jaiswal
-
పెర్త్‌పై పట్టు
బౌలర్ల అసమాన ప్రదర్శనకు... ఓపెనర్ల సహకారం తోడవడంతో పెర్త్ టెస్టుపై టీమిండియాకు పట్టు చిక్కింది. తొలి రోజు పేస్‌కు స్వర్గధామంలా కనిపించిన పిచ్‌పై రెండో రోజు భారత ఓపెనర్లు చక్కని సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఆ్రస్టేలియా బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోగా... జైస్వాల్, రాహుల్ అర్ధశతకాలతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మన పేసర్ల ధాటికి ఆ్రస్టేలియా 104 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్... మూడోరోజు ఇదే జోరు కొనసాగిస్తే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో బోణీ కొట్టడం ఖాయం!పెర్త్: ‘ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి’ అన్న చందంగా... తొలి ఇన్నింగ్స్‌లో పేలవ షాట్ సెలెక్షన్‌తో విమర్శలు ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు... రెండో ఇన్నింగ్స్‌లో సాధికారికంగా ఆడటంతో ఆ్రస్టేలియాతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కంగారూ పేసర్ల కఠిన పరీక్షకు భారత ఓపెనర్లు సమర్థవంతంగా ఎదురు నిలవడంతో పెర్త్ టెస్టులో బుమ్రా సేన పైచేయి దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 67/7తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా... చివరకు 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 46 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మిషెల్ స్టార్క్ (112 బంతుల్లో 26; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (21) క్రితం రోజు స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగినా... స్టార్క్ మొండిగా పోరాడాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా... హర్షిత్ రాణా 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (193 బంతుల్లో 90 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి చేరువవగా... తొలి ఇన్నింగ్స్‌లో సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్ చేరిన రాహుల్ (153 బంతుల్లో 62 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయతి్నంచినా ఆసీస్ ఈ జోడీని విడగొట్టలేకపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా ఓవరాల్‌గా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి రోజు 17 వికెట్లు కూలగా... రెండో రోజు మూడు వికెట్లు మాత్రమే పడ్డాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారకపోయినా... భారత బ్యాటర్లు మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించనుంది. స్టార్క్ అడ్డుగోడలా.. తొలి రోజు మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టిన భారత బౌలర్ల సహనానికి రెండోరోజు స్టార్క్ పరీక్ష పెట్టాడు. స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తలపిస్తూ తన డిఫెన్స్‌తో కట్టిపడేశాడు.ఓవర్‌నైట్ బ్యాటర్ అలెక్స్ కేరీని కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన బుమ్రా... టెస్టుల్లో 11వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. నాథన్ లయన్ (5) కూడా త్వరగానే ఔట్ కాగా... చివరి వికెట్‌కు హాజల్‌వుడ్ (31 బంతుల్లో 7 నాటౌట్; ఒక ఫోర్)తో కలిసి స్టార్క్ చక్కటి పోరాటం కనబర్చాడు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ఎన్ని ప్రయోగాలు చేసినా సాధ్యపడలేదు. ఈ ఇద్దరు పదో వికెట్‌కు 110 బంతుల్లో 25 పరుగులు జోడించి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్ దాటించారు. చివరకు హర్షిత్ బౌలింగ్‌లో స్టార్క్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫలితంగా భారత జట్టుకు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనింగ్ అజేయం తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ... రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు సత్తాచాటారు. పిచ్ కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన మాట వాస్తవమే అయినా... భీకర పేస్‌తో విజృంభిస్తున్న కంగారూ బౌలర్లను కాచుకుంటూ జైస్వాల్, రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. క్లిష్టమైన బంతుల్ని డిఫెన్స్ ఆడిన ఈ జోడీ... చెత్త బంతులకు పరుగులు రాబట్టింది. జైస్వాల్ కచ్చితమైన షాట్ సెలెక్షన్‌తో బౌండరీలు బాదాడు. రాహుల్ డిఫెన్స్‌తో కంగారూలను కలవరపెట్టాడు. సమన్వయంతో ముందుకు సాగిన ఓపెనర్లిద్దరూ బుల్లెట్లలాంటి బంతుల్ని తట్టుకొని నిలబడి... గతితప్పిన బంతులపై విరుచుకుపడ్డారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3.01 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. ఈ క్రమంలో మొదట జైస్వాల్ 123 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కాసేపటికి రాహుల్ 124 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. టెస్టు క్రికెట్లో జైస్వాల్‌కు ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్‌సెంచరీ కాగా... ఆ తర్వాత గేర్ మార్చిన యశస్వి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. రెండు సెషన్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన ఆసీస్ బౌలర్లు... మూడో రోజు తొలి సెషన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేదానిపై భారత ఆధిక్యం ఆధారపడి ఉంది. మైదానంలో బాగా ఎండ కాస్తుండటంతో... నాలుగో ఇన్నింగ్స్‌లో పగుళ్లు తేలిన పిచ్‌పై లక్ష్యఛేదన అంత సులభం కాకపోవచ్చు. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు పెర్త్ టెస్టుకు అభిమానులు ఎగబడుతున్నారు. రెండో రోజు శనివారం ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 32,368 మంది అభిమానులు వచ్చారు. ఈ స్టేడియం చరిత్రలో టెస్టు మ్యాచ్‌కు ఇంతమంది ప్రేక్షకుల హాజరు కావడం ఇదే తొలిసారి. ‘భారత్, ఆ్రస్టేలియా తొలి టెస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రెండు రోజుల్లో 63,670 మంది మ్యాచ్‌ను వీక్షించారు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఇప్పటి వరకు ఒక టెస్టు మ్యాచ్ (2006–07 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మ్యచ్)కు అత్యధికంగా 1,03,440 మంది హాజరయ్యారు. ఇప్పుడు తాజా టెస్టులో మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... ఇంకో 39,771 మంది తరలివస్తే ఆ రికార్డు బద్దలవనుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 2; స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ రాణా 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; కేరీ (సి) పంత్ (బి) బుమ్రా 21; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (సి) పంత్ (బి) హర్షిత్ రాణా 26; లయన్ (సి) రాహుల్ (బి) హర్షిత్ రాణా 5; హాజల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (51.2 ఓవర్లలో ఆలౌట్) 104. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59, 8–70, 9–79, 10–104. బౌలింగ్: బుమ్రా 18–6–30–5, సిరాజ్ 13–7–20–2, హర్షిత్ రాణా 15.2–3–48–3, నితీశ్ రెడ్డి 3–0–4–0, సుందర్ 2–1–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 90; రాహుల్ (బ్యాటింగ్) 62; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 172. బౌలింగ్: స్టార్క్ 12–2–43–0, హాజల్‌వుడ్ 10–5–9–0, కమిన్స్ 13–2–44–0, మార్ష్ 6–0–27–0, లయన్ 13–3–28–0, లబుషేన్ 2–0–2–0, హెడ్ 1–0–8–0. -
కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యలో దౌత్యపరమైన విభేదాలు చెలరేగాయి. అయితే.. భారత్‌పై ఆరోపణలతో ఊదరగొట్టిన జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఇక.. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే తాము భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు అంగీకరించారు. దీంతో కెనడా ప్రధాని తీరును భారత్ తీవ్రంగా ఖండిచింది. ‘‘చాలా రోజులుగా మేం చెబుతున్న విషయమే నిర్ధారణ అయింది. భారతదేశం, భారతీయ దౌత్యవేత్తలపై కెనాడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎటువంటి సాక్ష్యాలను మాకు అందించలేదు. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నిరూపితమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం ప్రధాని ట్రూడోనే’’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్‌వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. విదేశీ జోక్యంపై పార్లమెంటరీ విచారణలో కెనడాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రధాని ట్రూడో విమర్శలను భారత ప్రతినిధులు ధీటుగా తిప్పికొట్టారని అన్నారు.Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024చదవండి: Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు -
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్: టాప్–10లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. టాప్–10లో భారత్ నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 751 రేటింగ్ పాయింట్లతో ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 740 రేటింగ్ పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లి రెండు స్థానాలు పురోగతి సాధించి 737 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 881 పాయింట్లతో తన ‘టాప్ ర్యాంక్’ను నిలబెట్టుకోగా... విలియమ్సన్ (న్యూజిలాండ్; 859 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, మిచెల్ (న్యూజిలాండ్; 768 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌ను అందుకున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఆరు స్థానాలు పడిపోయి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అశి్వన్ 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 847 పాయింట్లతో హాజల్‌వుడ్ (ఆ్రస్టేలియా), బుమ్రా (భారత్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. -
జైస్వాల్, గిల్ ఘనంగా...
ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా వెళ్లిన యువ జట్టు అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి జింబాబ్వేపై టి20 సిరీస్ విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ సారి సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. నాలుగో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దూకుడైన బ్యాటింగ్ ముందు జింబాబ్వే ఏమాత్రం పోటీనివ్వలేకపోవడంతో జట్టు అలవోకగా లక్ష్యం చేరింది.హరారే: టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన తొలి సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరింది. జింబాబ్వే గడ్డపై జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల పోరులో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...మరుమని (31 బంతుల్లో 32; 3 ఫోర్లు), మదివెరె (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా జట్టును గెలిపించారు. సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు ఇక్కడే జరుగుతుంది. రజా రాణించినా... జింబాబ్వేకు ఓపెనర్లు మరుమని, మదివెరె కొన్ని చక్కటి షాట్లతో మెరుగైన ఆరంభాన్ని అందించారు. సిరీస్‌లో తొలిసారి ఆ జట్టు పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత పేసర్లు ఆరంభంలో కట్టు తప్పడం జింబాబ్వేకు కలిసొచ్చింది.తొలి వికెట్‌కు 52 బంతుల్లో 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ తన తొలి అంతర్జాతీయ వికెట్‌గా మరుమనిని వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లో మదివెరె కూడా అవుట్ కాగా...10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 67/2కు చేరింది. ఈ దశలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టి పడేశారు. నాలుగు పరుగుల వ్యవధిలో బెన్నెట్ (9), క్యాంప్‌బెల్ (3) అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. అయితే రజా దూకుడుగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో జింబాబ్వే 54 పరుగులు సాధించింది. దూబే, రుతురాజ్ ఒక్కో క్యాచ్ వదిలేసినా...భారత్‌కు వాటి వల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఆడుతూ పాడుతూ... జింబాబ్వే ఇన్నింగ్స్ మొత్తంలో 10 ఫోర్లు ఉండగా...భారత ఓపెనర్లు తొలి 4 ఓవర్లలోనే 10 ఫోర్లు బాదారు. ఎన్‌గరవ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన జైస్వాల్...చటారా ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అక్రమ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన గిల్ 35 బంతుల్లో సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బెన్నెట్ ఓవర్లో గిల్ 2 సిక్స్‌లు బాదడంతో మరో ఎండ్‌లో జైస్వాల్‌కు సెంచరీ అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున రాణించి గుర్తింపు తెచ్చుకున్న పేసర్ తుషార్ దేశ్‌పాండే ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 115వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదివెరె (సి) రింకూ సింగ్ (బి) దూబే 25; మరుమని (సి) రింకూ సింగ్ (బి) అభిõÙక్ 32; బెన్నెట్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 9; రజా (సి) గిల్ (బి) దేశ్‌పాండే 46; క్యాంప్‌బెల్ (రనౌట్) 3; మయర్స్ (సి) అండ్ (బి) ఖలీల్ 12; మదాందె (సి) రింకూ సింగ్ (బి) ఖలీల్ 7; అక్రమ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–63, 2–67, 3–92, 4–96, 5–141, 6–147, 7–152. బౌలింగ్: ఖలీల్ 4–0–32–2, దేశ్‌పాండే 3–0–30–1, బిష్ణోయ్ 4–0–22–0, సుందర్ 4–0–32–1, అభిõÙక్ 3–0–20–1, దూబే 2–0–11–1. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 93; గిల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 156. బౌలింగ్: ఎన్‌గరవ 3–0–27–0, ముజరబాని 3.2–0–25–0, చటారా 2–0–23–0, అక్రమ్ 4–0–41–0, రజా 2–0–24–0, బెన్నెట్ 1–0–16–0. -
‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్
న్యూఢిల్లీ:అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం చేస్తూ కవ్వింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవరిస్తున్న తీరుపై భారత విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్ తిరస్కరించింది.‘భారతదేశంలో అంతర్భగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నాం. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాప్రదేశ్ చైనాది అయిపోదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమే’ అని రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.చైనా ఎన్ని నిరాధారమైన వాదనలు చేసినా అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో అంతర్భాగమని మర్చి 28న భారత్ తేల్చి చెప్పింది. చైనా పలుసార్లు కొత్త వాదనలకు తెరలేపినా.. ఈ విషయంలో భారత్ వైఖరిని మార్చలేదని తెలిపింది. అరుణచల్ ప్రదేశ్‌లో చైనా పేర్లు మార్చిన 30 ప్రాంతాల్లో.. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం , కొంత భూభాగం ఉన్నాయని సోమవారం పలు కథనాలు వెలువడ్డ విషయం తెసిందే. -
‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్
న్యూఢిల్లీ:అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదంటూ చైనా వితండవాదం చేస్తూ కవ్వింపులకు దిగుతున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా వ్యవరిస్తున్న తీరుపై భారత విదేశి వ్యవహారాల అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ కోసం చైనా కనిపెట్టిన పేర్లను భారత్ తిరస్కరించింది. ‘భారతదేశంలో అంతర్భగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే తెలివి తక్కువ ప్రయత్నాలకు పూనుకున్నారు. అటువంటి తెలివి తక్కువ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నాం. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాప్రదేశ్ చైనాది అయిపోదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమే’ అని రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. చైనా ఎన్ని నిరాధారమైన వాదనలు చేసినా అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో అంతర్భాగమని మర్చి 28న భారత్ తేల్చి చెప్పింది. చైనా పలుసార్లు కొత్త వాదనలకు తెరలేపినా.. ఈ విషయంలో భారత్ వైఖరిని మార్చలేదని తెలిపింది. అరుణచల్ ప్రదేశ్‌లో చైనా పేర్లు మార్చిన 30 ప్రాంతాల్లో.. 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం , కొంత భూభాగం ఉన్నాయని సోమవారం పలు కథనాలు వెలువడ్డ విషయం తెసిందే. -
కుల్దీప్ ఫటాఫట్...ఓపెనింగ్ ధనాధన్!
ధర్మశాలలో తొలి రోజే వాతావరణం భారత్‌కు అనుకూలంగా మారిపోయింది. గిర్రున తిరుగుతున్న బంతులను ఎదుర్కోలేక తలవంచిన ఇంగ్లండ్ అరవై ఓవర్ల లోపే పది వికెట్లనూ స్పిన్నర్లకే అప్పగించింది. టాస్ గెలిచిన సానుకూలత, శుభారంభం తర్వాత ఒక దశలో 175/3తో మెరుగైన స్థితిలో నిలిచిన పర్యాటక జట్టు పేలవ ప్రదర్శనతో 43 పరుగులకే మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. ఎడంచేతి మణికట్టుతో కుల్దీప్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, తన వందో టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో అశ్విన్ అండగా నిలిచాడు. మరోమారు యశస్వి జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్, రోహిత్ సహకారం వెరసి సిరీస్‌లో భారత్‌కు తొలిసారి ఓపెనింగ్‌లో సెంచరీ భాగస్వామ్యం... ఆట ముగిసేసరికి కేవలం 83 పరుగుల లోటుతో ముగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే శుక్రవారమే చివరి టెస్టు పూర్తిగా భారత్ చేతుల్లోకి రావడం ఖాయం. ధర్మశాల: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన ఐదో టెస్టులో భారత్‌కు అన్ని విధాలా సరైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. క్రాలీ (108 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... మిగతా వారంతా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసి మరో 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. యశస్వి జైస్వాల్ (58 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించగా... రోహిత్‌తో పాటు శుబ్‌మన్ గిల్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో విఫలమైన రజత్ పటిదార్ స్థానంలో భారత్ దేవ్‌దత్ పడిక్కల్‌ను తొలిసారి తుది జట్టులోకి ఎంపిక చేసింది. మరోవైపు 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కు కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా బీసీసీఐ ప్రత్యేక జ్ఞాపిక అందించింది. టపటపా... ఓపెనర్లు క్రాలీ, డకెట్ (27) ఇంగ్లండ్‌కు మరోసారి శుభారంభం అందించారు. అయితే కుల్దీప్ రాకతో పరిస్థితి మారిపోయింది. గిల్ అద్భుత క్యాచ్‌తో తన తొలి ఓవర్లోనే డకెట్‌ను వెనక్కి పంపిన కుల్దీప్... కొద్ది సేపటికే పోప్ (11)ను కూడా అవుట్ చేశాడు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 100/2 కాగా, క్రాలీ కొన్ని చక్కటి షాట్లతో క్రీజ్‌లో పట్టుదలగా నిలబడ్డాడు. అయితే రెండో సెషన్లో భారత స్పిన్నర్లు మరింతగా చెలరేగిపోగా... ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతి క్రాలీ వికెట్లను ఎగరగొట్టగా, 100వ టెస్టు ఆడుతున్న బెయిర్‌స్టో (29) వికెట్ కూడా కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. శుభారంభం... భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 20 పరుగుల వద్ద రోహిత్‌ను అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో అతను నాటౌట్‌గా తేలడం కలిసొచ్చింది. తొలి 27 బంతుల్లో 6 పరుగులే చేసి ఓపిక ప్రదర్శించిన యశస్వి స్పిన్నర్ల రాకతో చెలరేగిపోయాడు. బషీర్ వేసిన తొలి ఓవర్లో అతను 3 సిక్సర్లు బాదాడు. అయితే బషీర్ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో అర్ధ సెంచరీని దాటిన యశస్వి అదే ఊపులో మూడో బంతికి ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. అనంతరం 77 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, మరోవైపు గిల్ కూడా దూకుడుగా ఆడాడు. పడిక్కల్@ 314 ఈ మ్యాచ్‌తో కర్ణాటకకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇప్పటికే 2 టి20లు ఆడిన పడిక్కల్... టెస్టులు ఆడిన 314వ భారత ఆటగాడిగా నిలిచాడు. 17 ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు ఆడిన 17వ ప్లేయర్‌గా బెయిర్‌స్టో గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అండర్సన్ (187), స్టువర్ట్ బ్రాడ్ (168), కుక్ (161), జో రూట్ (140), స్టివార్ట్ (133), బెల్ (118), గూచ్ (118), గోవర్ (117), అథర్టన్ (115), కొలిన్ కౌడ్రే (114), బాయ్‌కాట్ (108), పీటర్సన్ (104), బోథమ్ (102), స్టోక్స్ (102), స్ట్రాస్ (100), థోర్ప్ (100) ఉన్నారు. 14 భారత్ తరఫున 100 టెస్టులు పూర్తి చేసుకున్న 14వ ప్లేయర్‌గా అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ (200), ద్రవిడ్ (163), లక్ష్మణ్ (134), కుంబ్లే (132), కపిల్‌దేవ్ (131), గావస్కర్ (125), వెంగ్‌సర్కార్ (116), గంగూలీ (113), కోహ్లి (113), ఇషాంత్ శర్మ (105), సెహ్వాగ్ (103), హర్భజన్ (103), పుజారా (103) ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (బి) కుల్దీప్ 79; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 27; పోప్ (స్టంప్డ్) జురేల్ (బి) కుల్దీప్ 11; రూట్ (ఎల్బీ) (బి) జడేజా 26; బెయిర్‌స్టో (సి) జురేల్ (బి) కుల్దీప్ 29; స్టోక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; ఫోక్స్ (బి) అశ్విన్ 24; హార్ట్లీ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 6; వుడ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 0; బషీర్ (నాటౌట్) 11; అండర్సన్ (సి) పడిక్కల్ (బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (57.4 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–64, 2–100, 3–137, 4–175, 5–175, 6–175, 7–183, 8–183, 9–218, 10–218. బౌలింగ్: బుమ్రా 13–2–51–0, సిరాజ్ 8–1–24–0, అశ్విన్ 11.4–1–51–4, కుల్దీప్ 15–1–72–5, జడేజా 10–2–17–1. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (స్టంప్డ్) ఫోక్స్ (బి) బషీర్ 57; రోహిత్ (బ్యాటింగ్) 52; గిల్ (బ్యాటింగ్) 26; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (30 ఓవర్లలో వికెట్ నష్టానికి) 135. వికెట్ల పతనం: 1–104. బౌలింగ్: అండర్సన్ 4–1–4–0, మార్క్ వుడ్ 3–0–21–0, హార్ట్లీ 12–0– 46–0, షోయబ్ బషీర్ 11–2–64–1. -
యశస్వికి ‘డబుల్’...శ్రేయస్, కిషన్ అవుట్
ప్రతిభకు, మైదానంలో ప్రదర్శనకు బీసీసీఐ పట్టం కట్టింది...టెస్టుల్లో వరుస డబుల్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌ను ‘డబుల్ ప్రమోషన్’తో గుర్తించిన బోర్డు నిలకడైన ఆటతో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను ఒక మెట్టు పైకి ఎక్కించింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్థాయిని నిలబెట్టుకోగా...క్రమశిక్షణ తప్పితే శిక్ష తప్పదంటూ శ్రేయస్, కిషన్‌లను పక్కన పెట్టింది. 30 మందితో కూడిన బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ జాబితాలో విశేషాలివి. న్యూఢిల్లీ: 2023–24కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా బీసీసీఐ కాంట్రాక్ట్‌ల జాబితాలో తమ ‘ఎ ప్లస్’ గ్రేడ్లను నిలబెట్టుకున్నారు. ఈ కేటగిరీలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పూ జరగలేదు. గ్రేడ్ ‘ఎ’లో ఇప్పటికే ఉన్న అశ్విన్, షమీ, హార్దిక్ పాండ్యాలతో పాటు కొత్తగా సిరాజ్, రాహుల్, గిల్ చేరారు. గత ఏడాది కాలంగా వన్డే వరల్డ్ కప్ సహా పలు సిరీస్‌లలో కీలక ప్రదర్శనలతో టీమ్ మేనేజ్మెంట్ అంచనాలను అందుకోవడమే ఈ ముగ్గురి ప్రమోషన్‌కు కారణం. టి20ల్లో అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతూ వన్డే జట్టులోనూ ఉన్న సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ ‘బి’లో తన స్థానం నిలబెట్టుకోగా ఇందులో యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కడం పెద్ద విశేషం. సాధారణంగా తొలి సారి కాంట్రాక్ట్ ఇస్తూ ఆటగాళ్లను ‘సి’లో చేర్చి ఆపై ప్రదర్శనతో ప్రమోషన్లు ఇచ్చే బోర్డు యశస్వి అసాధారణ ఆటకు నేరుగా ‘బి’లో అవకాశం కల్పించింది. ‘సి’ జాబితాలో ఉన్నవారిలో కొందరు అప్పుడప్పుడు వన్డేల్లో మెరిసినా...దాదాపు అందరూ టి20 స్పెషలిస్ట్‌లే కావడం విశేషం. క్రమశిక్షణారాహిత్యంతో... ‘వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి పరిణామాలే అందుకు కారణం. వీరిద్దరు భారత్‌కు ఆడని సమయంలో రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగాలని బీసీసీఐ సూచించినా...దానిని పట్టించుకోలేదు. మానసిక ఆందోళన కారణంగా చూపి దక్షిణాఫ్రికా టూర్ మధ్యలోనే స్వదేశం వచ్చేసిన కిషన్ ఆ తర్వాత దుబాయ్‌లో పార్టీలో పాల్గొంటూ కనిపించాడు. తమ జట్టు జార్ఖండ్ ఒక వైపు రంజీ ఆడుతుంటే అతను నేరుగా ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ శిక్షణా శిబిరానికి హాజరయ్యాడు. మరో వైపు ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో చోటు కోల్పోయిన తర్వాత శ్రేయస్ వెన్ను గాయంతో ముంబై తరఫున రంజీ క్వార్టర్ ఫైనల్ ఆడలేనని చెప్పాడు. అతని గాయంలో నిజం లేదని ఎన్సీఏ డాక్టర్లు ధ్రువీకరించినట్లుగా బోర్డు అంతర్గత సమాచారం. ఈ విషయంలో కోచ్ ద్రవిడ్ నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్‌లో 530 పరుగులతో కీలక పాత్ర పోషించిన అయ్యర్ పట్ల తీవ్రంగా వ్యవహరించి...గాయం తర్వాత అక్టోబర్నుంచి ఇప్పటి వరకు అధికారిక టోర్నీ ఆడని హార్దిక్‌కు మాత్రం ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగించడం ఆసక్తికరం. జాతీయ జట్టుకు ఆడని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ బీసీసీఐ ఇప్పుడు స్పష్టంగా పేర్కొనడం విశేషం. కొత్తగా పేసర్లకు... కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషభ్ పంత్ గత ఏడాది కాలంలో ఎలాంటి క్రికెట్ ఆడకపోయినా...పూర్తిగా పక్కన పెట్టకుండా ఒక గ్రేడ్ తగ్గించి అతడిని కొనసాగించగా...పేలవ ప్రదర్శనతో అక్షర్ స్థాయి కూడా తగ్గింది. భారత్‌లో ఫాస్ట్ బౌలర్లను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించే క్రమంలో ఐదుగురు బౌలర్లకు కొత్తగా ‘ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్’లు ఇవ్వడం విశేషం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కాలాన్ని కాంట్రాక్ట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు, లేదా 10 టి20లు ఆడాలి. ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ తర్వాతి మ్యాచ్ ఆడితే వారు నేరుగా ‘సి’ గ్రేడ్‌లోకి వచ్చేస్తారు. జట్టులో స్థానం కోల్పోయిన పుజారా, ఉమేశ్, శిఖర్, చహల్, హుడా సహజంగానే జాబితానుంచి దూరమయ్యారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితా (2023–24) గ్రేడ్ ‘ఎ’ ప్లస్ (రూ.7 కోట్లు): రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘ఎ’ (రూ. 5 కోట్లు): అశ్విన్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా గ్రేడ్ ‘బి’ (రూ. 3 కోట్లు): సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ గ్రేడ్ ‘సి’(రూ.1 కోటి): రింకూసింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివమ్ దూ బే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, సుందర్, ముకేశ్ కుమార్, సంజు సామ్సన్, అర్ష్ దీప్, కేఎస్ భరత్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పటిదార్ (వీరందరికీ మొదటిసారి కాంట్రాక్ట్ దక్కింది). కాంట్రాక్ట్‌లు కోల్పోయినవారు: అయ్యర్, ఇషాన్ కిషన్, పుజారా, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్. సిరాజ్, రాహుల్, గిల్ (‘బి’ నుంచి ‘ఎ’కి) కుల్దీప్ ‘సి’ నుంచి ‘బి’కి పంత్, అక్షర్ (‘ఎ’ నుంచి ‘బి’ కి) యశస్వికి నేరుగా ‘బి’ గ్రేడ్ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లు: ఆకాశ్ దీప్ (బెంగాల్), ఉమ్రాన్ మలిక్ (జమ్మూ కశ్మీర్), యశ్ దయాళ్ (యూపీ), విద్వత్ కావేరప్ప, విజయ్‌కుమార్ వైశాక్ (కర్నాటక). -
భారత్ తడబాటు
భారత స్పిన్నర్ జడేజా మిగిలిన మూడు వికెట్లను పడగొట్టిన మన స్పిన్ పిచ్‌పై ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఆ తర్వాత అంతకు మించి పట్టు సాధించాడు. ఇది భారత తొలి ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టింది. అలాగే ‘అంపైర్ కాల్’ భారత వికెట్లను ప్రభావితం చేసింది. క్రీజులో ప్రధాన బ్యాటర్ అంటూ లేకుండా చేయడంతో పరుగుల పరంగా టీమిండియా వెనుకబడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించడం ఖాయమైంది. రాంచీ: మ్యాచ్‌కు ముందు రోజు వికెట్‌ను పరిశీలించిన ఇరుజట్ల వర్గాలు ‘పిచ్‌పై అంచనా కష్టం. ఏ రోజు టర్న్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం’ అని అభిప్రాయపడ్డాయి. అనూహ్యంగా రెండో రోజే పిచ్ పూర్తిగా స్పిన్‌కు స్వర్గధామమైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిపోయిన మూడు వికెట్లను జడేజా పడేశాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ తమ యువ ఆఫ్‌స్పిన్నర్ బషీర్‌తో వరుసగా ఓవర్లు వేయించాడు. అతను 31 ఓవర్లు నిర్విరామంగా బౌలింగ్ చేసి విలువైన వికెట్లను పడేయడంతో ఆతిథ్య భారత్ కష్టాల పాలైంది. శనివారం ఆట నిలిచే సమయానికి టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (117 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. బషీర్ 4 వికెట్లు పడగొడితే మరో స్పిన్నర్ హార్ట్లీ కూడా 2 వికెట్లు తీసి భారత్ కష్టాల్ని పెంచాడు. మరో 51 పరుగులు... రెండో రోజు 302/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ 104.5 ఓవర్లలో 353 పరుగుల వద్ద ఆలౌటైంది. మరో 14.5 ఓవర్లు ఆడి తొలి రోజు స్కోరుకు 51 పరుగులు జోడించింది. జో రూట్ (274 బంతుల్లో 122 నాటౌట్; 10 ఫోర్లు) అజేయగా నిలువగా... చకాచకా బౌండరీలు బాదిన ఒలీ రాబిన్సన్ (96 బంతుల్లో 58; 9 ఫోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో తొలి సారి అర్ధ శతకాన్ని సాధించాడు. వీరిద్దరు 8వ వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎట్టకేలకు రాబిన్సన్ను అవుట్ చేయడం ద్వారా జడేజా ఈ జోడీని విడగొట్టాడు. 347 పరుగుల వద్ద ఈ వికెట్ పడగా, మరో ఆరు పరుగుల వ్యవధిలో బషీర్ (0), అండర్సన్ (0) వికెట్లను కూడా జడేజానే తీయడంతో లంచ్‌కు ముందే ఇంగ్లండ్ ఆట ముగిసింది. రాణించిన యశస్వి ఈ సిరీస్‌లో అసాధారణ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. లేదంటే పరిస్థితి మరింత భిన్నంగా ఉండేది! కెప్టెన్ రోహిత్ (2) మూడో ఓవర్లోనే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన శుబ్‌మన్ గిల్‌తో జైస్వాల్ జోడి కుదరడంతో తొలి సెషన్లో మరో వికెట్ పడలేదు. ఇక రెండో సెషన్‌ను సాఫీగా నడిపిస్తున్న తరుణంలో బషీర్ స్పిన్ భారత్‌ను పదేపదే కష్టాల్లోకి నెట్టేసింది. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద గిల్‌ను బషీర్ ఎల్బీగా అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రజత్ పటిదార్ (17) క్రీజులోకి రాగా... జైస్వాల్ 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ మరోవైపు పటిదార్ బషీర్‌కే వికెట్ అప్పగించాడు. టీ విరామానికి ముందు అనుభవజు్ఞడైన ఆల్‌రౌండర్ జడేజా (12; 2 సిక్సర్లు)ను అవుట్ చేయడం ద్వారా బషీర్ భారత్‌ను చావుదెబ్బ తీశాడు. 131/4 స్కోరు వద్ద రెండో సెషన్ ముగిసింది. ధ్రువ్ నిలకడ ఆఖరి సెషన్లో కూడా స్పిన్ హవానే కొనసాగింది. దీంతో భారత్ 47 పరుగుల వ్యవధిలో మరో మూడు వికెట్లను కోల్పోయింది. ముందుగా జట్టు స్కోరు 150 పరుగులు దాటిన కాసేపటికి యశస్విని బషీర్ బౌల్డ్ చేశాడు. ఇది జట్టును కోలుకోనివ్వలేదు. దాంతో స్వల్ప వ్యవధిలో సర్ఫరాజ్ (14), అశ్విన్ (1)లను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు. 177 స్కోరు వద్ద 7 వికెట్లను కోల్పోయిన దశలో ధ్రువ్ జురెల్ (58 బంతుల్లో 30 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), కుల్దీప్ (72 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) చూపించిన తెగువ భారత్‌ను ఆలౌట్ కాకుండా ఆపగలిగింది. ఇద్దరు 17.4 ఓవర్ల పాటు ప్రత్యర్థి స్పిన్, పేస్‌కు ఎదురునిలిచి అబేధ్యమైన 8వ వికెట్‌కు 42 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: 353 భారత్ తొలిఇన్నింగ్స్: యశస్వి (బి) బషీర్ 73; రోహిత్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 2; శుబ్‌మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 38; పటిదార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బషీర్ 17; జడేజా (సి) పోప్ (బి) బషీర్ 12; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) హార్ట్లీ 14; జురెల్ బ్యాటింగ్ 30; అశ్విన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్ట్లీ 1; కుల్దీప్ బ్యాటింగ్ 17; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (73 ఓవర్లలో 7 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–112, 4–130, 5–161, 6–171, 7–177. బౌలింగ్: అండర్సన్ 12–4–36–1, రాబిన్సన్ 9–0–39–0, బషీర్ 32–4–84–4, హార్ట్లీ 19–5–47–2, రూట్ 1–0–1–0. -
అతడొక సంచలనం.. ఎంత చెప్పుకున్నా తక్కువే
-
434 పరుగుల తేడాతో...
విరామం తర్వాత మళ్లీ తాజాగా మొదలైన మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ విధ్వంసం... కొత్త కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రతాపం... బౌలింగ్‌లో జడేజా మాయాజాలం... వెరసి భారత్ చరిత్రకెక్కే విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన రోజు నుంచీ ప్రతీరోజు భారత్ ఆధిపత్యమే కొనసాగడంతో ఏ మలుపు లేకుండా ఈ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. రాజ్‌కోట్: టీమిండియా బలగం ముందు ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆట కుదేలైంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటర్ల పరుగుల పరాక్రమం, బౌలర్ల వికెట్ల మాయాజాలం ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై బ్రహ్మాండ విజయం నమోదు చేసింది. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో భారత జట్టుకిదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు భారత జట్టు 2021లో ముంబైలో న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో గెలిచింది. ఆట నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (5/41), కుల్దీప్ యాదవ్ (2/19), అశ్విన్ (1/19) స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. యశస్వి ‘డబుల్’... ఓవర్‌నైట్ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్ (91; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుల్దీప్ (27; 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. గిల్ రనౌటయ్యాక శనివారం వెన్నునొప్పితో వ్యక్తిగత స్కోరు 104 పరుగులవద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అదే దూకుడు కొనసాగిస్తూ యశస్వి జైస్వాల్ (236 బంతుల్లో 214 నాటౌట్; 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (72 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్లోనే విశేషానుభవజు్ఞడు అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 85వ ఓవర్లో యశస్వి హ్యాట్రిక్ సిక్సర్లు అతని విధ్వంసానికి మచ్చుతునకలు కాగా... సర్ఫరాజ్ అంతర్జాతీయ టెస్టుకు కొత్తైన... దూకుడు నాకు పాతే అని మరో అర్ధసెంచరీతో నిరూపించుకున్నాడు. 231 బంతుల్లో జైస్వాల్ ద్విశతకాన్ని సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 172 జోడించడం విశేషం. స్పిన్ ఉచ్చులో పడి... కొండత లక్ష్యం కావడంతో ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆట చేతులెత్తేసింది. కలిసొచ్చిన స్పిన్ పిచ్‌పై జడేజా పట్టు సాధించాడు. ఆరంభంలోనే డకెట్ (4) రనౌటయ్యాక, క్రాలీ (11)ని బుమ్రా ఎల్బీగా పంపాడు. తర్వాత జడేజా స్పిన్ మాయాజాలంలో పోప్ (3), బెయిర్‌స్టో (4), రూట్ (7) తేలిగ్గానే పడిపోయారు. జట్టు స్కోరు 50 వద్దే రూట్‌తో పాటు స్టోక్స్ (15), రేహాన్ అహ్మద్ (0) అవుటయ్యారు. మార్క్ వుడ్ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ కావడంతో ఇంగ్లండ్ 100 పరుగులు దాటింది. అత్యవసర వ్యక్తిగత కారణాలరీత్యా రెండో రోజు ఆట ముగిశాక చెన్నై వెళ్లిన అశ్విన్ ఆదివారం మైదానంలోకి దిగి ఒక వికెట్ కూడా తీశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319; భారత్ రెండో ఇన్నింగ్స్: 430/4 డిక్లేర్డ్. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 11. డకెట్ (రనౌట్) 4; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 3; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 4; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 15; ఫోక్స్ (సి) జురేల్ (బి) జడేజా 16; రేహన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 0; హార్ట్లీ (బి) అశ్విన్ 16; వుడ్ (సి) జైస్వాల్ (బి) జడేజా 33; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 122. వికెట్ల పతనం: 1–15, 2–18, 3–20, 4–28, 5–50, 6–50, 7–50, 8–82, 9–91, 10–122. బౌలింగ్: బుమ్రా 8–1– 18–1, సిరాజ్ 5–2–16–0, జడేజా 12.4–4– 41–5, కుల్దీప్ 8–2–19–2, అశ్విన్ 6–3–19–1. 3 వరుస టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఈ వరుసలో వినోద్ కాంబ్లి (1993లో), కోహ్లి (2017లో) ముందున్నారు. 9 స్వదేశంలో జడేజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుల సంఖ్య. అనిల్ కుంబ్లే (9) పేరిట ఉన్న రికార్డును జడేజా సమం చేశాడు. 12 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా అక్రమ్ (12 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ సమం చేశాడు. 28 రాజ్‌కోట్ టెస్టులో భారత్ సిక్స్‌ల సంఖ్య. ఒకే టెస్టులో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా 2019లో వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై నమోదు చేసిన రికార్డును భారత్ సవరించింది. 48 ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత జట్టు బాదిన సిక్స్‌లు. ఇదో కొత్త రికార్డు. దక్షిణాఫ్రికాపై 2019లో భారత్ 47 సిక్స్‌లు కొట్టింది. -
‘జై’స్వాల్ కమాల్
రాజ్‌కోట్ టెస్టులో రెండో రోజు వెనుకబడినట్లు కనిపించిన భారత్ ఒక్కసారిగా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది... బజ్‌బాల్ మాయలో చేజేతులా వికెట్లు కోల్పోయి స్వీయాపరాధంతో ఇంగ్లండ్ తమ పతనానికి అవకాశం కల్పించగా... టీమిండియా చక్కటి బౌలింగ్‌తో పాటు దానిని అందిపుచ్చుకుంది. అశ్విన్ లేని లోటు కనిపించకుండా మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొట్టారు. ఆపై యువ యశస్వి మరో దూకుడైన ఇన్నింగ్స్‌తో వరుసగా రెండో సెంచరీ సాధించగా, గిల్ అండగా నిలిచాడు. ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించిన భారత్ మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. దీంతో ఆదివారం మరిన్ని పరుగులతో అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచడం ఖాయం. రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టును గెలిచి సిరీస్‌లో ఆధిక్యంపై భారత్ కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (133 బంతుల్లో 104 రిటైర్డ్‌హర్ట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (120 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానం వీడిన యశస్వి మళ్లీ ఆదివారం బ్యాటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 207/2తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (41) ఫర్వాలేదనిపించగా... మొహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ ఓవరాల్‌గా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇటీవల కన్నుమూసిన మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్‌కు నివాళిగా భారత క్రికెటర్లు భుజాలకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. టపటపా... పటిష్ట స్థితిలో మూడో రోజు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లండ్ శనివారం స్వయంకృతంతో మంచి అవకాశం చేజార్చుకుంది. ప్రధాన బ్యాటర్ జో రూట్ (18) చేసిన తప్పుతో జట్టు పతనం మొదలైంది. మూడో రోజు ఐదో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో అత్యుత్సాహంతో ‘రివర్స్ స్కూప్’ ఆడిన రూట్ స్లిప్‌లో యశస్వి సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే చక్కటి బంతితో బెయిర్‌స్టో (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత 150 పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాత బెన్ డకెట్ (151 బంతుల్లో 153; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో స్టోక్స్, బెన్ ఫోక్స్ (13) కలిసి క్రీజ్‌లో పట్టుదలగా నిలిచే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు మళ్లీ చెలరేగారు. వరుస బంతుల్లో స్టోక్స్, ఫోక్స్‌లను పెవిలియన్ పంపించారు. రేహన్ (6), హార్ట్లీ (9) కూడా ఒకే స్కోరు వద్ద అవుట్ కాగా...యార్కర్‌తో అండర్సన్ (1) పని పట్టి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను సిరాజ్ ముగించాడు. 20 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ చివరి 5 వికెట్లు పడ్డాయి. భారీ భాగస్వామ్యం... అండర్సన్ తొలి ఓవర్లో రోహిత్ శర్మ (19) కొట్టిన రెండు ఫోర్లతో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. అయితే కొద్ది సేపటికే రోహిత్‌ను ఎల్బీగా అవుట్ చేసి రూట్ ఇంగ్లండ్‌లో కాస్త ఆనందం నింపాడు. కానీ అది ఆ కొద్ది సేపటికే పరిమితమైంది. గత టెస్టు సెంచరీ హీరోలు యశస్వి, గిల్ మరో భారీ భాగస్వామ్యంతో జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆరంభంలో వీరిద్దరు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా...ఆ తర్వాత దూకుడు పెంచారు. ముఖ్యంగా ఒక దశలో 73 బంతుల్లో 35 పరుగులతో ఉన్న యశస్వి ఆ తర్వాత మెరుపు షాట్లతో దూసుకుపోయాడు. అండర్సన్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 4 బాదడంతో ఇది షురూ అయింది. హార్ట్లీ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టిన అతను తొలి సిక్స్‌తో 80 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత సెంచరీని చేరేందుకు యశస్వికి మరో 42 బంతులే సరిపోయాయి. ఈ క్రమంలో అతను ఏ బౌలర్‌నూ వదలకుండా మరో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. అప్పటి వరకు ప్రేక్షకుడిగా ఉన్న గిల్ కూడా చెలరేగి వుడ్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పటిదార్ (బి) అశ్విన్ 15; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 153; పోప్ (ఎల్బీ) (బి) సిరాజ్ 39; రూట్ (సి) యశస్వి (బి) బుమ్రా 18; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; స్టోక్స్ (సి) బుమ్రా (బి) జడేజా 41; ఫోక్స్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రేహన్ (బి) సిరాజ్ 6; హార్ట్లీ (స్టంప్డ్) జురేల్ (బి) జడేజా 9; వుడ్ (నాటౌట్) 4; అండర్సన్ (బి) సిరాజ్ 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (71.1 ఓవర్లలో ఆలౌట్) 319. వికెట్ల పతనం: 1–89, 2–182, 3–224, 4–225, 5–260, 6–299, 7–299, 8–314, 9–314, 10–319. బౌలింగ్: బుమ్రా 15–1–54–1, సిరాజ్ 21.1–2–84–4, కుల్దీప్ 18–2–77–2, అశ్విన్ 7–0–37–1, జడేజా 10–0– 51–2. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (రిటైర్డ్‌హర్ట్) 104; రోహిత్ (ఎల్బీ) (బి) రూట్ 19; గిల్ (నాటౌట్) 65; పటిదార్ (సి) రేహన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (51 ఓవర్లలో 2 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–30, 2–191. బౌలింగ్: అండర్సన్ 6–1–32–0, రూట్ 14–2–48–1, హార్ట్లీ 15–2–42–1, వుడ్ 8–0–38–0, రేహన్ 8–0–31–0. -
ఒకే ఒక్కడు.. భారీ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్
తొలి రోజు 336 పరుగులు చేసిన తర్వాత కూడా జట్టు కాస్త అసంతృప్తికి గురి కావడం సాధారణంగా కనిపించదు... కానీ శుక్రవారం భారత్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. చక్కగా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై తమకు లభించిన ఆరంభాలను బ్యాటర్లు భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అయితే ఇలాంటి సమయంలో ఒకే ఒక్కడు యశస్వి జైస్వాల్ అద్భుత బ్యాటింగ్‌తో శిఖరాన నిలిచాడు. మైదానం నలుమూలలా చూడముచ్చటైన స్ట్రోక్‌లు కొట్టడంతో పాటు పదునైన డిఫెన్స్‌ను ప్రదర్శిస్తూ భారీ శతకం బాదాడు. మరో వైపు ఆరు వికెట్లు తీసిన ఇంగ్లండ్ ఆనందంగా ఆటను ముగించింది. మిగిలింది బౌలర్లే కాబట్టే యశస్వి, అశ్విన్ జోడి రెండో రోజు భారత్ స్కోరును 400 వరకు తీసుకెళుతుందా లేక ఇంగ్లండ్ ఆలోపు నిలువరిస్తుందా చూడాలి. విశాఖ స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజును భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ముగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (257 బంతుల్లో 179 నాటౌట్; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ఆటతో ఒంటరి పోరాటం చేస్తూ ద్విశతకానికి చేరువయ్యాడు. యశస్వి మినహా మిగతా బ్యాటర్లంతా ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం యశస్వితో పాటు అశ్విన్ (5 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు... భారత్ ఇన్నింగ్స్‌లో వరుసగా 40, 49, 90, 70, 52, 29 పరుగుల భాగస్వామ్యాలు ఉన్నాయి. చూస్తే మెరుగ్గానే అనిపిస్తున్నా... ఇందులో ఒక్కటీ భారీ భాగస్వామ్యంగా మారలేకపోయింది. ఒకే ఒక్కడు యశస్వి ఒంటి చేత్తో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా మిగతా బ్యాటర్ల స్కోర్లన్నీ 14నుంచి 34 పరుగుల మధ్య ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (14) తన సహజశైలికి భిన్నంగా జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అయితే 41 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయిన అతను లెగ్‌స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అరంగేట్ర బౌలర్ బషీర్ ఖాతాలో ఈ వికెట్ చేరింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఒక దశలో ఆరు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. అయితే అండర్సన్ చక్కటి బంతికి అతను అవుటయ్యాడు. లంచ్ తర్వాత కుదురుకునేందుకు ప్రయత్నించిన శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 27; 3 ఫోర్లు) కూడా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఆడలేక కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం యశస్వికి రజత్ పటిదార్ (72 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఆపై అక్షర్ పటేల్ (51 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచారు. టీ విరామ సమయానికి భారత్ స్కోరు 225/3. అయితే చివరి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు మూడు వికెట్లు తీయడంలో సఫలమయ్యారు. రేహన్ బౌలింగ్‌లో తన బ్యాట్‌ను తాకి వికెట్ల వైపు వెళుతున్న బంతిని ఆపడంలో విఫలమైన పటిదార్ పెవిలియన్ చేరాడు. అయితే ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు భారత్ అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ చెత్త షాట్‌తో వెనుదిరగ్గా...సొంత మైదానంలో సత్తా చాటేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని కేఎస్ భరత్ (23 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) వృథా చేసుకున్నాడు. ఈ టెస్టు కోసం భారత తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో దూరమైన రాహుల్, జడేజా స్థానాల్లో పటిదార్, కుల్దీప్ యాదవ్ రాగా...సిరాజ్‌కు బదులు ముకేశ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఎక్కువ క్రికెట్ ఆడిన సిరాజ్‌కు విరామం ఇస్తూ జట్టునుంచి విడుదల చేశామని...అతను తర్వాతి టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. జైస్వాల్ అలవోకగా... రూట్ తొలి ఓవర్లో 2 ఫోర్లతో బౌండరీల ఖాతా తెరిచిన యశస్వి చివరి వరకు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ అదే జోరును కొనసాగించాడు. బషీర్ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన యశస్వి 89 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతడిని ఇబ్బంది పెట్టడంతో ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. హార్ట్లీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి ఆధిక్యం ప్రదర్శించిన భారత ఓపెనర్ కొద్ది సేపటికే కెరీర్లో రెండో శతకం (151 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. హార్ట్లీ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్‌తో సెంచరీని అందుకోవడం విశేషం. యశస్వి చక్కటి షాట్లకు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. ఈ క్రమంలో రేహన్ ఓవర్లో భారీ సిక్స్‌తో అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఇండోర్‌కు చెందిన రజత్ పటిదార్ ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 310వ ఆటగాడిగా రజత్ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున టెస్టులు ఆడిన 713వ క్రికెటర్‌గా నిలిచాడు. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 179; రోహిత్ (సి) పోప్ (బి) బషీర్ 14; గిల్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 34; శ్రేయస్ (సి) ఫోక్స్ (బి) హార్ట్లీ 27; రజత్ (బి) రేహన్ 32; అక్షర్ (సి) రేహన్ (బి) బషీర్ 27; భరత్ (సి) బషీర్ (బి) రేహన్ 17; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (93 ఓవర్లలో 6 వికెట్లకు) 336. వికెట్ల పతనం: 1–40, 2–89, 3–179, 4–249, 5–301, 6–330. బౌలింగ్: అండర్సన్ 17–3–30–1, రూట్ 14–0–71–0, హార్ట్లీ 18–2–74–1, బషీర్ 28–0–100–2, రేహన్ 16–2–61–2. -
చెలరేగిన ఓపెనర్లు.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
లాడర్‌హిల్ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్ నాలుగో టి20కి ముందు ఈ రీజినల్ పార్క్ మైదానంలో జరిగిన 13 టి20ల్లో 11 మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసి జట్టే గెలిచింది. అత్యధిక లక్ష్య ఛేదన 95 పరుగులు మాత్రమే. అయితే శనివారం పోరులో భారత జోరు ముందు ఇవేవీ లెక్కలోకి రాలేదు. ముందుగా విండీస్ భారీ స్కోరు చేసినా, భారత్ ఓపెనర్ల జోరుతోనే అలవోక విజయం సాధించి సిరీస్‌లో 2–2తో సమంగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), షై హోప్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అనంతరం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (47 బంతుల్లో 77; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 94 బంతుల్లోనే 165 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సిరీస్ విజేతను తేల్చే చివరిదైన ఐదో టి20 మ్యాచ్ నేడు ఇదే వేదికపై జరుగుతుంది. హెట్‌మైర్ మెరుపులు... సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన హోప్, వరుస వైఫల్యాల తర్వాత తనదైన శైలిలో చెలరేగిన హెట్‌మైర్ మినహా విండీస్ బ్యాటింగ్ పూర్తిగా తడబాటుకు గురైంది. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించినా... మేయర్స్ (17), ఆ తర్వాత కింగ్ (18) ఎక్కువ సేపు నిలవలేదు. హోప్ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 55 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే పూరన్ (1), పావెల్ (1)లను అవుట్ చేసి విండీస్‌ను దెబ్బ తీయడంతో స్కోరు 57/4కు చేరింది. ఈ దశలో హోప్, హెట్‌మైర్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు 6 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. హోప్‌ను అవుట్ చేసి చహల్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, హెట్‌మైర్ వరుస సిక్సర్లతో తన జోరును కొనసాగించాడు. 35 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆఖరి 5 ఓవర్లలో విండీస్ 57 పరుగులు సాధించింది. అలవోకగా... ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు యశస్వి, గిల్ ధాటిగా ఆడుతూ దూసుకుపోయారు. తొలి బంతికి ఫోర్‌తో మొదలైన ఇన్నింగ్స్ అదే జోరులో గెలుపు దిశగా సాగింది. తొలి 6 ఓవర్లలోనే భారత్ 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసింది. 10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు సరిగ్గా 100కు చేరింది. ఆపై కూడా వీరిద్దరిని నియంత్రించడం విండీస్ వల్ల కాలేదు. 30 బంతుల్లో గిల్, 33 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నారు. విజయానికి మరో 14 పరుగుల దూరంలో గిల్ అవుటైనా, తిలక్ వర్మ (7 నాటౌట్)తో కలిసి యశస్వి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: మేయర్స్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 17; కింగ్ (సి) కుల్దీప్ (బి) అర్ష్ దీప్ 18; హోప్ (సి) అక్షర్ (బి) చహల్ 45; పూరన్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 1; పావెల్ (సి) గిల్ (బి) కుల్దీప్ 1; హెట్‌మైర్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 61; షెఫర్డ్ (సి) సామ్సన్ (బి) అక్షర్ 9; హోల్డర్ (బి) ముకేశ్ 3; స్మిత్ (నాటౌట్) 15; హొసీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–19, 2–54, 3–55, 4–57, 5–106, 6–118, 7–123, 8–167. బౌలింగ్: అక్షర్ 4–0–39–1, అర్ష్ దీప్ 4–0–38–3, చహల్ 4–0–36–1, కుల్దీప్ 4–0–26–2, పాండ్యా 1–0–14–0, ముకేశ్ 3–0–25–1. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 84; గిల్ (సి) హోప్ (బి) షెఫర్డ్ 77; తిలక్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17 ఓవర్లలో వికెట్నష్టానికి) 179. వికెట్ల పతనం: 1–165. బౌలింగ్: మెకాయ్ 3–0–32–0, హొసీన్ 4–0–31–0, హోల్డర్ 4–0–33–0, షెఫర్డ్ 3–0–35–1, స్మిత్ 2–0–30–0, పావెల్ 1–0–13–0. -
22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి
Vardhman textiles Suchita Oswal Jain success story{ 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు చేపట్టి విజయ పథంలో నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో తనకు తానే సాటి నిరూపించుకున్నారు.వర్ధమాన్ టెక్స్‌టైల్స్‌కు వైస్ ప్రెసిడెంట్ , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచితా ఓస్వాల్ జైన్. భారతదేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ కంపెనీలలో ఒకటైన ఈ గ్రూప్‌ని సుచితా తండ్రి ఎస్పి ఓస్వాల్‌తో, తాత రత్తన్ చంద్ ఓస్వాల్ కలిసి స్థాపించారు.ఇప్పుడు ఎస్పి ఓస్వాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. లూథియానాకు చెందిన ఓస్వాల్ కుటుంబంలోని సుచితా ఈ కుటుంబ వ్యాపారంలో మూడో జనరేషన్కుచెందిన వారు.ఏదో ఒకటి చేయాలనే కోరిక, ఏదో సాధించాలి అన్న పట్టుదలే రెండు దశాబ్దాల కృషితో కంపెనీని స్థాయికి చేర్చింది. వర్ధమాన్ టెక్స్టైల్స్ ప్రస్థానం 6000 స్పిండిల్స్‌తో ప్రారంభించింది.మరిపుడు సుచితా నేతృత్వంలో బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ టర్నోవర్‌తో భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ తయారీదారులలో ఒకటిగా అవతరించింది. 1965లో ప్రారంభమైనప్పటి నుండి, ఛైర్మన్ ఎస్పీ ఓస్వాల్ డైనమిక్ లీడర్‌షిప్‌లో టెక్స్టైల్ మేజర్‌గా అభివృద్ధి చెందింది. కానీ ఆ తరువాత 1990లో సుచితా కంపెనీలో చేరిన తరువాత బట్టల తయారీలో విభిన్నంగా మరింత అభివృద్ధి చెంది. 64 మగ్గాల నుండి, సంస్థ ఇప్పుడు 1544 మగ్గాలను నిర్వహిస్తోంది. సుచితా ఓస్వాల్ జైన్ ఆధ్వర్యంలోని కంపెనీ అనేక జాతీయ ,అంతర్జాతీయ క్లయింట్ల సాధించింది.పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ , తమిళనాడు వంటి 5 రాష్ట్రాలలో 20కి పైగా ఉత్పత్తి యూనిట్లు, 30 వేల మందికాగా పైగా ఉద్యోగులున్నారు. తండ్రి, పద్మభూషణ అవార్డ్ గ్రహీత ఎ స్పీ ఓస్వాల్ సమక్షంలో చిన్నతనంలోనే తయారీ కేంద్రాలను సందర్శించేది. తండ్రి మార్గదర్శకత్వంలోనే కంపెనీని నడిపించాలనీ, సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. లండన్ బిజినెస్ స్కూల్ INSEAD పారిస్ నుండి ఎంబీఏ చేసిన అనుభవంతోనె కంపెనీ శరవేగంగా ఆధునికతవైపు పరుగులు పెట్టించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీలో కంపెనీ తొలి ఫాబ్రిక్ తయారీ కేంద్రాన్ని స్థాపించారు. ఆమె తరువాత డైయింగ్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ యూనిట్లను జోడించింది. సుచితా ఫిక్సీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ బోర్డు సభ్యురాలు. యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ మెంబర్.. 8వ వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ , 2021లో ఇండియా CSR లీడర్షిప్, ఔట్‌స్టాండింగ్ విమెన్ లీడర్ అవార్డు లభించింది. అంతేకాదు ఆమె ఇద్దరు కుమార్తెలు కంపెనీ పగ్గాలు చేపట్టి తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తన సక్సెస్‌కు కారణం తన తల్లిదండ్రులే అంటారు సుచిత. వారి ప్రోత్సాహమే తన కుటుంబ వ్యాపారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయ పడిందంటారు. న్యూ డిజిటల్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఆర్థిక స్వాతంత్ర్యం వీటి పుణ్యమా అని మహిళలకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీరేం అనుకున్నారో అది సాధించడానికి నిబద్దతో కదలండి. ఎవరు బాస్ కావాలి అనేది గ్లాస్ సీలింగ్ ఏమీలేదు.విమర్శల్ని గాలికి వదిలి. రెక్కలు విప్పి ఎగరండి అంతే అని సందేశమిస్తారు సుచితా కంపెనీని మరింత అభివృద్ధి చేయడంతోపాటు,మరిన్ని దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నాం, తద్వారా భారతీయ కార్మికులు,వ్యవస్థాపకుల అద్భుతమైన సామర్థ్యం, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటా చెప్పాలి..భారతీయ కంపెనీలు అంతర్జాతీయ రంగంలో నిజంగా బాగా రాణించగలవు అంటారామె. GAP, Uniqlo, Marks & Spencer, Target, H&M, Kohl's, Calvin Klein మొదలైన అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా కంపెనీ తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. గతేడాది కంపెనీ టర్నోవర్ రూ.12,003 కోట్లు. -
భారత్ 182/4
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: రెండో టెస్టులోనూ భారత ఓపెనింగ్ జోడీ అదరగొట్టింది. కానీ తొలి సెషన్ వరకే ఈ శుభారంభం పరిమితమైంది. సెషన్ మారగానే వెస్టిండీస్ బౌలింగ్ ప్రతాపం మొదలైంది. ‘టాప్’ లేపింది. ఇరు జట్లు చెరిసగం ఆధిపత్యాన్ని పంచుకోవడంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా మొదలైంది. టాస్ నెగ్గిన వెస్టిండీస్ బౌలింగ్‌కే మొగ్గుచూపగా, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఉదయం సెషన్ అంతా వీళ్లిద్దరు ఆడుతూపాడుతూ పరుగులు సాధించారు. చెత్త బంతుల్ని సిక్సర్లుగా మలిచారు. ఈ క్రమంలో ముందుగా ‘హిట్‌మ్యాన్’ రోహిత్ 74 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 21వ ఓవర్లోనే జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే ధాటిగా ఆడుతున్న జైస్వాల్ కూడా 49 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 121/0 వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. భోజన విరామం తర్వాత 30 నుంచి 40 ఓవర్ల మధ్యలో... కేవలం 8 ఓవర్ల వ్యవధిలో కీలకమైన టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ముందుగా యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్)కు హోల్డర్ చెక్ పెట్టగా, రోచ్ బౌలింగ్‌లో పేలవమైన షాట్‌కు శుబ్‌మన్ గిల్ (10; 2 ఫోర్లు) నిష్క్రమించాడు. కోహ్లితో కలిసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మ (143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను వారికన్ బోల్తా కొట్టించాడు. అనుభవజ్ఞుడైన రహానే (8) క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 139/0 స్కోరు కాస్తా 182/4గా మారిపోయింది. టీ విరామానికి భారత్ 50.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోహ్లి (18 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. గాయపడిన శార్దుల్ ఠాకూర్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. విండీస్ తరఫున కిర్క్ మెకెంజి కెరీర్ మొదలు పెట్టాడు. 10 ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత స్టార్ విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పదో క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ధోని, ద్రవిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 100వ టెస్టు సందర్భంగా టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మకు జ్ఞాపికను అందజేసిన వెస్టిండీస్ క్రికెట్ అధ్యక్షుడు డాక్టర్ కిశోర్ షాలో, దిగ్గజం బ్రియాన్ లారా -
‘ఏ స్థానంలోనైనా సత్తా చాటుతా’
యశస్వి జైస్వాల్ ఇప్పుడు టీమిండియా క్రికెటర్. కష్టే ఫలితో ఎదిగాడు. 21 ఏళ్ల జైస్వాల్ ఎంపిక ఆశ్చర్యపరిచేది, అనూహ్య మైంది కానే కాదు. ఎందుకంటే కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో తన నిలకడైన ఆటతీరు చూపిస్తున్నాడు. ఐపీఎల్లో అయితే మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్లో అయితే దిగ్గజాల ప్రశంసలు కూడా పొందాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్‌బైగా ఇంగ్లండ్ వెళ్లొచ్చాడు. ఇప్పుడు కరీబియన్ టూర్ కోసం పూర్తిస్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. ముంబై: జైస్వాల్ యూపీ కుర్రాడు. అయితే ముంబైలో ఆటగాడయ్యాడు. ఐపీఎల్‌తో మెరుపు వీరుడిగా అందరికి పరిచయమై తాజాగా టీమిండియా జెర్సీ వేసుకోనున్నాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు జట్టులో సభ్యుడయ్యాడు. హిట్టర్‌గా పేరుతెచ్చుకున్న 21 ఏళ్ల యశస్వి ఇప్పుడు టెస్టు క్రికెటర్‌గా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. జట్టులో తొలిసారి ఎంపికైన జైస్వాల్ తొలి పిలుపునే గొప్ప మలుపుగా చేసుకోవా లని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంకా ఏమన్నాడంటే.... నాన్న భావోద్వేగం... నాకేమో ఆనందం... ఈ తీపి కబురు తెలియగానే మా నాన్నకు భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న నాకేమో శుక్రవారం బిజిబిజీగా గడిచింది. నిజం చెప్పాలంటే ప్రాక్టీస్ కూడా చేయలేదు. టీమిండియాకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నాను. భారత జట్టులోకి ఎంపికవడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. నా శక్తిమేర రాణించేందుకు కృషి చేస్తాను. టీమిండియా జెర్సీతో ఎప్పుడెప్పుడు ఆడాలా అన్న ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. సన్నాహాలపైనే దృష్టి నా సన్నాహాలు ఆశించినట్లే సాగుతున్నాయి. సీనియర్ ప్లేయర్ల సలహాలు, సంప్రదింపులతో ఆటతీరుకు మెరుగులు దిద్దుకుంటున్నా. ఇప్పుడైతే పూర్తిగా పని (బ్యాటింగ్) మీదే ధ్యాసంతా! ఎలా ఆడాలో ఎంత ముఖ్యమో ఎలా నడుచుకోవాలనేది అంతే ముఖ్యం. స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అజింక్య రహానేల ఆటను చూసి ఎంతో నేర్చుకున్నాను. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలు కూడా నా బ్యాటింగ్‌కు దోహదపడ్డాయి. ఏ స్థానమైనా సరే నాకంటూ ఫలానా స్థానమే నప్పుతుందనే ప్రాధన్యతలేవీ లేవు. జట్టు అవసరాలు, జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం మేరకు ఏ స్థానంలోనైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు తెలిసిందల్లా పరుగులు చేయడమే. ఎక్కడ బరిలోకి దిగినా జట్టు కోసం శ్రమిస్తాను. క్రమశిక్షణతో ఎదుగుతాను. ఈ రెండే నా కెరీర్‌కు సోపానాలు. కోచ్ సంబరం పదేళ్ల క్రితం 2013లో ఆజాద్ మైదాన్(ముంబై)లో జైస్వాల్ ఆటకు ముగ్దుడినై అతన్ని శిక్షణ కోసం ఎంపిక చేశాను. అతను పడ్డ కష్టానికి ఐపీఎల్ అందలమెక్కించింది. ఓ దశాబ్దం చెమటోడ్చితే అతనిప్పుడు భారత క్రికెటర్ అయ్యాడు. అది చెప్పుకోవడానికి చాలా సంతోషంగా, ఎంతో సంబరంగా ఉంది. యశస్వి ఎదిగిన తీరు నాకెంతో ముచ్చటగా ఉంది. చాలా గర్వపడుతున్నాను. కరీబియన్‌లో బరిలోకి దిగుతాడనే నమ్మకముంది. ఎప్పట్లాగే రాణిస్తాడనే ఆశాభావం కూడా ఉంది. – వ్యక్తిగత కోచ్ జ్వాలా సింగ్ -
పుజారాపై వేటు... యశస్వికి చోటు
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెట్లో కీలక పరిణామం... సుదీర్ఘ కాలంగా జట్టులో కీలక సభ్యుడిగా, పలు చిరస్మరణీయ విజయాల్లో ముందుండి నడిపించిన చతేశ్వర్ పుజారాపై సెలక్టర్లు విశ్వాసం కోల్పోయారు. వచ్చే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ను (డబ్ల్యూటీసీ 2023–2025) దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ చేయబోతున్న మార్పుల్లో భాగంగా అందరికంటే ముందుగా పుజారాపై వేటు పడింది. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం శుక్రవారం ప్రకటించిన భారత జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. అతనితో పాటు ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా జట్టు నుంచి తప్పించారు. వీరి స్థానాల్లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, పేసర్ ముకేశ్ కుమార్‌లను ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల ఈ టీమ్‌లోకి మరో పేస్ బౌలర్ నవదీప్ సైనీ కూడా ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రాణించిన అజింక్య రహానే తన స్థానం నిలబెట్టుకోవడంతో పాటు వైస్ కెపె్టన్‌గా కూడా ఎంపిక కావడం విశేషం. భిన్న వర్గాల నుంచి విమర్శలు వచ్చినా ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్ తన స్థానం నిలబెట్టుకోగా... గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ పేర్లను పరిశీలించలేదు. మొహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా, జనవరి 2021 తర్వాత మళ్లీ టెస్టు ఆడని సైనీకి మరో చాన్స్ దక్కింది. భారత్, విండీస్ మధ్య జూలై 12–16, జూలై 20–24 మధ్య డొమినికా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లలో రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. అనూహ్య ఎంపికలేమీ లేకుండా... వెస్టిండీస్‌తో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం ఎలాంటి ఆశ్చర్యకర ఎంపికలు లేవు. భారత్ ఆడిన గత 4 వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ సంజు సామ్సన్ తిరిగి జట్టులోకి ఎంపిక కావడమే చెప్పుకోదగ్గ విశేషం. ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో తొలి బంతికే వెనుదిరిగి చెత్త రికార్డు నమోదు చేసినా... సూర్యకుమార్ యాదవ్‌కు మళ్లీ అవకాశం దక్కింది . స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది. ఎంపిక చేసిన 17 మందితో పాటు గాయాల నుంచి కోలుకొని బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందు బాటులోకి వస్తే 20 మందితో వచ్చే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక సాగినట్లు అర్థమవుతోంది. భారత్, విండీస్ మధ్య జూలై 27, 29, ఆగస్ట్ 1 తేదీల్లో 3 వన్డేలు జరుగుతాయి. రంజీల్లో సత్తా చాటి... ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యశస్వి ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా ఘనంగా ఉండటం అతనికి టెస్టు టీమ్‌లో అవకాశం క ల్పించింది. 26 ఇన్నింగ్స్‌లలోనే అతను 80.21 సగటుతో 1845 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లలో 213, 144 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కూడా రిజర్వ్‌గా అతను ఇటీవల జట్టుతో పాటు లండన్ వెళ్లాడు. ఫస్ట్‌క్లాస్‌లో 42.19 సగటు ఉన్న రుతురాజ్ రికార్డు గొప్పగా లేకపోయినా, అతని టెక్నిక్ టెస్టు ఫార్మాట్‌కు పనికొస్తుందని భావించి సెలక్టర్లు గత కొంతకాలంగా అతడిపై దృష్టి పెట్టారు. గత మూడు రంజీ సీజన్లలో బెంగాల్ రెండుసార్లు ఫైనల్ వెళ్లడంలో పేసర్ ముకేశ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా ‘ఎ’ తరఫున కూడా రాణించిన అతను 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 21.55 సగటుతో 149 వికెట్లు తీశాడు. ఈ ముగ్గురిలో రుతురాజ్ ఇప్పటికే భారత్ తరఫున ఒక వన్డే, 9 టి20లు ఆడగా మిగతా ఇద్దరు ఇంకా అరంగేట్రం చేయలేదు. టెస్టు జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ. వన్డే జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్. -
WTC ఫివర్ ఫేవరెట్ గా ఇండియా ఎందుకంటే..!
-
యశస్విజైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్.. వెల్కమ్ టు టీమ్ ఇండియా
-
జైస్వాల్ ఊచకోత.. కేకేఆర్‌పై రాజస్తాన్ ఘన విజయం
తొలి ఓవర్లో 6, 6, 4, 4, 2, 4... ఇలా దూకుడు మొదలు పెట్టిన యశస్వి జైస్వాల్ ఆగలేదు... తొలి 6 బంతుల్లో 26 పరుగులు రాబట్టిన అతను తర్వాతి 7 బంతుల్లో మరో 24 పరుగులు కొట్టేశాడు. అంతే...13 బంతుల్లో ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో కొత్త రికార్డు సృష్టించాడు. 3 ఓవర్లలోపే యశస్వి హాఫ్ సెంచరీ అయిపోయింది. మరో 3 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 78 పరుగులు. అక్కడే మ్యాచ్‌లో ఎవరు గెలవబోతున్నారో అర్థమైపోయింది! ఇక మిగిలింది యశస్వి ఎంత దూరం, ఎలా వెళతాడనేది... సెంచరీ వరకు చేరగలిగాడు కానీ రెండు పరుగుల తేడాతో శతకం చేజారింది. అయితేనేం ఐపీఎల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడిన జైస్వాల్ రాజస్తాన్ జట్టును గెలిపించాడు... మరో ఎండ్‌లో కెప్టె న్ సామ్సన్ మెరుపు బ్యాటింగ్‌తో పని సులువైంది. రాజస్తాన్ 41 బంతులు మిగిలి ఉండగానే నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్తాన్ పండగ చేసుకుంది. నైట్‌రైడర్స్ బ్యాటింగ్ చేసినంత సేపూ నెమ్మదిగా అనిపించిన పిచ్‌పైనే పరుగులు వరద పారించి కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో రాజస్తాన్ 9 వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. యజువేంద్ర చహల్ 25 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతాను కట్టడి చేశాడు. అనంతరం రాజస్తాన్ 13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 151 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 98 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు), సంజూ సామ్సన్ (29 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి జట్టును లక్ష్యానికి చేర్చారు. వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్‌ను మినహాయిస్తే కోల్‌కతా ఇన్నింగ్స్ ఆసాంతం పేలవంగా సాగింది. వెంకటేశ్ కూడా మరీ విధ్వంసకరంగా ఆడకపోయినా... పరిస్థితిని బట్టి తనవంతు పాత్ర పోషించాడు. వెంకటేశ్ 42 బంతుల్లో 57 పరుగులు చేయగా ... ఇతర ఆటగాళ్లంతా కలిసి 78 బంతుల్లో 89 పరుగులు చేయగలి గారంటే అతని ఇన్నింగ్స్ విలువ తెలుస్తుంది. ధనాధన్... ఆశ్చర్యకరంగా పార్ట్‌టైమ్ బౌలర్, కోల్‌కతా కెప్టె న్ నితీశ్ రాణా మొదటి ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టి ప్రత్యర్థిని యశస్వి కఠినంగా శిక్షించాడు. సమన్వయ లోపంతో జోస్ బట్లర్ (0) రనౌట్ కావడంతో రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే జట్టుపై అది ఎలాంటి ప్రభావం చూపించలేదు. యశస్వి, సామ్సన్ కలిసి వేగం తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరి షాట్లకు నైట్‌రైడర్స్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది. సామ్సన్ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చి న క్యాచ్‌ను నేలపాలైంది. అనంతరం అనుకూల్ వేసిన ఓవర్లో 3 సిక్సర్లతో సామ్సన్ చెలరేగాడు. చివర్లో యశస్వి సెంచరీ విషయంలో కాస్త ఉత్కంఠ నెలకొంది. యశస్వి 94 పరుగుల వద్ద ఉండగా రాయల్స్‌కు 3 పరుగులు కావాలి. 13వ ఓవర్ చివరి బంతికి పరుగు తీయని సామ్సన్ సిక్సర్ కొట్టమన్నట్లుగా సైగ చేస్తూ యశస్వికి అవ కాశం ఇచ్చాడు. అయితే తర్వాతి బంతికి ఫోర్ మాత్రమే రావడంతో యశస్వి 98 పరుగుల వద్ద ఆగిపోవాల్సి వచ్చి ంది. అయితే దానిని పట్టించుకోకుండా అతను విజయానందాన్ని ప్రదర్శించాడు. 1 ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్‌గా యశస్వి (13 బంతుల్లో) నిలిచాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్, కమిన్స్ (14 బంతుల్లో) పేరిట ఉంది. 187 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ రికార్డు నెలకొల్పాడు. డ్వేన్ బ్రేవో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును చహల్ (143 బంతుల్లో 187 వికెట్లు) సవరించాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) హెట్‌మైర్ (బి) బౌల్ట్ 10; గుర్బాజ్ (సి) సందీప్ శర్మ (బి) బౌల్ట్ 18; వెంకటేశ్ (సి) బౌల్ట్ (బి) చహల్ 57; నితీశ్ రాణా (సి) హెట్‌మైర్ (బి) చహల్ 22; రసెల్ (సి) అశ్విన్ (బి) ఆసిఫ్ 10; రింకూ సింగ్ (సి) రూట్ (బి) చహల్ 16; శార్దుల్ (ఎల్బీ) (బి) చహల్ 1; అనుకూల్ (నాటౌట్) 6; నరైన్ (సి) రూట్ (బి) సందీప్ 6; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–14, 2–29, 3–77, 4–107, 5–127, 6–129, 7–140, 8–149. బౌలింగ్: బౌల్ట్ 3–0–15–2, సందీప్ శర్మ 4–0–34–1, అశ్విన్ 4–0–32–0, రూట్ 2–0–14–0, యజువేంద్ర చహల్ 4–0–25–4, ఆసిఫ్ 3–0–27–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 98; బట్లర్ (రనౌట్) 0; సామ్సన్ (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.1 ఓవర్లలో వికెట్ నష్టానికి) 151. వికెట్ల పతనం: 1–30. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–26–0, హర్షిత్ రాణా 2–0–22–0, శార్దుల్ ఠాకూర్ 1.1–0–18–0, వరుణ్ చక్రవర్తి 3–0–28–0, సునీల్ నరైన్ 2–0–13–0, సుయశ్ 3–0–22–0, అనుకూల్ 1–0–20–0. ఐపీఎల్లో నేడు ముంబై ్ఠ vs గుజరాత్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
రాజస్తాన్ ధనాధన్
జైపూర్: అప్పుడు చెన్నైలో... ఇప్పుడు సొంత ఇలాకాలో రాజస్తాన్ రాయల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. గురువారం జరిగిన ఐపీఎల్ పోరులో రాయల్స్ 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై జయభేరి మోగించింది. మొదట రాజస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (43 బంతుల్లో 77; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా, తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు తీశాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేసింది. శివమ్ దూబే (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రుతురాజ్(29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కనబరిచారు. స్పిన్నర్ ఆడమ్ జంపా (3/22), అశ్విన్ (2/35) తిప్పేశారు. విరుచుకుపడిన యశస్వి రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి బంతి నుంచే దూకుడుగా నడిపించాడు. ఆకాశ్ సింగ్ మొదటి ఓవర్లో మూడు బౌండరీలు బాదిన అతను మళ్లీ మూడో ఓవర్ వేసేందుకు వస్తే 4, 0, 6, 0, 4, 4లతో 18 పరుగులు పిండుకున్నాడు. బట్లర్ కూడా ఫోర్లు బాదడంతో పవర్ ప్లేలో రాయల్స్ 64/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్లోనే జైస్వాల్ ఫిఫ్టీ (26 బంతుల్లో) పూర్తయ్యింది. కాసేపటికి బట్లర్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) అవుటైనా... సంజూ సామ్సన్ (17)తో కలిసి యశస్వి తన జోరుకొనసాగించాడు. అయితే 14వ ఓవర్లో తుషార్ వీరిద్దరిని అవుట్ చేయగా, హిట్టర్ హెట్‌మైర్ (8) విఫలమయ్యాడు. ఈ దశలో స్కోరు వేగం మందగించగా... మళ్లీ డెత్ ఓవర్లలో ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పడిక్కల్ (13 బంతుల్లో 27 నాటౌట్; 5 ఫోర్లు) దంచేయడంతో స్కోరు 200 దాటింది. చెన్నై చతికిల... కొండంత లక్ష్యం ఛేదించాల్సిన జట్టుకు మెరుగైన ఆరంభం కావాలి. కానీ రుతురాజ్‌కు తోడుగా దిగిన ఓపెనర్ కాన్వే (8), టాపార్డర్‌లో వచ్చి న రహానే (15) విఫలమయ్యారు. 11వ ఓవర్లోనే 73 పరుగుల వద్ద అంబటి రాయుడు (0) రూపంలో నాలుగో వికెట్ పడిపోవడంతోనే చెన్నై చతికిలపడింది. ఆరంభంలో ఓపెనర్ రుతురాజ్ తన ధాటిని కొనసాగించాడు. ఆ తర్వాత వచ్చి న వారిలో ఒక్క దూబే తప్ప ఇంకెవరూ అలా ఆడలేకపోయారు. అయితే వీళ్లిద్దరి మెరుపులు అంతపెద్ద లక్ష్యానికి ఏ మాత్రం సరిపోలేదు. మొయిన్ అలీ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) మోస్తరు స్కోరే చేశారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) రహానే (బి) తుషార్ 77; బట్లర్ (సి) దూబే (బి) జడేజా 27; సామ్సన్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 17; హెట్‌మైర్ (బి) తీక్షణ 8; ధ్రువ్ (రనౌట్) 34; పడిక్కల్ (నాటౌట్) 27; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–86, 2–125, 3–132, 4–146, 5–194. బౌలింగ్: ఆకాశ్ 2–0–32–0, తుషార్ 4–0–42–2, తీక్షణ 4–0–24–1, జడేజా 4–0–32–1, మొయిన్ అలీ 2–0–17–0, పతిరణ 4–0–48–0. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) పడిక్కల్ (బి) జంపా 47; కాన్వే (సి) సందీప్ (బి) జంపా 8; రహానే (సి) బట్లర్ (బి) అశ్విన్ 15; దూబే (సి) బట్లర్ (బి) కుల్దీప్ 52; రాయుడు (సి) హోల్డర్ (బి) అశ్విన్ 0; మొయిన్ అలీ (సి) సామ్సన్ (బి) జంపా 23; జడేజా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–42, 2–69, 3–73, 4–73, 5–124, 6–170. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–24–0, కుల్దీప్ యాదవ్ 3–0–18–1, హోల్డర్ 4–0–49–0, అశ్విన్ 4–0–35–2, ఆడమ్ జంపా 3–0–22–3, చహల్ 2–0–21–0. ఐపీఎల్లో నేడు పంజాబ్ VS లక్నో (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
ఢిల్లీ మళ్లీ మళ్లీ...
గువహటి: రాజస్తాన్ రాయల్స్ తొలి ఓవర్లో 5 ఫోర్లతో 20/0...ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్లో ‘సున్నా’కు 2 వికెట్లు...ఇరు జట్ల మధ్య స్పష్టంగా కనిపించిన తేడా! ఆరంభంనుంచే జోరు ప్రదర్శించిన రాయల్స్ చివరి వరకు దానిని కొనసాగించగా...ఛేదనలో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ మళ్లీ కోలుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టుకు వరుసగా మూడో పరాజయం తప్పలేదు. శనివారం బర్సపర స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 57 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (31 బంతుల్లో 60; 11 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (51 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆరంభం అందించారు. ఖలీల్ వేసిన తొలి ఓవర్లో యశస్వి 5 ఫోర్లతో చెలరేగగా, నోర్జే వేసిన తర్వాతి ఓవర్లో బట్లర్ 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత అక్షర్ ఓవర్లోనూ యశస్వి 3 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 68/0. ఇందులో 56 పరుగులు 14 ఫోర్లతోనే రావడం విశేషం. 25 బంతుల్లోనే యశస్వి అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 98 పరుగుల భాగస్వామ్యం (51 బంతుల్లో) యశస్వి వెనుదిరగ్గా, సామ్సన్ (0), పరాగ్ (7) తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. అయితే చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపులు రాయల్స్‌కు భారీ స్కోరును అందించాయి. ఛేదనలో డేవిడ్ వార్నర్ (55 బంతుల్లో 65; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, క్యాపిటల్స్ విజయానికి అది సరిపోలేదు. వార్నర్‌తో పాటు లలిత్ యాదవ్ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించగా, మిగతావారంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లోలాగే ఈ సారి కూడా బౌల్ట్ తన అద్భుత బౌలింగ్‌తో తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టాడు. పృథ్వీ షా (0), మనీశ్ పాండే (0) డకౌట్ కాగా, రోసో (14) కూడా ఆరు ఓవర్ల లోపే అవుట్ కావడంతో ఢిల్లీ ఛేదన కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అండ్ (బి) ముకేశ్ 60; బట్లర్ (సి) అండ్ (బి) ముకేశ్ 79; సామ్సన్ (సి) నోర్జే (బి) కుల్దీప్ 0; పరాగ్ (బి) పావెల్ 7; హెట్‌మైర్ (నాటౌట్) 39; జురేల్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–98, 2–103, 3–126, 4–175. బౌలింగ్: ఖలీల్ 2–0–31–0, నోర్జే 4–0–44–0, ముకేశ్ కుమార్ 4–0–36–2, అక్షర్ 4–0–38–0, కుల్దీప్ 4–0–31–1, పావెల్ 2–0–18–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; వార్నర్ (ఎల్బీ) (బి) చహల్ 65; మనీశ్ పాండే (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; రోసో (సి) యశస్వి (బి) అశ్విన్ 14; లలిత్ యాదవ్ (బి) బౌల్ట్ 38; అక్షర్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 2; పావెల్ (సి) హెట్‌మైర్ (బి) అశ్విన్ 2; పోరెల్ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 7; కుల్దీప్ (నాటౌట్) 3; నోర్జే (బి) సందీప్ 0; ముకేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–36, 4–100, 5–111, 6–118, 7–138, 8–139, 9–140. బౌలింగ్: బౌల్ట్ 4–1–29–3, సందీప్ 4–0–20–1, ఆర్. అశ్విన్ 4–0–25–2, హోల్డర్ 3–0–28–0, చహల్ 4–0–27–3, మురుగన్ అశ్విన్ 1–0–11–0. -
బీమా చెల్లించకుండా నష్టం కలిగించారు
సాక్షి, హైదరాబాద్: సకాలంలో బీమా చెల్లించకుండా ఓ ఖాతాదారుడికి నష్టం కలిగించడమే కాకుండా, తప్పు తమది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన కెనరా బ్యాంకు తీరును రాష్ట్ర వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. వ్యాపారం కోసం ఖాతాదారుడు రుణం తీసుకున్నప్పుడు, రుణ ఒప్పందం ప్రకారం బీమా చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని తేల్చి చెప్పింది. సకాలంలో బీమా మొత్తం చెల్లించకపోవడం వల్ల ఆ ఖాతాదారుడికి కలిగే నష్టాన్ని భరించాల్సింది బ్యాంకేనంది. సకాలంలో బీమా చెల్లించకపోవడం వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన ఆస్తినష్టానికి బాధ్యత వహించాల్సిందేనని కెనరా బ్యాంకును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అతనికి రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని బ్యాంకుకు స్పష్టం చేసింది. ఖర్చుల కింద రూ.10వేలను చెల్లించాలంది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, సభ్యులు కె.రమేశ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఖమ్మం జిల్లాకు చెందిన వై.శేఖర్ వైఎన్ ప్రెస్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. వ్యాపార టర్నోవర్ బాగుండటంతో ఖమ్మంలోని కెనరా బ్యాంకు శేఖర్ ప్రెస్‌కు 2010లో రూ. 20 లక్షల రుణం ఇచ్చింది. ఒప్పందం మేరకు ప్రెస్ స్టాక్‌కు బ్యాంకే బీమా చెల్లించాలి. దీని ప్రకారం 2013 వరకు బీమా చెల్లించింది. 2014 నుంచి చెల్లించలేదు. పాలసీ రెన్యువల్ చేసుకోవాలని బీమా కంపెనీ నోటీసు పంపినా కెనరా బ్యాంకు పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా 2015లో వైఎన్ ప్రెస్‌లో విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగింది. దీంతో శేఖర్ పరి హారం కోసం బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోగా, తమకు బ్యాంకు ప్రీమియం చెల్లించలేదని బీమా కంపెనీ తెలిపింది. దీంతో శేఖర్ కెనరా బ్యాంకుపై రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జస్టిస్ జైశ్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కెనరా బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. బీమా కంపెనీ చూపిన రుజువులూ పరిశీలించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ కెనరా బ్యాంకు వాదనను తప్పుపట్టింది. తన తప్పును బీమా కంపెనీపై నెడుతోందంటూ ఆక్షేపించింది. ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యతారాహిత్యమే కాక, సేవలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని తేల్చింది. దీని వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన నష్టానికి కెనరా బ్యాంకే బాధ్యత వహించాలంది. వైఎన్ ప్రెస్ రూ.43 లక్షల మేర నష్టం వాటిల్లిందని సర్వేయర్ నివేదిక చెబుతోందని, పోలీసులు రూ.6.8 లక్షల మేరే నష్టమని చెబుతున్నారని తెలిపింది. అందువల్ల వైఎన్ ప్రెస్‌కు రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని కెనరా బ్యాంకును ఆదేశించింది. అలాగే ఖర్చుల కింద మరో రూ.10వేలు ఇవ్వాలంది. -
పటిష్ట వ్యవస్థతోనే కేసుల సత్వర పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరంలలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల రిడ్రెసల్ కమిషన్ అధ్యక్షులు జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ అన్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం, ప్రజల నుంచి పూర్తి సహకారం ఉండాలని కోరారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ పౌరసరఫరాల భవన్లో జరిగిన కార్యక్రమానికి జస్టిస్ జైస్వాల్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ వినియోగదారుల ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ జైస్వాల్ మాట్లాడుతూ వినియోగదారులకు వారి హక్కులు, బాధ్యతలపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందనీ, అలాగే వారినుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి అన్ని విధాలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న 90 రోజుల గడువులో కేసుల పరిష్కారానికి సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలంటే అందుకు కావాల్సిన వ్యవస్థను కూడా పటిష్టం చేసుకోవాలని అన్నారు. గత నెలరోజుల్లో రాష్ట్ర వినియోగదారుల ఫోరంకు 115 కేసులు రాగా 91 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. అయితే పెండింగ్ కేసులను కూడా నిర్దేశిత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ, తెలంగాణలో వినియోగదారులకు బాసటగా నిలుస్తూ నిర్దేశిత గడువులోగా కేసుల పరిష్కారానికి కమిషన్ కృషి చేస్తోందని, వినియోగదారుల ఫోరంను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రవి, ప్రముఖ వినియోగదారుల కార్యకర్త ఎన్.గణేషన్, సీఏటీసీవో అధ్యక్షులు గౌరీశంకరరావు, వినియోగదారుల వ్యవహారాల డిప్యూటీ కమిష నర్ అనూరాధ, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.