
అంత్యక్రియలకు దూరం
తల్లికి అంత్యక్రియలు.. కొడుకు ఆస్పత్రిలో..
అగ్గిపట్టిన మరిది మరోవైపు కొడుకు అంత్యక్రియలకు తండ్రి దూరం
ఇంద్రవెల్లి : ఉట్నూర్ మండలం లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం తీ రని విషాదాన్ని మిగిల్చడమే కాదు... సంప్రదాయ అంతిమ సంస్కారాలు, కడసారి చూ పులు కూడా దక్కకుండా చేసింది. మండల కేంద్రంలో గోండ్‌గూడలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్ర గాయలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్మల జైస్వాల్(45), సాయి జైస్వాల్(15) మృతదే హాలను శుక్రరవారం ఇంటికి తీసుకొచ్చారు. కాంతాబాయి(54) మృతదేహాన్ని మహారాష్ట్రలోని వారి గ్రామమైన కుప్టకు పంపించారు. కాగా, నిర్మల జైస్వాల్ భర్త బాబు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమెకున్న ఏకైక కుమారుడు పవన్, కోడలు సీతల్ జై స్వాల్ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్ర గాయలపాలై హైదరాబాద్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. విధి లేని పరిస్థితిలో ఆమె మరిది అయిన జనక్ జైస్వాల్ ద హన సంస్కారాలు నిర్వహించారు.
అదే వి ధంగా సాయి జైస్వాల్(15) మృతిచెందగా.. అతడి తమ్ముడు సోనుకు తీవ్రగాయాలు అయ్యాయి. వారి తల్లిదండ్రులు దిలీప్, సీతల్ జైస్వాల్ చిన్న కొడుకు సోను వెంట హైదరాబాద్‌లో ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో ప్రమాదంలో మృతిచెందిన పెద్ద కొడుకు సాయికి ఆ తల్లిదండ్రులు ఆఖరి చూపులు కూడా దక్కకుండానే అంతక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ సంఘటనలు గ్రామంలో తీరని విషాదాన్ని మిగిల్చాయి.