
సాక్షి,అమరావతి : కాకినాడ వినియోగదారులు కోర్టు కీలక తీర్పును వెలవరించింది. ఓ కస్టమర్ నుంచి ఒక్కో వాటర్ బాటిల్‌పై అదనంగా రూ.7వసూలు చేసినందుకు గాను హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్‌కు రూ.27లక్షల 27వేలు పెనాల్టీ విధించింది.
వివరాల్లోకి వెళితే.. 2023 డిసెంబర్ 8న హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఓ హోటల్‌లో ఓ మహిళ మూడు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేశారు. అయితే, తాను కొనుగోలు చేసిన ఒక్కో వాటర్ బాటిల్ ధరపై అదనంగా రూ.7వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ మహిళ సదరు హోటల్ నిర్వాకంపై కాకినాడ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు.
మహిళ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ కాకినాడ వినియోదారుల కోర్టు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో హోటల్‌పై కాకినాడ వినియోగదారుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటల్ యాజమాన్యానికి రూ.27లక్షల 27వేలు ఫైన్ విధించింది. రూ.27 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, ఫిర్యాదు చేసిన మహిళకు రూ.25000, కోర్టుకి రూ2000 చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment