Hardeep Singh
-
మోదీ టార్గెట్‌గా కెనడా కొత్త ప్లాన్!.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: ఢిల్లీ: కెనడాపై భారత ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్లాన్ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసు అంటూ కెనడాకు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తా పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాంటి అర్థం లేని కథనాలను కొట్టిపారేస్తున్నామని ఖండించింది.కెనడా కథనంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. మేము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందించం. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధారమైన ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. ఇలాంటి వార్తలపై అధికారులు కచ్చితంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతిస్తాయి. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిది అంటూ కామెంట్స్ చేశారు.సదరు వార్తా పత్రిక.. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొనడం గమనార్హం.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా వాదనలు నిరాధారమైనవి అని తెలిపింది. నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి కెనడా.. భారత ప్రభుత్వం, మోదీపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అంతకుముందు.. కెనడాకు చెందిన పలు నేతలు అమిత్ షాను కూడా టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. Our response to queries regarding a report in Canadian media: https://t.co/1IAURpKlfT pic.twitter.com/jIPlg05JM6— Randhir Jaiswal (@MEAIndia) November 20, 2024 -
ఫాస్ట్ ట్రాక్ వీసాలకు కెనడా మంగళం
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం తిరిగి తిరిగి చివరకు భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. కెనడా–భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న వేళ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కల్గించే నిర్ణయాన్ని అమలుచేసింది. విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)ను నిలిపేస్తున్నట్లు కెనడా శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంసహా 13 దేశాల విద్యార్థులకే ఎస్డీఎస్ కింద ప్రాధాన్యత దక్కేది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మిట్లు చాలా వేగంగా వచ్చేవి. తాజా నిర్ణయంతో ఈ 13 దేశాల విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విధానంలోని దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధంలేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్డీఎస్ను నిలిపేశామని వివరణ ఇచ్చింది. -
అమిత్ షాపై కెనడా ఆరోపణలు.. స్పందించిన అమెరికా
న్యూయార్క్: భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కెనడా చేసిన ఆరోపణలను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను లక్ష్యంగా చేసుకోవడంలో కేంద్ర మంత్రి అమిత్ షా హస్తం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ‘‘కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఆందోళనకరమైన పరిణామం. మేం ఆ ఆరోపణల గురించి కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తాం. ఈ ఆరోపణలపై పూర్తి సమాచారం తెలుసుకుంటాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.Canada’s allegations against Union Home Minister Amit Shah are “concerning”, the United States said on Wednesday, noting that it would continue to consult Ottawa on the issue @PMOIndia @AmitShah @AmitShahOffice #India @State_SCA @StateDeptSpox pic.twitter.com/RQKU94pX7K— Jahanzaib Ali (@JazzyARY) October 31, 2024 కెనడాలోని ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ ఆరోపణలు చేశారు.‘‘కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారు. ఈ విషయాలను మేము వెల్లడిస్తున్నాం. ఇదే సమయంలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేశాం’’ అని అన్నారు.కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్ ఆరోపణలు చేయటంపై ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది.చదవండి: US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం -
అమిత్ షాపై కెనడా సంచలన ఆరోపణ
అట్టావా: భారత హోంమంత్రి అమిత్ షాపై కెనడా సంచలన ఆరోపణలు చేసింది. కెనడాలోని ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో, రెండు దేశాల మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది.తాజాగా ఓ కార్యక్రమంలో కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ మాట్లాడుతూ..‘కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారు. ఈ విషయాలను మేము వెల్లడిస్తున్నాం. ఇదే సమయంలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేసినట్లు అంగీకరించారు.ఈ విషయాలు చెప్పేందుకు, తాను ఆ సమాచారం లీక్ చేయడానికి ట్రూడో అనుమతి అవసరం లేదన్నారు. ఈ దౌత్య వివాదంలో ఒక అమెరికన్ మీడియా కెనడా వాదనను వినిపించేలా చేస్తానన్నారని డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్ తెలిపారు. తమ కమ్యూనికేషన్ వ్యూహం మొత్తాన్ని ట్రూడో ఆఫీస్ పర్యవేక్షిస్తోందని చెప్పారు.🚨 HUGE. Canada ACCUSES 🇮🇳 Home Minister Amit Shah.Canadian Deputy foreign Minister says "Amit Shah AUTHORISED violent operations targeting Khalistanis in Canada."– This statement will BACKFIRE Canada only & will boost Modi govt's image in India 🎯pic.twitter.com/28y5t1VK13— Megh Updates 🚨™ (@MeghUpdates) October 30, 2024 ఇక, అక్టోబర్ 14వ తేదీకి ముందు తాను వాషింగ్టన్ పోస్టు పత్రికకు వెల్లడించిన సమాచారం సీక్రెట్ ఏమీ కాదని నటాలియా సదరు ప్యానల్‌కు వెల్లడించారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకొన్న చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు. కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆధారాలను న్యూఢిల్లీకి వెల్లడించినట్టు చెప్పుకొచ్చారు. -
కెనడా ప్రధాని ఆరోపణలు.. భారత రాయబారి స్పందన
భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న దౌత్యసంబంధాలను ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నాశనం చేశారిన కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ అన్నారు. ఖలిస్తానీ నేత నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా భారత్‌తో ఎలాంటి సాక్ష్యాలను పంచుకోలేదని తెలిపారు. ఈ హత్యకేసు విషయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.‘ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు.. ఖచ్చితమైన సాక్ష్యం కంటే ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా చేసినవిగా ఉన్నాయి. ఆరోపించిన, బలమైన సాక్ష్యం లేదని అయనే ఒప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా..టట్రూడో ఇరు దేశాల మధ్య సంబంధాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ప్రస్తుతం చూసి చూపించాడు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్ల కెనడా ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు’’ అని అన్నారు.🇨🇦🇮🇳INDIAN AMBASSADOR BLAMES TRUDEAU FOR DIPLOMATIC NIGHTMAREIndia's expelled envoy to Canada, Sanjay Kumar Verma, fired back at Trudeau, accusing him of wrecking diplomatic relations between the two nations.Verma, who was ousted after Trudeau tied him to the murder of Sikh… pic.twitter.com/CcKnhhfOuo— Alex Kennedy (@therealmindman) October 21, 2024 ఇటీవల భారత్ ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన దర్యాప్తుతో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మకు సంబంధం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసింది. కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిచింది. అనంతరం కెనడాలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.చదవండి: రష్యాపైకి ఉక్రెయిన్ 100 డ్రోన్లు -
దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి
ఒట్టావా: ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతాన్ని తెరపైకి తెచ్చి భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారని కెనడా విపక్షనేత మాక్సిమ్ బెర్నియర్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలంటే మరణానంతరం నిజ్జర్ పౌరసత్వాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయముందని ట్రూడో ఆరోపించడం, పరస్పర దౌత్యవేత్తల బహిష్కరణతో భారత్– కెనడా సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి కేంద్రబిందువైన నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, అతనికి 2007లో కెనడా పౌరసత్వం లభించిందని పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నేత బెర్నియర్ అన్నారు. కెనడా గడ్డపై భారత రాయబార సిబ్బంది నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది నిజమైతే.. అది చాలా తీవ్రమైన విషయమని, తగుచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా భారత్ ప్రమేయంపై ఎలాంటి ఆధారాలను ప్రభుత్వం బయటపెట్టలేదని, ఇతర వివాదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ట్రూడో నిజ్జర్ హత్యను వాడుకుంటున్నారని సుస్పష్టంగా కనపడుతోందన్నారు. నిజ్జర్ విదేశీ ఉగ్రవాది అని, 1997 నుంచి పలుమార్లు తప్పుడు పత్రాలతో కెనడా పౌరసత్వాన్ని పొందడానికి ప్రయత్నించాడని అన్నారు. పలుమారు తిరస్కరణకు గురైనా మొత్తానికి 2007 పౌరసత్వం దక్కించుకున్నాడని తెలిపారు. నిజ్జర్ కెనడా పౌరుడు కాదని, అధికారిక తప్పిదాన్ని సరిచేసుకోవడానికి వీలుగా.. మరణానంతరం అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని బెర్నియర్ డిమాండ్ చేశారు. అతని దరఖాస్తు తిరస్కరణకు గురైన మొదటిసారే నిజ్జర్‌ను వెనక్కిపంపాల్సిందన్నారు. -
పరువుచేటు పనులు!
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే హత్యలూ, హత్యాయత్నాలూ ఒక్కోసారి ఉలిక్కిపడేలా చేస్తాయి. వాటి వెనక ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు తలెత్తితే అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా సందర్భాల్లో అవి దేశాలమధ్య చిచ్చు రేపుతాయి. ఇలాంటి ఆపరేషన్లను గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. చేతికి నెత్తురంటకుండా, సాక్ష్యాధారాలేమీ మిగలకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో ఆ సంస్థ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. అలాంటి ఉదంతంలో ఇప్పుడు మన దేశం పేరు వినబడటం ఆశ్చర్య కరమే. అమెరికాలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం కేసులో అమెరికాలో దాఖలైన తాజా నేరారోపణ పత్రం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏడాదికాలంగా ఆ పంచాయతీ నడుస్తోంది. నేరుగా భారత్‌ను నిందించక పోయినా నిరుడు మే నెలలో దాఖలు చేసిన నేరారోపణ పత్రం తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం వెనక ‘భారత ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రమేయం ఉన్నద’ంటూ ఆరోపించింది. అప్పట్లో ఆ ఉద్యోగి పేరు వెల్లడించకుండా ‘సీసీ 1’గా మాత్రమే ప్రస్తావించింది. కానీ శుక్రవారం అమెరికా న్యాయశాఖ అతని పేరు వికాస్ యాదవ్ అనీ, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఇంతక్రితం పనిచేశాడనీ వెల్లడించింది. వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని నేరారోపణ పత్రం చెప్పటం... భారత ప్రభుత్వం ఈ కేసులో తమకు సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అనటం ఉన్నంతలో ఊరట. తమ దేశంలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని ఒకపక్క కెనడా ఆరోపిస్తున్న తరుణంలో అమెరికా సైతం ఇదే తరహా ఆరోపణ చేయటం గమనించదగ్గది. ఎన్నికల్లో సిక్కు ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధాని ట్రూడో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసిన మన దేశానికి తాజా పరి ణామం ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గురుపత్వంత్ను హతమార్చ టానికి ఏమేం చేయాలో నిందితులు చర్చించుకున్న సందర్భంలోనే నిజ్జర్ హత్యను జయప్రదంగా పూర్తిచేయటం గురించిన ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే వారికి వేయి కళ్లుండాలి. తాము ఎవరిని సంప్రదిస్తున్నామోక్షుణ్ణంగా తెలిసివుండాలి. కానీ ఆ సమయంలో రా సీనియర్ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్ మాదకద్రవ్య ముఠాలతో సంబంధాలుండే నిఖిల్ గుప్తాకు గురుపత్వంత్ను అంతంచేసే బాధ్యత అప్పగించటం, గుప్తా దాన్ని కాస్తా కిరాయి హంతకుడనుకున్న మరో వ్యక్తికి ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్లో దొరికిపోవటం, అతన్ని ఆ దేశం అమెరికాకు అప్పగించటం పర్యవసానంగా మొత్తం పథకం బట్టబయలైంది. కిరాయి హంతకుడనుకున్న వ్యక్తి కాస్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక విభాగం ఏజెంటు. ఆ సంగతి తెలియక హత్య కోసం అతనితో లక్ష డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకోవటం, అందులో 15 వేల డాలర్లు చెల్లించటం నిఖిల్ గుప్తాతోపాటు వికాస్ మెడకు చుట్టుకుంది. అది మన దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెచ్చింది. వికాస్ సాధారణ అధికారి కాదు. రా సంస్థకు ముందు ఆయన సీఆర్పీఎఫ్లో పనిచేశాడు. వికాస్‌ను సర్వీసునుంచి తొలగించి అతనికోసం గాలిస్తున్నామని మన ప్రభుత్వం ఇచ్చిన వివరణకు అమెరికా సంతృప్తి చెందింది. ‘రా’లో ఉన్నతాధికారులకు చెప్పకుండా వికాస్ యాదవ్ ఇలాంటి పెడధోరణులకు పాల్పడ్డాడని మన ప్రభుత్వం చెబుతోంది. విదేశాల్లో గూఢచర్యం ఆషామాషీ కాదు. అలాంటి పనిలో నిమగ్నమైవుండేవారు ఉన్నతాధి కారులకు తమ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వర్తమానం అందిస్తే వేరే విషయం. చెప్పినా చెప్ప కున్నా అంతా సవ్యంగా జరిగితే రివార్డులు దక్కవచ్చేమో. కానీ వికటిస్తే ఆ అధికారితోపాటు దేశం పరువు కూడా పోతుంది. గురుపత్వంత్ ఖలిస్తాన్ వేర్పాటువాదే కావొచ్చు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తే అయివుండొచ్చు. మన దేశంలో కేసులుంటే తమకు అప్పగించాలని అమె రికాను కోరాలి. ఆ దేశ పౌరుడిగా అక్కడే స్థిరపడిన వ్యక్తిపై అంతకుమించి ఏదో సాధించాలను కోవటం తెలివితక్కువతనం. అసలు ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందా? అతని సహచరులు భయకంపితులై ఉద్యమానికి దూరమవుతారా? ఏం సాధిద్దా మని వికాస్ ఇలాంటి పనికి సిద్ధపడ్డాడో తేల్చటం అవసరం. వికాస్ యాదవ్ విషయంలో ఇంత పట్టుదలగా పనిచేస్తున్న అమెరికా చరిత్ర కూడా తక్కువేమీ కాదు. 2003 నాటి రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ‘రా’లో సంయుక్త కార్య దర్శిగా ఉన్న రవీందర్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంటుగా పనిచేసి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వగైరా దేశాల్లో రా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందజేశాడు. తనసంగతి బయటపడిందని గ్రహించగానే కుటుంబంతో సహా మాయమై అమెరికాలో తేలాడు. వారికి అక్కడ మారు పేర్లతో పాస్‌పోర్టులు కూడా మంజూరయ్యాయి. విచిత్రంగా మన దేశం అతన్ని అప్పగించాలని పట్టుబట్టలేదు. ఉద్యోగంనుంచి తొలగించి అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడంతో సరిపెట్టింది. 2016లో ఒక రోడ్డు ప్రమాదంలో రవీందర్ మరణించాడని అంటున్నా దాన్ని ధ్రువీకరించే సమాచారం మన ప్రభుత్వం దగ్గరలేదు. మొత్తానికి గూఢచర్యం వికటిస్తే ఏమవుతుందో వికాస్ యాదవ్ ఉదంతం తెలియజెబుతోంది. -
నిరాధార ఆరోపణలు... అనవసర ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడా తీరును భారత్ మరోసారి తూర్పారబట్టింది. ఈ విషయమై ఏ ఆధారాలూ లేకున్నా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతారహితంగా చేసిన తీవ్ర ఆరోపణలే ఇరు దేశాల మధ్య తాజా దౌత్య వివాదానికి ఆజ్యం పోశాయంటూ ఆక్షేపించింది. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్లున్నారన్న తన ఆరోపణలకు నిఘా సమాచారమే ఆధారం తప్ప దాన్ని నిరూపించేందుకు ఎలాంటి రుజువులూ తమ వద్ద లేవని ట్రూడో బుధవారం స్వయంగా అంగీకరించడం తెలిసిందే. భారత్‌పై ఆయన ఆరోపణల్లో పస ఎంతో దీన్నిబట్టే అర్థమవుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నిజ్జర్ ఉదంతానికి సంబంధించి కెనడా తమకు ఇప్పటిదాకా ఎలాంటి రుజువులూ ఇవ్వలేదని భారత్ పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందేది.దొంగ ఏడ్పులు...నిజ్జర్ హత్య వెనక కూడా బిష్ణోయ్ గ్యాంగే ఉందని కెనడా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్‌లో అరాచకాలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్‌కు చెందిన పలువురు సభ్యులను అరెస్టు చేసి అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా స్పందనే లేదని జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘కెనడా గడ్డపై ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ శక్తుల్లో గుర్జీత్‌సింగ్, గుర్జీందర్‌సింగ్, అర్‡్షదీప్‌సింగ్ గిల్, లఖ్బీర్సింగ్ లండా, గుర్‌ప్రీత్‌సింగ్ తదితరుల పేర్లను ట్రూడో సర్కారుకు ఎప్పుడో ఇచ్చాం. వీరిలో పలువురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులూ ఉన్నారు. వీరంతా ఉగ్రవాదం తదితర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వీరిని అప్పగించాల్సిందిగా ఏళ్ల క్రితమే కోరాం. తాజాగా ఇటీవల కూడా విజ్ఞప్తి చేశాం. కానీ కనీస స్పందన లేదు’’ అని వివరించారు. ‘‘ఇలాంటి కనీసం 26 విజ్ఞప్తులు కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. భారత భద్రత కోణం నుంచి చూస్తే ఇది చాలా తీవ్రమైన అంశం’’ అని వివరించారు. ‘‘వారిపై కనీసం గట్టి చర్యలైనా తీసుకోవాలని భారత్ ఎన్నిసార్లు కోరినా ట్రూడో సర్కారు పెడచెవిన పెడూతూ వస్తోంది. వారి రెచ్చగొట్టే ప్రసంగాలను భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చూసీ చూడనట్టు వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ఓవైపేమో భారత్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారిని ఉద్దేశపూర్వకంగానే పట్టుకోవడం లేదు. మరోవైపు అదే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు భారత ఆదేశాల మేరకు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడుస్తోంది’’ అంటూ జైస్వాల్ నిప్పులు చెరిగారు. ట్రూడో సర్కారు తాలూకు ఈ ప్రవర్తన కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని ఆయన స్పష్టం చేశారు. మరో ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. -
కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యలో దౌత్యపరమైన విభేదాలు చెలరేగాయి. అయితే.. భారత్‌పై ఆరోపణలతో ఊదరగొట్టిన జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఇక.. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే తాము భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు అంగీకరించారు. దీంతో కెనడా ప్రధాని తీరును భారత్ తీవ్రంగా ఖండిచింది. ‘‘చాలా రోజులుగా మేం చెబుతున్న విషయమే నిర్ధారణ అయింది. భారతదేశం, భారతీయ దౌత్యవేత్తలపై కెనాడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎటువంటి సాక్ష్యాలను మాకు అందించలేదు. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నిరూపితమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం ప్రధాని ట్రూడోనే’’ అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్‌వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. విదేశీ జోక్యంపై పార్లమెంటరీ విచారణలో కెనడాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రధాని ట్రూడో విమర్శలను భారత ప్రతినిధులు ధీటుగా తిప్పికొట్టారని అన్నారు.Our response to media queries regarding PM of Canada's deposition at the Commission of Inquiry: https://t.co/JI4qE3YK39 pic.twitter.com/1W8mel5DJe— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2024చదవండి: Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు -
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్‌ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
కెనడా అడ్డగోలు ఆరోపణలు
ఒట్టావా/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, కెనడా దౌత్యబంధానికి హఠాత్తుగా బీటలు పడుతున్నాయి. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ హైకమిషన్ పేరును చేర్చిన కెనడా తాజాగా వ్యవస్థీకృత నేరగ్యాంగ్తో భారతీయ ఏజెంట్లకు సంబంధం అంటగట్టి భారత్‌తో దౌత్యబంధంలో ఆగ్రహజ్వాలలను రగలించింది. భారత్‌పై కెనడా నోటికొచి్చనట్లు ఆరోపణలు గుప్పించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మొదలు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులదాకా అందరూ మూకుమ్మడిగా భారత్‌పై అభాండాలు మోపారు.కెనడాలోని ఖలిస్తానీ నేతలను భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని, ఇందుకోసం కెనడాలోని బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఏజెంట్లు చేతులు కలిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కెనడియన్లపై దాడులకు భారత్ తన ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను ఆశ్రయించిందని కెనడా ప్రధాని ట్రూడో మంగళవారం దారుణ విమర్శలు చేశారు. తప్పని పరిస్థితుల్లో భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. కెనడా అధికారులు, నేతల మూకుమ్మడి విమర్శలను భారత్ ఏకపక్షంగా తోసిపుచ్చింది.నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్ అందుకు ప్రతిగా ఢిల్లీలోని ఆరుగురు దౌత్యాధికారులను బహిష్కరించడం, దానికి ప్రతీకారంగా కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యాధికారులను బహిష్కరించిన నేపథ్యంలో మంగళవారం కెనడా ఆరోపణల పర్వం మొదలెట్టింది. ఖలిస్తాన్ ఉద్యమకారులపై దాడులు కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమకారులు, నేతలపై దాడులను ప్రస్తావిస్తూ రాయల్ కెనడా మౌంటెడ్ పోలీస్ కమిషనర్ మైక్ డ్యూహెన్, డిప్యూటీ కమిషనర్ బ్రిగిట్ గౌవిన్లు మంగళవారం ఒట్టావాలో మీడియాతో మాట్లాడారు. ‘‘దక్షిణాసియా వాసులను, ముఖ్యంగా ఖలిస్తాన్ ఉద్యమంలో భాగస్వాములైన వారిని భారతీయ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్‌తో చేతులు కలిపారు. హత్య, డజనుకుపైగా బెదిరింపులు, హింసాత్మక ఘటనలతో భారత్‌కు సంబంధం ఉంది. హత్యల కేసులో 8 మందిని, భారతప్రభుత్వంతో సంబంధం ఉండి బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో 22 మందిని అరెస్ట్‌చేశాం’’అని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసులో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ తెరపైకి వచి్చన వేళ ఆ నేరముఠా పేరును కెనడా పోలీసులు ప్రస్తావించడం గమనార్హం. భారత్ పెద్ద తప్పిదం చేసింది: ట్రూడో కెనడా రాయల్ పోలీసులు ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ట్రూడో మీడియాతో మాట్లాడారు. ‘‘కెనడియన్లపై దాడి చేసేందుకు భారత్ తన దౌత్యవేత్తలు, ఏజెంట్లతోపాటు వ్యవస్థీకృత నేరగాళ్లను వినియోగించి భారీ తప్పిదం చేసింది. కెనడాలో హింస పెరగడంలో భారత పాత్ర దాగి ఉంది. భారత వైఖరితో మా పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. హింసకు పాల్పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గత వేసవికాలం నుంచి మా పంచ నేత్ర నిఘా కూటమి(ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా)తో భారత వైఖరిని పంచుకుంటున్నాం. చట్టాలకు అతీతంగా భారత్ హత్యలకు ప్రయత్నించింది. భారత్‌తో ఇలాంటి ఘర్షణాత్మక సంబంధాలను మేం కోరుకోవట్లేము. కానీ మాతో కలిసి పనిచేసేందుకు భారత్ విముఖత చూపుతోంది’’అని ట్రూడో వ్యాఖ్యానించారు. ఆరోపణలను తోసిపుచి్చన భారత్ ‘‘నిజ్జర్ కేసులో సాక్ష్యాలను ఇచ్చామని కెనడా చెబుతున్న దాంట్లో నిజం లేదు. ట్రూడో మళ్లీ అదే పాత కారణాలను, పాత విషయాలను వల్లె వేశారు. నిజ్జర్ హత్య ఘటనకు ఎవరు బాధ్యులో, ఎందుకు బాధ్యులో కెనడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. ఆ ఉదంతంలో గత ఏడాదికాలంగా భారత హైకమిషర్‌ను వేధించి ఇప్పుడు కేసులో ఇరికించి లక్ష్యంగా చేసుకోవడం అసంబద్ధం’’అని భారత్ ఆగ్రహం వ్యక్తంచేసింది.కెనడా, భారత్ జాతీయ భద్రతా సలహాదారుల రహస్య భేటీ! భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కెనడా జాతీయ భద్రతా మహిళా సలహాదారు నాథలీన్ డ్రౌలీ, ఉన్నతాధికారులతో వారం రోజుల క్రితం సింగపూర్‌లో రహస్యంగా సమావేశమయ్యారని అమెరికా వార్తాసంస్థ వాషింగ్టన్ పోస్ట్ కొత్త కథనం ప్రచురించింది. నిజ్జర్ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయముందని కెనడా రాయల్ పోలీసులు ఆరోపించిన వేళ ఈ వార్త చర్చనీయాంశమైంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై దాడులకు, నిజ్జర్‌ను హత్యచేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను భారత్ వాడుకుందని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కెనడా అధికారులు దోవల్‌కు సమరి్పంచారని కథనం సారాంశం. -
మన పాలిట మరో పాకిస్తాన్!
ఇరవై నాలుగు గంటల్లో అంతా మారిపోయింది. భారత, కెనడా దౌత్యసంబంధాలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. ఏడాది పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉన్నా, తాజా పరిణామాలతో అది పరాకాష్ఠకు చేరింది. అతివాద సిక్కుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అనుమానితుల జాబితాలో తమ దేశంలోని భారత దూతనూ, ఇతర దౌత్య వేత్తలనూ కెనడా చేర్చేసరికి సోమవారం సాయంత్రం కొత్త రచ్చ మొదలైంది. తీవ్రంగా పరిగణించిన భారత్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ, కెనడా యాక్టింగ్ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలతో ఇదే రకంగా వ్యవహరించింది. భారత్ ‘ప్రాథమికమైన తప్పు’ చేస్తోందనీ, ఢిల్లీ చర్యలు అంగీ కారయోగ్యం కాదనీ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ప్రకటించారు. వెరసి, వ్యవహారం చినికిచినికి గాలివాన నుంచి దౌత్యపరమైన తుపానైంది. రానున్న రోజుల్లో కెనడా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా మరిన్ని పర్యవసానాలు తప్పవని తేలిపోయింది.ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహసంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షలమంది భారతీయ సంతతి వారే. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీయ మూలాల వారే! ఇక, దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయ విద్యార్థులు ఆ దేశంలో చదువుతున్నారు. దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్ఠమైన వ్యాపారబంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణి లోని వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్యయుద్ధ వాతావరణాన్నీ ఊహించలేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజలకూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం. కెనడా గడ్డపై గత జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యపై విచారణలో భారత్ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ. సహకరించాలని కెనడా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానం. అయితే, ఆ హత్యలో భారత ప్రమేయం గురించి సాక్ష్యాధారాలేమీ లేకుండానే అన్నీ సమర్పించి నట్టు ఒట్టావా అబద్ధాలు ఆడుతూ, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. పైగా, తమ దేశంలోని కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకొని భారత్ కోవర్ట్ ఆపరే షన్లు చేస్తోందంటూ ట్రూడో ఎప్పటిలానే నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం ఏ రకంగా చూసినా సహించరానిది. భారత ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో తొలి సారిగా ప్రకటన చేసినప్పటి నుంచి ట్రూడోది ఇదే వరస. ఒకవేళ ఆయన ఆరోపణల్లో ఏ కొంచె మైనా నిజం ఉందని అనుకున్నా... మిత్రదేశంతో గుట్టుగా సంప్రతించి, వ్యవహారం చక్కబెట్టుకోవా ల్సినది పోయి ఇలా వీధికెక్కి ప్రకటనలతో గోల చేస్తారా? ఇక్కడే ట్రూడో స్వార్థప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక, అవాంఛిత ఆరోపణలకు దిగుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్థమవుతోంది. భారత్ వెలుపల సిక్కులు అత్యధికం ఉన్నది కెనడాలోనే! అందులోనూ వేర్పాటువాద ఖలిస్తా నీలూ ఎక్కువే. ఈ అంశంపై ఇందిరా గాంధీ కాలం నుంచి ఇండియా మొత్తుకుంటున్నా ఫలితం లేదు. 1985లో కనిష్క విమానం పేల్చివేతప్పుడు ప్రధానిగా ఉన్న ట్రూడో తండ్రి నుంచి ఇవాళ్టి దాకా అదే పరిస్థితి. సిక్కులను ఓటుబ్యాంకుగా చూస్తూ... వాక్ స్వాతంత్య్రపు హక్కు పేరిట ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను పెంచిపోషిస్తూ వచ్చింది. ఆ అండ చూసుకొని తీవ్రవాద బృందాలు రెచ్చి పోయి, కొంతకాలంగా అక్కడి భారతీయ దేవాలయాలపై దాడులు చేస్తూ వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిర హత్యను సమర్థిస్తూ ఊరేగింపు జరిపాయి. చివరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగడమే కాక భారతీయులనూ, భారతీయ సంతతి వారినీ ప్రాణాలు తీస్తామని బెదిరించే దశకు వచ్చాయి. కనీసం 9 ఖలిస్తానీ తీవ్రవాద బృందాలు కెనడాలో ఉన్నాయి. పాకిస్తానీ గూఢచర్యసంస్థ తరఫున పనిచేస్తున్నవారూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నేరాలకు దిగుతున్న ఇలాంటి వారిని మన దేశానికి అప్పగించాలని పదే పదే కోరుతున్నా, ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.ట్రూడో సారథ్యంలోని కెనడా, పొరుగున ఉన్న మన దాయాది దేశం తరహాలో ప్రవర్తిస్తూ వస్తోంది. కశ్మీర్‌ను రాజకీయంగా వాడుకుంటూ, అక్కడ నిప్పు రాజేసి తమ వాళ్ళ మెప్పు పొందా లని పాకిస్తాన్ చూస్తే... భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జన రల్ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ. ప్రస్తుతం ఆయన సారథ్యంలోని సంకీర్ణ సర్కార్ సైతం ఖలిస్తానీ జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్ పాలిట కెనడా అచ్చంగా మరో పాకిస్తాన్‌గా అవతరించింది. 2019 పుల్వామా దాడుల తర్వాత పాక్‌తో దౌత్య బంధాన్ని తగ్గించుకున్నట్టే... దౌత్యవేత్తల బహిష్కరణ పర్వంతో భారత్ ఇప్పుడు అధికారికంగా కెనడాను సైతం పాక్ సరసన చేర్చినట్లయింది. అసలిలాంటి పరిస్థితి వస్తుందని తెలిసీ, జాగ్రత్త పడకపోవడం మన దౌత్య వైఫల్యమే! అదే సమయంలో తాము పాలు పోసి పెరట్లో పెంచుతున్న పాములైన ఖలిస్తానీలు ఏదో ఒకరోజు తమనే కాటేస్తారని కెనడా గ్రహించాలి. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్న కల సంగతేమో కానీ, అక్షరాలా తీవ్రవాదం, అప్పులు, గృహ వసతి సంక్షోభంతో కెనడాను మరో పాక్‌గా మార్చడంలో ట్రూడో సక్సెసయ్యారు. అదే విషాదం. -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
‘మీ మీద మాకు నమ్మకం లేదు’.. కెనడా ప్రధానిపై భారత్ ఆగ్రహం
ఢిల్లీ : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ -కెనడా మధ్య దౌత్య పరమైన వివాదం రాజుకుంది. కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ కార్యాలయానికి కెనడా అధికారి స్టీవర్ట్ వీలర్ సమన్లను అందుకున్నారు.నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషన్ సహా, పలువురు దౌత్య వేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చింది కెనడా. అంతేకాదు వారిని విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయాన్ని ఖండించింది భారత్. కెనడా వాదన అసమంజసమని కొట్టిపారేసింది. ట్రూడో సర్కార్ రాజకీయ ఎజెండాలో భాగమేనంటూ ఫైరయ్యింది.ట్రూడోకు భారత్ పట్ల విధ్వేష భావం ఉందని భారత్ తన ప్రకటనలో తెలిపింది. భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద,వేర్పాటువాద ఎజెండాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రూడో తన కేబినెట్లో చేర్చుకున్నారని విమర్శించింది.ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో గతేడాది వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని నాటి నుంచి నేటి వరకు తమతో పంచుకోలేదని భారత్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించింది. కెనడా హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘హై కమీషనర్ సంజయ్ కుమార్ వర్మ 36 సంవత్సరాల పాటు దౌత్యవేత్తగా విశిష్టమైన సేవలందించారు. భారత్‌లోనే అత్యంత సీనియర్ దౌత్యవేత్త. సంజయ్ కుమార్ జపాన్, సూడాన్‌లలో రాయబారిగా ఉన్నారు. ఇటలీ, టర్కీ, వియత్నాం, చైనాలలో కూడా సేవలందించారు. అలాంటి దౌత్యవేత్తపై కెనడా ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ సందర్భంగా కెనడా నుంచి భారత హై కమిషనర్‌ను వెనక్కు పిలిపించింది. భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదు అందుకే వెనక్కి పిలిపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో హై కమిషనర్‌తో పాటు ఇతర దౌత్య సిబ్బంది భారత్‌కు తిరిగి రానున్నారు. -
నిజ్జర్‌కు కెనడా నివాళి.. స్పందించిన భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించడంపై భారత ప్రభుత్వం శుక్రవారం(జూన్ 21) స్పందించింది. వేర్పాటువాదం, హింసను సమర్థించే చర్యలను వ్యతిరేకిస్తామని తెలిపింది. గతేడాది జూన్‌లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా బయట నిజ్జర్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు.ఈ ఘటన వెనుక భారత ‘రా’ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య విభేదాలు ఏర్పడ్డాయి. ట్రూడో ఆరోపణలను అప్పట్లో భారత్ ఖండించింది. హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల నిజ్జర్‌కు నివాళులర్పించడం గమనార్హం. ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించడమే కాకుండా ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి మృతికి దేశ పార్లమెంట్లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. మరోవైపు వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి తగిన కౌంటర్ కూడా ఇచ్చింది.ఎయిర్ ఇండియాా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చివేసి ఈ జూన్ 23కు 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఖలిస్తానీ తీవ్రవాదులు పెట్టిన బాంబుకు ఆ విమానం ముక్కలు కావడంతో 329 మంది మృతి చెందారు. ఆ రోజున వాంకోవర్‌లో ఉన్న ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం కెనడా పార్లమెంటు నివాళులరి్పంచింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో సభ్యులు మౌనం పాటించారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత నిజ్జర్ గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా గురుద్వారా ఎదుట జరిగిన కాల్పుల్లో హతమాయ్యాడు. భారత ప్రభుత్వం ప్రకటించిన టెర్రిరిస్టుల జాబితాలో నిజ్జర్ పేరు ఉంది. నలుగురు భారతీయులు నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1997లో నకిలీ పాస్‌పోర్ట్‌పై నిజ్జర్ కెనడాకు వెళ్లాడు. శరణార్థిగా కెనడా పౌరసత్వాన్ని కోరాడు. ఇది తిరస్కరణకు గురైంది. అనంతరం తాను కెనడాకు రావడానికి సహాయపడ్డ మహిళను నిజ్జర్ వివాహమాడి మరోమారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మళ్లీ తిరస్కరణకు గురైంది. అయితే నిజ్జర్ హత్యకు గురైన వెంటనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయూ అతను కెనడా పౌరుడని పార్లమెంటులో చెప్పారు. నిజ్జర్ కేటీఎఫ్ కోసం నియామకాలు చేసుకొని.. వారికి శిక్షణ ఇస్తున్నాడని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి అరి్పంచడంపై వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ తీవ్రవాదులు బాంబులు అమర్చడంతో 329 ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్థం ఈనెల 23న (విమాన ఘటన 39 ఏళ్లు) సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. -
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
వాషింగ్టన్/ఒట్టావా: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా మరో భారతీయుడిని అరెస్ట్‌చేశారు. బ్రాంప్టన్ సిటీలో నివసించే 22 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌ను హత్య, హత్యకు కుట్ర నేరాల కింద అరెస్ట్‌చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో గత వారమే ముగ్గురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్‌చేశారు. అమన్దీప్ను ఒంటారియాలో మే 11న అరెస్ట్‌చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. బ్రిటిష్ కొలంబియాలో 2023 జూన్ 18వ తేదీన గురునానక్ గురుద్వారా వద్ద 45 ఏళ్ల నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. నిజ్జర్‌ను చంపిన ఇద్దరు షూటర్లలో అమన్‌దీప్ ఒకడని గ్లోబల్ న్యూస్ ఒక కథనం వెలువర్చింది. -
కెనడా నిజ్జర్ కేసు: మరో అనుమానితుడు అరెస్ట్
అట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిజ్జర్ కేసులో కెనడా పోలీసులు మరో అనుమానితుడిని అరెస్టు చేశారు. దీంతో, ఈ కేసులో నాలుగో వ్యక్తి అమర్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ కేసులో మరో అనుమానితుడు అమర్దీప్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాంప్టన్ ప్రాంతంలో ఉంటున్న అమర్‌దీప్‌ను అరెస్ట్ చేసినట్టు అధికారికంగా తెలిపారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కరన్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్, కరన్ ప్రీత్ సింగ్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌కు చెందిన వీరు ముగ్గురు ప్రస్తుతం ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసముంటున్నారు. మరోవైపు, ఈ పరిణామాల వెనక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని భారత విదేశాంగా శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు విషయంలో కెనడా కేవలం సమాచారం మాత్రమే ఇచ్చిందని తెలిపింది. అధికారికంగా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు కెనడా సర్కారు రాజకీయ వేదిక కల్పించిందని మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది జులై 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు చేశారు. -
నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ స్పందించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని, ఇందులో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులు కరణ్‌ప్రీత్ సింగ్ (28), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్‌పై జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తరచూ భారత్‌ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.మరోవైపు.. కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని పేర్కొంది. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
ఒట్టావా: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు. మరిన్ని అరెస్టులుంటాయని స్పష్టం చేశారు. ఎడ్మంటన్‌లో ఉంటున్న భారత పౌరులు కరణ్ బ్రార్(22), కమల్‌ప్రీత్ సింగ్(22), కరణ్‌ప్రీత్ సింగ్(28)లపై హత్య, హత్యకు కుట్ర కేసులు నమోదు చేశామన్నారు. కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం కోణంలోనూ విచారణ సాగుతోందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ) విభాగం శుక్రవారం తెలిపింది. 2023 జూన్ 18వ తేదీన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సర్రేలోని గురుద్వారా వెలుపల ఉన్న నిజ్జర్‌ను గుర్తు తెలియని దండగులు కాల్చి చంపారు. భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. -
నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
ఒట్టావా: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారికి అక్కడే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి 5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు నిజ్జర్ హత్యలో భారత్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.గతేడాది జూన్ 18న కెనడా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. -
ఖలిస్తానీ నేత హత్య వీడియో.. తొలిసారి టీవీలో ప్రసారం
ఒట్టావా: ఖలిస్తానీ అనుకూల నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వీడియో తొలిసారి కెనడాలోని ఓ టీవీ చానల్లో ప్రసారమైంది. గత ఏడాది జూన్ 18న కెనడా బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సులోని సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియోను కెనడాలో తొలిసారిగా అధికారిక సీబీసీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్ ప్లేస్‌లో నిజ్జర్ ప్రయాణిస్తున్న వైట్ సెడాన్కారును ఒక పిక్అప్ ట్రక్కు తొలుత అడ్డగిస్తుంది. అనంతరం ట్రక్కులో నుంచి నిజ్జర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన మాస్కులు ధరించిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడే వేచి ఉన్న టయోటా క్యామ్రీ కారులో ఎక్కి పారిపోయిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేకపోయింది. నిజ్జర్ హత్య కేసును ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఐహెచ్ఐటీ)దర్యాప్తు చేస్తోంది. నిజ్జర్ హత్యతో భారత వేగులకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ 18న ఆ దేశ పార్లమెంటులో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు -
నిజ్జర్ హత్య కేసు.. కెనడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఒట్టావో: ఖలిస్తానీ ఉద్యమ నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ నుంచి పూర్తి సహకారం అందుతోందని కెనడా తాజా మాజీ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ జోడీ థామస్ తెలిపారు. శుక్రవారం ఆమె తన పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘నిజ్జర్ హత్య కేసు విచారణలో భారత్ పూర్తిగా సహకరిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే దిశగా ముందుకు వెళుతున్నాయి. నిజ్జర్ హత్య కేసులో ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది. విచారణ సాఫీగా సాగేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తోంది’ అని థామస్ చెప్పారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఉన్న సర్రే నగరంలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్యకు భారత్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్(రా) వింగ్‌కు చెందిన ఏజెంట్లకు ఉన్న లింకుపై విచారణ చేపట్టామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అప్పట్లో ఆ దేశ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాలు రాయబారులను పరస్పరం బహిష్కరించాయి. ట్రూడో వ్యాఖ్యలు అభ్యంతరకరమని అప్పట్లో భారత్ ఖండించింది. ఇదీచదవండి.. వేధింపుల కేసులో భారత అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు -
నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?!
ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పురోగతి చోటు చేసుకుందా?. ఈ కేసుకు సంబంధించి.. ఇద్దరు వ్యక్తులను కెనడా పోలీసులు అరెస్టు చేయనున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్నారని సమాచారం. నిజ్జర్ హత్య తర్వాత హంతకులు కెనడాను విడిచిపెట్టలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెలల తరబడి పోలీసుల నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. కెనడా సర్రేలోని గురుద్వారాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను ఈ ఏడాది జులై 18న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది కాస్త భారత్-కెనడా వివాదంగా మారిపోయింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైన విషయం కాదని తెలిపింది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు భారత్ బాధ్యత వహించాలని కెనడా డిమాండ్ చేసింది. ప్రపంచ దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేసింది. ఇరుదేశాలు వీసాలపై నిబంధనలు విధించుకునే స్థాయికి వెళ్లాయి. ఇటీవలే కెనడా వీసాల రద్దును భారత్ సడలించింది. ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచే అయోధ్య రామ మందిర తలుపులు -
కెనడాకు మళ్లీ ఈ వీసా సేవలు
ఒట్టావా/న్యూఢిల్లీ: కెనడాతో దౌత్య వివాదం నేపథ్యంలో ఆ దేశస్థులకు నిలిపేసిన ఎల్రక్టానిక్ వీసాల జారీ సేవలను కేంద్రం పునరుద్ధరించింది. ఒట్టావాలోని భారత హై కమిషన్ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ మేరకు వెల్లడించింది. చేసింది. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్సింగ్ నిజ్జర్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించడం, అది భారత గూఢచారుల పనేనని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. -
భారత్‌తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
శాన్ఫ్రాన్సిస్కో: కెనడా-భారత్ సంబంధాలపై ఆ దేశ ఆర్థిక మంత్రి మేరీ ఎన్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో భారత్ సహకరించిన తర్వాతే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. నిజ్జర్ హత్యకేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ గురువారం తెలిపిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశానికి హాజరైన కెనడా ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్జీ మీడియాతో మాట్లాడుతూ.. "మా దృష్టంతా నిజ్జర్ కేసు దర్యాప్తుపైనే ఉంది. అందుకు భారత్ సహకరించేలా చేయడంపైనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పని పూర్తైన తర్వాతే ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచిస్తాం. మా దేశానికి చెందిన వ్యక్తి హత్యలో విదేశీ జోక్యం ఉందని ఆరోపణలు రావడాన్ని సీరియస్‌గా తీసుకున్నాం.' అని అయన చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఈ పరిణామాల తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసాలను కూడా రద్దు చేసుకున్నారు. ఈ కేసులో భారత్ దర్యాప్తుకు సహకరించాలని కెనడా ఒత్తిడి చేస్తోంది. ఇదీ చదవండి: ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి -
దౌత్యాధికారుల తగ్గింపు వ్యవహారం.. కెనడాకు అమెరికా, యూకేల మద్దతు
లండన్/వాషింగ్టన్: కెనడాకు చెందిన 41 మంది దౌత్యాధికారుల హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో తాము విభేదిస్తున్నట్లు అమెరికా, యూకేలు ప్రకటించాయి. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని భారత్ తీసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపాయి. వియన్నా ఒప్పంద సూత్రాలకు భారత్ ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకమని యూకే పేర్కొనగా, విభేదాల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో దౌత్యాధికారుల అవసరం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది. ‘దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయని మేం ఆశిస్తున్నాం. దౌత్యవేత్తల భద్రత కోసం కల్పించాల్సిన అధికారాలు, ఇతర హక్కులను ఏకపక్షంగా తొలగించడం వియన్నా సూత్రాల విరుద్ధం. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై స్వతంత్ర దర్యాప్తులో కెనడాతో పాలుపంచుకోవాలని భారత్‌ను కోరుతూనే ఉన్నాం’అని యూకే విదేశాంగశాఖ పేర్కొంది.‘భారత్‌లో దౌత్యాధి కారులను గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేయడం, కెనడా తన దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విభేదాలను పరిష్కరించడానికి క్షేత్ర స్థాయిలో దౌత్యవేత్తలు అవసరం. దౌత్యా ధికారులను తగ్గించాలంటూ కెనడాపై ఒత్తిడి తేవద్దని, నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం’అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. -
భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం నేపథ్యంలో భారత్ నుంచి 41 మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకుందని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. కెనడా ప్రతీకార చర్యలకు పాల్పడబోదని ఆమె వెల్లడించారు. కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడకపోతే శుక్రవారం ఏకపక్షంగా వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని జోలీ చెప్పారు. ఈ చర్యతో భారత్ దౌత్య సంబంధాలపై కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో భారత్ నుంచి దౌత్యవేత్తలను తరలించామని జోలి చెప్పారు. దౌత్యపరమైన విధానాలను నాశనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా దౌత్యవ్యవస్థ ఉండబోదని తెలిపారు. అందుకే తాము ప్రతిచర్యకు పాల్పడటం లేదని తెలిపారు. 41 మంది దౌత్యవేత్తలు వారిపై ఆధారపడిన 42 మంది సభ్యులను భారత్ నుంచి తరలించామని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ఇరుదేశాలు దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ మండిపడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరింది. అక్టోబర్ 10 నాటికి ఉపసంహరించుకోవాలని గడువును కూడా విధించింది. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
నిజ్జర్ హత్య కేసు: 'కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం లేదు'
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం కనిపించట్లేదని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ASIO) డైరెక్టర్ మైక్ బర్గెస్ అన్నారు. కాలిఫోర్నియాలోని ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ భాగస్వాముల చారిత్రాత్మక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ పౌరుని హత్య విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడం తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు ఏ దేశం పాల్పడకూడదని చెప్పారు. భారత ఏజెంట్ల తర్వాతి లక్ష్యం ఆస్ట్రేలియానేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అలా అని తాను ఊహించలేనని చెప్పారు. కెనడాలో జరిగిన విషయం ఆస్ట్రేలియా వరకు వస్తుందని చెప్పలేమని అన్నారు. ఇతర దేశ ప్రభుత్వం తమ దేశంలో జోక్యం చేసుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు పాల్పడుతున్న అతివాదులకు భారత్ నుంచి ముప్పు ఉంటుందని భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. అది వారినే అడగాలని దాటవేశారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించారు. తమ దేశ పౌరుని హత్యలో ఇతర దేశ ప్రమేయం తగదని హెచ్చరికలు చేసింది. ఇది ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. ఈ కేసు విచారణలో భారత్ సహకరించేలా ఒప్పించేట్లు ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా కెనడా చేసింది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని భారత్ వాదించింది. ఇదీ చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు -
ఉగ్రవాదాన్ని కెనడా ప్రోత్సహిస్తోంది
వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై నెలకొన్న విభేదాలను భారత్, కెనడా ప్రభుత్వం పరస్పరం చర్చించుకుంటే పరిష్కరించుకోవచ్చునని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. నిజ్జర్ హత్య కంటే ఉగ్రవాదాన్ని కెనడా ప్రభుత్వం ప్రోత్సహించడం అత్యంత తీవ్రమైన అంశంగా చూడాలని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదానికి, హింసాత్మక కార్యక్రమాలకు ట్రూడో ప్రభుత్వం అనుమతులిస్తోందని వెంటనే వాటిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ వాషింగ్టన్లో శుక్రవారం భారతీయ జర్నలిస్టులతో మాట్లాడారు. నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ గట్టిగా తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు. వాటిని పరిశీలించడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ చెప్పారు. ‘‘కెనడా ప్రభుత్వం నుంచి భారత్ చాలా కాలంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం, హింసాత్మక కార్యకలాపాలపై వారి ఉదాసీన వైఖరే ఇందుకు కారణం. భారత్‌లో నేరాలు చేసిన ఎందరో కెనడాలో తలదాచుకుంటున్నారు. వారిని అప్పగించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కెనడా ప్రభుత్వం స్పందించడం లేదు. నిజ్జర్ హత్యపై ఆధారాలు ఇవ్వకుండా అభాండాలు వేస్తోంది. మేము నాలుగ్గోడల మధ్య లేము. ఏదైనా పరిశీలిస్తాం’’ అని జై శంకర్ మండిపడ్డారు. నిజ్జర్ హత్య కంటే కెనడా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అతి పెద్ద సమస్యని దానినే మొట్టమొదట పరిష్కరించుకోవాలని అన్నారు. -
నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం..!
ఒట్టావా:కెనడా-భారత్ మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పాకిస్థాన్ ఉగ్రసంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన వివాదం పథకంలో భాగమనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇటీవల కెనడాలో పాగా వేయాలనే ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ దేశంలో కొంత మంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఒత్తిడి చేసిందట. ఆయన ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్థానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్‌ను హత్య చేశారనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమకు సహకరించడానికి ఐఎస్ఐ మరో వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖలిస్థానీ మద్దతుదారులకే మద్దతునిస్తున్నారని సమాచారం. ఇండియా-కెనడా వివాదం.. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా-కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు.. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయరాదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
నిజ్జర్‌పై 50 రౌండ్ల కాల్పులు.. సీసీటీవీలో రికార్డు
ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్-కెనడా మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్య వెనుక భారత్ హస్తముందని ఆ దేశ ప్రధాని ఆరోపించాక రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణలో భాగంగా హర్దీప్ సింగ్ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి బయటపడింది. వీడియోలో ఈ వీడియోకు సంబంధించి ప్రముఖ పత్రిక ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. ఈ ఏడాది జూన్ 18న కెనడాలో బ్రిటీష్ ప్రావిన్స్‌లోని సర్రే గురుద్వారా ఎదురుగా నిజ్జర్ హత్య జరిగింది. విచారణలో భాగంగా పోలీసులు అక్కడి గురుద్వారా సీసీ కెమెరాల్లో నిజ్జర్ హత్య తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. 90 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ముఖానికి మాస్కులు ధరించిన ఆరుగురు దుండగులు రెండు వాహనాలపై వచ్చి నిజ్జర్‌పై కాల్పులు జరిపారని ఆ పత్రికా కథనంలో పేర్కొంది. దుండగులు మొత్తం 50 రౌండ్లు కాల్పులు జరపగా అందులో 34 నిజ్జర్ శరీరంలో దూసుకెళ్లాయని తెలిపింది. నిజ్జర్ హత్యను ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపిన వివరాలతోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. భూపేందర్ సింగ్ అనే వాలంటీర్ అక్కడ ఆ సమయంలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నానని కాల్పుల శబ్దం విని ఏవో టపాసులు అనుకున్నానని తెలిపాడు. వెంటనే పార్కింగ్ వద్దకు వెళ్లి చూస్తే నిజ్జర్ ట్రక్ అద్దాలు మొత్తం రక్తసిక్తమై ఉన్నాయని తెలిపాడు. తనతోపాటు మరికొందరు స్నేహితులు కారు డోర్ తెరిచి చూస్తే అప్పటికే నిజ్జర్ చనిపోయాడన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు మాస్కులు ధరించి హుడీలు ధరించి ఉన్నారని తెలిపాడు. ఇది కూడా చదవండి: భారత్‌తో సైనిక సంబంధాలకు ఢోకా లేదు: కెనడా సైనికాధికారి -
భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై అమెరికా నెమ్మదిగా ఒత్తిడి పెంచుతోంది. ఈ కేసులో కెనడాకు సహకరించాలని ప్రైవేట్‌గా, బహిరంగంగా అభ్యర్థించామని స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయబద్ధంగా నిందితులను కోర్టులో హాజరుపరచాలని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కోరారు. కెనడా ఆరోపణలపై కలత చెందామని పేర్కొన్న ఆయన.. ఆ దేశంతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న US హౌస్ సభ్యుడు జిమ్ కోస్టా కూడా నిజ్జర్ హత్య కేసుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. బాధ్యులైనవారికి కఠిన శిక్షలు పడాలని అన్నారు. ఇందుకు భారత్ సహకరించాలని కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో -
ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది. ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
ఖలిస్తాన్ వాదులూ జాగ్రత్త!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న ఖలిస్తానీల ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) హెచ్చరికలు చేసింది. అమెరికన్ సిఖ్ కాకస్ కమిటీ కోఆర్డినేటర్‌గా ఉన్న ప్రీత్‌పాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..తనతోపాటు మరో ఇద్దరు అమెరికన్ సిక్కులను ఎఫ్‌బీఐ అధికారులు జూన్‌లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారని చెప్పారు. ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యునైటెడ్ హిందూ ఫ్రంట్ నిరసన తెలిపింది. భారత వ్యతిరేక ఖలిస్తానీలకు కెనడా ప్రధాని మద్దతు, రక్షణ కలి్పంచడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిపై అంతగా ప్రేముంటే కెనడాలోనే ప్రత్యేక ఖలిస్తాన్‌ను ట్రూడో ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. -
కెనడా ప్రధాని ద్వంద్వ నీతి.. ఆమె సంగతేంటి?
ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారత్‌పై నేరారోపణ చేయడనికి కూడా వెనకాడని కెనడా ప్రధాని అనుమానాస్పద రీతిలో మరణించిన న్యాయవాది, బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించింది బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాదికి అండగా? ఈ ఏడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని గురుద్వారా గుమ్మం వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఈ హత్య జరిగిన మూడు నెలల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమ్నెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రకటించి వివాదానికి తెరలేపారు. మొదటిగా కెనడాలోని భారతీయ దౌత్యాధికారిని కూడా విధుల నుంచి తొలగించగా భారత్ కూడా అందుకు దీటుగా స్పందించి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని తొలగించి ఐదురోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ప్రధానికి లేఖ.. ఒక ఉగ్రవాది హత్య జరిగితే ఇంతగా స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మూడేళ్ళ క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ మరణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది కెనడాలోని బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాది హత్యపై ప్రధాని అత్యుత్సాహంతో చేసిన ఆరోపణలకు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ చేస్తుండడంపైనా కరీమా బలూచ్ మృతిపై కనీసం ఆయన స్పందించకపోవడంపై సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తూ సంఘం ప్రధానికి ఒక లేఖను రాసింది. సమన్యాయం చేయండి.. బలూచ్ మానవహక్కుల సంఘం లేఖలో ఏమని రాసిందంటే.."కెనడాలో బలూచ్ వర్గం చాలా చిన్నది. పైగా పార్లమెంట్ ప్రతినిధుల ఎంపికలో కూడా మేము పెద్దగా ప్రభావం కూడా చూపలేము. బహుశా అందుకే కెనడా ప్రభుత్వం కరీమా విషయంలో ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని రాసింది. ఈ సందర్బంగా కెనడా సమాజంలోని ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడటంలో బలూచ్ వర్గం ఎంతగా సహకరించింది గుర్తుచేశారు. కరీమా కేసులో కూడా కెనడా లిబరల్ ప్రభుత్వం పారదర్శకతతో విచారణ జరిపించాలని కోరారు. రెండేళ్లుగా మా గోడును పట్టించుకోని ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని.. ఇప్పటికైనా బలూచ్ సంక్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కరీమాకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. ఎవరీ కరీమా బలూచ్? కెనడాలో మూడేళ్ళ క్రితం డిసెంబర్, 20న బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత టొరంటోలోని ఒంటారియో సరస్సులో విగతజీవిగా కనిపించింది. ఈమె వృత్తి పరంగా న్యాయవాది కాగా బలూచ్ మానవహక్కుల కోసం బలంగా పోరాడారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ఆగడాలపై చేసిన పోరాటానికి 2016లో బీబీసీ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె చోటును దక్కించుకున్నారు. Karima Baloch had been exposing the reality of Pak throughout her life and #PakArmy got so scared of her that it murdered her. But it didn’t stop other Baloch from speaking the truth. She continues to inspire all of us. #FreeBalochistan@Hani_Baloch7@yalsarmachar@FawazBaloch7 pic.twitter.com/lSmaI0cIYi — Sohrab Haider (@SohrabHaider7) September 23, 2023 ఇది కూడా చదవండి: భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం' -
భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం'
న్యూయార్క్: భారత్-కెనడా వివాదంలో అమెరికా తలదూర్చకపోవచ్చని రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ చార్లెస్ మైయర్స్ చెప్పారు. కెనడా వివాదం కారణంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న సంబంధాలకు అమెరికా ఇబ్బంది కలిగించబోదని ఆయన అన్నారు. ఈ వ్వవహారంలో అంటీ అంటనట్లు ఉండవచ్చని అంచనా వేశారు. భారత్- కెనడా వివాదంలో ఇరుదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి ఇరుదేశాలు సహకరించుకోవాలని కోరింది. ఈ అంశంలో భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. కానీ అమెరికా దాని మిత్రపక్షాలు ఈ అంశంలో భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోకుండా ఆగిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
అమెరికా ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు
న్యూయార్క్: కెనడాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అమెరికాలోని ఖలిస్థానీలకు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఖలిస్థానీ నేతల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియనందున జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు అమెరికా ఖలిస్థానీ నేతలు చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సుర్రే గురుద్వారాలో ఉండగా.. కాల్పులు జరిపి నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ కేసులో భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే.. నిజ్జర్ హత్య తర్వాత ఎఫ్‌బీఐ అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించింది. నిజ్జర్ హత్య తర్వాత ఇద్దరు ఎఫ్‌బీఐ అధికారులు తనను కలిసినట్లు అమెరికన్ సిక్కుల కోఆర్డినేటర్ ప్రతిపాల్ సింగ్ తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. తనతోపాటు మరో ఇద్దరు సిక్కు నేతలను కూడా ఎఫ్‌బీఐ అధికారులు కలిశారు. నిజ్జర్ హత్యకు ముందే హెచ్చరికలు.. నిజ్జర్ హత్యకంటే ముందే కెనడాలో సిక్కు నేతలను నిఘా వర్గాలు హెచ్చరించాయంట. ఈ విషయాన్ని బ్రిటీష్ కొలంబియా గురుద్వారా కౌన్సిల్ ప్రతినిధి మోనిందర్ సింగ్ తెలిపారు. సిక్కు నేతల ప్రాణాలకు ముప్పు ఉందని అంతకంటే ముందే సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఎన్ఐఏ అప్పట్లో కేసులు నమోదు చేసింది. అతనిపై రూ.10 లక్షల రివార్డ్‌ను కూడా ప్రకటించింది. మోహాలీలోని కోర్టులో అతనిపై ఛార్జీషీటు దాఖలు చేసింది. అయితే.. ఆయన్ను జూన్ 18న దుండగులు హత్య చేశారు. ఈ కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్థానీ మరో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. పన్నూన్ 'జస్టిస్ ఫర్ సిక్' అనే అమెరికా ఆధారిత సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. చంఢీగర్, అమృత్సర్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నడిచాయి. ఉపా చట్టం కింద భారత్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
Canada–India relations: నిజ్జర్ హత్యపై ఆధారాలిచ్చాం
టొరంటో/న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై విమర్శలు చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయంపై తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను భారత ప్రభుత్వానికి చాలా వారాల క్రితమే అందజేసినట్లు ట్రూడో తెలిపారు. తీవ్రమైన ఈ అంశంలో వాస్తవాలను ధ్రువీకరించే విషయంలో నిర్మాణాత్మకంగా భారత్ వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు. భారత్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కెనడాతో భారత్ సహకిస్తుందని ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల సమస్య మూలాల్ని తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. అయితే, అది ఎలాంటి సమాచారమో ఆయన వెల్లడించలేదు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ‘కెనడా ప్రధాని చెబుతున్నట్లుగా గతంలో గానీ, ఇప్పుడు గానీ అటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందనేలేదు. అటువంటిదేమైనా ఉంటే భారత ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇదే విషయాన్ని కెనడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం’అని స్పష్టం చేశారు. గతంలో కెనడా గడ్డపై భారత వ్యతిరేక హింసాత్మక చర్యలకు సంబంధించిన సమాచారం అందజేసినప్పుడు అటువైపు నుంచి స్పందన రాలేదని గుర్తు చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు దగ్గరి సంబంధం ఉందనే విషయంలో కెనడా నిఘా సంస్థలు చురుగ్గా దర్యాప్తు చేపట్టాయంటూ గత వారం ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ ఆరోపణలు ఆందోళనకరం: అమెరికా ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌నుద్దేశించి ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీనిపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నాం. భారత ప్రభుత్వంతో కూడా ప్రస్తావించాం. దర్యాప్తులో భారత్ సహకరించడం ఎంతో కీలకం. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి బాధ్యులను తేల్సాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల వెనుక ఫైవ్ ఐస్ నుంచి అందిన నిఘా సమాచారమే ఆధారమని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ చెప్పారు. మత పెద్ద కాదు.. ఉగ్రవాదే: భారత్ నిజ్జర్ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. ఉగ్ర శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి వాటితో అతడికి సంబంధాలున్నాయంది. అతడు ప్రముఖుడు కాదని పేర్కొంది. నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్(కేసీఎఫ్)కు చెందిన గుర్దీప్ సింగ్ అలియాస్ హెరాన్వాలాకు అతడు సన్నిహితుడని తెలిపింది. 1980–90 మధ్య కాలంలో పంజాబ్‌లో గుర్దీప్ సింగ్200 వరకు హత్యలకు పాల్పడినట్లు గుర్తు చేసింది. బలవంతంపు వసూళ్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న నిజ్జర్ పోలీసుల అరెస్టు భయంతో 1996లో నకిలీ ధ్రువపత్రాలతో భారత్ నుంచి కెనడాకు పరారయ్యాడని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్లో చూసే తెలుసుకున్నా ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం తాను ఇంటర్నెట్లోనే చూశానని బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబీ చెప్పారు. తనకీ విషయాలను దర్యాప్తు అధికారులెవరూ తెలపకపోవడం నిరుత్సాహం కలిగించిందన్నారు. ఫెడరల్ ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అందించకపోవడంతో స్థానికంగా పౌరులకు భద్రత కల్పించే చర్యలపై తమ వంతుగా స్పందించలేకపోయామన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను ఆస్తులు జప్తు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆస్తుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వాధీనం చేసుకుంది. 2020లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం(యూఏపీఏ)కింద నమోదైన కేసుకు సంబంధించి మొహాలిలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) జనరల్ కౌన్సిల్‌గా చెప్పుకునే పన్నుకు చెందిన అమృత్‌సర్‌లోని ఖాన్కోట్ గ్రామంలో ఉన్న 5.7 ఎకరాల వ్యవసాయ భూమి, చండీగఢ్‌లోని సెక్టార్ 15/సి ప్రాంతంలోని ఇంటిలో కొంతభాగం ఉన్నాయన్నారు. -
ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత దౌత్య అధికారుల హస్తం ఉందన్న విశ్వసనీయ సమాచారాన్ని ఇండియాకు తాము కొన్ని వారాల క్రితమే తెలియజేశామని అన్నారు. గత సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం కంటే ముందే భారత్‌కు చెప్పామని స్పష్టం చేశారు. ఇండియాతో నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కోరుకున్నామని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారుల ప్రమోయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. కెనడా పౌరుని హత్యలో భారత్ జోక్యం అంటూ మండిపడ్డారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్న చర్యగా అభిప్రాయపడింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిఘా విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో బయటపెట్టాలని భారత్ కోరింది. కానీ కెనడా ఇప్పటివరకు ఆధారాలను వెల్లడించలేదు. ఇండియా జవాబుదారీగా ఉండాలి: అమెరికా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. దర్యాప్తులో కెనడాకు సహకరించాలని ఇండియాకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో భారత్, కెనడాతో సంప్రదింపులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత..? -
Canada–India relations: అక్కడి నుంచే సమాచారం
టొరంటో: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా చేసిన ఆరోపణలకు ఫైవ్ ఐస్ నెట్వర్క్ అందించిన సమాచారమే ఆధారమని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కెనడా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని ఒక గురుద్వారాలో నిజ్జర్‌ను దుండగులు కాల్చి చంపిన తర్వాత కెనడా ప్రభుత్వం సాగించిన విచారణలో అయిదు కళ్ల కూటమిలో ఒక భాగస్వామ్య దేశం అందించిన సమాచారం ఆధారంగానే భారత్ ప్రమేయం ఉందన్న అనుమానాలు వచ్చాయని సీబీసీ న్యూస్ ఒక కథనంలో వెల్లడించింది. కెనడాలో భారత్ దౌత్యవేత్తల కమ్యూనికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ దేశం కెనడాకు పంపినట్టుగా తెలిపింది. మానవ మేధస్సు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ దేశం పంపిన సమాచారంలో భారత్ ప్రమేయంపై అనుమానాలున్నట్టు తెలుస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాలు సభ్యత్వం ఉన్న ఆ కూటమిలో ఏ దేశం భారత్ ప్రమేయం ఉందని చెబుతున్న సమాచారం అందించిందో సీబీసీ న్యూస్ వెల్లడించలేదు. కెనడాలో విద్వేషానికి చోటు లేదు భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ హిందువుల్ని బెదిరిస్తున్న వీడియో మరింతగా ఆందోళనల్ని పెంచుతోంది. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం వీడి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన కెనడా ప్రభుత్వం ఇలాంటి విద్వేషపూరితమైన చర్యలకి తమ దేశంలో చోటు లేదని పే ర్కొంది. కెనడాలో నివసిస్తున్న వారెవరూ భయాందోళనలకు లోనుకావల్సిన పని లేదని హామీ ఇచి్చంది. భారత్‌కు ప్రత్యేక మినహాయింపులుండవ్: అమెరికా ఖలిస్తాన్ అంశంలో కెనడా, భారత్ మధ్య రగిలిన చిచ్చుపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలకు సంబంధించి తాము భారత్ దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఈ అంశంలో భారత్‌కు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. భారత్‌తో బంధాల బలోపేతం కోసమే కెనడా వైపు అమెరికా మాట్లాడడం లేదన్న ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. -
40 ఏళ్లుగా కెనాడాలోచాప కింద నీరులా ఉగ్రవాదం
కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాదానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, వ్యవస్థీకృత నేరాలు వంటివి ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు గత నాలుగు దశాబ్దాలుగా నిత్యకృత్యంగా మారాయి. అయినా అక్కడ ప్రభుత్వాలు ఖలిస్తాన్ వేర్పాటు వాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి దీనికి ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణం. భారత్ తర్వాత ప్రపంచంలో కెనడాలో సిక్కు జనాభా అధికంగా ఉంది. కెనడా జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు (మొత్తం జనాభాలో 2%పైగా) ఉన్నారు. వీరి జనాభా శరవేగంతో పెరుగుతూ వస్తోంది. కెనడాలో న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) పగ్గాలను సిక్కు నాయకుడైన జగ్మిత్ సింగ్ ధాలివాల్ 2017 సంవత్సరంలో చేపట్టిన తర్వాత ఖలిస్తాన్ వేర్పాటు వాదుల ఎజెండాకు మద్దతు పలికారు. 2021లో ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలవలేకపోవడంతో ఎన్డీసీ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది.దీంతో ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరింత చెలరేగిపోతున్నా ప్రధాని ట్రూడో ఏమీ చేయలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ ప్రత్యేక ఖలీస్తాన్పై రెఫరెండం చేపట్టి తమకు లక్ష మందికిపైగా మద్దతు పలుకుతున్నట్టుగా ప్రకటించింది. 2019 నుంచి పెరిగిన దాడులు ♦ జగ్మిత్ సింగ్ బృందం ఖలిస్తాన్ విషయంలో మరింత చురుగ్గా ఉంటూ దాడులకుప్రోత్సహిస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్తేలియాలో ఇటీవల కాలంలోవీరి దాడులు పెరిగిపోతున్నాయి. ♦ భారత కార్యాలయాలు, హిందూఆలయాలపై విచ్చలవిడిగా దాడులుజరుగుతున్నాయి. మార్చిలో లండన్‌లో భారత హైకమిషనర్ కార్యాలయంపై దాడి జరిగింది. ♦2022 మేలో మొహాలిలో పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్ దాడి వెనుక(ఎస్ఎఫ్జే) హస్తం ఉంది. ♦ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ జూన్ 4న ఖలీస్తాన్ ఉద్యమకారులువివిధ కార్యక్రమాలు చేపట్టారు.రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిర, ఒక సిక్కు చేతిలో తుపాకీ ఉన్న చిత్రాలకి సంబంధించిన కటౌట్లు టొరాంటో వీధుల్లో వెలిశాయి. దర్బార్ సాహిబ్‌పై దాడులకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందంటూ దానిపై రాశారు. ఒంటారియాలో భారీ ర్యాలీతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంబరాల్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు.కెనడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వేర్పాటువాదుల ఆగడాలను చూసీచూడనట్టువదిలేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ♦ జులైలో ఆ్రస్టేలియాలోని సిడ్నీలో భారతీ విద్యార్థులపైఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. అప్పట్లో ట్రూడో తండ్రి ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియరే ట్రూడో 1980లో కెనడా ప్రధానిగా ఉన్నారు. అప్పట్లోనే ఖలిస్తాన్ కార్యకలాపాలపై భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ నాటి ప్రభుత్వం కూడా ఉదాసీనంగానే వ్యవహరించిందని బ్లడ్ ఫర్ బ్లడ్ అనే పుస్తకంలో రచయిత టెర్రీ మిల్వెస్కీ పేర్కొన్నారు. అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమం కెనడాలో కూడా ఉవ్వెత్తున లేచింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్లీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి ఖలిస్తాన్ ఉద్యమం ప్రజా మద్దతు ఉన్నది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ‘‘‘ఖలిస్తాన్ ఉద్యమం భౌగోళిక రాజకీయాలకు సంబంధించినది. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు తమ శత్రుదేశమైన భారత్‌కు ఇబ్బంది కలుగుతుందని ఖలిస్తాన్ వేర్పాటు వాదులకి సాయపడుతున్నాయి’’అని రచయిత టెర్రీ పేర్కొన్నారు. ఇందిర హత్యని ఒక సంబరంగా పేర్కొంటూ 2002లో టొరాంటో ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే సంజా సవేరా మ్యాగజైన్ కథనాలు వండి వార్చింది. ఆలాంటి పత్రికకు ప్రభుత్వం అత్యధికంగా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పింది. నిజ్జర్ హత్యతో రాజుకున్న చిచ్చు గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను సర్రేలోని గురుద్వారాలో కాల్చి చంపడంతో భారత, కెనడాల మధ్య చిచ్చు రేగింది. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాలు తమ రాయబారుల్ని వెనక్కి పిలిపించేదాకా వెళ్లాయి. పంజాబ్‌లో జలంధర్‌కు చెందిన నిజ్జర్ 1997లో కెనడాకు వలస వెళ్లాడు. ప్లంబర్‌గా పని చేస్తూనే ఖలిస్తాన్ వేర్పాటు వాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. సిక్స్ ఫర్ జస్టిస్‌లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2020లో భారత్ నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో పంజాబ్‌లోని లూథియానాలో పేలుళ్లు, 2009లో పటియాలాలో రాస్ట్రీయ సిక్ సంగత్ అధ్యక్షుడు రూల్డా సింగ్ హత్యలో నిజ్జర్ ప్రమేయమున్నట్టు అనుమానాలున్నాయి. కెనడా, యూకే, అమెరికాలో భారత రాయబార కార్యాలయాల దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉన్నట్టుగా భారత్ విచారణలో తేలింది. -
భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో అటు కెనడా.. ఇటు భారత్ దౌత్య అధికారులను దేశం విడిచివెళ్లాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేశాయి. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాది అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎందుకు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఖలిస్థానీల మద్ధతును కూడగట్టుకోవడం వంటి కొన్ని రాజకీయ సమీకరణాల కోసమే ట్రూడో ఈ చర్యలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంటున్నారు.. ఇంతకు అవేంటంటే..? ట్రూడో పాలనపై వ్యతిరేకత కెనడాలో ప్రస్తుతం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ కష్టకాలంలో ఉంది. ట్రూడో పాలనపై అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అబాకస్ డేటా సర్వే కూడా ఈ విషయాన్నే వెల్లడించింది. కెనడా యువత లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారట. ప్రజాభిప్రాయాన్ని సేకరించే ఆంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ట్రూడో పట్ల కేవలం 33 శాతం మంది మాత్రమే సానుకూల వైఖరి కలిగి ఉన్నారు. దాదాపు 63 శాతం మందికి ట్రూడో పాలనపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. అటు.. భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కి ట్రూడో పర్యటన ఆ దేశంలో విమర్శలకు దారి తీసింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా కెనడా ప్రధాని ట్రూడో భారత్‌లోనే రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. దీంతో కెనడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఎంతటి దారుణానికి దిగజారిందో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ద్రవ్యోల్భణం, ధరలు.. ట్రూడో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవన నిర్మాణాల నుంచి కనీస నిత్యావసరాల వరకు అన్ని రంగాల్లో ఖర్చులు అమాంతం పెరిగాయి. ద్రవ్యోల్బణం, అధిక విదేశీయుల తాకిడి విపరీతంగా హెచ్చయింది. ఇమ్మిగ్రేషన్లను పెంచడం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ట్రూడో భావించాడు. కానీ కొత్తగా వస్తున్నవారితో నిరుద్యోగం, జీవన వ్యయం, సేవల కొరతతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రే సమర్థవంతంగా పరిష్కరించగలడని ప్రజలు భావిస్తున్నారు. ఆ పార్టీ మద్దతు కోసమే.. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రేకు కెనడాలో రోజురోజుకు ఆధరణ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో పియర్ పోయిలీవ్రే ప్రధాని అవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగమీత్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ మద్దతు పార్టీ ఎన్డీపీ మద్దతు అవసరమని ట్రూడో భావించాడని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీపీ 24 సీట్లు సాధించింది. మళ్లీ విజయం సాధించాలంటే ఎన్డీపీ మద్దతు కీలకమని లిబరల్ పార్టీ భావించి ఉంటుందని సమాచారం. అందుకే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై జస్టిన్ ట్రూడో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: కెనడాకు షాకిచ్చిన భారత్.. ఐదు రోజుల్లో వెళ్లిపోవాల్సిందే.. -
కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఐదు రోజుల్లో వెళ్లిపోండి..
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా దౌత్యకార్యాలయంలోని భారతీయ ఏజెంట్ ప్రమేయముందని ఆరోపిస్తూ ఆయనకు బహిష్కరించిన కొద్దీ సేపటికే భారత్ దెబ్బకు దెబ్బ తీసింది. భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారతీయ ఏజెంట్‌కు సంబంధమున్నట్లు తమవద్ద ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ప్రకటించారు. ఆయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది. మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం చేసుకోకడమే కాకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేరానికి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని వెంటనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. భారత్‌కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్కేను ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. The High Commissioner of Canada to India was summoned today by GOI and informed about it’s decision to expel senior Canadian diplomat and to leave India within the next five days! pic.twitter.com/wgJdvpLnzE — Prof.N John Camm (@njohncamm) September 19, 2023 ఇది కూడా చదవండి: గాయపడిన సైనికులకు జెలెన్స్కీ పరామర్శ -
భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. రాయబారిపై వేటు
ఒట్టావా: కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారముందని అన్నారు. ఇదే ఏడాది జూన్‌లో సర్రేలోని గురుద్వారా ముఖద్వారం వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్‌లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన నిజ్జర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. నిజ్జర్ హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. అయితే ఆ అధికారి పేరుని మాత్రం వెల్లడించలేదు. #BREAKING: Canadian Foreign Minister @melaniejoly says Canada has expelled a top Indian diplomat accusing India of killing a Khalistani radical Canadian Citizen. Canada is escalating a diplomatic standoff with India. Expect more fireworks in coming days. pic.twitter.com/IldOaOwow8 — Aditya Raj Kaul (@AdityaRajKaul) September 18, 2023 ఈ నేపథ్యంలో ఒట్టావాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చంపిన కేసులో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని దీనికి సంబంధించి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. హత్యోదంతంపై భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అని ప్రకటించారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సమావేశాల సమయంలోనే ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర ప్రధాని ట్రూడో తెలిపారు. India Canada ties on the brink. Canadian PM Justin Trudeau accuses Indian govt of killing Khalistani leader Hardeep Singh Nijjar in the Canadian Parliament. pic.twitter.com/gXpMrWWuTf — Sidhant Sibal (@sidhant) September 19, 2023 భారత రాయబారిపై వేటు.. ట్రూడో ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా.. భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు. ఈ మేరకు టొరంటో మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఒట్టావాలోని భారత ఎంబసీ స్పందించలేదు. తీవ్రంగా ఖండించిన భారత్.. ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత్ జోక్యం ఉందంటూ ఆ దేశం అసంబద్ద, ప్రేరేపిత ఆరోపణలు చేస్తోంది. చట్టబద్దమైన పాలన పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా కెనడా ప్రధాని ఇలాంటి ఆరోపణలే చేశారు. సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై భారత్ చేసిన డిమాండ్లపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం. కెనడాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు వంటివి జరగడం కొత్తేం కాదు. అలాంటి వాటిల్లోకి భారత ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలో నుంచి భారత వ్యతిరేక శక్తులను వెళ్లగొట్టేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మేం మరోసారి కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. #WATCH | Canadian High Commissioner to India, Cameron MacKay leaves from the MEA headquarters at South Block, New Delhi. pic.twitter.com/zFAaTFfeAP — ANI (@ANI) September 19, 2023 ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం? -
ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ..
టొరంటో: ఖలిస్థాన్ మద్దతుదారుల ఫ్రీడం ర్యాలీకి దీటుగా వారి కంటే ఎక్కువ సంఖ్యలో హాజరై కెనడా భారతీయులు ఐక్యత చాటుతూ ర్యాలీ నిర్వహించారు. ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీలో భాగంగా కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు భారత కాన్సులేట్ ఎదుట పోగయ్యారు. అయితే వారికంటే అధిక సంఖ్యలో వారికి దీటుగా భారత్ జెండాలతో ప్రదర్శన చేశారు అక్కడి భారతీయులు. అంతే మరి.. తాడిని తన్నే వాడొకడుంటే, వాడిని తలదన్నే వాడొకడుంటాడంటారు. మాజీ భారత ప్రధాని 1984లో తలపెట్టిన ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు 5 కి.మీ ర్యాలీ నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని శకటాల ద్వారా ప్రదర్శించి సర్దార్ సాహిబ్ సింగ్ హత్యకు ప్రతీకారంగా అని రాశారు. అది జరిగిన సరిగ్గా నెలరోజులకు ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను అక్కడి గురుద్వారా ఎదుటే కాల్చి చంపబడ్డాడు. దీంతో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నిరసనగా జులై 8న ర్యాలీ నిర్వహించనున్నట్లు పోస్టర్లతో ఎంబసీ వద్ద హడావుడి చేశారు ఖలిస్తానీలు. ఒట్టావా భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలను నిజ్జర్ హంతకులుగా చిత్రీకరిస్తూ కొన్ని పోస్టర్లు వేయడం వివాదాస్పదమైంది. అమెరికా కాన్సులేట్ ముందు కూడా ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లతో అక్కడి ఖలిస్తానీలు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ర్యాలీకి సంబంధించి కెనడా, యూఎస్, యూకే ఎంబసీల ఎదుట పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. జులై 8 ఉదయాన్నే కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కెనడా కాన్సులేట్ వద్దకు చేరుకొని ఖలిస్థాన్ చిహ్నమున్న జెండాలు పట్టుకుని నిజ్జర్ కు జేజేలు పలుకుతూ భారత జెండాను చింపేసి కించపరిచారు. అందుకు దీటుగా కెనడాలోని భారతీయులు ఖలిస్తానీల కంటే రెట్టింపు సంఖ్యలో అక్కడికి చేరి ఖలిస్తానీలు భారతీయులు కాదని పోస్టర్లు రాసి "వందేమాతరం" "భారత్ మాతా కీ జై" అంటూ ఆకాశాన్ని తాకేలా నినదించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని ఖలిస్తానీలు దెబ్బకు ఖంగుతిన్నారు. #WATCH | Members of the Indian diaspora held a counter protest against pro-Khalistan supporters in front of the Indian consulate in Canada's Toronto on July 8 pic.twitter.com/lZvRiSdVs1 — ANI (@ANI) July 9, 2023 ఇది కూడా చదవండి: యుద్ధంలో కీలక పరిణామం..ఉక్రెయిన్ కమాండర్లు విడుదల.. -
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం..
కెనడా: భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను సర్రేలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ వద్దనున్న గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) గతంలో ప్రకటించిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉంది. పంజాబ్ నుంచి కెనడా పారిపోయి చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిజ్జర్ ను అప్పగించాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కెనడా ప్రభత్వాన్ని కోరుతూ ఉంది. కానీ అంతలోనే కెనడాలోని గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిని కాల్చి చంపేశారు. ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. కెనడాలోని భారత రాయబారి సంస్థ పైన ఇటీవల జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయముందని స్వయంగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్ కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు నిజ్జర్. ఇది కూడా చదవండి: మెక్సికోలో పెను భూకంపం.. -
అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరించండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా పనిచేస్తోందని, అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరిని కోరారు. ఏపీలోని పలు పట్టణాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు చక్కటి అవకాశాలున్నాయని, రెండో విడత ప్రాజెక్టులో వీలైనన్ని స్మార్ట్ సిటీల అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో మూడు రోజుల పాటు జరిగే స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ అర్బనైజేషన్ జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి సోమవారం కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతికి పలు ర్యాంకులు తిరుపతిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలు, అనుసరిస్తున్న విధానాలకు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో 2020 సంవత్సరానికి గాను అవార్డులు వరించాయి. వివిధ అభివృద్ధి అంశాల ప్రాతిపదికగా నిర్వహించిన పోటీలో శానిటేషన్, సోషల్ యాస్పెక్టస్ విభాగంలో మొదటి ర్యాంకు, ఎకానమీ విభాగంలో రెండో ర్యాంకు, అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మూడో ర్యాంకుతో పాటు రౌండ్ వైజ్ సిటీస్ పోటీలో రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ నుంచి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ అవార్డులను అందుకున్నారు. -
కర్నూలు సిగలో కలికితురాయి
కర్నూలు (సెంట్రల్): కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. జిల్లా ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న కర్నూలు విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.153 కోట్ల వ్యయంతో ఓర్వకల్లు వద్ద నిర్మించిన దీన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.హర్దీప్సింగ్ జాతికి అంకితం చేస్తారని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎయిర్‌పోర్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. నాడు అసంపూర్తిగా.. కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచి్చన ప్రభుత్వాలు దీన్ని గాలికొదిలేశాయి. చివరకు 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. నిర్మాణ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి చెందిన కంపెనీకి అప్పగించడంతో భూసేకరణ, ఇతర పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి కేవలం 2.2 కిలోమీటర్ల రన్‌వే మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన పనులను అసలు మొదలుపెట్టలేదు. అయినా చంద్రబాబు 2019 జనవరి 18న హడావుడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించి.. అదే సంవత్సరం ఏప్రిల్ నుంచి విమానాల రాకపోకలు సాగుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇవన్నీ గాలిమాటలుగానే మిగిలిపోయాయి. ఏడాదిన్నరలోనే పనులన్నీ పూర్తి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు విమానాశ్రయ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లోని అన్ని పనులను పూర్తి చేయించే బాధ్యతను ఆరి్థక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు అప్పగించారు. ఆయన కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ కేవలం ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు అదనంగా రూ.75 కోట్లను విడుదల చేయించారు. ప్యాసింజర్ టెరి్మనల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అడ్మిన్ బిల్డింగ్, పోలీస్ బ్యారక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, సబ్‌స్టేషన్, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఏటీసీ, డీజీసీఏ అనుమతులు.. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులను రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి అనుమతులు వచ్చేలా చేశారు. 2019లో ఏటీసీ, 2020 జనవరి 16న డీజీసీఏ అనుమతులు లభించాయి. ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ న్యూఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయం ఉత్తర్వులిచి్చంది. దీంతో విమానాల రాకపోకలకు లైన్‌క్లియర్ అయ్యింది. కర్నూలు జిల్లా అభివృద్ధిలో కీలకం కర్నూలు ఎయిర్‌పోర్టు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడి పారిశ్రామిక రంగానికి ఎంతో ఊతమిస్తుంది. ఇప్పటికే ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఎయిర్‌పోర్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజల తరఫున నా కృతజ్ఞతలు. – జి.వీరపాండియన్, జిల్లా కలెక్టర్, కర్నూలు -
పౌర విమానయాన మంత్రితో బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందని, రాష్ట్రంలో పౌర విమానయాన రంగానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ కొలిక్కి వచ్చాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. బుధవారం ఢిల్లీలోని నిర్మాణ్‌భవన్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురితో బుగ్గన సమావేశమయ్యారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయాలకు సంబంధించి పెండింగ్ పనుల విషయమై కేంద్రమంత్రితో చర్చించారు. భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించిన అనుమతుల గురించి కేంద్రమంత్రితో మాట్లాడానని తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం త్వరలోనే ఉంటుందన్నారు. అలాగే భోగాపురానికి సంబంధించి ప్రస్తుత ఎయిర్‌పోర్టు నుంచి తరలింపు అంశంతోపాటు ఇతర సాంకేతిక అంశాలపై చర్చించామని చెప్పారు. అన్ని అంశాలపై పౌర విమానయాన మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని పేర్కొన్నారు. మాది టీడీపీ మాదిరిగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాదు తమ ప్రభుత్వం టీడీపీ మాదిరిగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం కాదని, సహనంతో కూడిన సమర్థత కలిగిన ప్రభుత్వమని బుగ్గన చెప్పారు. శంకుస్థాపనల కోసం కాకుండా ప్రారంభోత్సవాలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. -
‘ఇప్పటివరకు 100 విమానాలు ల్యాండ్ అయ్యాయి’
తిరువనంతపురం: కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు విమానం టేబుల్‌టాప్ ఎయిర్‌పోర్టులోని రన్‌వేను ఒక కిలోమీటరు మేర తాకినట్లు రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వర్గాలు వెల్లడించాయి. బోయింగ్ 737 ఎన్జీ విమానం రన్‌వేపై ఆగడానికి ముందు పట్టుతప్పిందని.. దాంతో నిటారుగా పడిపోయి రెండు ముక్కలయ్యిందని డీజీసీఏ తెలిపింది. అప్పటికే విమానం ల్యాండ్ అవ్వడానికి పలుమార్లు ప్రయత్నించిందని.. కానీ అందుకు వీలుపడలేదని తెలిపింది. అంతేకాక నిన్న విమానాశ్రయ ప్రాంతంలోనే కాక కేరళలోని పలు చోట్ల వర్షం కురిసిందని వెల్లడించింది. పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. డైవర్షన్ ల్యాండింగ్‌కు సరిపడా ఇంధనం విమానంలో ఉందని వెల్లడించారు. (‘ఆ రన్‌వేకు ఎక్స్టెన్షన్ అవసరం ఉంది’) దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 18 మంది మరణించగా.. వీరిలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు విమానంలో మంటలు చెలరేగకపోవడంతో ప్రాణనష్టం తక్కువగా ఉందని అధికారలు తెలిపారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్‌వే కండిషన్‌పై వస్తోన్న విమర్శలను జూనియర్ విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ ఖండించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం కోసం ఉద్దేశించిన ‘వందే భారత్ మిషన్’లో భాగంగా మే 7 నుంచి దాదాపు 100 విమానాలు కోళీకోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయని తెలిపారు. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!) అంతేకాక రన్ వే పరిస్థితి గురించి ఇంతకుముందు వచ్చిన నివేదికలకు నిన్న జరిగిన సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని నిన్ననే పౌర విమానయాన మంత్రి స్పష్టం చేశారని మురళీధరన్ తెలిపారు. ప్రస్తుతం దక్షిణ భారతంలో రెండు టేబుల్‌టాప్ విమానాశ్రయాలు(కోళీకోడ్, మంగళూరు) ఉన్నాయన్నారు. అయితే వాటిని వినియోగించాలా వద్దా అన్నది చాలా పెద్ద ప్రశ్న అన్నారు మురళీధరన్. టెబుల్టాప్ విమానశ్రాయం టెబుల్టాప్ విమానాశ్రయం అనేది పీఠభూమి లేదా కొండను చదును చేసి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. -
రెండో రోజూ తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు రెండో రోజు మంగళవారం కూడా సమస్యలను చవిచూశారు. దేశవ్యాప్తంగా పలు సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం నుంచి దేశీయ పౌర విమాన సేవలు ఆరంభం అయిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 325 విమానాలు గమ్యస్థానాలకు బయల్దేరగా, 283 విమానాలు గమ్యస్థానాలకు చేరుకున్నాయి. మొత్తం 41,673 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్టు పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురి ట్వీట్ చేశారు. బెంగాల్ రాష్ట్రం నుంచి ఒక్క సర్వీసు కూడా నడవలేదు. చెన్నై విమానాశ్రయం నుంచి 20 విమానాలు టేకాఫ్ తీసుకోగా, మరో 20 ల్యాండయ్యాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 277 విమాన సర్వీసులకుగాను, 25 రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయం కేవలం 20 సర్వీసులను నిర్వహించింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలు విమానాల సంఖ్యపై పరిమితులు విధించాయి. కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే ఆ విషయం తెలియడంతో వారి నుంచి నిరసన వ్యక్తం అయింది. తొలిరోజు 428 విమాన సర్వీసులే దేశీయంగా పౌర విమాన సేవలు ప్రారంభమైన సోమవారం 428 విమాన సర్వీసులు నడిచినట్టు పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. 832 విమాన సర్వీసులు నడిచినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ట్వీట్ చేసిన కొద్ది గంటల తర్వాత సంబంధిత శాఖ నుంచి మంగళవారం ఈ ప్రకటన విడుదల అయింది. -
విమాన టికెట్ల బుకింగ్‌లను ఆపేయండి: డీజీసీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 3 వరకు లౌక్‌డౌన్ అమల్లో ఉండగా, ఆ తర్వాతి తేదీలకు ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ బుకింగ్‌లను కొనసాగిస్తుండడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ‘‘ఎయిర్‌లైన్స్ సంస్థలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తగిన సమయం, ముందస్తు నోటీసు ఇవ్వడం జరుగుతుంది’’ అంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్‌లను నిలిపివేసింది. మే 4వ తేదీ నుంచి ప్రయాణాలకు ఎయిర్ఇండియాతోపాటు, ప్రైవేటు ఎయిర్‌లైన్స్ బుకింగ్‌లు తీసుకుంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు దూరంగా ఉండాలని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ సూచించడం గమనార్హం. -
ఎయిరిండియా వాటా విక్రయానికి ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ, ఎయిరిండియాలో వాటా విక్రయానికి మరో అడుగు ముందుకు పడింది. వాటా కొనుగోలుకు అసక్తిగల సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)దరఖాస్తులను స్వీకరించడానికి జీఓఎమ్(మంత్రుల సంఘం–గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) పచ్చజెండా ఊపింది. అంతే కాకుండా వాటా కొనుగోలు ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గల జీఓఎమ్ మంగళవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిరిండియా వాటా విక్రయానికి సంబంధించి ఈఓఐ, వాటా కొనుగోలు ఒప్పందాలను ఈ నెలలోనే జారీ చేస్తామని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులకు ఒక స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని, రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా ఎయిరిండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజమ్ (ఏఐఎస్ఏఎమ్) రూపొందించిందని వివరించారు. వాటా కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాకు చెందిన మొత్తం రుణాన్ని ఒక ప్రత్యేక కంపెనీకి (ఎస్పీవీ) బదిలీ చేస్తారు. ఇప్పటికే సంస్థకు చెందిన రూ.29,400 కోట్ల రుణాన్ని ఎస్పీవీకి బదిలీ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియాకు రూ.8,556 కోట్ల నికర నష్టాలు రాగా, రుణ భారం రూ.80,000 కోట్లుగా అంచనా. జీఓఎమ్ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్, విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురి హాజరయ్యారు. -
జెట్ సమస్యలు పరిష్కారమవుతాయ్!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సమస్యలు పరిష్కారమవుతాయని పౌర విమానయాన శాఖ కొత్త మంత్రి హర్దీప్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగానికి సంబంధించి గతంలో కొన్ని తప్పులు చేశామని, ఇప్పుడు వాటిని సరిదిద్దాల్సిన అవసరముందని పేర్కొన్నారు. భారీ రుణాల కారణంగా సంక్షోభంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్పై రెండో సారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం నుంచి వెలువడిన తొలి వ్యాఖ్య ఇది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీగా రుణాలు చేయడం, తీవ్రమైన పోటీతో ఒకప్పుడు ప్రైవేట్ రంగంలో అతి పెద్ద విమానయాన సంస్థగా వెలిగిన జెట్ ఎయిర్వేస్ ఇప్పుడు కార్యకలాపాలు నిలిపేసింది. ఫలితంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా విమాన చార్జీలు భారీగా పెరిగాయి. విమానయాన రంగం గడ్డు పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ శాఖకు కొత్త మంత్రిగా పురి బాధ్యతలు స్వీకరించారు. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ, ఎయిర్ ఇండియా విక్రయం గత ఏడాది విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సమస్యలను కొత్త మంత్రి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. -
మరో ఆప్ నేత అరెస్ట్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నేతను అరెస్ట్ చేశారు. దళిత మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్‌కు చెందిన ఆప్ విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న హర్దీప్ను ఈ రోజు సంగ్రుర్ జిల్లా ధిండ్సా గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హర్దీప్ సన్నిహితుడుగా భావిస్తున్నారు. ఓ ఫొటో స్టూడియో నడుపుతున్న హర్దీప్ వద్దకు ఫొటో తీయించుకునేందుకు వెళ్లగా, తనపై దారుణానికి ప్రయత్నించినట్టు బాధిత బాలిక ఆరోపించింది. కాగా రాజకీయ కుట్రతోనే తనను కేసులో ఇరికించారని హర్దీప్ అన్నాడు. ఆప్ నాయకులపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. -
ఆప్ నేత వద్దకు అమ్మాయి ఫొటో కోసం వెళ్తే..
చండీగఢ్: వరుస వివాదాలు, కేసులు, తీవ్ర ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. వివాదాల్లో కూరుకుపోతున్న ఆప్ నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లోనూ ఆప్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించగా, తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్‌పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. ప్రస్తుతం హర్దీప్ పరారీలో ఉన్నాడు. సంగూర్కు చెందిన హర్దీప్ తనపై లైంగికదాడికి యత్నించినట్టు ఓ మైనర్ దళిత బాలిక ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంగూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలు తన చెల్లెలితో కలసి పాస్ పోర్టు సైజు ఫొటోలు తీయించుకునేందుకు హర్దీప్ స్టూడియోకు వెళ్లగా.. హర్దీప్ డార్క్ రూమ్‌లో ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.ఆమె గట్టిగా అరవడంతో ఆయన అక్కడి నుంచి బయటకుపారిపోయాడు. ఆప్ నేతలు హర్దీప్పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కేజ్రీవాల్ గత ఫిబ్రవరిలో హర్దీప్ గ్రామానికి వెళ్లారు. ఆప్ అగ్రనేతలు కొందరు ఆయన ఇంట్లో బసచేశారు. కేజ్రీవాల్‌తో హర్దీప్ దిగిన ఫొటో బయటకు రావడంతో ఆప్‌లో దుమారం రేపుతోంది. పంజాబ్‌లో ఆప్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది. దీనికి తోడు తాజా కేసులు ఆప్‌కు ఇబ్బందికరంగా మారాయి. -
రియో ఒలింపిక్స్‌కు హర్దీప్ అర్హత
ఆసియా క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీ ఆస్తానా (కజకిస్తాన్): అందర్నీ ఆశ్చరపరుస్తూ భారత గ్రీకో రోమన్ రెజ్లర్ హర్దీప్ సింగ్ రియో ఒలింపిక్స్‌కు మరో బెర్త్‌ను ఖాయం చేశాడు. ఫ్రీస్టయిల్ విభాగంలో నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత పొందగా... తాజాగా వీరిద్దరి సరసన హర్దీప్ చేరాడు. ఆదివారం ముగిసిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో హర్దీప్ 98 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ముకేశ్ ఖత్రీ (55 కేజీలు) తర్వాత గ్రీకో రోమన్ విభాగంలో ఓ భారత రెజ్లర్ ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ఇదే ప్రథమం. నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్లో పోటీపడిన హర్దీప్ 11-0తో సపర్మమెదోవ్ (తుర్క్మెనిస్తాన్)పై, సెమీఫైనల్లో 11-2తో అసెమ్బెకోవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. ఫైనల్లో హర్దీప్ బరిలోకి దిగలేదు. దాంతో రజతం దక్కింది.