
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా నియమితులైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఫోరం సభ్యులు రమేశ్‌తో కలిసి కేసులు విచారించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జస్టిస్ జైశ్వాల్‌కు ఫోరం ఉద్యోగులు అభినందనలు తెలియచేశారు.
మొన్నటి వరకు ఫోరం చైర్మన్‌గా ఉన్న జస్టిస్ బీఎన్ రావు నల్లా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ జైశ్వాల్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.