విమానం కోసం 6 లక్షల మంది గాలింపు | 600,000 scan satellites images for clues to jet | Sakshi
Sakshi News home page

విమానం కోసం 6 లక్షల మంది గాలింపు

Published Wed, Mar 12 2014 9:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

విమానం కోసం 6 లక్షల మంది గాలింపు

విమానం కోసం 6 లక్షల మంది గాలింపు

శనివారం అదృశ్యమైన మలేషియా విమానం ఆచూకీ కోసం శాటిలైట్ పంపిన చిత్రాలను మంగళవారం ఒక్కరోజు 6 లక్షల మంది స్కాన్ చేశారని కోలరాడో చెందిన డిజిటల్గ్లోబల్ వెల్లడించింది. గల్లంతైన విమాన ఆచూకీ కోసం శాటిలైన్ చిత్రాలను 6 లక్షల మంది స్కాన్ ద్వారా జల్లెడ పట్టారని ఆ కంపెనీ సీనియర్ డైరక్టర్ షె హర్ నాయ్ తెలిపారు.  అయిన వీసమెత్తు ఆచూకీ కూడా లభించలేదని అన్నారు. శాటిలైట్ పంపిన చిత్రాలను ఎప్పటికప్పుడు  http://www.tomnod.comలో పొందుపరుస్తున్నామని వివరించారు. అయితే వెబ్సైట్లోని ఆ ఫోటోలను నిన్న సాయంత్రానికి 10 మిలియన్ల మంది వీక్షించారని వెల్లడించారు.

 

శనివారం కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు వెళ్తూ మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. 227 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. నాటి నుంచి  చైనా, మలేషియాతోపాటు పలు దేశాలు విమానాలు, ఓడలు రంగంలోకి దిగి ఆ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయిన విమానానికి సంబంధించిన కనీసం విసమెత్తు ఆచూకీ కూడా లభ్యం కాలేదు.

 

దాంతో కాలాలంపూర్, బీజింగ్ మార్గంలో శాటిలైట్ ద్వారా చిత్రాలను తీయాలని ఆయా దేశాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ శాటిలైట్ చిత్రాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెడతున్నారు. సముద్రంలో ఎక్కడైన విమానశకలాలు, ప్రయాణికుల వస్తువులు, సముద్రంపై నూనె తెట్టు లాంటి పదార్థాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఆ చిత్రాలను వెబ్సైట్లో ఉంచారు. అయినా విమానానికి సంబంధించిన ఆచూకీ ఇంతవరకు తెలియలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement