Consumer Forum
-
అంతర్వేది రథం దగ్ధం కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం
కాకినాడ లీగల్: అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథం అగ్నికి ఆహుతి అయిన కేసులో రూ.84 లక్షల బీమా పరిహారం ఇవ్వాలని కాకినాడ వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రఘుపతి వసంతకుమార్, సభ్యులు చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు చెప్పారు. ప్రమాదవశాత్తు రథం దగ్ధమైన కేసులో అంతర్వేది శ్రీలక్ష్మీనారాయణ దేవస్థానం తరఫున ఎగ్జిక్యూటివ్ అధికారులు కాకినాడ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. రూ.84 లక్షల పరిహారం, నష్టాల కింద రూ.15 లక్షలను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని కోరారు. రథం ఘటన ప్రమాదం కాదంటూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫు న్యాయవాది వాదించారు. కాకినాడ కోర్టు పరధిలోకి ఈ కేసు రాదన్నారు. దీనిపై ఎండోమెంట్ ప్యానల్ న్యాయవాది జీవీ కృష్ణప్రకాష్ వాదిస్తూ భగవంతుడు సర్వాంతర్యామి అని, కాకినాడలో ఎండోమెంట్ కార్యాలయం ఉందని, అందువల్ల కేసును కాకినాడ కోర్టులోనే విచారించాలన్నారు. వాదోపవాదనల అనంతరం రూ.84 లక్షల పరిహారంతో పాటు రూ.30 వేలు ఖర్చుల కింద 45 రోజుల్లోపు బీమా కంపెనీ చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. హెచ్ఆర్సీకి 9 నుంచి సంక్రాంతి సెలవులు కర్నూలు(సెంట్రల్): స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్ఆర్సీకి)కి ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కమిషన్ కార్యదర్శి ఎస్.వెంకటరమణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాత కేసుల వాయిదా, విచారణ, అత్యవసర కేసుల నిమిత్తం వెకేషన్ కోర్టులను నిర్వహిస్తారు. 9, 10, 11 తేదీల్లో కమిషన్ చైర్మన్ ఎం.సీతారామమూర్తి, 12, 13 తేదీల్లో కమిషన్ జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు నడుస్తుంది. 14, 15, 16 తేదీల్లో పూర్తి సెలవు ఉండగా.. 17వ తేదీన కమిషన్ నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెకేషన్ కోర్టు ఉంటుంది. 18వ తేదీ నుంచి యధాతథంగా హెచ్ఆర్సీ కార్యకలాపాలు జరుగుతాయి. ఇదీ చదవండి: TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా! -
ఎయిర్ ఇండియాకు జరిమానా
సాక్షి, రంగారెడ్డి జిల్లాకోర్టులు: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు శ్రీమతి చిట్టినేని లతా కుమారి నేతృత్వంలోని బెంచ్ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకు రూ.10 వేలు జరిమానా విధించింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చిలకమర్తి గోపీకృష్ణ 2020 అక్టోబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా సదరు విమానయాన సంస్థ టికెట్‌ను రద్దు చేసింది. రద్దు చేసినందుకు టికెట్ ధర రూ. 71,437లను తిరిగి చెల్లించేందుకు అగీకరిస్తూ ఇందుకు సంబందించి ప్రక్రియ మొదలు పెట్టినట్టు మార్చి 2021లో సమాచారం అందించింది. ఆ తర్వాత సదరు సంస్థ వినియోగదారుడికి ఎటువంటి జవాబు ఇవ్వకపోగా, ఇది వరకే రీఫండ్ చేశామని చెప్పడంతో బాధితుడు గోపీకృష్ణ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఆ తర్వాత 20 రోజులకు రూ. 71,437/–ల టికెట్టు రుసుమును గోపీకృష్ణకు చెల్లించి ఫోరం ఎదుట వాదనలు వినిపించిన సంస్థకు చెల్లింపుల్లో జరిగిన జాప్యాన్ని పరిగణలోకి తీసుకున్న ఫోరం విమానయాన సంస్థ సేవల లోపం కారణంగానే జాప్యం జరిగిందని నిర్ధారిస్తూ సంస్థకు జరిమానాతో పాటు టికెట్ రుసుముపై ఐదు నెలలకు 6% వార్షిక వడ్డీ చెల్లించాలని తీర్పు వెలువరించింది. చదవండి: (CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!) -
శునకాల స్వైర విహారం.. 11 జాతులపై నిషేధం.. ఎక్కడంటే!
న్యూఢిల్లీ: ఇంటి భద్రత కోసం చాలా మంది శునకాలను పెంచుకుంటారు. పెట్స్ ను పెంచుకోవడాన్ని కొంతమంది స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. ఇదంతా బాగానే ఉన్నా పెంపుడు జంతువులతో యజమానులకు పెద్దగా సమస్యలు ఉండవు. కానీ శునకాల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీంతో కుక్కలంటేనే జనం వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్‌లో శునకాల బెడద పెరిగిపోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. 11 విదేశీ శునకాల జాతులను నిషేధించాలని, వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశించింది. ఆగస్టు 11న సివిల్ లైన్స్‌లో డోగో అర్జెంటీనో జాతికి చెందిన కుక్క కాటుకు గురై తీవ్ర గాయాలపాలైన మహిళ.. తమను ఆశ్రయించడంతో వినియోగదారుల ఫోరం ఈ మేరకు నవంబర్ 15న ఉత్తర్వులు వెలువరించింది. బాధిత మహిళకు రూ. 2 లక్షలు చెల్లించాలని.. పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీని రూపొందించాలని ఎంసీజీని ఫోరం ఆదేశించింది. ఈ 11 జాతులు ప్రమాదకరం.. ప్రమాదకరమైన వాటిగా గుర్తించిన 11 విదేశీ జాతి శునకాలను నిషేధించాలని ఫోరం ఉత్తర్వులిచ్చింది. అమెరికన్ బుల్డాగ్, అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీల్లర్, బోయర్‌బోయెల్, ప్రెస్ కానరియో, నియాపోలిషియన్ మాస్టిఫ్, వోల్ఫ్డాగ్, కేన్ కోర్సో, బాండోగ్, ఫిలా బ్రసిలీరో జాతి శునకాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటి బాధ్యత యజమానులదే పెంపుడు శునకాలకు సంబంధించి అమలు చేయాల్సిన అంశాలపై ఎంసీజీకి ఫోరం స్పష్టమైన సూచనలు చేసింది. ‘ప్రతి నమోదిత శునకానికి కాలర్‌ను ధరించాలి.. దానికి మెటల్ టోకెన్‌తో పాటు మెటల్ చైన్‌ను జతచేయాలి. ఒక కుటుంబం ఒక కుక్కను మాత్రమే పెంచుకునేలా చూడాలి. పెంపుడు శునకాలను బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడల్లా అవి ఎవరినీ కరవకుండా ఉండేందుకు వాటి మూతిని నెట్ క్యాప్ లేదా మరేదైనా వస్త్రంతో కవర్ చేయాలి. బహిరంగ ప్రదేశాలను పాడు చేయకుండా చూడాల్సిన బాధ్యతను యజమానులదేన’ని 16 పేజీల ఉత్వర్తుల్లో పేర్కొంది. పసిపాపపై కుక్క దాడి.. విషాదం గురుగ్రామ్‌లో శునకాల స్వైర విహారంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నెలలో వీధి కుక్క దాడిలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కాగా, పిట్ బుల్, రోట్వీలర్, డోగో అర్జెంటినో అనే మూడు జాతుల కుక్కల పెంపకంపై నిషేధం విధించే ప్రతిపాదనను ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్టోబర్‌లో ఆమోదించింది. జంతు ప్రేమికుల ఆందోళన విదేశీ సంతతికి చెందిన 11 జాతి శునకాలపై నిషేధం విధించడాన్ని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శునకాల్లో ప్రమాదకరమైనవి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని.. పరిస్థితులను బట్టి మూగజీవాలు స్పందిస్తాయని నిహారిక కశ్యప్ అనే జంతు పరిరక్షణ కార్యకర్త తెలిపారు. కుక్కలను ఎక్కువసేపు బంధించి ఉండచం, వాటికి సమయానికి ఆహారం పెట్టకపోవడం వంటి కారణాలతోనే అవి అదుపు తప్పుతాయని వివరించారు. సమస్య పరిష్కారానికి కారణాలు గుర్తించకుండా కొన్ని జాతి శునకాలపై నిషేధం విధించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విదేశీ శునకాలను అధిక మొత్తానికి విక్రయించి సొమ్ములు చేసుకుంటున్న వ్యాపారులపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. (క్లిక్: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు) -
ఎనిమిదేళ్లనాటి ఘటన.. అపోలో వైద్య బృందానికి భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపోలో ఆసుపత్రి వైద్యుల బృందానికి భారీ జరిమానా విధించింది రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని తెలిపింది. ఈ ఘటన ఎనిమిదేళ్ల కిందటి నాటిది కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్ హుడా కాలనీలో నివసించే ఎం.ఆర్.ఈశ్వరన్(53) తీవ్ర కడుపునొప్పితో 2012 సెప్టెంబర్ 18న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే డయాబెటిక్ పేషెంట్‌గా ఎనిమిదేళ్లు ఆయన వైద్య సహాయం పొందుతున్నాడు. ఈశ్వరన్‌ను పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకొని కొలొనోస్కోపీ టెస్ట్ చేయించాలని సూచించారు. అదే నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ‘కొలొనోస్కోపీ’పరీక్ష కోసం వైద్యులు అపాయింట్మెంట్ ఇవ్వగా, 3 గంటలు ఆలస్యంగా పరీక్షకు తీసుకెళ్లారు. అయితే ఈశ్వరన్ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లాడు. 116 రోజులు వెంటిలేటర్‌పై ఉండి 2013 జనవరి 14న చనిపోయాడు. ఆసుపత్రి వైద్యులు, మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ఈశ్వరన్ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంతో.. తాజాగా పరిహారం తీర్పు వెల్లడించింది ఫోరం. ఇదీ చదవండి: డబ్బుకోసం చూస్తే.. సుతారీ మేస్త్రీకి గుండె ఆగినంత పనైంది -
‘మరమ్మతు హక్కుల’ నిబంధనలపై కసరత్తు
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉత్పత్తులను స్వయంగా లేదా థర్డ్ పార్టీల ద్వారా మరమ్మతు చేయించుకునే హక్కులను (రైట్ టు రిపేర్) కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 13న తొలిసారిగా భేటీ అయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ విషయాలు తెలిపింది. రిపేర్లు, విడిభాగాల విషయంలో కంపెనీలు ఏ విధంగా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయనేది కమిటీ .. సమావేశంలో చర్చించింది. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు, మొబైల్ ఫోన్లు/ట్యాబ్లెట్లు, వినియోగ వస్తువులు, కార్ల వంటి ఆటోమొబైల్స్/ఆటోమొబైల్ పరికరాల రంగాల్లో ఇలాంటి ధోరణులను పరిశీలించింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తుల మరమ్మతుకు తాము తయారు చేసే పరికరాలే వాడాలని, తమ దగ్గరే రిపేరు చేయించుకోవాలని .. థర్డ్ పార్టీలు లేదా సొంతంగా మరమ్మతు చేసుకుంటే వారంటీలు పనిచేయవంటూ షరతులు పెడుతుంటాయి. అలాగే పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా .. కొంత కాలానికి మాత్రమే పనిచేసేలా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఆ తర్వాత అవి రిపేరుకు కూడా పనికి రాకుండా పోవడం వల్ల కస్టమర్లు మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా పాతవి వ్యర్ధాల కింద మారుతున్నాయి. ఇలాంటి నియంత్రణలు, గుత్తాధిపత్య ధోరణులు .. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించేవేనని ప్రభుత్వ కమిటీ అభిప్రాయపడింది. సమస్యలు వస్తే ఎలా రిపేరు చేసుకోవాలి, వేటిని ఉపయోగించాలి లాంటి విషయాల గురించి కస్టమర్లకు కంపెనీలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం థర్డ్ పార్టీలు, వ్యక్తులకు ఆయా సాధనాలను అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రైట్ టు రిపేర్ వల్ల వ్యర్ధాలను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు’ రైట్ టు రిపేర్’ని గుర్తించాయి. -
ఐదు తులాల బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో ఐదు తులాల బంగారు నాణేన్ని ఆర్డర్ చేశాడో వ్యక్తి. సీల్డ్బాక్స్లో బిల్ ఇన్వాయిస్ మాత్రమే పంపించిందా దుకాణం. నష్టపరిహారంగా 18 శాతం వడ్డీతో నగదు ఇవ్వాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రవిచంద్ర (24) 2016 డిసెంబర్ 17న ఆన్లైన్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చెందిన 50 గ్రాముల బంగారాన్ని హైదరాబాద్‌లోని షాపర్స్‌స్టాప్‌లో ఆర్డర్ చేశాడు. అందుకోసం రూ.1,53,091 చెల్లించాడు. ఆరమెక్స్ కొరియర్ ద్వారా బంగారం పంపుతున్నట్లు 2016 డిసెంబర్ 22న మలబార్ గోల్డ్ నుంచి సమాచారం వచ్చింది. కానీ డిసెంబర్ 26న ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ ద్వారా సీల్డ్బాక్స్ వచ్చింది. అనుమానాస్పదంగా ఉన్న ఆ కవర్‌ను వీడియోగ్రఫీ సాయంతో తెరిచి చూడగా, అందులో గోల్డ్ కాయిన్ లేదు. కేవలం రూ.1,53,091కి సంబంధించిన బిల్లు మాత్రమే ఉంది. దీంతో అతను వీడియోను జత చేస్తూ షాపర్స్‌స్టాప్ హైదరాబాద్, ముంబై ఆఫీసుల్లో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో 2017లో హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం–1 కోర్టును ఆశ్రయించాడు. 2019 ఫిబ్రవరి 5న ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై షాపర్స్‌స్టాప్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎస్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలను, సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్కె జైస్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్ధించారు. వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని, అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇచ్చేంతవరకు 18 శాతం వడ్డీతో ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక రూ.50 వేల నష్టపరిహారం, రూ.10వేలు ఖర్చుల కింద చెల్లించాలని, ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని తీర్పులో పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!) -
రూ.3 కోసం మూడేళ్ల పోరాటం..ఎట్టకేలకు
ముషీరాబాద్: క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసిన మూడు రూపాయలను కొనుగోలు తేదీ నుంచి పిటిషనర్‌కు తిరిగి చెల్లించే వరకు 9శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్‌ను హైదరాబాద్ రెండవ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఫిర్యాదు దారుడికి రూ.10వేల నష్టపరిహారం, ఖర్చుల నిమిత్తం రూ.6వేలు చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... 2019 జూన్ 2వ తేదీన ఫిర్యాదుదారుడు వడ్డె ఆనంద్‌రావు వస్తువుల కొనుగోలుకు అమీర్‌పేట స్పెన్సర్స్ సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. రూ.101 బిల్లుకు అదనంగా కవర్ కోసం రూ.3 వసూలు చేసి లోగో ఉన్న కవర్ అందించారు. ఫిర్యాదుదారుడు అభ్యంతరం తెలిపినా ఫలితం లేకపోవడంతో ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తరువాత ఆ మాల్‌ను మూసేసినా, పట్టువదలలేదు. కమిషన్ ఆదేశాలతో పత్రికలో ప్రకటన ఇచ్చి, రెండవ ప్రతివాదిగా స్పెన్సర్స్ను మళ్లీ కేసులో ఇంప్లీడ్ చేసి విజయం సాధించారు. కాగా.. క్యారీ బ్యాగుల అమ్మకానికి ఉద్దేశించిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 15ను 2018లో తొలగించారు. ఈ నేపథ్యంలో క్యారీ బ్యాగులకు అదనంగా డబ్బులు వసూలు చేయకుండా లీగల్ మెట్రాలజీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ శాఖలు సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్‌కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కమిషన్ తీర్పులో పొందుపరిచింది. ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంటూ తీర్పు కాపీలను ప్రతివాదికి పంపాలని కార్యాలయానికి సూచించింది. -
సిటీ సెంటర్‌మాల్‌లో క్యారీ బ్యాగ్‌కు బిల్లు.. రూ.20 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌మాల్‌లో లైఫ్ స్టైల్ దుస్తుల షోరూం క్యారీ బ్యాగ్‌కు రూ.5 వసూలు చేయడంతో సదరు దుస్తుల కంపెనీకి జిల్లా కన్జ్యూమర్ డిస్పూట్స్ రెడ్రెసల్ కమిషన్ రూ.20 వేల జరిమానా విధించింది. వినియోగదారులకు క్యారీ బ్యాగ్‌లు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా షాపు నిర్వాహకుడు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఓ బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టి ఆ షోరూంకు జరిమానా విధించింది. చదవండి: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ.. -
‘మొబైల్ సేవల లోపాలపై ఫోరంను ఆశ్రయించొచ్చు’
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీల మొబైల్ సేవల్లో లోపాలపై కస్టమర్లు వినియోగదారుల ఫోరాలను నేరుగా ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి టెలిగ్రాఫ్ చట్టంలో ఉన్న మధ్యవర్తిత్వ సదుపాయం దీనికి అడ్డు కాబోదని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. రెండింట్లో దేన్ని ఎంచుకోవాలన్నది కస్టమర్ ఇష్టమేనని చెప్పింది. ఉచిత సేవలు, కాంట్రాక్టులో భాగంగా కస్టమర్‌కు వ్యక్తిగతంగా అందించే సేవలు మాత్రమే ఇందుకు మినహాయింపు అని వివరించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ తమపై నేరుగా ఫోరాన్ని ఆశ్రయించడాన్ని సవాలు చేస్తూ వొడాఫోన్–ఐడియా సెల్యూలర్ కంపెనీ చేసుకున్న అపీలుపై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
Hyderabad: ఇన్సురెన్స్ కంపెనీకి వార్నింగ్.. రూ.79 లక్షలు చెల్లించాలంటూ ఆదేశం
వినియోగదారులకు సరైన సేవలు అందివ్వడంలో విఫలమైన ఇన్సురెన్సు కంపెనీపై కన్సుమర్ ఫోరమ్ కన్నెర్ర చేసింది. పాలసీదారుడు నష్టపోయిన సొమ్మును వడ్డీతో చెల్లించడంతో పాటు సకాలంలో సేవలు అందించకుండా మానసిక క్షోభకు గురి చేసిందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2018లో పాలసీ హైదరాబాద్ నగరానికి చెందిన హితేశ్ కుమార్ కేడియా అనే వ్యాపారి స్పాంజ్ ఐరన్ వ్యాపారంలో ఉన్నాడు. తన స్పాంజ్ ఐరన్ స్టాక్‌కి సంబంధించిన విషయంలో న్యూ ఇండియా అశ్యురెన్స్ కంపెనీలో బీమా పాలసీ 2018 ఫిబ్రవరి 25న తీసుకున్నాడు. పాలసీ సమయంలోనే అకస్మాత్తుగా మంటలు సంభవించినప్పుడు నష్టపరిహారం పొందే హక్కు కలిగి ఉండే విధంగా పాలసీ చేశాడు. అగ్నిప్రమాదం హితేశ్ కుమార్ గోదాములో సుమారు రూ. 20 కోట్ల రూపాయల విలువైన స్పాంజ్ ఐరన్ స్టాకు నిల్వ చేసిన సమయంలో 2018 అక్టోబరు 5వ తేదిన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల కారణంగా సుమారు రూ.79 లక్షల రూపాయల విలువైన స్టాకు కాలిపోయింది. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి నష్ట పరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీ నిరాకరించింది. కన్సుమర్ ఫోరం ఇన్సురెన్సు కంపెనీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హితేశ్ కుమార్ కేడియా హైదరాబాద్ కన్సుమర్ ఫోరమ్ -1లో కేసు ఫైలు చేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కన్సుమర్ ఫోరం ఇన్సురెన్సు కంపెనీని తప్పు పట్టింది. సకాలంలో సేవలు అందివ్వడంలో విఫలం చెందారంటూ మొట్టికాయులు వేసింది. 45 రోజుల్లోగా కన్సుమర్ ఫోరం ఆదేశాల ప్రకారం ప్రమాదంలో హితేశ్ కుమార్ నష్టపోయిన స్టాకు విలువ రూ.79 లక్షలను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఇంత కాలం సేవల్లో లోపం చేస్తూ వినియోగదారుడిని ఇబ్బంది పెట్టినందుకు రూ. 3 లక్షలు జరిమాన విధించింది. కోర్టు ఖర్చులకు సంబంధించిన రూ.20 వేలు కూడా ఇవ్వాలంది. ఈ మొత్తాలను తీర్పు వెలువడినప్పటి నుంచి 45 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. చదవండి:ఈ–కామర్స్ కంపెనీలకు షాక్! రూ.42 లక్షల జరిమానా -
న్యాయవాది కేసు ఓడిపోతే సేవాలోపం అనలేం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సేవల్లో లోపం ఉందని ఆరోపిస్తూ ఎవరైనా పరిహారం నిమిత్తం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చని, అయితే అది అన్ని వేళలా సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ నెల 8న విచారించింది. ఓ కేసు విషయంలో ముగ్గురు న్యాయవాదుల వల్ల నష్టపోయానంటూ వినియోగదారుల ఫోరాన్ని ఓ వ్యక్తి సంప్రదించారు. జాతీయ వినియోగదారుల ఫోరం కూడా సదరు వ్యక్తి అభ్యర్థన తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు పిటిషనర్ అభ్యర్థన తిరస్కరించడం సబబే. ప్రతి కేసులోనూ ఎవరో ఒకరు ఓడిపోవడం జరుగుతుంది. అంతమాత్రాన వినియోగదారుల ఫోరానికి వెళ్లి న్యాయవాది నుంచి పరిహారం ఇప్పించాలనడం సమంజసం కాదు. జరిమానా విధించకుండా పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది నిర్లక్ష్యం ఉందని బలమైన ఆధారాలుంటే తప్ప సేవాలోపంగా పేర్కొనలేమని స్పష్టం చేసింది. -
లోన్ ఇవ్వనందుకు ఎస్బీఐకి మొట్టికాయ
సాక్షి, హైదరాబాద్: ఇంటి కొనుగోలుకు అవసరమైన రుణం మంజూరు చేయనందుకు బాధితుడికి రూ. 20 వేల ఖర్చును వడ్డీతో పాటు చెల్లించాలని, పరిహారం కింద మరో రూ. 50 వేలు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వినియోగ దారుల ఫోరం–3... 2018లో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ఎంఎస్కే జైస్వాల్ బుధవారం తాజా ఉత్తర్వులు ఇచ్చారు. టీఎస్ఆర్టీసీలో ఉద్యోగిగా పని చేస్తున్న గుడవల్లి భాస్కర్‌బాబు.. మలక్‌పేటలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు రూ. 10 లక్షల రుణం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీఎస్ఆర్టీసీ బ్రాంచ్‌లో 2017 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగి కావడంతో అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, ఫ్లాట్ విలువ వివరాలను నిపుణుల నుంచి తీసుకొని ఎస్బీఐకి సమర్పించారు. దరఖాస్తుదారుడి వివరాలను పరిశీలించిన ఎస్బీఐ కేవలం రూ. 4,35,000 మాత్రమే మంజూరు చేసింది. దీంతో భాస్కర్‌బాబు లక్ష రూపాయల పరిహారం, జరిగిన నష్టానికి రూ. 50,000 చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం–3ని ఆశ్రయించారు. తాను రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లు, న్యాయ సలహా, వాల్యుయేషన్ సర్టిఫికేట్ తదితర వాటి కోసం చేసిన ఖర్చు వివరాలను పొందుపరిచారు. దీనిపై విచారించిన జిల్లా వినియోగదారుల ఫోరం–3 ఫిర్యాదుదారుడికి ఖర్చుల కింద రూ.40 వేలు, రుణం విషయంలో వేధింపులకు గాను రూ.50 వేలు, మరో 3వేలు ఇతర ఖర్చులకు ఇవ్వాలని 2018 డిసెంబర్ 12న ఆదేశించింది. దీనిపై ఎస్బీఐ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడు, ఎస్బీఐతో పాటు ఈ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను, సంస్థలను విచారించిన కమిషన్, భాస్కర్బాబుకు ఖర్చుల కింద రూ.20 వేలు, పరిహారంగా రూ.50 వేలు చెల్లించాలని బుధవారం ఆదేశించింది. రూ. 20 వేలకు జూన్ 2017 నుంచి ఇప్పటివరకు 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని పేర్కొంది. -
‘ఫిట్జీ’ ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: బోధన నచ్చలేదని చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చేసిన వినతిని ఫిట్జీ పినాకిల్ సంస్థ తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ మానేసిన విద్యార్థికి ఫీజు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత సంస్థకు హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది. ఫిట్జీలో కోర్సులో చేరి తర్వాత మానేసిన విద్యార్థి తన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించింది. దీనిపై ఆ విద్యార్థి వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఫిట్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వాదోపవాదనలు విని పైతీర్పు ఇచ్చింది. అయితే విచారణలో ‘చేరే సమయంలో విద్యార్థికి తిరిగి ఫీజు చెల్లించబోమని విషయాన్ని ముందే చెప్పాం’ అని ఫిట్జీ వాదించింది. ఈ ఒప్పందంపై ఆ విద్యార్థి సంతకం చేశారని కూడా గుర్తు చేయగా ఆ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ఫీజు వివాదం వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని ఫిట్జీ విద్యా సంస్థ పేర్కొనగా కమిషన్ తిరస్కరించింది. విద్యా సంస్థ ముసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని కమిషన్ పేర్కొంది. విద్యార్థికి రూ.4.35 లక్షల ఫీజు, రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఫిట్జీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది 45 రోజుల్లో చెల్లించకపోతే 9 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల కమిషన్ హెచ్చరించింది. -
ఫోనుకు బదులు సబ్బు, సర్ఫ్.. అమెజాన్‌కు మొట్టికాయ
సాక్షి, ముషీరాబాద్: ఫోనుకు బదులుగా సబ్బు, సర్ఫ్ ను వినియోగదారుడికి అందించిన అమెజాన్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం–2 మొట్టికాయ వేసింది. ఫోన్ విలువతో పాటు రూ.10 వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ఫోరం సభ్యుడు పీవీటీఆర్ జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. హైదరాబాద్ బీకేగూడ పార్కు వద్ద నివసించే ప్రైవేటు ఉద్యోగి అయిన పి.విజయ్‌కుమార్ 2020 డిసెంబర్ 19న అమెజాన్‌లో ఒప్పో సెల్‌ఫోన్‌ను రూ.11,990 చెల్లించి ఆర్డర్ చేశారు. అయితే ఫోనుకు బదులుగా ఒక సబ్బు, సర్ఫ్ ప్యాకెట్‌తో కూడిన పార్సల్ అందింది. వెంటనే విజయ్‌కుమార్ అమెజాన్‌కు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ అమెజాన్ నుంచి స్పందన రాకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై ఆమెజాన్ ఇండియా మేనేజర్, అప్పారియో రిటైల్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్‌కు ఫోరం నోటీసులు జారీ చేసింది. వారి తరుపున హాజరైన న్యాయవాదులు ఫిర్యాదు దారుడికి సరైన సాక్ష్యాలు చూపించక పోవడంతో వినయ్‌కుమార్ చెల్లించిన రూ.11,990లకు 9శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, ఫిర్యాదు దారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక వేదనకు రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5వేలు ఫిర్యాదుదారుడికి చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం2 ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగులో తీర్పు.. తెలంగాణ వినియోగదారుల ఫోరం సభ్యుడు పీవీటీఆర్.జవహర్‌బాబు, ఒక్కింటి నర్సింహారావు, ఆర్.ఎస్.రాజశ్రీలతో కూడిన బెంచ్ తెలుగులో తీర్పును వెలువరించింది. -
కోల్గేట్కు షాక్.. రూ.65 వేల జరిమానా
సంగారెడ్డి: కోల్గేట్ సంస్థ పేస్టును అధిక ధరకు విక్రయిస్తున్నారని చెప్పి ఓ వినియోగదారుడు పిటిషన్ వేయగా విచారించిన వినియోగదారుల ఫోరం రూ.65 వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తోందని సంగారెడ్డికి చెందిన ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను విచారించి శుక్రవారం ఫోరం తీర్పునిచ్చింది. న్యాయవాదిగా పనిచేస్తున్న సీహెచ్ నాగేందర్ 2019 ఏప్రిల్ 7వ తేదీన సంగారెడ్డిలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ.92కు కొన్నారు. దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్‌పేస్ట్ రూ.10కి కొనుగోలు చేశారు. అయితే రూ.పదికి 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకోవడంపై నాగేందర్ సందేహం వ్యక్తం చేశారు. అంటే రూ.17 అధికంగా తీసుకుంటున్నారని గుర్తించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారంటూ ఆయన కోల్గేట్ సంస్థ వారికి నోటీసులు పంపించారు. అతడి నోటీసులకు కోల్గేట్ సంస్థ స్పందించకపోవడంతో ఆయన సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ను విచారించి కోల్గేట్ సంస్థ అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు ఇచ్చారు. దాంతోపాటు ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ. 5వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థను ఆదేశించారు. అయితే ఇవన్నీ కూడా నెల రోజుల్లోపు వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ విధంగా వినియోగదారుల ఫోరం వినియోగదారుల కోసం పని చేస్తుంటుంది. మీరు కూడా ఎక్కడైనా.. ఏం సంస్థ వస్తువు విషయంలో మోసపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. -
కస్టమర్ కు రూ.45వేలు చెల్లించిన అమెజాన్
ఒడిశా: ఆన్లైన్లో సహజంగానే ఈ-కామర్స్ సైట్లలో అప్పుడప్పుడు కొన్ని వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. కొన్ని సార్లు ఈ ఆఫర్లు నిజమేనా అని మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. ఈ-కామర్స్ సైట్ల నిర్వాహకులు సాధారణ సమయాలలో కూడా పలు సేల్స్ పేరిట వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సైట్లో తలెత్తిన సాంకేతిక కారణంగా ఒక వినియోగదారుడికి నష్టపరిహారంగా రూ.45వేలు చెల్లించాల్సి వచ్చింది.(చదవండి: పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త) వివరాల్లోకి వెళ్లితే.. ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర అనే న్యాయ విద్యార్థి 2014లో అమెజాన్‌లో ఒక ల్యాప్‌టాప్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్ రూ.190 ఆఫర్ కింద లభించడంతో దాన్నీ ఆర్డర్ చేసుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఆర్డర్ రద్దు కావడంతో అమెజాన్ కస్టమర్‌ను సంప్రదించాడు. అమెజాన్ కస్టమర్ కేర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సాంకేతిక సమస్య కారణంగా తక్కువ ధర చూపించిందని తెలపడంతో పాటు ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతను ఈ విషయాన్నీ విడిచిపెట్టకుండా ఒడిశా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అత్యవసరంగా ల్యాప్‌టాప్ అవసరం ఉన్నందున తాను రూ.190కి ల్యాప్‌టాప్ అని చూసి దాన్ని ఆర్డర్ చేస్తే అమెజాన్ దాన్ని రద్దు చేసిందని, కనుక తనకు న్యాయం చేయాలని అతను కోరాడు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ విచారణ తాజాగా ముగిసింది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆర్డర్ రద్దు చేసినందుకు బాధితుడికి నష్ట పరిహారం కింద రూ.40వేలు, ఖర్చుల కింద మరో రూ.5వేలను అమెజాన్ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త చదివిన చాలా మంది నిజమే వినియోగదారుడిని మోసం చేసినందుకు అమెజాన్ కు కమిషన్ సరైన శిక్ష విధించిందని పేర్కొన్నారు. -
వినియోగదారుల చట్టం కిందకి విద్యాసంస్థలు?
న్యూఢిల్లీ: విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల సేవల్లో లోపం వినియోగదారుల చట్టం–1986 కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తమిళనాడులోని సేలంకి చెందిన వినాయక మిషన్ యూనివర్సిటీ సరైన సేవలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థి మనుసోలంకి, ఇతర విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌వేశారు. ధర్మాసనం ఈ అప్పీల్‌ను విచారణకు అంగీకరించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) నిర్ణయంపై అప్పీల్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఆరు వారాల్లోగా తమ వాదనను వినిపించాలని ఆదేశించింది. మహర్షి దయానంద్ యూనివర్సిటీ వర్సెస్ పీటీ కోషి కేసులో గతంలో సుప్రీంకోర్టు, విద్యని సరుకుగా పరిగణించలేమని తీర్పునిచ్చిన నేపథ్యంలో తిరిగి ఇది చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలు థాయ్‌లాండ్‌లోనూ, రెండున్నర సంవత్సరాలు యూనివర్సిటీలో చదువు చెప్పిస్తామని విద్యార్థులను 2005–2006 సంవత్సరంలో చేర్చకున్నారు. విద్యార్థులకు ఎంబీబీఎస్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్లు అందజేస్తామని, వాటికి కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు వచ్చేలా చూస్తామని కూడా ఇచ్చిన హామీని విద్యాసంస్థలు నెరవేర్చకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. -
అమర జవాన్ల కోసం 'స్టాండ్ ఫర్ ద నేషన్'
సాక్షి, విజయవాడ: ఆసరా సంస్థ ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ద నేషన్' బ్రోచర్ ఆవిష్కరణ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. విజయవాడ వినియోగదారుల (కన్జ్యూమర్) ఫోరమ్ జడ్జి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సైనికులకోసం ఆసరా సంస్థ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాబోయే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల15 నిమిషాలకు అమరులైన జవాన్ల కోసం నివాళిగా స్టాండ్ ఫర్ ద నేషన్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆసరా ద్వారా ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వినియోగదారులకు అందించిన సేవలు మరువలేనివని మాధవరావు ప్రశంసించారు. చట్టం గురించి తెలియని వారి కోసం.. ఆసరా సంస్థ సభ్యులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. -
ఆ విషయంలో కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు
సాక్షి, హన్మకొండ : కల్తీ వస్తువుల విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చాలా సీరియస్‌గా ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ వినియోగదారుల ఫోరం ఆరు జిల్లాల సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వినియోగదారులకు హక్కులు చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అయిపోతోంది. పాలు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. కల్తీ లేని వస్తువులతోనే ఆరోగ్యం. ఆరోగ్యంతోనే సమాజం బాగుంటుంది. కల్తీ వస్తువులతో అందరూ ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టపోతారు. వినియోగదారుల ఫోరం వినియోగదారుల కోసం పని చేయాలి. అందరికీ కల్తీ లేని వస్తువులు అందేలా చూడాల’’ని అన్నారు. -
మాంసాహారం సర్వ్ చేసినందుకు 47 వేలు ఫైన్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఎయిరిండియాకు రూ.47 వేలు జరిమానా విధించింది. శాఖాహారులైన ప్రయాణికులకు మాంసాహార భోజనం వడ్డించినందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. వివరాలు.. మొహాలి సెక్టార్ 121కి చెందిన చంద్రమోహన్ పఠాక్ భార్యతో కలిసి ఢిల్లీ నుంచి చికాగో వెళ్లేందుకు జూన్ 17, 2016లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అంతేకాక అదే ఏడాది నవంబర్ 14న తిరుగు ప్రయాణం నిమిత్తం రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. తాను, తన భార్య శాఖాహారులమని టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే స్పష్టం చేశాడు. చికాగో వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపాడు చంద్రమోహన్. కానీ ఢిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విమాన సిబ్బంది తమకు మాంసాహారం భోజనం సర్వ్ చేశారని ఆరోపించారు. అంతేకాక ఆహార పొట్లాల మీద మాంసాహారం, శాఖాహారం అని తెలిపే గుర్తులు కూడా లేవన్నారు. దాంతో ఆగ్రహించిన చంద్రమోహన్ ఈ విషయం గురించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను ఎయిరిండియా సంస్థ చంద్రమోహన్‌కు రూ. 10 వేలు జరిమానాతో పాటు లీగల్ ఖర్చుల నిమిత్తం మరో ఏడు వేల రూపాయలు అదనంగా చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఎయిరిండియా కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఎయిరిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్ జరిమానా మొత్తాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచి మొత్తం రూ. 47వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీని గురించి చంద్రమోహన్ పఠాక్ మాట్లాడుతూ.. ‘నేను ముందుగానే మేం శాఖాహారులమని స్పష్టంగా చెప్పాను. కానీ వారు నాకు మాంసాహార భోజనం అందించారు. వారు పాపం చేశారు. కోర్టు తగిన శిక్ష విధించింది’ అని తెలిపారు. -
వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు లేరు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు ఒక్కరు కూడా లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం 12 జిల్లాల్లోని వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న 24 మంది మహిళా సభ్యుల పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కరీంనగర్ వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. ఫోరాల్లో మహిళా సభ్యుల నియామకాల భర్తీ విషయంపై వివరణ ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. -
ఎక్కడికెళ్లినా మోసమే..
సాక్షి, విజయనగరం : వినియోగదారులు నిత్యం నిలువ దోపిడీకి గురవుతున్నారు. చిన్న కూరగాయల కొట్టు మొదలుకుని బంగారుషాపు వరకు ఎక్కడికెళ్లినా వినియోగదారుడిని మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. చివరకు రేషన్ డీలర్లు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో దుకాణాల్లో వేసిన తూకం.. ఇంటికెళ్లి చూస్తే తేడా కనిపిస్తోంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరత పేరుతో చోద్యం చూస్తోంది. కిరాణ, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ, హార్డ్‌వేర్, బంగారు షాపులు ఇలా వివిధ రకాల దుకాణాలు జిల్లాలో 24,301 ఉన్నాయి. చిరువ్యాపారులను కలుపుకుంటే 50 వేల మందికిపైగా ఉంటారు. అయితే జిల్లా వ్యాప్తంగా తూకానికి సంబంధించి ఏ ఏడాది కూడా 300కు మించి కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా తనిఖీలు నిర్వహించేటప్పుడు కిరాణాదుకాణాలు, షాపుల యజమానుల నుంచి రూ. 1200 నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేసి రూ. 200కే రశీదు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే మరింత ఇబ్బందులకు గురి చేస్తారని దుకాణదారులు వాపోతున్నారు. కాటాలకు సీళ్లు వేసేందుకు కూడా అక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా థియేటర్లలో ఎక్కడ కూడా కూల్ డ్రింక్స్,తిను బండారాలపై ఎంఆర్పీ వసూలు చేస్తున్న దాఖలాలు లేవు. అధిక ధరలకు విక్రయిస్తుండడంపై ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోకపోవడం విశేషం. నిర్ధిష్ట ప్రమాణాలుంటాయి... ఘన పదార్థాలైతే తూకాలు, ద్రవ పదార్థాలైతే కొలతల్లో కొలుస్తారు. వీటికి నిర్థిష్ట ప్రమాణాలుంటాయి. అయితే కొందరు వ్యాపారులు ధన దాహంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. వినియోగదారునికి తెలియకుండానే మోసం చేస్తున్నారు. తూనికలు– కొలతలు శాఖ నిబంధనల ప్రకారం.. వ్యాపారి ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తూకం రాళ్లు, ప్రతి ఏటా కాటాకు ప్రభుత్వ పరమైన ముద్రలు వేయించుకోవాలి. కాటాలో తేడాలు వస్తే సరి చేయించుకోవాలి. అలా చాలా మంది వ్యాపారులు చేయించుకోవడం లేదు. తూనికలు కొలతలు శాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వ్యాపారులు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కూరగాయల వ్యాపారమే ఎక్కువ.. జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. తూకం కాటాలతో మోసం చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ కాటాలతో తూకం వేస్తున్నా అందులో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగానే వంద గ్రాముల తగ్గించి జీరో వచ్చేలా అమర్చుతున్నారు. కొన్ని దుకాణాల్లో కాటాపై ఉన్న పళ్లెం బరువును లెక్కించకుండా తూకంలో కలిపేసి మోసాలకు పాల్పడుతున్నారు. కిలోకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. గ్యాస్‌లోనూ చేతివాటం వంటగ్యాస్ సిలిండర్ తూకంలోను వ్యత్యాసం ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. సిలిండర్లను తూకం వేయకుండానే అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలలకు రావాల్సిన సిలిండర్ కేవలం 40 రోజులకే అయిపోతుందని గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
క్యారీ బ్యాగ్‌కు రూ.5 వసూలు.. షాపింగ్ మాల్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: షాపింగ్‌మాల్స్ తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్‌లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం ఆదేశించింది. షాపర్స్ స్టాప్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను రూ.5కు విక్రయించడంపై హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఉచితంగా ఇవ్వాలని, లేదంటే అది విక్రయించడం ద్వారా వినియోగదారుని డబ్బుతో సంస్థ ప్రచారం చేసుకోవడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ లోగో ఉన్న బ్యాగులను ఉచితంగా ఇవ్వాలని గతంలో చండీగఢ్ వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. దీని ఆధారంగా అధికారులు షాపర్స్ స్టాప్‌కు నోటీసులు జారీ చేసి రూ.7 వేలు జరిమానా విధించారు. దుకాణదారులతో ఎటువంటి వివాదాలు తలెత్తినా, వినియోగదారులు అన్ని ప్రభుత్వ పనిదినాల్లోనూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వినియోగ వ్యవహారాల కమిషనర్ తెలిపారు. ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో నేరుగా లేదా 1800425 00333 టోల్‌ఫ్రీ నంబరుకు సంప్రదించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. -
బాటాకు రూ.9 వేల జరిమానా
చంఢీగడ్: వినియోగదారుడి వద్ద 3 రూపాయల పేపర్ బ్యాగ్‌కు చార్జి చేసినందుకు గానూ బాటా ఇండియా కంపెనీకి చండీగఢ్ కన్సూమర్ ఫోరమ్ రూ.9 వేల జరిమానా విధించింది. చంఢీగడ్‌కు చెందిన దినేశ్ ప్రసాద్ రాతూరి ఈ ఏడాది ఫిబ్రవరి 5న సెక్టర్ 22డీ ప్రాంతంలోని బాటా షోరూంలో ఒక జత బూట్లు కొన్నారు. దానికి గానూ పేపర్ బ్యాగ్‌తో కలిపి బాటా స్టోర్, వినియోగదారుడి వద్ద రూ.402 చార్జి చేశారు. ఉచితంగా ఇవ్వాల్సిన బ్యాగ్‌కు ఎందుకు చార్జి చేశారని ప్రసాద్ స్టోర్ వారిని ప్రశ్నించారు. బాటా స్టోర్ నిర్వాహకులు ఇచ్చిన సమాధానంతో దినేష్ ప్రసాద్ సంతృప్తి చెందలేదు. దీంతో దినేష్ ప్రసాద్ కన్స్యూమర్ ఫోరం ఆశ్రయించాడు. పేపర్ బ్యాగ్‌పై బాటా బ్రాండ్ ముద్రించి ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఫోరం ముందు తన ఆవేదనను వెళ్లగక్కాడు. తనకు రూ.3 రిఫండ్ చేయించాలని, అలాగే కలిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం దాదాపు రెండున్నర నెలల తర్వాత వినియోగదారుడికి అనుకూలంగా తీర్పిచ్చింది. వినియోగదారుడు చేసిన ఆరోపణలను కౌంటర్ ఇచ్చిన బాటా ఇండియా వ్యాఖ్యల్ని త్రోసిపుచ్చింది. వస్తువులను కొన్న వినియోగదారుడికి ఉచితంగా పేపర్ బ్యాగ్ అందించాల్సిన బాధ్యత బాటా స్టోర్‌దేనని ఫోరం తెలిపింది. అలాగే వస్తువులను కొనే వినియోగదారులకు ఉచితంగా బ్యాగ్‌లను అందించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లతో పర్యావరణానికి ఇబ్బంది కలిగితే బాటా ఇండియానే పర్యావరణానికి అనుకూలంగా ఉండే పేపర్ బ్యాగ్‌లను వినియోగదారులకు అందించాలని సూచించింది. పేపర్ బ్యాగ్ ధర రూ.3, లిటిగేషన్ చార్జి కింద రూ.1000, అలాగే వినియోగదారుడిని మానసికంగా వేదనకు గురిచేసినందుకు గానూ రూ.3 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్టేట్ కన్స్యూమర్ డిస్పూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ లీగల్ ఎయిడ్ అకౌంట్లో రూ.5 వేలు జమ చేయాలని ఆదేశించింది. చండీగఢ్ వినియోగదారుల ఫోరమ్ తీసుకున్న నిర్ణయం, పేపర్ బ్యాగ్‌లకు చార్జీలు వసూలు చేసే దుకాణదారులకు కనువిప్పులాంటిది. -
రాశి, రంభల ఆ యాడ్స్ వద్దు
సాక్షి, విజయవాడ : రాశి, రంభ లాంటి సినితారలతో ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. కలర్స్ సంస్థ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టీస్ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని సూచించించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ. 2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు. ప్రజాదరణ కలిగిన రాశి, రంభ లాంటి సెలబ్రిటీలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీలకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. షాపింగ్ మాల్‌కు రూ. 5లక్షల జరిమానా.. అక్రమంగా పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్న పీవీఆర్ మాల్‌కు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మొత్తాన్ని వినయోగదారుల సంక్షేమనిధికి జమచేయాలని, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఫిర్యాదుదారుడికి అందజేయాలని పేర్కొన్నారు. హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం మాల్స్, మల్టిప్లెక్స్ లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు.