భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న దౌత్యసంబంధాలను ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నాశనం చేశారిన కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ అన్నారు. ఖలిస్తానీ నేత నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా భారత్‌తో ఎలాంటి సాక్ష్యాలను పంచుకోలేదని తెలిపారు. ఈ హత్యకేసు విషయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు.. ఖచ్చితమైన సాక్ష్యం కంటే ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా చేసినవిగా ఉన్నాయి. ఆరోపించిన, బలమైన సాక్ష్యం లేదని అయనే ఒప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా..టట్రూడో ఇరు దేశాల మధ్య సంబంధాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ప్రస్తుతం చూసి చూపించాడు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్ల కెనడా ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు’’ అని అన్నారు.
🇨🇦🇮🇳INDIAN AMBASSADOR BLAMES TRUDEAU FOR DIPLOMATIC NIGHTMARE
India's expelled envoy to Canada, Sanjay Kumar Verma, fired back at Trudeau, accusing him of wrecking diplomatic relations between the two nations.
Verma, who was ousted after Trudeau tied him to the murder of Sikh… pic.twitter.com/CcKnhhfOuo— Alex Kennedy (@therealmindman) October 21, 2024
ఇటీవల భారత్ ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన దర్యాప్తుతో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మకు సంబంధం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసింది. కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిచింది. అనంతరం కెనడాలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment