
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్ష పదవికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మిశ్రీలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్(ఎంఎస్‌కే జైస్వాల్) పేరు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జస్టిస్ జైస్వాల్ నియామకానికి సీఎం కేసీఆర్ ఒకట్రెండు రోజు ల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
ఫోరం సభ్యుడిగా విశ్రాంత న్యాయాధికారి రమేశ్ నియామకానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. ప్రస్తుత అధ్యక్షుడు బీఎన్‌రావు నల్లా కూడా పదవీ విరమణ చేశారు. ఫోరం సభ్యునిగా ఉన్న పాటిల్‌రావు ఈ నెల 6న పదవీ విరమణ చేశారు. సభ్యురాలి పోస్టు కూడా ఖాళీగా ఉంది. వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment