![Consumer Court Bans On Actress Rashi And Ramba Kolors Ads - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/22/Rasi..jpg.webp?itok=sTjZXICy)
సాక్షి, విజయవాడ : రాశి, రంభ లాంటి సినితారలతో ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. కలర్స్ సంస్థ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టీస్ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని సూచించించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ. 2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు.
ప్రజాదరణ కలిగిన రాశి, రంభ లాంటి సెలబ్రిటీలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీలకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
షాపింగ్ మాల్‌కు రూ. 5లక్షల జరిమానా..
అక్రమంగా పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్న పీవీఆర్ మాల్‌కు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మొత్తాన్ని వినయోగదారుల సంక్షేమనిధికి జమచేయాలని, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఫిర్యాదుదారుడికి అందజేయాలని పేర్కొన్నారు. హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం మాల్స్, మల్టిప్లెక్స్ లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment