
ఒట్టావా/న్యూఢిల్లీ: కెనడాతో దౌత్య వివాదం నేపథ్యంలో ఆ దేశస్థులకు నిలిపేసిన ఎల్రక్టానిక్ వీసాల జారీ సేవలను కేంద్రం పునరుద్ధరించింది. ఒట్టావాలోని భారత హై కమిషన్ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ మేరకు వెల్లడించింది. చేసింది.
కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్‌సింగ్ నిజ్జర్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించడం, అది భారత గూఢచారుల పనేనని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు బాగా క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment