కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యలో దౌత్యపరమైన విభేదాలు చెలరేగాయి. అయితే.. భారత్‌పై ఆరోపణలతో ఊదరగొట్టిన జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఇక.. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే తాము భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు అంగీకరించారు. దీంతో కెనడా ప్రధాని తీరును భారత్ తీవ్రంగా ఖండిచింది.
‘‘చాలా రోజులుగా మేం చెబుతున్న విషయమే నిర్ధారణ అయింది. భారతదేశం, భారతీయ దౌత్యవేత్తలపై కెనాడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎటువంటి సాక్ష్యాలను మాకు అందించలేదు. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నిరూపితమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం ప్రధాని ట్రూడోనే’’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్‌వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. విదేశీ జోక్యంపై పార్లమెంటరీ విచారణలో కెనడాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రధాని ట్రూడో విమర్శలను భారత ప్రతినిధులు ధీటుగా తిప్పికొట్టారని అన్నారు.
Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe
— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024
Comments
Please login to add a commentAdd a comment