కొలరాడో ప్రైమరీ బ్యాలెట్‌లో ఆయన పేరుండాలని ఆదేశం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరిచింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయీ, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్‌పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్‌కు భారీ ఊరట లభించింది.
ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్ధత్వం కోసం ప్రైమరీల్లో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్‌పైకి మద్దతుదారులను ఉసిగొల్పారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్‌ను ఉపయోగించి ట్రంప్‌ను ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అధ్యక్ష అభ్యరి్థపై కోర్టు ఈ సెక్షన్‌ను వాడటం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 14వ సవరణను వాడే అధికారం పార్లమెంట్‌కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయంమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment