న్యూఢిల్లీ: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ (నార్త్‌జోన్)లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు నైనా జైస్వాల్, ఫిడెల్ ఆర్.స్నేహిత్ సత్తా చాటారు. సబ్ జూనియర్ బాలికల ఈవెంట్‌లో నైనా టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సబ్ జూనియర్ బాలుర కేటగిరీలో రాష్ట్ర నంబర్‌వన్ ఆటగాడు స్నేహిత్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక్కడి హన్స్‌రాజ్ మోడల్ స్కూల్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో శనివారం జరిగిన బాలికల సెమీఫైనల్లో నైనా జైస్వాల్ 4-2తో యాశిని (ఢిల్లీ)పై గెలుపొందింది.
అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 3-2తో ప్రియాంక (ఆజ్మీర్)ను కంగుతినిపించింది. బాలుర విభాగంలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన స్నేహిత్ చక్కని విజయాలతో దూసుకెళ్తున్నాడు. గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)లో శిక్షణ పొందుతున్న స్నేహిత్ క్వార్టర్ ఫైనల్లో 3-0 (18-16, 11-7, 11-9)తో భారత ఆరో ర్యాంకర్ ఆకాశ్‌నాథ్ (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించాడు. క్యాడెట్‌లో ఆకాశ్‌నాథ్ నంబర్‌వన్ ఆటగాడు కావడం గమనార్హం. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్నేహిత్ 3-2తో బెంగాల్‌కే చెందిన ఆకాశ్ చౌదరిపై గెలుపొందాడు. సెమీఫైనల్లో అతను మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ)తో తలపడతాడు.
ఫైనల్లో నైనా
Published Sun, Dec 15 2013 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement