ఇండియా @ నైట్: అద్భుతమైన నాసా ఫొటోలు!
రాత్రిపూట అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అంతరిక్ష నుంచి మానవ ఆవాసాలు ఎలా కనిపిస్తాయి? అన్నదానిని తెలుసుకోవాలంటే తాజాగా అమెరిక అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విడుదల చేసిన ఫొటోలను చూడాల్సిందే. రాత్రిపూట భూగోళం ఎలా ఉంటుందో వెల్లడించే తాజా గ్లోబల్ మ్యాపులను నాసా శాస్త్రవేత్తలు గురువారం విడుదల చేశారు.
చాలా స్పష్టతతో కూడిన ఈ శాటిలైట్ చిత్రాలలో భూమిపై మానవ ఆవాసాల నమూనాలను స్పష్టంగా చూడవచ్చు. నాసా విడుదల చేస్తున్న ఈ శాటిలైట్ చిత్రాలు సామాన్యుల్లో ఆసక్తి రేపడమే కాకుండా.. పరిశోధనలకూ ఉపయోగపడుతున్నాయి. గతంలో నాసా 2012లో ఇదేవిధంగా రాత్రిపూట భూగోళం ఎలా ఉంటుందో మ్యాపులు విడదల చేసింది. తాజాగా దేశాల సరిహద్దుల ప్రకారం అంతరిక్షం నుంచి భూమి చీకట్లో ఎలా ఉంటుందో వివరిస్తూ మ్యాపులు విడుదల చేసింది. ఈ మ్యాపులలో భారత్‌కు సంబంధించిన చిత్రాలు అద్భుతంగా ఉండి వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 2012 సంవత్సరంతో పోల్చుకుంటే 2016లో భారత్‌లో ఎలాంటి మార్పు వచ్చిందో ఈ అద్భుతమైన ఫొటోలలో చూసి తెలుసుకోవచ్చు. ఈ ఫొటోలు అంతరిక్ష ఔత్సాహికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.