consumer court
-
నీ రైట్ కోసం ఫైట్!
నగరాల్లోని వారికీ తెలియక..ఇతర దేశాల్లో వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యత ఎక్కువ. మన దేశంలో అంతంత మాత్రమే. చట్టాలున్నా వాటి అమలులో తీవ్ర నిర్లక్ష్యం ఉంది. గ్రామీణ ప్రజలే కాదు.. నగరాల్లోని వారికి కూడా వినియోగదారుల కమిషన్లను ఎలా ఆశ్రయించాలో తెలియదు. చెప్పుకోవడానికే చట్టాలు అన్నట్టుగా వ్యవస్థ తయారైంది. ప్రభుత్వం ఇతర కోర్టులతోపాటు ఈ కమిషన్లనూ అభివృద్ధి చేసి, ప్రజల చెంతకు చేర్చాలి. చట్టప్రకారం జిల్లాకో కమిషన్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తే దగ్గరలో సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుంది.– ఆకాశ్ బాగ్లేకర్, న్యాయవాది, వినియోగదారుల చట్టాల పుస్తక రచయిత సాక్షి, హైదరాబాద్:⇒ దుర్గాభాయ్ దేశముఖ్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి బేగంపేట్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపులో రూ.66 వేలు వెచ్చించి ఓ టీవీ కొనుగోలు చేశారు. కొన్ని రోజులకే టీవీ పనిచేయడం మానేసింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించి మరమ్మతులు చేయించినా లాభం లేకపోయింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. పరిశీలించిన కమిషన్.. రూ.66 వేలు రీఫండ్ చేయాలని, అదనంగా రూ.13 వేలు పరిహారం, రూ.5 వేలు కేసు ఖర్చుల కింద వినియోగదారుడికి ఇవ్వాలని ఆదేశించింది. మరో రూ.5 వేలు కన్జ్యూమర్ లీగల్ ఎయిడ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.⇒ అధిక బరువుతో బాధపడుతున్న ఓ వ్యక్తి బరువు తగ్గించే చికిత్స కోసం ఒక ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థను సంప్రదించారు. ఈ మేరకు చికిత్స అందిస్తామని హామీ ఇచ్చిన సంస్థ.. రూ.1,30,000 ఫీజును ఈఎంఐ రూపంలో వసూలు చేసింది. కానీ ఆయన ఎంతకీ బరువు తగ్గకపోగా ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడింది. దీంతో తాను చెల్లించిన మొత్తం రీఫండ్ చేయాలని సంస్థను కోరారు. కానీ సంస్థ స్పందించకపోవడంతో.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్ రూ.1,30,000 సొమ్మును 12 శాతం వడ్డీతో కలిపి రీఫండ్ చేయాలని.. కేసు ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని సంస్థను ఆదేశించింది...వస్తువులు, సేవల్లో లోపాల వల్ల ప్రజలు నష్ట పోయిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు విని యోగదారుల కమిషన్లు తీసుకున్న చర్యలు ఇవి. కానీ మనలో చాలా మందికి సరైన అవగాహన లేక, నష్టపోయినా భరించి ఊరుకుండిపోతున్నారు.చట్టం ఎంత బలంగా ఉన్నా.. అమల్లో నిర్లక్ష్యం ఉంటే ఫలితం శూన్యం. ఎవరికోసమైతే ఆ చట్టం చేశామో.. అదొకటి ఉందని వారికి తెలియక పోతే నిష్ప్రయోజనం. అలాంటివే వినియోగదారుల చట్టాలు. గ్రామీణులకే కాదు నగరాల్లో ఉండే వారికి కూడా వాటిపై అవగాహన అంతంతే. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లోనూ వినియోగదారుల హక్కులేమిటో తెలియని వారు కోకొల్లలు. ప్రభుత్వం కూడా వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించడంపై ఫోకస్ పెట్టని పరిస్థితి. ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు ఏవో కార్యక్రమాలు నిర్వహించడం మినహా పెద్దగా చేస్తున్నదేదీ లేదు. నిజానికి వినియోగదారులు కాని ప్రజలంటూ ఎవరూ ఉండరు. అందుకే అందరూ ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని.. సేవలను హక్కుగా పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.2020లో మార్పులు చేశాక..1986 నుంచి ఉన్న వినియోగదారుల చట్టంలో మార్పులు చేర్పులు చేసి వినియోగదారుల రక్షణ చట్టం–2019ను రూపొందించారు. అది 2020 జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వినియోగ దారుల ఫిర్యాదు లను మరింత వేగంగా పరిష్కరించడా నికి ఇది దోహదం చేస్తోంది. ఈ చట్టం ద్వారా సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటె క్షన్ అథారిటీ (సీసీపీఏ)ని స్థాపించారు. దీనిద్వారా వినియోగదారుల హక్కులను ప్రోత్సహిస్తూ, పరిరక్షిస్తు న్నారు. అలాగే వినియోగదారుల ఫోరంను వినియోగదారుల వివా దాల పరిష్కార కమిషన్ మార్చారు.వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి..⇒ వస్తువు లేదా సేవ కోసం చేసిన ఖర్చు విలువ రూ.50 లక్షల వరకు అయితే.. జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. రూ.2 కోట్ల వరకు అయితే రాష్ట్ర కమిషన్‌లో, అంతకుమించితే జాతీయ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేయాలి.⇒ రాష్ట్ర కమిషన్‌తోపాటు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.⇒ ఆన్లైన్ ద్వారా లేదా కమిషన్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ⇒ దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.వినియోగదారుల కమిషన్ల వివరాలివీ..జాతీయ వినియోగదారుల కమిషన్..ఉపభోక్య న్యాయభవన్ఎఫ్ బ్లాక్, జీపీవో కాంప్లెక్స్ఐఎన్ఏ, న్యూఢిల్లీ–110023ఈ–మెయిల్: ఎన్సీడీఆర్సీ ఎట్‌దిరేట్ ఎన్ఐసీ డాట్ ఇన్ఫోన్ నంబర్: 011–24608724⇒ ఇందులో అధ్యక్షుడితోపాటు 11 మంది సభ్యులు ఉంటారు. నేరుగా వేసే పిటిషన్లతోపాటు అప్పీళ్లను కూడా ఎన్సీడీఆర్సీ విచారణ చేస్తుంది. వినియోగదారుల రక్షణ చట్టం–2019లో పేర్కొన్న నిబంధనల ప్రకారం జాతీయ కమిషన్ పనిచేస్తుంది.తెలంగాణ రాష్ట్ర కమిషన్..ఏరువాక బిల్డింగ్, శ్రీధర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా.., ఆనంద్‌నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్ఈ–మెయిల్: ఎస్సీడీఆర్సీ–టీఎస్ ఎట్‌దిరేట్ ఎన్ఐసీ డాట్ ఇన్మీనా రామనాథన్, ఇన్చార్జి అధ్యక్షురాలు, ఫోన్: (040) 23394399కె.రంగారావు, సభ్యుడు, ఫోన్: (040) 23394399వీవీ శేషుబాబు (జ్యుడీషీయల్) సభ్యుడు..ఆర్ఎస్ రాజశ్రీ, సభ్యురాలు..వీపీ వెంకటరమణమూర్తి, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఫోన్: 23394399రెండేళ్లలోపు కేసు వేయాలి..⇒ వినియోగదారుల కమిషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరికి అవగాహన ఉన్నా.. కమిషన్‌ను ఎలా సంప్రదించాలో తెలియదు. కాజ్ ఆఫ్ యాక్షన్ (సమస్య ఎదురైనప్పటి) నుంచి రెండేళ్లలోపు కేసు దాఖలు చేయాలి. తర్వాత పెడితే కేసు చెల్లదు. ఏవైనా బలమైన కారణాలుంటే సెక్షన్ 24ఏ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. కొందరు అనవసర కేసులు వేస్తూ విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. దీంతో నిజంగా లబ్ధిపొందాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు.– మీనా రామనాథన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్చార్జి అధ్యక్షురాలుమధ్యంతర ఉత్తర్వులిస్తాం..⇒ రాష్ట్ర కమిషన్‌కు ఎక్కువగా అప్పీల్ కేసులు వస్తున్నాయి. దీంతో పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కమిషన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఓ బిల్డర్ వద్ద ప్లాట్ కొనుగోలు చేశారు. బిల్డర్ ఆ ప్లాట్‌ను రిజిస్టర్ చేయకుండా మరొకరికి అమ్ముతున్నప్పుడు కమిషన్‌ను సంప్రదిస్తే.. ఆ లావాదేవీని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంటుంది. – పి.భాస్కర్, కోర్టు ఆఫీసర్, రాష్ట్ర కమిషన్చదువుకున్నా అవగాహన తక్కువే..⇒ డిగ్రీ చదివినా కూడా నాకు వినియోగదారుల కమిషన్‌ను ఎలా ఆశ్ర యించాలో తెలియదు. ఎక్కడా ఎలాంటి అవగా హన కార్యక్రమం చేపట్టగా చూడలేదు. కోర్టులు తెలుసుగానీ, వినియోగదారుల కమిషన్‌లో ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది.– ఉపేందర్‌రెడ్డి, ఉప్పల్, హైదరాబాద్⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌సీడీఆర్‌సీ ఏర్పాటైంది. 2015లో తొలి అధ్యక్షుడిగా జస్టిస్ బీఎన్.రావు నియమితుల య్యారు. 2018 వరకు పనిచేశారు. తర్వాత జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ నియమితులయ్యారు.⇒ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు ఒక జిల్లా కమిషన్ ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో మాత్రం మూడు కమిషన్లు ఉన్నాయి.⇒ జిల్లా వినియోగదారుల కమిషన్లలో నేరుగా వినియోగదారుడే వాదనలు వినిపించుకోవచ్చు లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.⇒ న్యాయస్థానాలే అయినా వినియోగదారులు స్థానిక భాషలో వాదనలు వినిపించుకునే అవకాశం ఉంది.⇒ జిల్లా కమిషన్‌కు రాష్ట్ర కమిషన్, రాష్ట్ర కమిషన్‌కు జాతీయ కమిషన్ అప్పీలేట్గా వ్యవహరిస్తాయి. జాతీయ కమిషన్ తీర్పులను సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్ చేయవచ్చు. ఇతర ఏ కోర్టులూ ఈ తీర్పుల్లో జోక్యం చేసుకోలేవు.హైదరాబాద్ జిల్లా కమిషన్లు..జిల్లా వినియోగదారుల కమిషన్–1, 2, 3చంద్రవిహార్ కాంప్లెక్స్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ఫోన్ నంబర్లు: 040–24733368, 040–24747733, 040–24746001రంగారెడ్డి జిల్లా కమిషన్..రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ఎన్టీఆర్ నగర్, ఎల్బీనగర్, రంగారెడ్డి ఫోన్: 040–24031275 -
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
ఎస్బీఐకి కన్జ్యూమర్ కోర్టు మొట్టి కాయలు వేసింది. కస్టమర్ మోసపోయిన రూ.80వేల నగదును వెంటనే బ్యాంక్ చెల్లించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.జూలై 4, 2015న ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కి నగర నివాసీ పార్థసారథి ముఖర్జీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరస్తులు న్యూఢిల్లీలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంల నుంచి రూ.80,000 విత్‌డ్రా చేశారు. విత్ డ్రా అయినట్లు ముఖర్జీ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. వెంటనే సదరు బ్యాంక్‌కు మెయిల్ పంపాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎం నుంచి ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు విత్ డ్రా చేసినట్లు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే ఉత్తరాఖండ్ కన్జ్యూమర్ కోర్టునూ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కన్జ్యూమర్ కోర్టు సమస్యను పరిష్కరించి, బాధితుడికి న్యాయం చేయాలని ఢిల్లీ ఎస్బీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టేందుకు ఎస్బీఐ బ్యాంక్‌ను సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని కోరారు. అందుకు ఎస్బీఐ అధికారులు తిరస్కరించారు. ఎస్బీఐ అధికారుల తీరుపై బాధితుడు కన్జ్యూమర్ కోర్టుకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే, అగంతకులు విత్ డ్రాపై బ్యాంక్ సత్వరమే చర్యలు తీసుకుందని, తన బ్యాంక్ బ్రాంచ్‌తో పాటు ఇతర బ్యాంక్ బ్రాంచీలకు సమాచారం ఇచ్చామని బ్యాంక్ అధికారులు కన్జ్యూమర్ కోర్టుకు తెలిపారు. తమ (ఎస్బీఐ) సేవల్లో ఎలాంటి లోపాలు లేవని, బ్యాంక్ ఖాతాదారుడు అగంతకులకు కార్డ్ వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్ అందించారని స్పష్టం చేసింది. ఎస్బీఐ బ్యాంక్ తీరును ప్రశ్నించిన కన్జ్యూమర్ కోర్టు బాధితుడు నష్టపోయిన రూ.80వేల మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.వివాదాస్పద లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లేకపోవడంతో పోలీసు విచారణను ముగించలేమని రాష్ట్ర కమిషన్ గమనించింది. రికార్డులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా బ్యాంక్ సేవల్లో లోపాలు ఉన్నాయని భావించామనే, కాబట్టే ఈ తీర్పు ఇచ్చినట్లు ఉత్తరా ఖండ్ కన్జ్యూమర్ కోర్టు వెల్లడించింది. -
8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఉబర్ తాజాగా వినియోగదారుడికి రూ.10వేలు పరిహారం చెల్లించాలంటూ చండీగఢ్ కన్జూమర్ ఫోరమ్ తీర్పు చెప్పింది. తక్కువ దూరాలకు సంబంధించిన రైడ్లకు ఉబర్ అధికమొత్తంలో ఛార్జీ వసూలు చేస్తుండడంతో అతడు కమిషన్‌ను ఆశ్రయించాడు. పూర్వాపరాలు విచారించిన కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మీడియా కథనాల్లోని వివరాల ప్రకారం.. ఆగస్టు 6, 2021న చండీగఢ్‌కు చెందిన అశ్వనీ ప్రశార్ తను ఉన్న ప్రదేశం నుంచి వేరేచోటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాను వెళ్లాలనుకునే ప్రదేశం గూగుల్ మ్యాప్స్‌లో 8.83 కిలోమీటర్లుగా చూపించింది. దాంతో ఉబర్ బుక్ చేయాలనుకున్నారు. తాను ఎంచుకున్న రైడ్‌కు ముందస్తు ఛార్జీలు రూ.359గా చూపించింది. వెంటనే రైడ్ కన్ఫర్మ్ చేశారు. అయితే రైడ్ ముగిసి క్యాబ్ దిగేప్పుడు ముందస్తు ఛార్జీలతో పోలిస్తే అదనంగా రూ.1,334 రైడ్ ఛార్జీలు చూపించాయి. దాంతో చేసేదేమిలేక ఆ మొత్తాన్ని చెల్లించారు. తర్వాత అశ్వనీ ప్రశార్ కస్టమర్ చాట్, ఈమెయిల్ల ద్వారా కంపెనీకి సమస్యను వివరించారు. ఎంత ప్రయత్నించినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. దాంతో పూర్తివివరాలతో కన్జూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించారు. సమగ్ర విచారణ జరిపించిన కోర్టు తాజాగా ఉబర్ కంపెనీ రూ.10,000 పరిహారంతో పాటు చట్టపరమైన ఖర్చుల కోసం అదనంగా మరో రూ.10,000లను ప్రయాణికుడికి చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. ఇదీ చదవండి: గతేడాదితో పోలిస్తే అధికంగా విమానయానం.. ఎందరో తెలుసా.. విచారణ సమయంలో ఉబర్ ఇండియా ఛార్జీల పెంపును సమర్థించింది. అందుకు అనేక రూట్ డివియేషన్స్ కారణమని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు ఛార్జీలు, వాస్తవ ఛార్జీల మధ్య భారీ వ్యత్యాసం అన్యాయమని ఫోరమ్ తేల్చి చెప్పింది. -
చైనా కంపెనీ ముక్కు పిండి వసూలు చేశాడు
గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు కస్టమర్లకు జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగా.. మరో కొన్ని కంపెనీలు ఊరుకున్నాయి. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి కోర్టుకెళ్లి నష్ట పరిహారంగా రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. అతడు రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా.. అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్‌కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్‌ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు. ఇదీ చదవండి: ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే? ఎన్ని రోజులకూ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్‌తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి.. రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్‌కు చెల్లించాలని లేదా స్కూటర్‌ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది. -
ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్
కార్లను కొనుగోలు చేసినప్పుడు డీలర్షిప్ వర్గాలు కొన్ని సందర్భాల్లో మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసాలకు బలైన బాధితులు కన్స్యూమర్ కోర్టు ద్వారా పరిష్కారం లేదా నష్టపరిహారం పొందుతారు. ఇటీవల కర్ణాటకలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన వ్యక్తి 2019 జూన్ 11న 'అద్వాతి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి 'హ్యుందాయ్ శాంట్రో ఎమ్‌టి స్పోర్ట్జ్' (Hyundai Santro M.T Sportz) కారును రూ. 6,25,663కు కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఇందులో లోపాలు ఉన్నట్లు, రెండు సర్వీసింగ్ సెషన్లకు లోనయ్యిందని డీలర్‌షిప్‌కు విన్నవించాడు. కస్టమర్ అభ్యర్థన మేరకు డీలర్షిప్ రెండు సార్లు సర్వీస్ చేసింది. సర్వీస్ చేసిన తరువాత 2020 అక్టోబర్ 17న బాణావర నుంచి అరసికెరెకు ప్రయాణిస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు బయటపడ్డారు, అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. సంఘటన జరిగిన వెంటనే వినియోగదారుడు షోరూమ్‌కు తెలియజేశాడు, డీలర్షిప్ యాజమాన్యం స్పందిస్తూ.. కారును రీప్లేస్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు ఎదురు చూసినా కస్టమర్‌కు కారుని అందించలేదు. దీంతో విసిగిపోయిన కస్టమర్ బాణవర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. కారు తయారీలో లోపాలు ఉన్నట్లు, అదే కారులో మంటలు రావడానికి కారణమని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్‌కు తెలియజేశాడు. కాలిపోయిన కారుకు బదులుగా ఇంకో కారు ఇస్తామన్న షోరూమ్ వాగ్దానాలను వెల్లడించాడు. ఈ సంఘటన మానసిక ఒత్తిడికి దారితీసినట్లు, ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు ప్రస్తావించాడు. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! విచారణ తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్.. తయారీ లోపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్థారించి, దీనికి షోరూమ్ బాధ్యత వహించి కొత్త హ్యుందాయ్ శాంత్రోను అందించాలని, కస్టమర్‌కు 1.4 లక్షల పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. -
యాపిల్‌కు లక్ష ఫైన్.. కస్టమర్ దెబ్బ అదుర్స్..
కొన్ని సార్లు కంపెనీలు లేదా కంపెనీ నిర్వహణ సంస్థలు చేసే తప్పిదాలు కస్టమర్లకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో వినియోగదారుడు నష్టపరిహారం పొందుతాడు. ఇలాంటి సంఘటన ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ నివాసి 'అవెజ్ ఖాన్' ఆపిల్ ఇండియా సర్వీస్ సెంటర్ నుంచి లక్ష రూపాయల నష్టపరిహారాన్ని పొందినట్లు తెలుస్తోంది. అతని ఐఫోన్ 13 మొబైల్‌కి జరిగిన నష్టం కారణంగా ఈ పరిహారం వచ్చింది. 2021 అక్టోబర్ నెలలో ఐఫోన్ 13 మొబైల్‌ను ఒక సంవత్సరం వారంటీతో కొనుగోలు చేసాడు. ఆ తరువాత కొన్ని నెలలకు బ్యాటరీ, స్పీకర్ రెండింటిలోనూ సమస్య ఏర్పడింది. దీంతో 2022 ఆగస్టులో ఇందిరానగర్ సర్వీస్ సెంటర్ సందర్శించి సమస్య తెలిపాడు. అక్కడి వారు ప్రాబ్లమ్ త్వరలోనే పరిష్కారమవుతుందని, వారం రోజుల్లో మీకు ఫోన్ చేస్తామని తెలిపారు. కొన్ని రోజుల తరువాత మొబైల్ ప్రాబ్లమ్ క్లియర్ అయిందని సర్వీస్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తరువాత కూడా అదే సమస్య ఉన్నట్లు మళ్ళీ సర్వీస్ సెంటర్లో ఫిర్యాదు చేశాడు. మళ్ళీ ఈ సమస్య క్లియర్ చేస్తామని చెప్పిన సర్వీస్ సెంటర్ రెండు వారాలైనా స్పందించలేదు. మొబైల్ మెష్‌పై జిగురు లాంటి పదార్ధం కనిపించినట్లు తెలిపారు. ఈ సమస్య ఒక సంవత్సరం వారంటీ కింద కవర్ చేయరని తెలిపారు. దీంతో ఖాన్.. ఆపిల్ ప్రతినిధులకు చాలా ఇమెయిల్‌లు పంపించాడు, కానీ దానికి ఎలాంటి రిప్లై రాలేదు. విసిగిపోయిన కస్టమర్ లీగల్ నోటీసు పంపాడు, దానికి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. ఇదీ చదవండి: రతన్ టాటా జీవితంలో ఈ ప్రత్యేక వ్యక్తి గురించి తెలుసా? కంపెనీని నడిపించడమే కాదు.. గత డిసెంబర్ నెలలో స్థానిక జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుని విచారించిన కమిషన్ అతనికి వడ్డీతో కలిపి రూ. 79,900 నష్టపరిహారం, అతడు పడిన కష్టానికి అదనంగా రూ. 20,000 చెల్లించాలని యాపిల్ కంపెనీని ఆదేశించినట్లు సమాచారం. -
మూడు రూపాయల దాన్ని..ముక్కు పిండేదాకా తెచ్చుకున్నాడు!
మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్ షాప్ యజమానికి భారీ షాక్ తగిలింది. పైగా బెగ్గర్ అంటూ కస్టమర్‌ని దుర్బాష లాడాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.25,000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒడిశాలోని సంబల్పూర్లోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఫోటోకాపీ దుకాణం యజమాని కస్టమర్‌కు రూ.3 తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన కేసును విచారించిన సంబల్పూర్ కోర్టు రూ. 25 వేలు 30 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే సంవత్సరానికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది. బుధరాజా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రఫుల్ల కురార్ దాస్ ఏప్రిల్ 28న జిరాక్స్ కోసం ఫోటో కాపీ సెంటర్‌కి వెళ్లాడు. కాపీ రూ.2 ల చార్జీకి గాను రూ. 5 దుకాణదారుడికిచ్చాడు. మిగిలిన రూ. 3 తిరిగి అడగ్గా ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాదు బెగ్గర్ అంటూ దుర్భాషలాడాడు. అడగ్గా .అడగ్గా. ..పైగా బిచ్చమేశా అనుకుంటూ అంటూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో తనకు చిల్లర ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు రసీదు కూడా ఇవ్వలేదంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఆర్థిక నష్టంతోపాటు, మానసిక వేదన, అవమానానికి గురయ్యానంటూ పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కేసు మాత్రమే కాదు. వినియోగ దారులందరి హక్కులకు సంబంధించింది. అందుకే కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందాను అంటూ తెలిపారు. -
కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్షిప్ - రూ.61 లక్షలు రీఫండ్!
కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇందర్జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది. కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్‌షిప్‌ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్‌షిప్‌కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. -
‘ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్’, కోర్టు మెట్లెక్కిన ఢిల్లీ బాబు.. చివరికి ఏమైందంటే?
తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువైందంటూ ఓ వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. రెండేళ్ల పాటు విచారణ జరిగిన ఈ కేసులో కోర్టు తుది తీర్పు ఏమని ఇచ్చింది. చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్‌కు చెందిన పీ. ఢిల్లీ బాబు అనే వ్యక్తికి మూగ జీవాలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజు వీధికుక్కలకు బిస్కెట్లను ఆహారంగా అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఢిల్లీ బాబు ఎప్పటిలాగే కుక్కలకి బిస్కెట్లు అందించేందుకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ ఐటీసీ సంస్థకు చెందిన సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్లు ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అనంతరం ఆ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించగా అందులో ఓ తప్పు జరుగుతున్నట్లు గుర్తించారు. సంస్థ రేపర్ (చాక్లెట్ కవర్) మీద 16 బిస్కెట్లు ఉన్నాయని చెప్పింది. కానీ తాను కొన్న బిస్కెట్ ప్యాకెట్లో రేపర్ మీద పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కెట్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరణ కోసం స్థానిక స్టోర్‌తో పాటు ఐటీసీకి మెయిల్ చేసినా స్పందన లేదు. ఒక్క బిస్కెట్ తక్కువైంది సార్ దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి 2021 డిసెంబర్ నెలలో చెన్నైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఒక్కో బిస్కెట్ ధర 75 పైసలు. ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను తయారు చేస్తుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే కంపెనీ వినియోగదారులను ప్రతిరోజూ రూ.29 లక్షలు మేర మోసం చేస్తోంది అంటూ కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రతిస్పందనగా ఐటీసీ సంస్థ బిస్కెట్లను సంఖ్య ఆధారంగా కాకుండా బరువు ఆధారంగా విక్రయిస్తారని వాదించింది. ఇరు వాదనల విన్న కోర్టు సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌ను పరిశీలించింది. ప్రతి ప్యాకెట్‌పై పేర్కొన్న నికర బరువు 76 గ్రాములు. అయితే, 15 బిస్కెట్లు ఉన్న ఒక్కో ప్యాక్ 74 గ్రాముల బరువు మాత్రమేనని కోర్టు గుర్తించింది. అసంతృప్తికి గురైన కోర్టు 2011 నాటి లీగల్ మెట్రాలజీ నిబంధనలు ముందుగా ప్యాక్ చేసిన వస్తువులలో గరిష్టంగా 4.5 గ్రాముల వ్యత్యాసాన్ని అనుమతించాయని కోర్టుకు విన్నవించుకుంది. అయితే, అస్థిర ఉత్పత్తుల విషయంలో మాత్రమే ఇటువంటి మినహాయింపులు చెల్లుబాటు అవుతాయని కోర్టు సంస్థ ఇచ్చిన వివరణను తిరస్కరించింది. బిస్కెట్లు కాలక్రమేణా బరువు తగ్గవు కాబట్టి నియమం వర్తించదు అని స్పష్టం చేసింది. పైగా, రేపర్‌పై ఐటీసీ 16 బిస్కెట్లను పేర్కొన్నందున, సంఖ్య కాకుండా.. బరువు ఆధారంగా బిస్కెట్లు విక్రయించారనే వాదన కూడా కొట్టివేసింది. లక్ష చెల్లించాలని ఆదేశాలు బిస్కెట్ ప్యాకెట్లో రేపర్‌పై పేర్కొన్న బిస్కెట్ల సంఖ్య కన్నా ఒక బిస్కట్ తక్కువగా ప్యాక్ చేశారంటూ ఐటీసీకి వినియోగదారుల కోర్టు రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఫిర్యాదు దారుడు ఢిల్లీ బాబుకు చెల్లించాలని ఐటీసీ సంస్థకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - ఎందుకంటే?
వాహనాల కొనుగోలు విషయంలో గానీ, వాహనాల తయారీ విషయంలో గానీ ఏదైనా సమస్య అనిపిస్తే, దానికి సంబంధిత సంస్థలు బాధ్యత వహించకపోతే మీరు కంజ్యూమర్ కోర్టుని సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో ఇన్సిడెంట్ తెరపైకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) గురుగ్రామ్‌లోని పోర్షే అవుట్లెట్కు భారీ జరిమానా విధించింది. ఒక వినియోగదారుడు తనకు విక్రయించిన కారుని తయారు చేసిన సంవత్సరం తప్పుగా ఉందని పిర్యాదు చేసిన కారణంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2013లో తయారు చేసిన పోర్షే కారు 2014లో తయారు చేసిన కారుగా విక్రయించారని, అంతే కాకుండా సర్వీసులో లోపం ఉన్నట్లు జస్టిస్ రామ్ సూరత్ రామ్ మౌర్య కోర్టుకు విన్నవించారు. వినియోగదారుడు ప్రవీణ్ కుమార్ మిట్టల్ పోర్షే ఇండియా, గురుగ్రామ్‌లోని పోర్స్చే సెంటర్‌కు వ్యతిరేకంగా ఫిటిషన్ వేయడంతో ఈ చర్చ జరిగింది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ 'ఎక్స్టర్' ఫస్ట్ లుక్ - చూసారా!) తయారు చేసిన సంవత్సరం గురించి అబద్ధం చెబుతూ రూ. 80 లక్షలకు కేయాన్‌ను విక్రయించినట్లు కస్టమర్ ఆరోపించారు. అయితే అదే తరహాలో కొత్త కారు ఇవ్వాలని, తాను ఖర్చు చేసిన ఇతర ఖర్చులతో పాటు పూర్తి కారు ధరలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) ఫిర్యాదుదారుని దుర్మార్గపు ఉద్దేశ్యాలతో ఆరోపించే ఆరోపణలను పోర్స్చే తిరస్కరించింది. తయారీ సంవత్సరం గురించి అతనికి బాగా తెలుసు. కాబట్టే దానికి తగిన తగ్గింపు కూడా పొందినట్లు పేర్కొంది. ఇరువర్గాలు తమ పత్రాలను కోర్టులో సమర్పించారు. మిట్టల్ సమర్పణలు సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద పబ్లిక్ అథారిటీ ద్వారా సేకరించడం వల్ల వాటి ప్రామాణికతను కోర్టు సమర్థించింది. చివరకు రూ. 18 లక్షలకు పైగా ఉన్న వడ్డీతో కలిపి అతనికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని పోర్షేను ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారుడికి లిటిగేషన్ ఖర్చుగా రూ. 25,000 చెల్లించాలని ఆదేశించింది. కల్పిత పత్రాల విషయమై అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు ఆ ప్రాంత పరిధిలోని పోలీసులచే విచారణ జరిపించాలని కూడా కమిషన్ ఆదేశించింది. -
Parking Offer: రూ.60 కోసం సుదీర్ఘ పోరాటం!
వినియోగాదారుల హక్కుల ప్రాముఖ్యత, దాని కోసం నిలబడి పోరాడేలని చెప్పే అంశం దేశ రాజధాని ఢిల్లీలో తెరపైకి వచ్చింది. అదీకూడ ఒక చిన్న మొత్తం కోసం పోరాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసినా.. మన హక్కులను గుర్తు చేయడమే గాక కొన్ని ఆఫర్లు మనల్నీ ఎలా నిలువు దోపిడి చేస్తున్నారో ప్రపంచానికి తెలిసేలా చేసింది ఈ ఘటన. వివరాల్లోకెళ్తే..కమల్ ఆనంద్ తన భార్యతో కలిసి సాకేత్‌లోని ఒక మాల్లో కోస్టా కాఫీ అవుట్‌లెట్‌కి వెళ్లారు. అవుట్లెట్ ఉద్యోగి వారికి ఒక ఆఫర్ ఇచ్చాడు. కాఫీ ఆర్డర్ చేస్తే పార్కింగ్ ఉచితం అని వారికి తెలియజేశాడు. దీంతో కమల్ రెండు కాఫీలు కొనుగోలు చేసి రూ.570 చెల్లించాడు. తదనంతరం అతను తన భార్యతో కలిసి పార్కింగ్ స్థలం నుంచి బయటకు రాగానే రూ. 60 చెల్లించమని పార్కింగ్ నిర్వాహకుడు అడిగాడు. అతను ఆఫర్ స్లిప్‌ను చూపించాడు. ఐతే అక్కడున్న వ్యక్తి ఆ ఆఫర్ గురించి ఎలాంటి సమాచారం లేదని పార్కింగ్‌కి డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఈ విషయమై కోస్టా కాఫీ నిర్వాహకులకు, మాల్ యజమానికి ఫిర్యాదు చేసినప్పటికీ..లాభం లేకుండా పోయింది. పైగా నిర్వాహకులు పార్కింగ్ డబ్బులు వసూలు చేశారు కూడా. దీంతో ఆనంద్ ఢిల్లీలోని వినయోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ సుమారు పదేళ్లు సాగింది. ఐతే విచారణ సమయంలో ఆనంద్ తన ఫిర్యాదుకు మద్దతుగా తగిన సాక్ష్యాధారాలను కోర్టుకి సమర్పించాడు. అయితే ఆనంద్ వాదనను ఎదుర్కోనేలా ప్రతివాది ఎటువంటి ఆధారాలను సమర్పించ లేకపోయాడు. దీంతో కోర్టు ఇది కేవలం రూ. 60కి సంబంధించినది కాదని వినియోగదారుల హక్కులకు వారు పొందాల్సి సౌకర్యాలకు సంబంధించిందని పేర్కొంది. కస్టమర్‌ను ఆఫర్‌తో ప్రలోభ పెట్టి ఆపై కస్టమర్ విపత్కర స్థితిలో చిక్కుకున్నప్పుడూ ఆ ఆఫర్ తిరస్కరించటం సర్వీస్‌లో నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంత చిన్న మొత్తం అయినా వెనుకడుగు వేయక జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డందుకు ఆనంద్‌ని కోర్టు ప్రశంసించింది. అంతేగాదు కోర్టు ఈ కేసులో నిందితులకు రూ.61,201 జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కమల్‌కి చెల్లించాలని స్పష్టం చేసింది. (చదవండి: 'ప్రేమలో పడండి' అంటూ విద్యార్థులకు సెలవులు మంజూరు) -
ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు..చివరకు..
బెంగళూరు: మనం ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే కండక్టర్ ఒక్కోసారి చిల్లర లేదని చెబుతుంటాడు. కొన్నిసార్లు టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమంటాడు. దీంతో కొంతమంది ఒక్క రూపాయి, రెండు రూపాయల చిల్లరను కండక్టర్‌కే వదిలేసి వెళ్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన ఒ వ్యక్తి మాత్రం ఇలా కాదు. తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేదు. దీని కోసం వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? ఒక్క రూపాయి కోసం కోర్టు వరకు వెళ్లిన ఇతని పేరు రమేశ్ నాయక్. 2019లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కి శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర. రూ.29. దీంతో కండక్టర్‌కు రూ.30 ఇచ్చాడు రమేశ్. మిగతా ఒక్క రూపాయి చిల్లర ఇవ్వమని అడిగాడు. ఇందుకు కండక్టర్ అతనిపై కోపపడ్డాడు. చిల్లర లేదు ఇవ్వనని గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి వాపోయిన రమేశ్.. బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదని భావించిన రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు. ఈ విషయాన్ని పరిశీలించిన న్యాయస్థానం బీఎంటీసీకి షాక్ ఇచ్చింది. రమేశ్‌కు రూ.2,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. న్యాయప్రక్రియకు అయిన ఖర్చు కోసం మరో రూ.1,000 అదనంగా చెల్లించాలని చెప్పింది. 45 రోజుల్లోగా పరిహారం అందజేయాలని పేర్కొంది. ఒకవేళ చెప్పిన తేదీలోగా పరిహారం ఇవ్వకపోతే ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. విషయం రూపాయి గురించే కాదు.. అయితే ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇది బస్సుల్లో రోజూ జరిగే సాధారణ విషయమేమని, సేవల్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. రమేశ్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. న్యాయస్థానం మాత్రం వీరి వాదనను తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది. పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. చదవండి: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు.. -
రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు.. షాకిచ్చిన కోర్టు.. ఏకంగా రూ. 65 వేలు
సాక్షి, చెన్నై: వినియోగదారుడికి రూ.100 తిరిగి ఇవ్వని బ్యాంకు నష్టపరిహారంగా రూ. 65 వేలు అందజేయాలని వినియోగదారుల ఫోరంను కోర్టు ఆదేశించింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్ చెన్నై సౌకార్‌పేట గోవిందప్పనాయకన్ వీధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2018 జూలై 24న స్నేహితుడు అకౌంట్లో నగదు డిపాజిట్ చేశాడు. ఆ సమయంలో రూ. 900కు గాను రెండు 500 రూపాయల నోటును బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. చలానాలో రెండు 500 నోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. బ్యాంక్ క్యాషియర్ రూ.900 లకు బదులుగా నిర్మల్ కుమార్ స్నేహితుడి ఎకౌంట్‌కు వెయ్యి రూపాయలు పంపించేశాడు. దీంతో నిర్మల్ కుమారు బ్యాంకు క్యాషియర్ వద్ద మిగిలిన రూ. 100 ఇవ్వమని కోరాడు. ఈ వ్యవహారాన్ని నిర్మల్ కుమార్ బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని తరువాత ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారు కూడా చర్యలు తీసుకోలేదు. చివరిగా చెంగల్పట్టు వినియోగదారుల ఫోరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల ఫోరం కోర్టు న్యాయమూర్తి బాధితుడికి నష్టపరిహారంగా రూ. 50 వేలు, కేసు దాఖలు చేయడానికి అయిన ఖర్చు రూ. 15 వేలు కలిపి మొత్తం రూ. 65 వేలు అందజేయాలని సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేశారు. -
నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్: ఓలాకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక కస్టమర్ నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు జబేజ్ శామ్యూల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్ కారణంగా మొత్తం రూ. 95,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఓలా క్యాబ్స్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు దారు జబేజ్ శామ్యూల్ 2021, అక్టోబరు 19న నాలుగు గంటలకు ఓలా క్యాప్ బుక్ చేసుకున్నాడు. భార్య, మరొకరితో కలిసి క్యాబ్ ఎక్కినపుడు అంతా డర్టీగా కనిపించింది. ఏసీ ఆన్ చేయమన్నా, డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాదు నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శామ్యూల్‌ని మధ్యలోనే దింపేశాడు. దీనిపై ఓలాను సంప్రదించినప్పటికీ ఫలితం కనబడలేదు. పైగా రూ. 861 ఫీజు చెల్లించాల్సిందిగా పదేపదే కోరడంతో విసిగిపోయిన కస్టమరు దాన్ని చెల్లించారు. (భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం) దీంతో హతాశుడైన శామ్యూల్ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ - III ను ఆశ్రయించారు. దాదాపు రూ.5 లక్షల పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. దీన్ని విచారించిన కోర్టు 5 లక్షల అంటే, చాలా పెద్ద మొత్తం అని అభిప్రాయపడినకోర్టు, ట్రిప్ చార్జీ, రూ. 861 వడ్డీతో (సంవత్సరానికి 12శాతం చొప్పున), అలాగే మానసిక వేదనకుగాను రూ. 88వేలు, ప్రొసీడింగ్స్ ఖర్చుల నిమిత్తం రూ. 7 వేలు కలిపి మొత్తం 95 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్ ఓలా క్యాబ్‌ను ఆదేశించింది. -
జాగో కన్జ్యూమర్! 40పైసల కోసం పోతే..
-
నీకు తిక్కుంది.. కానీ లెక్కలేదు.. పెద్దాయనకి ఫైన్ విధించిన కోర్టు
బెంగళూరు కన్సుమర్ కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ఆసక్తికరంగా మారింది. వినియోగదారుల హక్కులు, వ్యాపార సంస్థల బాధ్యతలను మరోసారి చర్చకు పెట్టింది. కేవలం నలభై పైసల కోసం జరిగిన విచారణ చివరకు మూలనపడిన ఓ కొత్త సర్క్యులర్ని బయటకు వెలికి తీసింది. బెంగళూరుకు చెందిన మూర్తి అనే సీనియర్ సిటిజన్ నగరంలో ఉన్న ఎంపైర్ అనే హోటల్‌కి వెళ్లి టేక్ అవేలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. బిల్లు రూ. 264.60లు అవగా హోటల్ వాళ్లు అతని నుంచి రూ. 265లు తీసుకున్నారు. హోటల్ యాజమాన్యం తన నుంచి అన్యాయంగా 40 పైసలు దోచుకున్నారంటూ కన్సుమర్ కోర్టును 2021 జనవరిలో ఆశ్రయించాడు. దీనికి పరిహారంగా ఒక రూపాయి నష్టపరిహారం ఇప్పించాలంటూ కోర్టును కోరాడు. ఈ కేసుకి సంబంధించి హోటల్ యాజమాన్యం ఇద్దరు లాయర్లను నియమించుకోగా మూర్తి తానే వాదనలు వినిపించాడు. ఎంఆర్పీ మీద అదనంగా డబ్బులు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించాడు. జీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 170 ప్రకారం.. కస్టమర నుంచి ఎక్కువ సొమ్ము తీసుకోలేదని.. అధికంగా తీసుకున్న 40 పైసలు కూడా ట్యాక్స్‌లో భాగమేనంటూ హోటల్ తరఫున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఒకరు నలభై పైసలు నష్టపోగా.. మరొకరు దోషిగా తేలితే జరిమానాగా ఒక రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎవ్వరూ ఈ కేసులో వెనక్కి తగ్గకుండా తమ వాదనలు కోర్టులో వినిపిస్తూ వచ్చారు. ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు వినియోగదారులకు సంబంధించిన అన్ని చట్టాలను, నిబంధనలను న్యాయమూర్తి చదవాల్సి వచ్చింది. చివరకు ఓ సర్క్యులర్ ఆధారంగా చేసుకుని న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. కేసు పెట్టిన మూర్తి యాభై పైసల కంటే తక్కువ నష్టపోయినందున కేసును కొట్టి వేసింది. ఇదే సమయంలో కోర్టు సమయాన్ని పబ్లిసిటీ కోసం వృధా చేసినందుకు రూ. 4000 జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించింది. ఏడాదికి పైగా పలు దఫాలుగా విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తికి వినియోగదారుల హక్కులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ఓ పాయింట్ దొరికింది. దాని ప్రకారం... ఎవరైనా యాభై పైసల కంటే తక్కువ నష్టపోతే దాన్ని ఇగ్నోర్ చేయవచ్చని పేర్కొంది. కానీ యాభై పైసలు అంతకంటే ఎక్కువ నష్టపోయిన పక్షంలో చట్ట ప్రకారం అతనికి న్యాయం జరగాల్సిందేనంటూ స్పష్టం చేసి ఉంది. -
15 నిమిషాలు ఆలస్యంగా షో వేసిన థియేటర్‌కు రూ. లక్ష జరిమానా
Hyderabad Theatre Fined Rs 1 Lakh For Wasting Time On Advertisements: హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు కంజ్యూమర్స్ ఫోరమ్ లక్ష రూపాయల జరిమాన విధించి షాకిచ్చింది. షో సమయానికి కంటే 15 నిమిషాలు ఆలస్యంగా సినిమా వేసి తన సమయాన్ని వృథా చేశారంటూ రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన వినియోగదారుల కోర్టు తాజాగా సదరు థియేటర్‌కు లక్ష రూపాయల జరిమాన విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి టికెట్‌పై ముద్రించిన సమయానికి సినిమా ప్రారంభించకుండా ప్రకటనలు వేసి 15 నిమిషాలు ఆలస్యంగా షో వేశారని ఆరోపిస్తూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా! ఈ క్రమంలో 15 నిమిషాలు తన సమయాన్ని వృథా చేసిన సదరు థియేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేసు నమోదు చేశాడు. అంతేగాక తనకు న్యాయం చేయాలంటూ అతడు విజ్ఞప్తి చేశాడు. విజయ్ తన ఫిర్యాదులో ‘2019 జాన్ 22న వచ్చిన గేమ్ ఓవర్ సినిమాను చూసేందుకు కాచిగూడ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్లు వెళ్లినట్లు చెబుతూ ఆధారాలన్నిటీని సమర్పించాడు. టికెట్‌పై ముంద్రించిన సమయం ప్రకారం సినిమా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కావాలి, కానీ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభించారని ఆరోపించాడు. చదవండి: ‘పుష్ప’ టీమ్‌కి భారీ షాక్, ఆందోళనలో దర్శక-నిర్మాతలు 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ థియేటర్ మేనేజర్‌కు కూడా ఫిర్యాదు చేశానని, అయితే, ఆయన స్పందించలేదని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు చెప్పాడు. దీంతో ఈ కేసులో రెండో ప్రతివాదిగా లైసెన్సింగ్ అథారిటీ 'హైదరాబాద్ పోలీస్ కమిషనర్'ను చేర్చారు. అయితే, తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955 ప్రకారం పాత విధానం ప్రక్రారమే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమకు ఆర్టికల్ 19(1)(జీ), (ఏ) ప్రకారం ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి పుష్ప మూవీ అయితే, ఐనాక్స్ సంస్థ వాదనలను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. చట్టం ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అంతేగాక, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని తీర్పు వెలువరించి, ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ. 5 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ. 5 వేలు చెల్లించాలని తాజాగా తీర్పు ఇచ్చింది. అంతేగాక, లైసెన్సింగ్ అథారిటీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి పెనాల్టీ కింద లక్ష రూపాయలు జరిమాన చెల్లించాలని ఆదేశించింది. ఆ థియేటర్ నుంచి వచ్చే ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని పోలీసులకు సూచించింది. -
బీమా క్లెయిం తిరస్కరించడంతో ఎల్ఐసికి రూ.15.5 లక్షల జరిమానా
హైదరాబాద్: కె.రాములు అనే వృద్దుడు తన మైనర్ మనవరాళ్ల తరఫున బీమా క్లెయిం తిరస్కరణకు సంబందించి ఎల్ఐసి వ్యతిరేకంగా గతంలో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును వినియోగదారుల ఫోరం జూలై 25న వెల్లడించింది. క్లెయింను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనలను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి రూ.15.5 లక్షలు చెల్లించాలని ఎల్ఐసిని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదివారం ఆదేశించింది. తన కుమారుడు జీవన్ ఆనంద్ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని 2012లో తీసుకున్నట్లు పిర్యాదులో కె.రాములు పేర్కొన్నాడు. అయితే, తన కుమారుడి మరణం తర్వాత మైనర్ మనవరాళ్ల తరఫున వారి తాత రాములు జూలై 6, 2012న ఎల్ఐసికి బీమా క్లెయింను సమర్పించారు. 'మృతుడు తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారాన్ని వెల్లడించకుండా, ప్రస్తుత పాలసీని తీసుకునేటప్పుడు తన మునుపటి పాలసీల గురుంచి తెలపడంలో విఫలమయ్యాడు' అనే కారణంతో బీమా క్లెయింను తిరస్కరించింది. పిర్యాదులో పేర్కొన్న ప్రకారం మరణించిన వ్యక్తి తన పాలసీలో కేవలం ఒక విషయం గురుంచి మాత్రమే ప్రకటించలేదని బెంచ్ తెలిపింది. జూన్ 13, 2012 నాటి డిశ్చార్జ్ సారాంశం ప్రకారం, బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27, 2011న తీసుకున్నట్లు ధర్మాసనం గుర్తించింది. "ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేసినట్లు రికార్డులో ఏమీ లేదు" అని బెంచ్ తెలిపింది. జిల్లా వినియోగదారుల ఫోరం 9% వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని ఎల్ఐసిని ఆదేశించింది. అలాగే పరిహారంతో పాటు ఫిర్యాదుదారుడికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని పేర్కొంది. -
10 రూపాయల కోసం కక్కుర్తి..15వేలు కట్టించారు
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ మాల్‌కు అధికారులు షాకిచ్చారు. 10 రూపాయల కోసం కక్కుర్తి పడిన మాల్ యాజమాన్యానికి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చారు. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని కవాడిగూడకు చెందిన వి. బెజ్జం అనే వ్యక్తి ఇటీవలె సెంట్రల్ మాల్లో 1400 రూపాయలు చెల్లించి ఓ షర్ట్‌ను కొనుగోలు చేశాడు. ప్యాకింగ్ అనంతరం షర్ట్‌ను మాల్ లోగో ముద్రించిన పేపర్ బ్యాగ్ ఇచ్చి పది రూపాయలు వసూలు చేశారు. దీనిపై కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదుదారునికి పరిహారంగా మాల్ యాజమాన్యం 15వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
బటర్ చికెన్ తెచ్చినందుకు రూ. 55 వేలు ఫైన్
ముంబై : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు పూణె వినియోగదారుల కోర్టు రూ. 55 వేల జరిమానా విధించింది. వివరాలు.. ముంబైకు చెందిన లాయర్ దేశ్‌ముఖ్ బాంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పనిమీద పూణెకు వెళ్లారు. ఆరోజు ఏదో వ్రతంలో ఉన్న ఆయన అక్కడ ఓ పంజాబీ ధాబా నుంచి వెజిటేరియన్ ఫుడ్ అయిన... పన్నీర్ బటర్ మసాలా జొమాటోలో ఆర్డర్ చేసుకున్నాడు. కానీ అతనికి బటర్ చికెన్ డెలివరీ చేశారు. ఈ విషయం గురించి డెలివరీ బాయ్‌కు ఫోన్ చేసి అడగ్గా.. తనకేం సంబంధం లేదన్నాడు. దాంతో దేశముఖ్ రెస్టారెంట్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దేశ్‌ముఖ్ ఫిర్యాదుపై స్పందించిన యజమాని.. పొరపాటు జరిగింది మళ్లీ పంపిస్తానంటూ... మరోసారి కూడా చికెన్ పంపించాడు. అసలే ఆకలి మీద లాయర్ లోపల ఉన్న పదార్థం ఏంటో గమనించకుండా తినేశాడు. తీరా తిన్న తర్వాత అది చికెన్ అని తెలిసింది. శాకాహారిని అయిన తనతో చికెన్ తినిపించినందుకు గాను సదరు లాయర్ జొమాటో మీద వినియోగదారుల కోర్టులో కేసు నమోదు చేశారు. తన ధార్మిక భావనలు దెబ్బతినేలా ప్రవర్తించిన హోటల్‌తో పాటు జొమాటోపై కూడా ఫిర్యాదు చేశాడు. దేశముఖ్ ఫిర్యాదును విన్న కోర్టు...జొమాటోతో పాటు రెస్టారెంట్‌కు నోటీసులు అందించింది. వెంటనే రూ.55 వేలు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. అయితే జొమాటో మాత్రం తమకెలాంటి నోటీసులు అందలేదని చెబుతోంది. -
రాశి, రంభల ఆ యాడ్స్ వద్దు
సాక్షి, విజయవాడ : రాశి, రంభ లాంటి సినితారలతో ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. కలర్స్ సంస్థ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టీస్ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని సూచించించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ. 2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు. ప్రజాదరణ కలిగిన రాశి, రంభ లాంటి సెలబ్రిటీలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీలకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. షాపింగ్ మాల్‌కు రూ. 5లక్షల జరిమానా.. అక్రమంగా పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్న పీవీఆర్ మాల్‌కు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మొత్తాన్ని వినయోగదారుల సంక్షేమనిధికి జమచేయాలని, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఫిర్యాదుదారుడికి అందజేయాలని పేర్కొన్నారు. హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం మాల్స్, మల్టిప్లెక్స్ లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. -
ఏటీఎంలో నో క్యాష్ : ఎస్బీఐకి ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకుల సేవింగ్ ఖాతాల్లో మినిమం బాలెన్స్ లేకపోతే కస్టమర్లను ఛార్జీలతో బాదేయడం మనకు తెలిసిందే. అయితే ఏటీఎంలో సరిపడినంత నగదు ఉంచడంలో ఫెయిలైన అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐకి భలే షాక్ తగిలింది. కస్టమర్ ఫిర్యాదును విచారించి వినియోగదారుల ఫోరం ఎస్బీఐకు జరిమానా విధించింది. అంతేకాదు ఇంటర్నెట్ ఫెయిల్యూర్, ఎస్బీఐ కస్టమర్ కాదు లాంటి కుంటిసాకులతో తప్పించుకోజూసిన బ్యాంకునకు మొట్టికాయలు కూడా వేసింది. వివరాల్లోకి వెడితే రాయపూర్‌కు చెందిన వినియోగదారుడు ఏటీఎంలో నగదు విత్ డ్రా కోసం వెళ్లినపుడు నో క్యాష్ అవైలబుల్ మెసేజ్ వెక్కింరిచింది. మూడుస్లారు ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 2017 ఏడాదిలో మే, జూన్ నెలలో ఒకసారి, మరోసారి ఇలా మూడుసార్లు ఏటీఏంలో నగదు తీసుకోలేకపోయాననీ, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాల్సిందిగా కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన కోర్టు అన్నిబ్యాంకులు ఏటీఏం సేవలపై ఏడాదికి ముందే ఫీజు నుకస్టమర్ల వద్దనుంచి వసూలు చేస్తున్నపుడు..ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం తన తీర్పులో పేర్కొంది. మూడు సందర్భాల్లో ఏటీఎంలో క్యాష్ లభించపోవడంపై ప్రశ్నించింది. అయితే కేవలం ఇంటర్నెట్ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్ బాధ్యత వహించాలన్న ఎస్బీఐ వాదనను కూడా తోసి పుచ్చింది. అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని యూజర్ల నుంచి ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది. రూ.2500 ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. కాగా ఎస్బీఐ నెలకు రూ. వెయ్యి-మూడువేల వరకు కనీస నిల్వను ఉంచని పొదుపు ఖాతాల ఖాతాదారుల నుంచి జీఎస్టీ తోపాటు 5-15శాతం జరిమానా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2017-18 సంవత్సరంలోని ఎనిమిది నెలల కాలంలో 41కోట్ల మంది సేవింగ్స్ ఖాతాదారులను కలిగి ఉన్న ఎస్బీఐ దాదాపు రూ.1772 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. -
సరైన భాగస్వామిని వెదకలేకపోయారుగా.. అందుకే
చండీగఢ్ : ‘మంచి సంబంధం కోసం వెదుకుతున్నారా.. అయితే మీరు మా సైట్లో వివరాలు అప్లోడ్ చేసుకోవాల్సిందే. మీరు కోరుకున్న లక్షణాలున్న భాగస్వామిని వెదికి పెట్టే బాధ్యత మాది’ అంటూ మ్యాట్రిమొనీలు యాడ్లతో యువతను ఆకర్షించడం మామూలే. చండీగఢ్ కేంద్రంగా పనిచేసే వెడ్డింగ్ విష్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఇలాంటి యాడ్ చూసి తాను మోసపోయానంటూ ఓ యువతి కన్జ్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించింది. తనకు జీవిత భాగస్వామిని వెదకలేకపోయిన సదరు మ్యాటిమొనీ నుంచి 70 వేల రూపాయల పరిహారం పొందింది. వివరాలు.. చండీగఢ్‌లోని సెక్టార్ 27 నివాసి అయిన ఓ యువతి రెండేళ్ల క్రితం వెడ్డింగ్ విష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మ్యాట్రిమోనియల్ సైట్లో తన వివరాలు అప్లోడ్ చేసింది. ఇందుకుగానూ 58, 650 రూపాయలు చెల్లించింది. రాయల్ ప్లాన్ కింద పన్నెండు నెలల పాటు ఆమె ప్రొఫైల్‌కు సరిపోయే యువకుల ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసి వారితో మాట్లాడేలా ఏర్పాట్లు చేసింది సదరు మ్యాట్రిమొని. ఈ క్రమంలో సుమారు 21 మంది ప్రొఫైల్స్ చూసిన ఆ యువతికి ఒక్కరు కూడా నచ్చలేదు. దీంతో విసిగెత్తిపోయిన ఆమె.. 2016, జూన్ 2న కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. నెలరోజుల తర్వాత లీగల్ నోటీసులు రావడంతో విషయాన్ని గ్రహించిన మ్యాట్రిమొని యాజమాన్యం ఆమెకు మరలా ప్రొఫైల్స్ పంపడం ప్రారంభించింది. కానీ అవి కూడా ఆమెకు నచ్చకపోవడంతో కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. ప్రొఫైల్ అప్లోడ్ చేసే సమయంలో చెల్లించిన ఫీజుకు తోడు అదనంగా 11 వేల రూపాయలు యువతికి చెల్లించాలంటూ బుధవారం కోర్టు ఆదేశించింది. ఉద్దేశపూర్వరంగానే ఫిర్యాదు చేసింది...! ఎన్ని ప్రొఫైల్స్ పంపినా తిరస్కరించిన ఆ యువతి ఉద్దేశపూర్వకంగానే తమకు చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించిందని మ్యాట్రిమొని యాజమాన్యం వాదించింది. ‘ఎవరైనా కావాలని ఎందుకు అలా చేస్తారు. ఆమెకు సరిపోయే ప్రొఫైల్స్ మీరు పంపించనందు వల్లే ఫిర్యాదు చేసింది. సరైన జీవిత భాగస్వామిని వెదుకుతామని చెప్పి అలా చేయకపోవడం మీ తప్పే కదా’ అంటూ కోర్టు పేర్కొనడంతో షాక్ తినడం వారి వంతైంది. -
ఆ మల్టీప్లెక్స్ థియేటర్లకు జరిమానా
-
అధిక ధరలు.. మల్టీప్లెక్స్‌లకు కోర్టు షాక్!
సాక్షి, విజయవాడ : షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకు వినియోగదారుల ఫోరమ్ మొట్టికాయలు వేసింది. ఎమ్పార్టీ కంటే అధిక రేట్లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్లపై స్థానిక వినియోగదారుల న్యాయస్థానం కొరడా ఝళిపించింది. విజయవాడలోని ఐదు మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున (మొత్తం 25 లక్షల రూపాయలు) భారీ జరిమానా విధించింది. ఎల్ఈపీఎల్, ట్రెండ్‌సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. నగరంలోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో మూవీ టికెట్లతో పాటు తినుబండారాలు, కూల్ డ్రింక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతేడాది నుంచి దీనిపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ క్రమంలో గురువారం మరోసారి విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు.. ప్రేక్షకులు బయట నుంచి తెచ్చుకునే తినుబండారాలు, తాగునీటిని మల్టీప్లెక్స్‌లలోకి అనుమతించాలని తీర్పు ఇచ్చారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను తూనికలు కొలతల శాఖకు కోర్టు అప్పగించింది. అధిక ధరలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడటం తీవ్రమైన తప్పిదంగా పరిగణించిన కోర్టు.. ఎల్ఈపీఎల్, ట్రెండ్‌సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఐదేసి లక్షల చొప్పున జరిమానా విధించారు. కాగా, జరిమానా నగదును రెండు నెలల్లోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని ఆదేశించారు.