పేరుతో ఎన్సీబీ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్‌ను అధికారికంగా వినియోగించుకోవడానికి టీజీ ఏఎన్‌బీకి అనుమతి ఇచ్చింది. దీని వినియోగంపై అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది. -
ఘోర విపత్తు.. దారణంగా టర్కీ పరిస్థితి.. శాటిలైట్ ఫోటోలు వైరల్
టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. ప్రకృతి విలయానికి ఇరు దేశాలూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఎటుచూసినా కూలిన భవన శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేలమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15,383 వేలకు చేరింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 12,391 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 2,992 మంది మరణించినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. తుర్కియే, సిరియా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆప్తుల ఆక్రందనలు, మిన్నింటిన రోదనా దృశ్యాలతో భయానంకంగా తయారయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలన్నింటినీ తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. అయితే ఎత్తయిన వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత? శాటిలైట్ దృశ్యాలు విడుదల రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా విలవిల్లాడుతున్నాయి. తాజాగా భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్ విడుదల చేసిన దృశ్యాలు ఉపద్రవం సృష్టించిన వినాశనం కళ్లకు అద్దం పట్టిన్నట్లు చూపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన అత్యవసర ఆశ్రయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ భూకంపం కారణంగా ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలన్నీ నేలమట్టమైన దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. టర్కీలోని దక్షిణ నగరాలైన అంటాక్యా, కహ్రమన్మరాస్, గాజియాంటెప్ భూకంపానికి గురైన అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ కుప్పకూలిన భవనాలు, గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 25వేల మందికి పైగా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితం భారీ భూకంపం కారణంగా దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ప్రభావిత ప్రాంతాల్లో 77 జాతీయ, 13 అంతర్జాతీయ అత్యవసర వైద్య బృందాలను మోహరించినట్లు పేర్కొంది. భారత్ సైతం, టర్కీ, సిరియాకు సహాయ సామాగ్రిని అందించింది. -
ప్రకృతి విలయానికి పాకిస్తాన్ కకావికలం.. శాటిలైట్ చిత్రాలే సాక్ష్యం!
ఇస్లామాబాద్: ప్రకృతి విలయానికి పాకిస్తాన్ కకావికలమైంది. జూన్ మధ్య నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అక్కడి ప్రజల జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలోని వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు ఉప్పొంగి రహదారులు కొట్టుకుపోయాయి. భారీ వరదలతో పాక్ అతలాకుతలం.. విలయానికి ముందు, తర్వాత- శాటిలైట్ చిత్రాలు (Image: Twitter/ @Maxar) వరదలతో పాకిస్తాన్లో 3.3 కోట్ల మందికిపైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదలకు ముందు, వరదల తర్వాత పరిస్థితి ఎలా ఉందని ఓ సంస్థ విడుదల చేసిన దృశ్యాలు పాక్‌లో ప్రకృతి విలయాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. This is a before and after from @Maxar published yesterday showing the devastating flooding in villages and fields along Pakistan’s Indus River (location: 28.718, 70.066). Image on the right was taken Aug 28. pic.twitter.com/5Su7lYs0hZ — Reade Levinson (@readelev) August 29, 2022 This is the price we, as the Most Affected People and Areas pay for the billions of profits made by oil and gas corporations. We need climate reparations now.#PakistanFloods pic.twitter.com/4nDC0Sj9uU — Fazeela Mubarak (@fazeelamubarak) August 29, 2022 భారీ వర్షాలు, వరదల వల్ల పాకిస్తాన్ వ్యాప్తంగా సోమవారం నాటికి 1,136 మంది చనిపోయారు. మరో 1,634 మంది వివిధ ప్రమాదాల్లో గాయపడ్డారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ఈ గణాంకాలను వెల్లడించారు. వరదల కారణంగా పాక్‌లో దాదాపు 10 లక్షల ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. లక్షల మంది తినడానికి ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా పాక్‌కు 160 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. #PakistanFloods are still ongoing. At least 1136 people have died. 33 million people (1 in 7 Pakistanis) are affected. 1/3 of the country is underwater. "It's all one big ocean." "Village after village has been wiped out. Millions of houses have been destroyed," pic.twitter.com/qLDoquDHir — Anonymous (@YourAnonCentral) August 30, 2022 ⭕ PAKISTAN FLOODS 2022 ⭕ Listen this clip; Videos shots are from current Pakistan floods. #Pray_for_Pakistan. #PakistanFloods #Pakistan pic.twitter.com/9ZKVd4uyVo — Cheeku🖤 (@cheekkuuu) August 27, 2022 50 million people have been impacted by #PakistanFloods RT Donate to Emergency Aid: https://t.co/MMoNScpsUE pic.twitter.com/zfRJ5K65Dj — Khaled Beydoun (@KhaledBeydoun) August 29, 2022 Shame on the mainstream media for not giving enough coverage to this devastation in Pakistan. Always covering the spiciest news for ratings.Who cares about the politics when people are helpless and dying? #PakistanFloods #FloodsInPakistan #گستاخ_وقار_ستی_کوگرفتارکرو #easypaisa pic.twitter.com/iSJxO0I156 — Dr Sardar Ali Shahbaz🇵🇸🇵🇰 (@Alishahbaz_7) August 24, 2022 The Worst Flood Ever in Pakistan Happening Right Now >45 Million People Affected >784% Above Normal Rainfall 40+ small dams breached. 210+ bridges collapsed; 1,115 people dead. 10M people displaced.#PakistanFloods pic.twitter.com/nr7hp0Lgrd — Anand Panna (@AnandPanna1) August 28, 2022 Devastating #Floods in #Pakistan have destroyed millions of homes, and taken the lives of 1000s. Please donate as much as you can and remember them in your prayers 🙏🏽 #PakistanFloods pic.twitter.com/7i3M7AOrM3 — Khalissee (@Kahlissee) August 27, 2022 Foods are wreaking havoc in our Swat. Overflooded rivers have invaded its banks and becoming a potential danger to the villages and hotels located nearby. #Swat #ClimateCrisis #PakistanFloods#Emergency pic.twitter.com/JpxeupdLLK — Hasnain Ali (@Hasnain69190888) August 26, 2022 ALMIGHTY ALLAH please protect Pakistan 🤲🏻 #FloodsInPakistan #ISPR #Dollar #PakistanFloods pic.twitter.com/oqUVIjyPB4 — Dr Sardar Ali Shahbaz🇵🇸🇵🇰 (@Alishahbaz_7) August 26, 2022 -
భారత్ టార్గెట్‌గా చైనా స్పెషల్ ఆపరేషన్.. జిన్‌పింగ్ అసలు ప్లాన్ ఇదే!
China's New 'Mission Indian Ocean'.. చైనా.. ఈ పేరు వింటేనే అందరిలో కయ్యానికి కాలుదువ్వే దేశం అని గుర్తుకు వస్తుంది. ఇటీవలే తైవాన్‌పై దాడులకు తెగబడిన డ్రాగన్ కంట్రీ.. భారత్‌ను కూడా కవ్విస్తోంది. హిందూ మహాసముద్రంపై ఫోకస్ పెట్టి భారత్‌ను రెచ్చగొడుతోంది. అయితే, హిందూ మహాసముద్రంలో పట్టు బిగించటమే లక్ష్యంగా చైనా.. ఓ స్పెషల్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకా స్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం. ‘మిషన్ ఇండియన్ ఓషన్’ పేరుతో సైనిక కార్యకలాపాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక, చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన సంగతి తెలిసిందే. కాగా, చైనా 590 మిలియన్ డాలర్లతో 2016లో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో నౌకా స్థావరాన్ని నిర్మించింది. అయితే, ఈ స్థావరం.. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకంగా భావించే సూయజ్ కాలువ మార్గంలో ఉంది. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ను వేరుచేసే వ్యూహాత్మక బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి వద్ద చైనా మాస్టర్ ప్లాన్‌తో ఈ స్థావరాన్ని నిర్మించింది. ఇక, ఈ ప్రాంతంలోనే తాజాగా చైనా.. యుజావో యుద్ధనౌకను మోహరించినట్లు శాటిలైట్ ఫొటోల ఆధారంగా తెలుస్తోంది. ఈ స్థావరంలో నౌకపై భారీ సైనిక సామర్థ్యం గల వాహనాలతో పాటు జెట్ ఫైటర్లను చైనా మోహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నౌక ద్వారా భారత్ కు సంబంధించిన కీలక ఉపగ్రహ సమాచారాన్ని చైనా సేకరించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. చైనా ఇటీవలే శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను మోహరించిన విషయం తెలిసిందే. -
అక్కడంతా సర్వనాశనం... గుబులుపుట్టిస్తున్న శాటిలైట్ చిత్రాలు?
కీవ్: ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో కళ్ల ముందు విధ్వంసం తప్ప మరేమీ కనిపించడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ శిథిలాల దిబ్బగా మారిపోయాయి. ఆకాశ హార్మ్యాలు నేలమట్టమయ్యాయి. వీధుల్లో స్మశాన నిశబ్దం అలుముకుంది. లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్లతో కాలం గడుపుతున్నారు.బాంబుల ధాటికి కాలి మసిబారి రూపు కోల్పోయిన భవనాలు, కూలిన వంతెనలు, దెబ్బతిన్న రహదారులే కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ దుర్బర పరిస్థితిని కళ్లకు కట్టే శాటిలైట్ చిత్రాలు బయటకొచ్చాయి. పశ్చిమ కీవ్‌లోని బుచ ప్రాంతం.. వోక్జల్నా వీధిలో ఇళ్లు, మిలటరీ వాహనాలు కాలిపోతున్న దృశ్యాలు ( Courtesy: Maxar Technologies) చెర్నివ్‌లో బాంబుల దాడిలో ధ్వంసమైన బ్రిడ్జి.. ఇళ్లు. ( Courtesy: Maxar Technologies) చెర్నివ్ శివారులోని ఓ ఫ్యాక్టరీ బాంబుల దాడిలో నాశమైన దృశ్యాలు. ( Courtesy: Maxar Technologies) లుజంకా వద్ద ఉక్రెయిన్-హంగేరి సరిహద్దు దాటుతున్న కార్లు ( Courtesy: Maxar Technologies) చెర్నివ్వైపునకు వెళ్తున్న రష్యా మిలటరీ వాహనశ్రేణి ( Courtesy: Maxar Technologies) కీవ్‌లో ఆహారం కోసం కీలోమీటర్లకొద్దీ క్యూలైన్లలో జనం (Courtesy: Maxar Technologies) -
కొండపల్లి అటవీ ప్రాంతం.. శాటిలైట్ చిత్రాలను మా ముందుంచండి
సాక్షి, అమరావతి : కృష్ణాజిల్లా కొండపల్లి అటవీ భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రధాన కాలువను పూడ్చేసి, ఏకంగా దానిపై నుంచి రోడ్డువేసి, స్టోన్ క్రషర్ల నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులు.. అటవీ భూములను ఆక్రమించి అక్రమ మైనింగ్‌కు పాల్పడలేదంటే నమ్మాలా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలువను ఆక్రమించిన మాట వాస్తవమేనని చెబుతున్న అధికారులు, అటవీ భూమి మాత్రం ఆక్రమణకు గురికాలేదని చెబుతున్న మాటలను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని హైకోర్టు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకోవాలని భావిస్తున్నామని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా కొండపల్లి అటవీ ప్రాంతం జియో కోఆర్డినేట్స్ సాయంతో శాటిలైట్ చిత్రాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణ మండలికి, అటవీ భూమిలో విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మంది స్టోన్ క్రషర్ల యజమానులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆక్రమణలపై మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి పిల్... కృష్ణాజిల్లా పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కొండపల్లి రిజర్వ్ అటవీ భూములను ధ్వంసం చేస్తూ మైనింగ్ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కూడా ఆయన తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాలువ పూడ్చేసి రోడ్డేసేశారు ఈ సందర్భంగా పిటిషనర్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ స్పందిస్తూ.. ఈ కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు ప్రభుత్వం గడువు కోరిందని తెలిపారు. ఈ సమయంలో అధికారుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, ప్రధాన పంట కాలువను పూడ్చేసిన మాట వాస్తవమేనని.. అక్కడ స్టోన్ క్రషర్లను నిర్మించుకుని రోడ్డు కూడా వేసుకున్నారని వివరించారు. 2018లోనే నోటీసులు జారీచేశామని, దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలుసుకుని చెబుతానని సుమన్ తెలిపారు. అధికారులు చెబుతున్న దాన్నిబట్టి అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాలేదన్నారు. మరోసారి ఆక్రమణలను పరిశీలించండి.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రధాన కాలువనే పూడ్చేసి దానిపై రోడ్డేసి నిర్మాణాలు చేసిన వాళ్లు అటవీ ప్రాంతాన్ని ఆక్రమించలేదంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించింది. ఆక్రమణలను మరోమారు పరిశీలించాలని.. జియో కోఆర్డినేట్ సాయంతో అటవీ ప్రాంతం శాటిలైట్ చిత్రాలను తీసి తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ 6కి వాయిదా వేసింది. -
తాజా ఫొటోలు: చైనా పన్నాగాలు బట్టబయలు!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద, ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికొచ్చిన మరునాడే చైనా పన్నాగాలు బయటపడ్డాయి. ఒకవైపు రెండు దేశాల లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి అధికారుల చర్చలు జరుగుతుండగానే డ్రాగన్ దేశం ఉద్రిక్త ప్రాంతంలో పనులు కొనసాగించింది. తాజాగా విడుదలైన హై రిజల్యూషన్ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో గల్వాన్ నది వద్ద వాస్తవాధీన రేఖకు ఇరువైపులా చైనా పలు రక్షనాత్మక నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడైంది. భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న ప్యాట్రోల్ పాయింట్ 14 వద్ద చైనా బలగాలకు వసతి గృహాలు, గల్వాన్ నదిపై కల్వర్టు చేపట్టినట్టు తెలుస్తోంది. జూన్ 22కు సంబంధిచిన ఈ ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసింది. వీటి ప్రకారం ప్యాట్రోల్ పాయింట్ 14 వద్ద మే 22న ఒక్క టెంట్ మాత్రమే ఉండగా.. తాజాగా వెలువడ్డ చిత్రాలు చైనా రక్షణాత్మక స్థానాలను చూపుతున్నాయి. (చదవండి: బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు) దాంతో పాటు గల్వాన్ నది వద్ద రోడ్డు వెడల్పు పనులనూ చైనా చేపట్టినట్టు తెలుస్తోంది. అంతకుముందు విడుదలైన ఛాయాచిత్రాల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఒక టెంట్ మాత్రమే ఉంది. కాగా, చైనా ఆకస్మిక దాడికి చేసేందుకే వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణాత్మక నిర్మాణాలు చేపట్టి ఉండొచ్చని రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ రమేశ్ పాధి అనుమానం వ్యక్తం చేశారు. బలగాలను మోహరించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఇక జూన్ 15 రాత్రి జరిగన ఘర్షణల్లో కల్నల్ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు అమరలైన సంగతి తెలిసిందే. ఇక తమ వైపు నుంచి ఒక కమాండర్ మృతి చెందినట్టు చైనా అంగీకరించినట్టు తెలిసింది. 45 మంది సైనికులు కూడ మరణించినట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. (చదవండి: బలగాల ఉపసంహరణ) -
గల్వాన్‌లో బయటపడ్డ చైనా కుట్రలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి చైనా కుట్రలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ప్రణాళికా బద్ధంగానే భారత సైనికులపై దాడికి పాల్పడినట్లు తాజా సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. దాడికి వారం ముందే గల్వాన్ లోయలో చైనా 200 బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లే ట్రక్కులను తరలించినట్లు తెలిసింది. ఈ మేరకు జూన్ 6 నుంచి 16 మధ్య చిత్రీకరించిన శాటిలైట్ చిత్రాల్లో చైనా జిత్తులు బయటపడ్డాయి. ఈ వాహనాలను తరలిస్తున్న ఉపగ్రహ దృశ్యాలు ఓ జాతీయ మీడియా ఆదివారం ప్రచురించిన కథనంలో పేర్కొంది. కాగా ఇరు దేశాల మధ్య చోటుచుసుకున్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. (గల్వాన్ వంతెన నిర్మాణం విజయవంతం) ఆ చిత్రాల ప్రకారం జూన్ 9 నుంచే వివాదాస్పద ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరించింది. గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో వాహనాన్ని తరలిస్తూ జూన్ 15 నాటికి భారీగా ఆయుధ సామాగ్రి, బుల్డోజర్ వాహనాలను గల్వాన్ లోయకు చేర్చింది. పై చిత్రం ప్రకారం వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి 2.8 కిమీ దూరంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన 127 వాహనాలు మోహరించబడ్డాయి. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) వివాదాస్పద గల్వాన్ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంపు. ఇది వాస్తవాధీన రేఖకు 2.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రకారం చైనా అక్కడేదో నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 16 నాటికి చైనా మరింత దూకుడు పెంచింది. ఎల్ఏసీకు కేవలం 1.3 కిలోమీటర్ల దూరంలో (భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో) ఏకంగా 79 వాహనాలను చేర్చింది. భారత్ చెబుతున్నట్లు ఇదంతా కూడా ఎల్ఏసీకి ఇవతలి వైపు (భారత్‌వైపు) ఉన్న ప్రాంతం. అయినప్పటికీ చైనా సైన్యం సరిహద్దును ఉల్లంఘించి భారత భూభాగంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య చెలరేగిన హింసలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. -
కరోనా మృతదేహాలను ఏం చేస్తున్నారంటే..!
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ వ్యాప్తి ప్రస్తుతం అక్కడ కొంత తగ్గుముఖం పట్టగా.. ఇరాన్లో మాత్రం విజృంభిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా 429 మంది మాత్రమే తమ దేశంలో చనిపోయారని చెబుతున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్లో సమాధులు తవ్వుతున్నారు. కాగా.. ఇరాన్లో ఇప్పటికే 10, 075 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. చదవండి: మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు చైనాలో వెలుగు చూసిన కరోనా ప్రస్తుతం చైనాకు వెలుపల ఇరాన్లో ఎక్కువగా ప్రభావం చూపుతోంది. తాజాగా కొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు చూపించిన వాటి ప్రకారం ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 145 కి.మీ. దూరంలోని కోమ్ సిటీ వద్ద కరోనా సమాధులు తవ్వుతున్నారు. కరోనా మృతులను విడివిడిగా కాకుండా సామూహికంగా ఖననం చేశారు. ఒక్కో సమాధి 100 గజాల పొడవు ఉంది. ఈ సమాధులు అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని శాటిలైట్ చిత్రాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో పాత సమాధులను పూడ్చి కొత్తగా తవ్వుతున్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఇరాన్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఆ దేశం ప్రపంచ బ్యాంకును భారీ సాయం కోరుతోంది. చదవండి: కరోనా కల్లోలం: అక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు Great to see @AlexWardVox shouting out our team who first reported on the mass burial site in Qom. You can watch report about #Iran and #coronavirus here: https://t.co/3FPabQRMoP & Alex's great follow-up report for @Vox is here: https://t.co/M8PQgJ3ZM9 pic.twitter.com/sBfxwXOw9J — Nilo Tabrizy (@ntabrizy) March 12, 2020 -
‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో వాటిల్లిన నష్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఐఏఎఫ్ అందుకు సంబంధించిన ఆధారాల్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. సంబంధించిన ఉపగ్రహ, రాడార్ చిత్రాలను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాడులకు వైమానిక దళం వార్హెడ్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ వివరాల్ని బుధవారం కొన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. బాంబులు ఉగ్రవాదుల ఆవాసాల పైకప్పులను చీల్చుకుంటూ వెళ్లి అంతర్గతంగా అపార నష్టం మిగిల్చినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిపిన వైమానిక దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ నష్టం అంత తీవ్రస్థాయిలో లేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అటవీ ప్రాంతంలో చెట్లు దెబ్బ తినడం తప్ప పెద్దగా నష్టమేమీ కలగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కాగా, భారత వైమానిక దళం దాడి తరువాత జైషే మహ్మద్ భవనాలకు అనుకున్నంత భారీ నష్టం జరగలేదని ప్లానెట్ ల్యాబ్స్ అనే అమెరికన్ ప్రైవేటు సంస్థ ఓ ఉపగ్రహ చిత్రం విడుదలచేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. బాలాకోట్ ఆపరేషన్‌పై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎందరు ఉగ్రవాదులు హతయ్యారో అధికారిక సమాచారం వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. వైమానిక దళ చర్యను రాజకీయం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దాడులతో నెరవేరిన లక్ష్యాలపై ఆధారాలతో వైమానిక దళం ప్రభుత్వానికి నివేదిక అందించడం గమనార్హం. 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు.. బాలాకోట్‌లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్‌లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి. దాడిలో మిరాజ్ విమానాలు ఇజ్రాయెల్ స్పైస్ బాంబుల్ని అత్యంత కచ్చితత్వంతో జారవిడవగా, అందులో 80% అనుకున్న లక్ష్యాల్ని తాకాయని తెలిపాయి. మిగిలిన 20% బాంబుల విజయ శాతం కచ్చితంగా ఎంతని అంచనా వేయలేకపోయామని చెప్పాయి. -
ప్రకృతి బీభత్సం; గగుర్పొడిచే దృశ్యాలు
గ్వాటెమాలా సిటీ: ప్యూగో అగ్నిపర్వతం సృష్టించిన విలయం నుంచి గ్వాటెమాలా ఇప్పుడప్పుడే కోలుకునేలా లేదు. అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ఇప్పటివరకున్న అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 90కి పెరిగింది. లావాతో పేరుకుపోయిన శిథిలాల కింద కనీసం 200 మంది సజీవసమాధి అయి ఉంటారని అంచనా. వాయువేగంతో ఉప్పెనలా దూసుకొచ్చిన లావా... లాస్ లోటెస్, శాన్మిగుయెల్, ఎల్‌రోడియో తదితర ప్రాంతాలను ముంచెత్తింది. (ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు) శాటిలైట్ ఫొటోల్లో ప్రకృతి బీభత్సం: గ్వాటెమాలాలోని ప్యూగో అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సానికి సంబంధించి శాటిలైట్లు చిత్రీకరించిన ఫొటోలు విడుదలయ్యాయి. కొద్ది నెలల కిందట ఆ ప్రాంతం ఎలా ఉండేదో.. అగ్నిపర్వతం బద్దలై, లావా ముంచెత్తిన తర్వాత ఎలా తయారైందో స్పష్టంగా కనిపిస్తుంది. శాటిలైట్ ఫొటోలు(ప్యూగో సమీప గ్రామం): ఫిబ్రవరి 5న అలా, జూన్ 6న ఇలా) కొనసాగుతోన్న సహాయక చర్యలు: ఆదివారం అగ్నిపర్వతం బద్దలుకాగా బుధవారం నాటికి వేడిమి కాస్త తగ్గింది. దీంతో పెద్ద ఎత్తున సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శిథిలాలను తొలగిస్తూ, మృతదేహాలను గుర్తించేపని చేపట్టామని, చాలా వరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని, శిథిలాల తొలగింపు ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శిబిరాల్లో తలదాచుకున్న మూడు గ్రామాల నిర్వాసితులు ఇంకొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి. (ఏప్రిల్ 7 నాటి ఫొటో, జూన్ 6 నాటికి ఇలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అణు పరీక్షకు ఉత్తరకొరియా సిద్ధం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తుంటే తాను మాత్రం తక్కువ తినలేదంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కూడా అంతే దూకుడుగా ఉంటున్నారు. తాజాగా ఆయన అణ్వస్త్రాలను పరీక్షించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.ఘిటీవల తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఉత్తరకొరియాలోని పంగ్యే -రి అనే ప్రాంతంలో దీనికి సంబంధించిన పరికరాలను ఇప్పటికే మోహరించినట్లు ఆ చిత్రాల్లో ఉంది. ఒకవేళ ఇదే నిజమై.. వాళ్లు అణ్వస్త్రాలను పరీక్షిస్తే మాత్రం 2006 తర్వాత ఈ తరహా పరీక్ష ఇది ఆరోసారి అవుతుంది. ఏప్రిల్ 12వ తేదీన తీసిన ఉపగ్రహ చిత్రాల్లో పంగ్యే- రి వద్ద ఉత్తరకొరియా సైనికుల కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ప్రధానంగా అక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలో ఎక్కువ మంది ఉంటున్నారని, సైట్‌లోని కమాండ్ సెంటర్ వద్ద కూడా కొంతమంది ఉన్నారని అమెరికాకు చెందిన 38 నార్త్ అబ్జర్వేటరీ సంస్థ తెలిపింది. అక్కడి వాతావరణాన్ని బట్టి చూస్తుంటే మాత్రం అణ్వస్త్ర పరీక్ష జరిగే అవకాశం కనిపిస్తోందని చెప్పింది. అయితే దక్షిణ కొరియా అధికారులు మాత్రం అదేమీ ఉండకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరకొరియా అంత సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. -
ఇండియా @ నైట్: అద్భుతమైన నాసా ఫొటోలు!
-
ఇండియా @ నైట్: అద్భుతమైన నాసా ఫొటోలు!
రాత్రిపూట అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అంతరిక్ష నుంచి మానవ ఆవాసాలు ఎలా కనిపిస్తాయి? అన్నదానిని తెలుసుకోవాలంటే తాజాగా అమెరిక అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసిన ఫొటోలను చూడాల్సిందే. రాత్రిపూట భూగోళం ఎలా ఉంటుందో వెల్లడించే తాజా గ్లోబల్ మ్యాపులను నాసా శాస్త్రవేత్తలు గురువారం విడుదల చేశారు. చాలా స్పష్టతతో కూడిన ఈ శాటిలైట్ చిత్రాలలో భూమిపై మానవ ఆవాసాల నమూనాలను స్పష్టంగా చూడవచ్చు. నాసా విడుదల చేస్తున్న ఈ శాటిలైట్ చిత్రాలు సామాన్యుల్లో ఆసక్తి రేపడమే కాకుండా.. పరిశోధనలకూ ఉపయోగపడుతున్నాయి. గతంలో నాసా 2012లో ఇదేవిధంగా రాత్రిపూట భూగోళం ఎలా ఉంటుందో మ్యాపులు విడదల చేసింది. తాజాగా దేశాల సరిహద్దుల ప్రకారం అంతరిక్షం నుంచి భూమి చీకట్లో ఎలా ఉంటుందో వివరిస్తూ మ్యాపులు విడుదల చేసింది. ఈ మ్యాపులలో భారత్‌కు సంబంధించిన చిత్రాలు అద్భుతంగా ఉండి వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 2012 సంవత్సరంతో పోల్చుకుంటే 2016లో భారత్‌లో ఎలాంటి మార్పు వచ్చిందో ఈ అద్భుతమైన ఫొటోలలో చూసి తెలుసుకోవచ్చు. ఈ ఫొటోలు అంతరిక్ష ఔత్సాహికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
అవి మలేషియా విమాన శకలాలేనా?
మలేషియా విమానం ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో కుప్పకూలిపోయిందనడానికి మరిన్ని ఆధారాలు దొరికాయి. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్తలు తమ ఉపగ్రహ చిత్రాలలో ఆస్ట్రేలియాకి దాదాపు 2500 కి.మీ దూరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో సముద్రంలో పలు శకలాలు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ చిత్రాలను వారు మలేషియా ప్రభుత్వపు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అందచేశారు. ఈ ఉపగ్రహ చిత్రాల్లో దాదాపు 122 వస్తువులు కనిపించాయి. ఇందులో కొన్ని వస్తువులు దాదాపు 23 మీటర్ల పొడవున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మలేషియన్ ప్రభుత్వం దక్షిణ హిందూ మహాసముద్రంలోనే విమానం కుప్పకూలినట్టు ప్రకటించింది. మరో వైపు సముద్రంలో జాడ తెలియకుండా పోయిన విమానం తాలూకు బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ ను కనుగొనేందుకు అమెరికా నుంచి నిపుణులు మలేషియా వచ్చారు. మామూలుగా బ్లాక్ బాక్సులు 30 రోజుల వరకూ పనిచేస్తాయి. వాటి బ్యాటరీల చార్జింగ్ అప్పటి వరకూ పనిచేస్తుంది. వాటికి అండర్ వాటర్ లోకేటర్ బీకన్లు అమర్చి ఉంటాయి. ఇవి నీటి అట్టడుగున 14000 అడుగుల లోతున ఉన్నా సందేశాలు పంపగలుగుతాయి. అయితే ఇప్పటికే విమానం నీట మునిగి 17 రోజుల, 13 గంటల, 49 నిమిషాలు అయింది. అంటే ఇంకా పదకొండు రోజుల్లో బ్లాక్ బాక్సును కనుగొనలేకపోతే అది శాశ్వతంగా దొరకకుండా పోతుందన్నమాట. ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా బ్లాక్ బాక్సులో విమాన ప్రయాణ కాలంలో కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను రికార్డు చేస్తాయి. దీని ఆధారంగా అసలేం జరిగిందో అంచనా వేయడానికి వీలుంటుంది. -
విమానం కోసం 6 లక్షల మంది గాలింపు
శనివారం అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ కోసం శాటిలైట్ పంపిన చిత్రాలను మంగళవారం ఒక్కరోజు 6 లక్షల మంది స్కాన్ చేశారని కోలరాడో చెందిన డిజిటల్గ్లోబల్ వెల్లడించింది. గల్లంతైన విమాన ఆచూకీ కోసం శాటిలైన్ చిత్రాలను 6 లక్షల మంది స్కాన్ ద్వారా జల్లెడ పట్టారని ఆ కంపెనీ సీనియర్ డైరక్టర్ షె హర్ నాయ్ తెలిపారు. అయిన వీసమెత్తు ఆచూకీ కూడా లభించలేదని అన్నారు. శాటిలైట్ పంపిన చిత్రాలను ఎప్పటికప్పుడు http://www.tomnod.comలో పొందుపరుస్తున్నామని వివరించారు. అయితే వెబ్‌సైట్‌లోని ఆ ఫోటోలను నిన్న సాయంత్రానికి 10 మిలియన్ల మంది వీక్షించారని వెల్లడించారు. శనివారం కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. 227 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. నాటి నుంచి చైనా, మలేషియాతోపాటు పలు దేశాలు విమానాలు, ఓడలు రంగంలోకి దిగి ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయిన విమానానికి సంబంధించిన కనీసం విసమెత్తు ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దాంతో కాలాలంపూర్, బీజింగ్ మార్గంలో శాటిలైట్ ద్వారా చిత్రాలను తీయాలని ఆయా దేశాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ శాటిలైట్ చిత్రాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడతున్నారు. సముద్రంలో ఎక్కడైన విమానశకలాలు, ప్రయాణికుల వస్తువులు, సముద్రంపై నూనె తెట్టు లాంటి పదార్థాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఆ చిత్రాలను వెబ్సైట్లో ఉంచారు. అయినా విమానానికి సంబంధించిన ఆచూకీ ఇంతవరకు తెలియలేదు.