
కోట్లు ఖరీదు చేసే హోటల్ కచ్చితంగా అంతకు మించిన ధరలో అమ్ముడుపోతుంది. అది పక్కా..!. పోనీ అలా కాదనుకుంటే.. కనీసం దాని విలువకు దగ్గరదగ్గరగా లేదా కొద్దిపాటి తేడాతో మంచి ధరలోనే అమ్ముడవుతుంది. కానీ ఇక్కడ కోట్లు ఖరీదు చేసే హోటల్ జస్ట్ వందల రూపాయల్లోనే అమ్ముడైతే..ఎవ్వరికైనా ఏంటిది అనే డౌటు వచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు అంత తెలివతక్కువగా ఎవడ్రా అమ్మింది అనుకుంటారు. కానీ అలా ఎందుకు అమ్ముతున్నారో వింటే శెభాష్ అని ప్రశంసించకుండా ఉండలేరు.
ఇంతకీ అమ్మడానికి కారణం ఏంటంటే..అమెరికా కొలరాడోలోని డెన్వర్‌లో మాజీస్టే ఇన్ మోటెల్ హోటల్ విలువ ఏకంగా రూ. 75 కోట్లు ఉంటుంది. అంత ఖరీదుకే డెన్వర్ నగరం ఈ హోటల్‌ని కొనుగోలు చేసింది కూడా. అయితే ప్రస్తుతం దాన్ని నగరం కొద్దిపటి మరమత్తులు చేసి అమ్మేయాలనుకుంది.
ఎంతకో తెలిస్తే కంగుతింటారు. కేవలం రూ. 875లకే అమ్మేస్తారట. కానీ వాళ్లుపెట్టే షరతులకు అంగీకరిస్తే అంత తక్కువ ధరలో అంత ఖరీదు చేసే హోటల్‌ని సొంత చేసుకోగలరని చెబుతున్నారు డెన్వర్ నగరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్‌బరీ.
ఆ షరతులేంటంటే..
దీన్ని 99 ఏళ్లపాటు ఆదాయ నిరోధిక గృహంగా ఉంచాలట. అలాగే నిరాశ్రయులకు సహాయ గృహంగా ఉండాలనే షరతులకు అంగీకరిస్తే గనుక ఈ హోటల్‌ని తక్కువ ధరకే అమ్ముతామని చెప్పారు డెన్వర్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్‌బరీ. ఈ హోటల్‌ని పునరుద్ధరించి నిరాశ్రయలుకు నివాసంగా మారుస్తున్నాని అంగీకరిస్తేనే.. ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేయగలరన్నారు.
మరీ ఇంతకు ఎవరూ దీన్ని పునరుద్ధరించి కొనుగోలు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది అందుకోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు వుడ్‌బరీ. ఆ ప్రతిపాదిత డెవలప్పర్ ఆమోదం నగర్ కౌన్సిలో చేతిలో ఉంటుందట.
నిరాశ్రయులైనవారికి చక్కటి వసతిని కల్పించడమే లక్ష్యంగా ఈ వినూత్న డీల్‌ని తీసుకొచ్చినట్లు వివరించారు వుడ్‌బరీ. అంతేగాదు భవనాన్ని యథాతథంగా అమ్ముతామని కూడా చెబుతున్నారు. మరీ ఎవరు దీన్ని కొని ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకుంటారనేది వేచి చేసి చూడాల్సిందే.
(చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!)
Comments
Please login to add a commentAdd a comment