Diplomatic relations
-
పాక్ గడ్డపై భారత జట్టుకు మానని గాయాలు!
దాయది దేశాల క్రికెట్ పోరు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. కొన్ని కోట్ల మందికి, ముఖ్యంగా ఇరుదేశాల క్రికెట్ అభిమానుల్ని ఒకచోటుకు చేర్చి.. విపరీతమైన మజాను అందిస్తుంటుంది. అయితే ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సన్నగిల్లడం, సరిహద్దు వివాదం, ఉగ్రదాడుల నేపథ్యాలు పరస్పర పర్యటనలకు ఇరుదేశాలను దూరం చేస్తూ వస్తున్నాయి. ఈ కారణంగానే వచ్చే ఏడాదిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ఫిక్స్ అయ్యింది. అయితే..క్రికెట్ రంగంలోనే రిచ్చెస్ట్ బోర్డు అని.. ఐసీసీనే ప్రభావితం చేయగల సత్తా ఉందనే పేరుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి. అంతటి శక్తివంతమైన బోర్డు.. పాక్ గడ్డకు తమ ఆటగాళ్లను పంపించేందుకు, అక్కడి పిచ్‌లపై ఆడించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తోంది. దీనికి కొంత సమాధానం భారత మాజీ క్రికెటర్ రాసిన పుస్తకంలో దొరికింది.👉80వ దశకం చివర్లో.. పాక్-భారత్ మధ్య కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పైసలు, ఆశ్రయమిచ్చి మరీ పోషిస్తోందంటూ పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో భారత్ ఎండగట్టడం మొదలుపెట్టింది అప్పుడే. అలాంటి టైంలో అనూహ్యంగా.. భారత జట్టు పాక్ పర్యటన వెళ్లాల్సి వచ్చింది.👉1989-90 సీజన్లో కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలోని భారత జట్టు.. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు పాక్‌కు వెళ్లింది. అన్ని టెస్టులు డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. అయితే.. కరాచీ స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఎవరూ ఊహించని ఓ ఘటన జరిగింది. పాక్ జట్టు బ్యాటింగ్.. భారత్ ఫీల్డింగ్ చేస్తోంది. ఆ సమయంలో పథాన్ దుస్తుల్లో ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. బహుశా ఎవరైనా అభిమాని తమ ఫేవరెట్ ప్లేయర్‌ను కలవడానికి అయ్యి ఉంటారేమో!.. సిబ్బంది అతన్ని అడ్డుకుంటారులే అనుకుంటూ భారత ఫీల్డర్లు తమతమ స్థానాల్లో ఉండిపోయారు. అయితే పిచ్‌ను సమీపించే కొద్దీ.. అతని ఉద్దేశం ఏంటో ఆటగాళ్లకి అర్థమైంది. ప్రోకశ్మీర్, భారత వ్యతిరేక స్లోగన్లతో దూసుకొచ్చాడతను. అసలు ఈ పర్యటనకు రాకుండా ఉండాల్సిందంటూ భారత ఆటగాళ్లు దూషిస్తున్నాడతను. ఇంతలో అంపైర్లు జోక్యం చేసుకుని.. అతన్ని అడ్డగించే మైదానం నుంచి వెనక్కి పంపే ప్రయత్నం చేయబోయారు. అయితే ఆ వ్యక్తి సరాసరి కృష్ణమాచారి శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు. అంతే.. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఒకరి గల్లా ఒకరు పట్టుకుని లాగేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ షర్ట్ చినిగిపోయింది. దీంతో జట్టు సభ్యులంతా దగ్గరికి పరిగెత్తారు. ఈలోపు.. సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అక్కడి నుంచి లాక్కెల్లారు. క్రికెటర్ నుంచి కామెంటేటర్‌గా మారిన సంజయ్ మంజ్రేకర్ తన ‘ఇంపర్ఫెక్ట్’లో ఈ ఘటన గురించి రాసుకొచ్చారు. మంజ్రేకర్‌కు మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ మ్యాచ్ టెస్ట్ డెబ్యూ కావడం గమనార్హం.అయితే ఈ ఘటన తర్వాత..శ్రీకాంత్ తన షర్ట్ మార్చుకుని వచ్చాడు. అసలేం జరగనట్లు ఆట యధావిధిగా జరిగింది. కానీ ఇదే మ్యాచ్‌లో.. మరో భారతీయ ఆటగాడు ముహమ్మద్ అజారుద్దీన్పైనా మెటల్ హుక్తో దాడి జరిగింది. ఒకవేళ.. ఇవాళ అలాంటి ఘటనలే గనుక ఈనాడు జరిగి ఉంటే.. ఆ మ్యాచ్, సిరీస్..మొత్తం పర్యటనే రద్దు అయ్యి ఉండేదేమో!.👉ఇక.. అదే టూర్లో జరిగిన మరో ఘటన గుర్తు చేసుకుంటే.. మూడో వన్డే సందర్భంగా పెద్ద రచ్చే చెలరేగింది. కరాచీ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతుండగా.. 28 పరుగులకు పాక్ మూడు వికెట్లు పొగొట్టుకుంది. అది సహించలేని అభిమానులు భారత జట్టు ఆటగాళ్ల మీదకు రాళ్లు విసిరారు. పాక్ కెప్టెన్ జావెద్ మియాందాద్ అభిమానుల్ని శాంతపర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి చెల్లాచెదురు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి.. తిరిగి లాహోర్‌లో నిర్వహించారు.👉ఈ ఘటన తర్వాత ఇరు కూడా దేశాలు పర్యటనలను కొనసాగించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే సిరీస్‌లు నిర్వహించుకున్నాయి. తటస్థ వేదికల్లోనూ మ్యాచ్‌లు ఆడాయి.. ఇంకా ఆడుతున్నాయి. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భద్రతా కారణాల వల్లే తమ జట్టును పాక్‌కు పంపలేమని బీసీసీఐ కుండబద్ధలు కొట్టేసింది. ఇందుకు పైన చెప్పుకున్న కారణాలే కాదు.. ఇంకో ముఖ్యమైన ఘటన ఉంది.2009 శ్రీలంక జట్టుపై పాక్ పర్యటనలో జరిగిన దాడి.. క్రికెట్ చరిత్రలో ‘బుల్లెట్’ అక్షరాలతో లిఖించబడింది. టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ముసుగులతో వచ్చిన కొందరు తూటాల వర్షం కురిపించారు. ఆరుగురు పోలీసాఫీసర్లు చనిపోగా.. లంక టీంకు ఆటగాళ్లు, అధికారులు ఏడుగురు గాయపడ్డారు. ఘటన తర్వాత ఎయిర్‌లిఫ్ట్ ద్వారా క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ చరిత్రలోనే అదొక చీకటి దినంగా మిగిలిపోయింది.ఈ ఘటన తర్వాత చాలా దేశాలు తమ జట్లను పాక్‌కు పంపేందుకు భయపడ్డాయి. అయితే భారత్ మాత్రం 2008 తర్వాతి నుంచి పాక్ గడ్డపై సిరీస్ ఆడలేదు. ముంబై 26/11 దాడులే అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.👉పాక్ క్రికెట్ జట్టు ఇప్పటిదాకా పదిసార్లు.. భారత్‌లో పర్యటించింది. 1989 ఘటనలు పాక్ గడ్డపై భారత్‌కు మానని గాయం. అయితే ఆ ఘటనల తర్వాత కూడా భారత జట్టు మూడుసార్లు పాక్ పర్యటనకు వెళ్లింది. కానీ, మునుపటిలా పరిస్థితులు లేవిప్పుడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగితే పర్వాలేదు. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కానీ, పాక్‌లో ఇప్పుడు పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్‌తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. పైగా.. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత రాజకీయంగానూ పాక్‌లో సంక్షోభం నడుస్తోంది. ఒకవైపు ఉగ్రదాడులు.. ఇంకోవైపు అనుమానాస్పద రీతిలో ఉగ్ర నేతలు హతమవుతుండడం తీవ్ర చర్చనీయాంశంమైంది. అలాంటప్పుడు భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం ప్రశ్నార్థకమే!. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ఇటు బీసీసీఐ, అటు కేంద్రప్రభుత్వం టీమిండియాను పాక్ పర్యటనకు అనుమతించడం లేదన్నది అర్థమవుతోంది. -
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు
కజన్: సంఘర్షణలు, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గాలే శ్రేయస్కరమని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. శాంతియుత మా ర్గంలో చర్చలు, సంప్రదింపులకే తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఏ సమస్యకైనా యుద్ధాలతో పరిష్కారం లభించందని స్పష్టంచేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.రష్యాలోని కజన్ నగరంలో బుధవారం 16వ ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశి్చతి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేలా బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని చెప్పారు. బ్రిక్స్ వైవిధ్యంతో కూడిన, సమగ్ర వేదిక అని వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు ‘‘యుద్ధానికి కాదు.. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. కోవిడ్–19 సంక్షోభాన్ని మనమంతా కలిసికట్టుగా అధిగమించాం అదే తరహాలో ముందు తరాలకు సురక్షితమైన, బలమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి నూతన అవకాశాలు మనం సృష్టించగలం. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్‌పై ప్రపంచ దేశాలకు ఎన్నో అంచనాలున్నాయి. వాటిని నెరవేర్చేలా మనం పనిచేయాలి. ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. అందరూ ఒకే ఆలోచనతో ఉంటేనే లక్ష్యం సాధించడం సులువవుతుంది. యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర తీర్మానం చేసేలా మనమంతా కలిసి ఒత్తిడి పెంచాలి. అలాగే సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. నిరి్ధష్ట గడువులోగా సంస్కరణలు వచ్చేలా మనం ఉమ్మడిగా ముందుకు సాగాలి. బ్రిక్స్‌లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్ ప్రత్యామ్నాయం అనే భావన రాకూడదు. ఆయా సంస్థలను సంస్కరించే వేదిక అనే అభిప్రాయం అందరిలోనూ కలగాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని మనం కర్తవ్యంగా స్వీకరించాలి. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్‌లోకి మరికొన్ని భాస్వామ్య దేశాలను ఆహా్వనించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కూటమి దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. అదేసమయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలను గౌరవించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. కూటమిలోకి మరో ఐదు దేశాలు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో చేరేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పారు. ఈ విషయంలో ఆయా దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల పట్ల చురుగ్గా స్పందించాలని కూటమిలోని సభ్యదేశాలకు సూచించారు. కొత్త దేశాలను కూటమిలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బ్రిక్స్ ప్రస్తుత సదస్సులో నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిక్స్‌లో తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సభ్యదేశాలుగా చేరాయి. బ్రిక్స్ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టమని జిన్‌పింగ్ చెప్పారు. ఆయన బుధవారం బ్రిక్స్ సదస్సులో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో బిక్స్ దేశాల్లో 10 ఓవర్సీస్ లెరి్నంగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. భారత ఆర్థిక ప్రగతి సూపర్: పుతిన్ భారత ఆర్థిక ప్రగతి అద్భుతమంటూ బ్రిక్స్ సదస్సు వేదిక సాక్షిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతించారు. ఈ విషయంలో బ్రిక్స్ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘హెచ్చు వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని గురించి దేశాధినేతలుగా మనమంతా తరచూ మాట్లాడుతుంటాం. ప్రధాని మోదీ దాన్ని విజయవంతంగా సాధించి చూపిస్తున్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్‌ను మనందరికీ ఆదర్శంగా నిలిపారు. ఆయన సాధిస్తున్న విజయాలకు అభినందనలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి ధన్యవాదాలు’’ అన్నా రు. ద్వైపాక్షిక వర్తకంలో భారత్, రష్యా సాధిస్తున్న వృద్ధి పట్ల పుతిన్ సంతృప్తి వెలిబుచ్చారు. ఉగ్రవాదంతో అందరికీ ముప్పు బ్రిక్స్ సదస్సు అనంతరం కూటమి నేతలు బుధవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ‘ఉమ్మడి ముప్పు’గా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క మతం, జాతీయత, నాగరికతకు సంబంధించింది కాదని ఉద్ఘాటించారు. అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని బ్రిక్స్ కూటమి నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరగబోయే కాప్–29 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక పరిష్కారం మార్గం వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. -
మన పాలిట మరో పాకిస్తాన్!
ఇరవై నాలుగు గంటల్లో అంతా మారిపోయింది. భారత, కెనడా దౌత్యసంబంధాలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. ఏడాది పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉన్నా, తాజా పరిణామాలతో అది పరాకాష్ఠకు చేరింది. అతివాద సిక్కుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అనుమానితుల జాబితాలో తమ దేశంలోని భారత దూతనూ, ఇతర దౌత్య వేత్తలనూ కెనడా చేర్చేసరికి సోమవారం సాయంత్రం కొత్త రచ్చ మొదలైంది. తీవ్రంగా పరిగణించిన భారత్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ, కెనడా యాక్టింగ్ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలతో ఇదే రకంగా వ్యవహరించింది. భారత్ ‘ప్రాథమికమైన తప్పు’ చేస్తోందనీ, ఢిల్లీ చర్యలు అంగీ కారయోగ్యం కాదనీ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ప్రకటించారు. వెరసి, వ్యవహారం చినికిచినికి గాలివాన నుంచి దౌత్యపరమైన తుపానైంది. రానున్న రోజుల్లో కెనడా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా మరిన్ని పర్యవసానాలు తప్పవని తేలిపోయింది.ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహసంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షలమంది భారతీయ సంతతి వారే. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీయ మూలాల వారే! ఇక, దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయ విద్యార్థులు ఆ దేశంలో చదువుతున్నారు. దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్ఠమైన వ్యాపారబంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణి లోని వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్యయుద్ధ వాతావరణాన్నీ ఊహించలేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజలకూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం. కెనడా గడ్డపై గత జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యపై విచారణలో భారత్ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ. సహకరించాలని కెనడా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానం. అయితే, ఆ హత్యలో భారత ప్రమేయం గురించి సాక్ష్యాధారాలేమీ లేకుండానే అన్నీ సమర్పించి నట్టు ఒట్టావా అబద్ధాలు ఆడుతూ, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. పైగా, తమ దేశంలోని కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకొని భారత్ కోవర్ట్ ఆపరే షన్లు చేస్తోందంటూ ట్రూడో ఎప్పటిలానే నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం ఏ రకంగా చూసినా సహించరానిది. భారత ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో తొలి సారిగా ప్రకటన చేసినప్పటి నుంచి ట్రూడోది ఇదే వరస. ఒకవేళ ఆయన ఆరోపణల్లో ఏ కొంచె మైనా నిజం ఉందని అనుకున్నా... మిత్రదేశంతో గుట్టుగా సంప్రతించి, వ్యవహారం చక్కబెట్టుకోవా ల్సినది పోయి ఇలా వీధికెక్కి ప్రకటనలతో గోల చేస్తారా? ఇక్కడే ట్రూడో స్వార్థప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక, అవాంఛిత ఆరోపణలకు దిగుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్థమవుతోంది. భారత్ వెలుపల సిక్కులు అత్యధికం ఉన్నది కెనడాలోనే! అందులోనూ వేర్పాటువాద ఖలిస్తా నీలూ ఎక్కువే. ఈ అంశంపై ఇందిరా గాంధీ కాలం నుంచి ఇండియా మొత్తుకుంటున్నా ఫలితం లేదు. 1985లో కనిష్క విమానం పేల్చివేతప్పుడు ప్రధానిగా ఉన్న ట్రూడో తండ్రి నుంచి ఇవాళ్టి దాకా అదే పరిస్థితి. సిక్కులను ఓటుబ్యాంకుగా చూస్తూ... వాక్ స్వాతంత్య్రపు హక్కు పేరిట ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను పెంచిపోషిస్తూ వచ్చింది. ఆ అండ చూసుకొని తీవ్రవాద బృందాలు రెచ్చి పోయి, కొంతకాలంగా అక్కడి భారతీయ దేవాలయాలపై దాడులు చేస్తూ వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిర హత్యను సమర్థిస్తూ ఊరేగింపు జరిపాయి. చివరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగడమే కాక భారతీయులనూ, భారతీయ సంతతి వారినీ ప్రాణాలు తీస్తామని బెదిరించే దశకు వచ్చాయి. కనీసం 9 ఖలిస్తానీ తీవ్రవాద బృందాలు కెనడాలో ఉన్నాయి. పాకిస్తానీ గూఢచర్యసంస్థ తరఫున పనిచేస్తున్నవారూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నేరాలకు దిగుతున్న ఇలాంటి వారిని మన దేశానికి అప్పగించాలని పదే పదే కోరుతున్నా, ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.ట్రూడో సారథ్యంలోని కెనడా, పొరుగున ఉన్న మన దాయాది దేశం తరహాలో ప్రవర్తిస్తూ వస్తోంది. కశ్మీర్‌ను రాజకీయంగా వాడుకుంటూ, అక్కడ నిప్పు రాజేసి తమ వాళ్ళ మెప్పు పొందా లని పాకిస్తాన్ చూస్తే... భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జన రల్ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ. ప్రస్తుతం ఆయన సారథ్యంలోని సంకీర్ణ సర్కార్ సైతం ఖలిస్తానీ జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్ పాలిట కెనడా అచ్చంగా మరో పాకిస్తాన్‌గా అవతరించింది. 2019 పుల్వామా దాడుల తర్వాత పాక్‌తో దౌత్య బంధాన్ని తగ్గించుకున్నట్టే... దౌత్యవేత్తల బహిష్కరణ పర్వంతో భారత్ ఇప్పుడు అధికారికంగా కెనడాను సైతం పాక్ సరసన చేర్చినట్లయింది. అసలిలాంటి పరిస్థితి వస్తుందని తెలిసీ, జాగ్రత్త పడకపోవడం మన దౌత్య వైఫల్యమే! అదే సమయంలో తాము పాలు పోసి పెరట్లో పెంచుతున్న పాములైన ఖలిస్తానీలు ఏదో ఒకరోజు తమనే కాటేస్తారని కెనడా గ్రహించాలి. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్న కల సంగతేమో కానీ, అక్షరాలా తీవ్రవాదం, అప్పులు, గృహ వసతి సంక్షోభంతో కెనడాను మరో పాక్‌గా మార్చడంలో ట్రూడో సక్సెసయ్యారు. అదే విషాదం. -
కెనడా ప్రధాని ట్రూడో నోట మళ్లీ పాత పాటే..
సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. అంతేకాకుండా కెనడా నుంచి దౌత్యాధికారులను భారత్ వెనక్కి రప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడాలో నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం.. ప్రాథమిక తప్పు చేసిందని ఆరోపించారు. ఒట్టావాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఎత్తిచూపారు. సింగపూర్‌లో ఈ వారాంతంలో షెడ్యూల్ చేయబడిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రాముఖ్యతను తెలిపారు. గత వారం చివరలో నేను భారత ప్రధాని మోదీతో మాట్లాడిన సమయంలో ఈ వారాంతంలో సింగపూర్‌లో జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైన సమావేశం జరగబోతోందని తెలిపారు. ఆ సమావేశం గురించి మోదీకి కూడా తెలుసు. అయితే ఆ సమావేశం అవసరమని నేను తెలియజేశా. అదేవిధంగా ఈ సమావేశాన్ని చాలా చాలా సీరియస్‌గా తీసుకోవాలని అన్నాను.#WATCH | Ottawa: Canadian PM Justin Trudeau says, "When I spoke to PM Modi at the end of last week, I highlighted how incredibly important meeting between our national security advisors in Singapore this weekend was going to be. He was aware of that meeting and I pressed upon him… pic.twitter.com/RvKMN2Trzg— ANI (@ANI) October 14, 2024..కెనడియన్ గడ్డపై, హత్య, దోపిడీ పాటు, కెనడియన్లకు వ్యతిరేకంగా నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగలమని భావించడంలో భారత ప్రభుత్వం ప్రాథమిక తప్పు చేసింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.అయితే.. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్‌తో కలిసి పనిచేయడానికి కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇరుదేశాల మధ్య ఘర్షణ సృష్టించటం కెనడా ఉద్దేశం కాదు. భారతదేశం ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య దేశం. భారత్‌తో కెనడాకు వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాం. .. అందుకే మేము ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందా లేదా అనే విషయంపై విచారణ ప్రారంభించాం. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉన్నట్లు మాకు తెలుసు. ఈ విషయంలో పరిష్కరించటంలో భారత్ మాతో కలిసి పని చేయాలి. మేము ఈ పోరాటం చేయవద్దని అనుకుంటున్నాం. కానీ కెనడియన్ గడ్డపై ఓ వ్యక్తిని చంపటం ఒక దేశంగా మేము విస్మరించలేని విషయం’’ అని అన్నారు.చదవండి: భగ్గుమన్న దౌత్య బంధం -
అతని ఫౌజీ సాజిదా
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భర్త, మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుతో కలిసి మన దేశంలో అడుగుపెట్టిన సాజిదాకు ‘బెంగళూరు డేస్’ గుర్తుకొచ్చి ఉంటాయి. ఆశ్చర్యంగా ఉందా! అవును. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా బెంగళూరులో డిగ్రీ చేసింది. ఇక్కడి నుంచి వెళ్లిన తరువాత ముయిజ్జుతో వివాహం అయింది. ‘ఆమె అతడి అదృష్టం’ అనే మాట ఎలా ఉన్నా ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అని మరోసారి గట్టిగా చెప్పడానికి బలమైన ఉదాహరణ సాజిదా మొహమ్మద్....మాల్దీవుల రాజధాని మాలేలో పుట్టింది సాజిదా. తండ్రి షేక్ మహ్మద్ ఇబ్రహీం ప్రఖ్యాత పండితుడు. రాజకీయ, సామాజిక విషయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉన్న సాజిదా రకరకాల స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేసింది. సాజిదా స్వేచ్ఛకు తల్లిదండ్రులు ఎప్పుడూ ఆడ్డు పడలేదు.బెంగళూరులో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన సాజిదా యూకేలోని లీడ్స్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్‌లో సివిల్ సర్వెంట్‌గా పనిచేసింది. యూనిసెఫ్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పిల్లల ఆరోగ్యం నుంచి సృజనాత్మక ప్రతిభను పెం΄÷ందించడం వరకు ఎన్నో కార్యక్రమాలలో భాగం అవుతోంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపే క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిధుల సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ‘5 మిలియన్ ట్రీ ప్రాజెక్ట్’ ను లాంచ్ చేసింది. తలసీమియా పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే తలసీమియా చికిత్సపై దృష్టి పెట్టింది.సాజిదా ప్రసంగాలలోని వాడి, వేడి ఏమిటో 2023 అధ్యక్ష ఎన్నిక సమయంలో లోకానికి తెలిసింది. తన అద్భుతమైన ప్రసంగాలతో శ్రోతలను ఆకట్టుకునేది. భర్త విజయానికి ఆమె ప్రసంగాలు ఒక కారణంగా చెప్పవచ్చు.మాల్దీవులలో సైన్స్ రంగంలో మహిళలను, బాలికలను ్ర΄ోత్సహించడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ రంగాలలో మహిళల సంఖ్యను పెంచడానికి దేశ ప్రథమ మహిళగా ఎంతో కృషి చేస్తోంది సాజిదా.‘లింగ వివక్ష లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి’ అనే విషయాన్ని గట్టిగా చెబుతుంది.‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనేది ఆంగ్ల సామెత.తాను మాట్లాడబోయే అంశాలను ఇంట్లో భార్యతో పంచుకోవడం మాల్దీవుల అధ్యక్షుడు మొహహ్మద్ ముయిజ్జుకు అలవాటు. తన ఆలోచనలను సాజిదాతో పంచుకోవడమే కాదు ఆమె సలహాలు తీసుకుంటాడు. ఆ ఇంట్లో తమ ముగ్గురు పిల్లలు యాస్మిన్, ఉమైర్, జాయెద్‌ల గురించి కుటుంబ విషయాలను ఎంత సహజంగా మాట్లాడుకుంటారో జెండర్ ఈక్వాలిటీ నుంచి జీరో వేస్ట్ప్రాజెక్ట్ల వరకు ఎన్నో సామాజిక విషయాలను అంతే సహజంగా మాట్లాడుకుంటారు.‘మా ఆలోచనలు ఎప్పుడు ఒకేరకంగా ఉంటాయి’ అని భార్య గురించి మురిసి΄ోతుంటాడు డా. మొహమ్మద్ ముయిజ్జు. -
23న ఉక్రెయిన్‌కు మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 23న ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు వొలోదిమియర్ జెలెన్స్కీతో చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.రైలులో కీవ్‌కు ఉక్రెయిన్ కంటే ముందు మోదీ పోలండ్‌కు వెళతారు. ఈనెల 21, 22 మోదీ పోలండ్‌లో పర్యటిస్తారు. పోలండ్ సరిహద్దుల్లో గల ఒక స్టేషన్ నుంచి రైలులో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకుంటారు. ఇది దాదాపు 10 గంటల ప్రయాణం. తిరుగు ప్రయాణంలోనూ మోదీ రైలు ద్వారానే పోలండ్‌కు వస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్ పర్యటనకు రైలు మార్గాన్నే ఎంచుకోవడం విశేషం. -
లెబనాన్‌పై దాడుల నియంత్రణకు అమెరికా దౌత్యం
ఇంతవరకూ పాలస్తానాలోని గాజాకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుధ్దం ఇప్పుడు లెబనాన్‌కూ పాకింది. ఇది తీవ్రరూపం దాల్చకుండా ఉండేందుకు అమెరికా తన ప్రయత్నాలను ప్రారంభించింది.ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌పై జరిగిన రాకెట్ దాడిలో 12 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీనిని నిరోధించేందుకు యునైటెడ్ స్టేట్స్ రంగంలోకి దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో దీనికి ప్రతీకారంగా లెబనాన్‌లోని బీరుట్ లేదా ఇతర లెబనీస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు తెగబడకుండా ఉండేందుకు అమెరికా తన దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రారంభించిందని రాయిటర్స్ పేర్కొంది.అమెరికాకు చెందిన ఇద్దరు దౌత్య అధికారులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతోందని, ఇది బహుశా చాలా రోజుల పాటు కొనసాగవచ్చని అన్నారు. అయితే తాము ఇజ్రాయెల్‌ను పరిమిత ప్రతీకార చర్యలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. లెబనాన్‌లోని బీరుట్‌తో పాటు హిజ్బుల్లా ఆధిపత్యం కలిగిన దక్షిణ శివారు ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు, జనసాంద్రత కలిగిన ప్రాంతాలపై దాడులకు దిగవద్దని ఇజ్రాయెల్‌ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్, డిప్యూటీ పార్లమెంట్ స్పీకర్ ఎలియాస్ బౌ సాబ్తో సహా లెబనీస్ అధికారులు యుద్ధం విషయంలో సంయమనం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. పౌర నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్ తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా హెచ్చరించింది.లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను అదుపు చేసేందుకు అమెరికా, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరమైన చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ.. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ప్రమాదాన్ని తగ్గించేందుకు నడుంబిగించారు. -
ఇజ్రాయెల్‌కు షాక్.. ‘దౌత్య సంబంధాలు తెంచుకుంటాం’
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు ఆగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్‌కు గట్టిపట్టున్న రఫాలో వారిని అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో గుస్తావో పెట్రో అన్నారు.కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు పెట్రో రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. -
సౌదీలో తొలి మద్యం దుకాణం
రియాద్: మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కాహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్‌ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. రియాద్‌లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్‌ను మరి కొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. -
దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ
ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్‌లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని విచారించారని సమాచారం. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
భారత్– దక్షిణ కొరియా బంధం బలీయం: మోదీ
న్యూఢిల్లీ: భారత్, దక్షిణకొరియాల సంబంధం పరస్పర గౌరవం, ఉమ్మడి విలువల ఆధారంగా మరింత బలపడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, దక్షిణ కొరియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నేటితో 50 ఏళ్లు పూరయ్యాయి. ఇది పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలు, పెరుగుతున్న భాగస్వామ్యాలు కలగలిసిన ప్రయాణం’అని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన సంబంధాలకు 50 ఏళ్లయిన సందర్భంగా ఆయన ఆదివారం ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
కెనడాకు మళ్లీ ఈ వీసా సేవలు
ఒట్టావా/న్యూఢిల్లీ: కెనడాతో దౌత్య వివాదం నేపథ్యంలో ఆ దేశస్థులకు నిలిపేసిన ఎల్రక్టానిక్ వీసాల జారీ సేవలను కేంద్రం పునరుద్ధరించింది. ఒట్టావాలోని భారత హై కమిషన్ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ మేరకు వెల్లడించింది. చేసింది. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్సింగ్ నిజ్జర్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించడం, అది భారత గూఢచారుల పనేనని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. -
భారత్ వ్యవహారాల్లో కెనడా జోక్యం
న్యూఢిల్లీ: కెనడా దేశస్తులకు వీసా సేవల పునరుద్ధరణ అంశం, ఆ దేశంలోని భారత దౌత్యవేత్తలకు కల్పించే భద్రతపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. కెనడాతో దౌత్యపరమైన సమానత్వం వియన్నా సూత్రాల ప్రకారమే భారత్ కోరుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ నుంచి 41 మంది దౌత్యాధికారులను కెనడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత్–కెనడా సంబంధాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొనసాగిస్తోందనే ఆందోళనతోనే దౌత్యపరమైన సమానత్వంపై పట్టుబట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కాలక్రమంలో మరికొన్ని అంశాలు బయటకు వస్తాయి. భారత్ చర్యలపై చాలా మందికి ఎందుకు అసౌకర్యం కలిగిందనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు’అంటూ వ్యాఖ్యానించారు. ‘కెనడాతో సంబంధాలు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారాయి. ఆ దేశ రాజకీయాల్లోని ఒక వర్గం, దానికి సంబంధించిన విధానాలతో మాకు కొన్ని సమస్యలున్నాయి. కెనడాలోని మన దౌత్యాధికారుల భద్రత ప్రమాదంలో పడింది. అందుకే వీసాల జారీని నిలిపివేశాం. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తేనే వీసాల జారీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది’ అని జైశంకర్ అన్నారు. దౌత్యాధికారుల భద్రత, రక్షణ అంశం వియన్నా సూత్రాల్లో కీలకమైందని వివరించారు. జూన్‌లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఘటన వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఉద్రిక్తతలు మొదలైన విషయం తెలిసిందే. -
భారత్‌లోని ఆ నగరాల్లో జాగ్రత్త: తమ పౌరులకు కెనడా అడ్వైజరీ
భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం చల్లారడం లేదు. ఖలిస్తానీ సానుభూతిపరుడు నిజ్జార్ సింగ్ హత్యతో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేడంతో మొదలైన ఇరు దేశాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు.. నెల రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లోని తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కెనడా పేర్కొంది. ఈ మేరకు కెనడా ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. భారత్‌లో 41 మంది దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుని, తమ దౌత్యకార్యాలయాలు, కాన్సులేట్లను మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించిన గంటల వ్యవదిలోనే.. కెనడా ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘భారత్, కెనడా మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. మీడిమా, సామాజిక మాద్యమాల్లో మీడియాలో కెనడాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కెనడా వ్యతిరేక ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కెనడియన్లకు బెదిరింపులు అందవచ్చు. వేధింపులకు గురికావచ్చు. జాతీయ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో(ఎన్సీఆర్) జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో ఎక్కువగా మాట్లడకండి. కొత్త వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దు’ అని అడ్వైజరీలో పేర్కొంది. చదవండి: భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ బెంగళూరు, చండీగఢ్, ముంబై నగరాల్లోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పెద్ద నగరాల్లో, పర్యాటక ప్రాంతాల్లో విదేశీయులు లక్ష్యంగా చేసుకుని కొంత మంది డబ్బు, పర్స్ దొంగతనాలకు పాల్పడుతుంటారని.. రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యహరించాలని, పెద్ద సంఖ్యలో డబ్బులు తీసుకెళ్లవద్దంటూ పేర్కొంది. అదే విధంగా సిబ్బందిని తగ్గించిన నేపథ్యంలో ముంబయి, బెంగళూరులోని కాన్సులేట్లలో అన్ని రకాల ఇన్-పర్సన్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మూడు నగరాల్లోని తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని కోరింది. భారతదేశంలోని కెనడియన్లందరూ తమకు సహాయం కావాలంటే న్యూ ఢిల్లీలోని హైకమిషన్‌ను సంప్రదించవలసిందిగా కోరారు. -
Canada-India relations: కెనడా పెట్టుబడులు ఎక్కువే
న్యూఢిల్లీ: ఇటీవల కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో పెట్టుబడుల రాకపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో వెనువెంటనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడకపోవచ్చని ఇన్వెస్టర్ల ఫోరమ్.. సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్(ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ) పేర్కొంది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) వంటి అంశాలు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చని అభిప్రాయపడింది. నిజానికి 2000 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్య కాలంలో కెనడా నుంచి దేశీయంగా 3.64 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,212 కోట్లు) ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. వెరసి ఎఫ్‌డీఐల రాకలో కెనడా 17వ ర్యాంకులో నిలిచినట్లు ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. కెనడియన్ పెట్టుబడుల్లో సరీ్వసులు, మౌలికసదుపాయాల పెట్టుబడులు 40.63 శాతంకాగా.. దేశీయంగా 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కలిగి ఉన్నాయి. ఇంతకంటే అధికస్థాయిలో కెనడా కంపెనీలు దేశీయంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం కెనడియన్ పెన్షన్ ఫండ్స్ 2022 చివరికల్లా దేశీయంగా 45 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎఫ్‌డీఐగా కెనడా నిలిచింది. ఫండ్ పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసులున్నాయి. భారీ మార్కెట్ కావడం, పెట్టుబడులపై అత్యధిక రిటర్నులు కారణంగా కెనడా పెన్షన్ ఫండ్స్ దేశీయంగా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు జీటీఆర్ఐ అభిప్రాయపడింది. లక్ష కోట్లకుపైగా దేశీయంగా రియలీ్ట, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఐటీ తదితర రంగాలలో కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. సీపీపీఐబీ తాజా గణాంకాల ప్రకారం ఏడాదిక్రితంవరకూ దేశంలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ స్వతంత్ర బోర్డు నిర్వహణలో ఉంటుందని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ చైర్మన్ లక్ష్మీ నారాయణన్ పేర్కొన్నారు. ప్రధానంగా వాటాదారులకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో ఇన్వెస్ట్ చేస్తుందని తెలియజేశారు. దేశీ స్టార్టప్‌లలో సీపీపీఐబీ పెట్టుబడులు చేపడుతోంది. డెల్హివరీలో 6 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2.68 శాతం, జొమాటోలో 2.42 శాతం, ఇండస్టవర్లో 2.18 శాతం, పేటీఎమ్‌లో 1.76 శాతం, నైకాలో 1.47 శాతం చొప్పున వాటాలు కలిగి ఉంది. ఈ బాటలో విదేశాలలో లిస్టయిన దేశీ కంపెనీలలోనూ ఇన్వెస్ట్ చేసింది. యూఎస్ లిస్టెడ్ విప్రో, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకులలో పెట్టుబడులు కలిగి ఉంది. మరికొన్ని ఇతర అన్‌లిస్టెడ్ కంపెనీలోనూ వాటాలు పొందినట్లు నారాయణన్ తెలియజేశారు. రెండింటికీ మేలే భారత్, కెనడా సంబంధాలు రెండింటి లబ్ది ఆధారితమై ఉన్నట్లు స్వతంత్ర రీసెర్చర్, కన్సల్టెంట్ ప్రతీమ్ రంజన్ బోస్ పేర్కొన్నారు. దీంతో పెట్టుబడులపై వెనువెంటనే ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని అంచనా వేశారు. రెండు ఆర్థిక వ్యవస్థలకూ నష్టదాయకం కావడంతో ప్రస్తుత వివాదాలు కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దౌత్య మార్గంలో సమస్యలు సర్దుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు. దశాబ్దకాలం తదుపరి ఇటీవలే రెండు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పంద చర్చలకు తెరతీసినట్లు తెలియజేశారు. అయితే రాజకీయ వివాదాలు తలెత్తడంతో తిరిగి నిలిచిపోయినట్లు తెలియజేశారు. 2022లో కెనడాకు తొమ్మిదో ర్యాంకు విదేశీ వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధిక రిటర్నులు దౌత్యపరమైన ప్రస్తుత ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య పెట్టుబడులను దెబ్బతీయకపోవచ్చని ప్రభుత్వ అత్యున్నత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దేశీయంగా అత్యధిక రిటర్నులు లభిస్తుండటంతో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ మౌలిక సదుపాయాల రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. అధిక లాభాలను పొందుతున్నందునే దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ప్రస్తుత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు వెనక్కి మళ్లేందుకు కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే వివాదాలు పరిష్కారంకావచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫండ్స్ పెట్టుబడులపై ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి రిటర్నులు పొందలేకపోవచ్చని స్పష్టం చేశారు. -
తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్–కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన వివాద పరిణామాలను దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిశితంగా పరిశీలిస్తోంది. కెనడాలోని తమ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వారి అభిప్రాయం ప్రకారం తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదని పేర్కొంది. ఖలిస్తానీ వేర్పాటువాది హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. పలు భారతీయ ఐటీ దిగ్గజాలు కెనడాలో కార్యకలాపాలను సాగిస్తుండటంతో పాటు అక్కడ పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాస్కామ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ప్రస్తుతానికైతే టెక్ పరిశ్రమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం లేకపోయినా.. ఈ వివాదం ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సి ఉంటుందని పరిశ్రమ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. -
Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే
దేశ నేతలు ఇతర దేశాల నేతలతో సరిగా మాట్లాడాలి. వారు చెప్పేది సరిగా వినాలి. దౌత్య సంబంధాలు సఫలం కావాలంటే సంభాషణే కీలకం. కాని అన్ని భాషలు అందరు నేతలకూ రావాలని లేదు. అందుకే దుబాసీలను ఎంచుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో తరచు కనిపిస్తున్న దుబాసి గుర్దీప్ కౌర్ చావ్లా. ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో ఆమె కీలక పాత్ర పోషించింది. అది వేదిక మీద ఎవరో ఒక నాయకుడు చేస్తున్న రాజకీయ ప్రసంగాన్ని అనువాదం చేయడం కాదు. లేదా ఒక కథనో వ్యాసాన్నో అనువాదం చేయడం కాదు. అగ్రనేతలు చర్చలు చేసుకుంటున్నప్పుడు ఆ సంభాషణను అనువాదం చేయడం. దుబాసీగా ఉండటం. ‘ఆ పని చాలా కష్టం’ అంటారు గుర్దీప్ కౌర్ చావ్లా. అమెరికాలో స్థిరపడిన ఈ పంజాబీ భారతీయురాలు గత 26 ఏళ్లుగా దౌత్యరంగంలో దుబాసీగా సేవను అందిస్తున్నారు. ‘డిప్లమాటిక్ ఇంటర్ప్రెటర్’గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు గుర్దీప్ కౌర్. So good to see Gurdeep Kaur Chawla (interpreter) at the historic meeting between President Biden and Prime Minister Modi. Gurdeep is simply brilliant!#Politics #India #Historic pic.twitter.com/DuelcjJNUB — Dr. Jagdish N. Sheth (@JagSheth) June 27, 2023 ఢిల్లీలో చదువుకుని గుర్దీప్ కౌర్ ఢిల్లీలో ఎం.ఏ. ఇంగ్లిష్ చదవి, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి, పీహెచ్డీ చేశాక పార్లమెంట్లో అనువాదకురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఇంగ్లిష్, హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో గొప్ప ప్రవేశం ఉండటంతో దుబాసీగా ఆమె సేవలను పార్లమెంట్ భవన్ ఉపయోగించుకునేది. అయితే భర్త ఉద్యోగరీత్యా 1996లో అమెరికా వెళ్లిన గుర్దీప్ అక్కడ కూడా దౌత్యపరమైన దుబాసీగా కావాల్సిన అనుభవం కోసం ‘జ్యుడిషియల్ కౌన్సిల్ ఆఫ్ కాలిఫోర్నియా’లో పని చేశారు. ‘దౌత్యరంగానికి అవసరమైన మేలిమి ఇంటర్ప్రెటర్ల కొరతను ఆ రోజుల్లోనే నేను గమనించాను. అలాంటివారిని తయారు చేయడానికి ‘ఇండియన్ లాంగ్వేజస్ సర్వీసెస్’ అనే సంస్థను స్థాపించి దుబాసీలను తయారు చేస్తున్నాను. భారతీయ నేతల కోసమే కాదు ప్రపంచ నేతల కోసం కూడా అరబిక్, స్పానిష్, చైనీస్ తదితర భాషలలో నిపుణులైన దుబాసీలను మేము ఏర్పాటు చేస్తాం’ అంటారు గుర్దీప్ కౌర్. We are proud of Pacific Council member Dr. Gurdeep Kaur Chawla, who is interpreting bilateral talks during the #ASEAN summit in #Singapore. pic.twitter.com/PqyFBbRYP4 — Pacific Council (@PacCouncil) November 15, 2018 ప్రధానులకు దుబాసీ అమెరికా పర్యటనకు వచ్చే భారతీయ ప్రధానులకు గుర్దీప్ దుబాసీగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు, వాజ్‌పేయి, గుజ్రాల్, మన్మోహన్ సింగ్ వీరందరూ అమెరికా వచ్చినప్పుడు వారి అధికారిక దుబాసీగా గుర్దీప్ పని చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కోసం పని చేస్తున్నారు. అయితే ట్రంప్ హయాంలో మోదీ అమెరికా వచ్చినప్పుడు ట్రంప్‌కు కూడా దుబాసీగా గుర్దీప్ పని చేశారు. అంటే ట్రంప్ మాట్లాడేది హిందీలో అనువాదం చేసి మోదీకి తెలిపారు. ఒబామాకు కూడా గుర్దీప్ పని చేశారు. సవాళ్లతో నిండిన పని ‘అగ్రనేతలు పాల్గొనే దౌత్య సంబంధ సమావేశాలలో దుబాసీగా పని చేయడం చాలా సవాలు. నేతలు మాట్లాడేది ఒక మాట తక్కువ కాకూడదు ఒక మాట ఎక్కువ కాకూడదు. ముఖ్యంగా మన భావాలు, పెడర్థాలు కలపకూడదు. నేను ఒక నేతకు దుబాసీగా పని చేయాలని అనుకున్న వెంటనే ఆ నేత వాడే పదసముదాయం, ఉచ్చారణ, యాస, వ్యక్తీకరణ మొత్తం స్టడీ చేస్తాను. రెండు దేశాల మధ్య ఉండే దౌత్య పరమైన సంబంధాల అవగాహన ఉండాలి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక అంతరం, అధికారిక సంబంధాల మధ్య ఉండే సవాళ్లు... వీటన్నింటిని తెలుసుకుని ఆ అగ్రనేత ఏం మాట్లాడబోతాడో ఊహించి సిద్ధంగా ఉండాలి. ఇంత హోమ్‌వర్క్ లేకపోతే తక్షణ అనువాదం సాధ్యం కాదు’ అంటుంది గుర్దీప్ కౌర్. ఐక్యరాజ్యసమితి, ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంక్, యూ.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్, డబ్లు్య.హెచ్.ఓ తదితర సంస్థలకు గుర్దీప్ కౌర్ వ్యక్తిగతంగా తన సంస్థ తరఫున సేవలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు దేశాలు ఏవైనా మాట్లాడుకోవాలంటే గుర్దీప్ కౌర్ సేవలు తప్పనిసరి అనే స్థితిలో ఆమె తన సేవలను విస్తరించారు. భాష తెలియడం వల్ల వచ్చిన విజయం ఇది. భాషల మీద పట్టు సాధించి ఇటువైపు కెరీర్ మలుచుకోవాలనుకునేవారికి గుర్దీప్ గొప్ప స్ఫూర్తి. Super proud of our colleague, Dr Gurdeep Kaur Chawla @ Imagindia Institute - she is sitting to the right of US Secy State Pompeo, as he meets Prime Minister Modi today morning in Delhi. pic.twitter.com/lCLz1DcLCa — Imagindia (@Imagindia) June 26, 2019 -
సౌదీ అరేబియా X ఇరాన్ విద్వేష గీతం: వరుస మారింది
బద్ధ విరోధులైన సౌదీ అరేబియా, ఇరాన్ క్రమంగా దగ్గరవుతున్నాయి. దశాబ్దాల వైరానికి తెర దించే దిశగా సాగుతున్నాయి. దౌత్య బంధాలను పునరుద్ధరించుకోవడంతో పాటు ఆర్థిక సంబంధాలను కూడా బలోపేతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. మధ్య ప్రాచ్యంపై పట్టు పెంచుకునే యత్నాల్లో భాగంగా ఈ సయోధ్యకు చైనా మధ్యవర్తిత్వం వహిస్తోంది. అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పరిణామాన్ని చైనాకు కీలక దౌత్య విజయంగా భావిస్తున్నారు. రెండు శత్రు దేశాల మధ్య సయోధ్య యత్నాల్లో డ్రాగన్ దేశం నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై అమెరికా పెత్తనానికి బీటలు వారుతున్నట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది... పశ్చిమాసియాలో చిరకాల ప్రత్యర్థులైన సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య మొగ్గతొడుగుతున్న కొత్త దోస్తీ ఒక రకంగా అనూహ్యమే. ఇది ప్రపంచ దేశాలను కాస్త ఆశ్చర్యపరిచింది కూడా. 2016లో షియా మత పెద్దను సౌదీ చంపేయడం, ప్రతిగా ఇరాన్‌లోని ఆ దేశ దౌత్య కార్యాలయాలపై దాడులతో దశాబ్దాల వైరం తారస్థాయికి చేరింది. దౌత్య తదితర సంబంధాలన్నీ తెగిపోయాయి. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలూ దగ్గరయ్యే ప్రయత్నాలు 2021 నుంచీ జరుగుతున్నాయి. చైనా చొరవతో అవి రెండు నెలలుగా ఊపందుకున్నాయి. నెల రోజులుగా బీజింగ్ వేదికగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న మంత్రుల స్థాయి భేటీలు సయోధ్యకు గట్టి పునాదులే వేశాయి. విదేశాంగ మంత్రులు హొస్సైన్ అమిరబ్దొల్లాహియాన్ (ఇరాన్), ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ (సౌదీ) బీజింగ్‌లో తాజాగా చర్చలు జరిపారు. ఇరు దేశాల్లో పరస్పరం దౌత్య కార్యాలయాలను తిరిగి తెరిచేందుకు Vఅంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులతో పాటు వీసా జారీకి అవకాశాలను పరిశీలించనున్నట్టు హొస్సైన్ తెలిపారు. ఈ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతీయ, భౌగోళిక రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చంటున్నారు. ‘‘యెమెన్ నుంచి లెబనాన్ దాకా వేర్పాటువాద పోరాటాల్లో చెరో వైపుండి ఇరాన్–సౌదీ చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెర పడుతుంది. ఇది పశ్చిమాసియాలో రాజకీయ స్థిరత్వానికి దారి తీయవచ్చు’’అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా సౌదీ–ఇరాన్ బంధం ఏ మేరకు గట్టిపడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందన్నది వారి అభిప్రాయం. దశాబ్దాల వైరం సౌదీ అరేబియా, ఇరాన్ వైరం ఈనాటిది కాదు. 1979 విప్లవంతో ఇరాన్లో రాచరికానికి తెర పడి మతవాద శక్తుల ఆధిపత్యంతో కూడిన ప్రభుత్వం ఏర్పడటంతో అది మరింత ముదిరింది. ► ఇరాన్ ప్రధానంగా షియా ఆధిపత్య దేశం కాగా సౌదీ అరేబియా సున్నీ ప్రాబల్య దేశం. ► ప్రాంతీయంగా ఆధిపత్య కాంక్ష తదితరాలు వాటి శత్రుత్వానికి మరింత ఆజ్యం పోశాయి. ► 2016లో ప్రముఖ షియా నేత షేక్ నిమ్ర్ అల్ నిమ్ర్‌ను ఉగ్రవాద ఆరోపణలపై సౌదీ తల నరికి చంపడంతో ఇరాన్ భగ్గుమంది. భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. మధ్య ప్రాచ్యంలోని పలు దేశాల్లో సౌదీ వ్యతిరేక పోరాట గ్రూపులకు బాసటగా నిలవసాగింది. ► ఇరాక్, సిరియా, యెమన్, లెబనాన్ వంటి పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో సౌదీ, ఇరాన్ చెరో వర్గం వైపు నిలిచి ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయి. సిరియాలో రెబెల్ గ్రూపులకు సౌదీ మద్దతిస్తుండగా అధ్యక్షుడు అల్ బషర్‌కు ఇరాన్ దన్నుగా నిలిచింది. ► సరిహద్దు దేశమైన యెమన్‌లో తాము అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సాయుధ, ఆర్థిక సాయం చేస్తోందని సౌదీ గుర్రుగా ఉంది. ► 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను గద్దె దించడంతో అక్కడ సున్నీల ఆధిపత్యానికి తెర పడింది. అప్పటినుంచీ ఇరాక్‌లోని షియా ప్రాబల్య ప్రభుత్వంపైనా ఇరాన్ పట్టు పెరిగింది. తాజా చర్చల అనంతరం యెమెన్‌లోని హౌతీలకు సాయాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకరించిందని సమాచారం. ► పశ్చిమాసియాలో ఇటీవల మార్పు పవనాలు వీస్తున్నాయి. వైరి దేశాలు స్పర్ధలను పక్కన పెట్టి ఒక్కటవుతున్నాయి. అరబ్ దేశమైన యూఏఈ 2020లో ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ముందడుగు వేసింది. చైనా.. పశ్చిమాసియాలో పవర్ బ్రోకర్ అమెరికా స్థానంలో పశ్చిమాసియాలో పెద్దన్న పాత్రను పోషించేందుకు చైనా కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ► 2015లో ఇరాన్ అణు ఒప్పందం వంటి బహుపాక్షిక శాంతి చర్చల్లో చైనా చురుగ్గా పాల్గొంది. తొలుత అమెరికా కూడా భాగస్వామిగా ఉన్నా 2018లో ఉన్నట్టుండి వైదొలగింది. ► చైనా ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారు. అందుకే చమురు నిల్వలు బాగా ఉన్న పశ్చిమాసియాపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ► అటు ఇరాన్‌తో, ఇటు సౌదీ అరేబియాతో చైనాకు ముందునుంచీ మంచి సంబంధాలే ఉన్నాయి. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య ముందునుంచీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! సౌదీతో కూడా అమెరికా సంబంధాలు కొంతకాలంగా క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా బైడెన్ హయాంలో అవి మరీ దిగజారాయి. ► పొరుగునున్న యెమెన్‌లోని హౌతీ మూకలతో చిరకాల పోరాటంతో అలసిన సౌదీ శాంతి మంత్రం జపిస్తోంది. అమెరికా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ కూడా ఆర్థికంగా ఊపిరి పీల్చుకునే అవకాశాల కోసం చూస్తోంది. ఈ పరిస్థితులు చైనాకు కలసి వచ్చాయి. ► చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గత డిసెంబర్లో రియాద్ వెళ్లి సౌదీ–ఇరాన్ నాయకత్వంతో మంతనాలు జరిపారు. తర్వాత ఫిబ్రవరిలో ఇరాన్ అధ్యక్షునితో బీజింగ్‌లోనూ చర్చలు జరిపి ఇరు దేశాల చర్చలకు రంగం సిద్ధం చేశారు. ► మధ్య ప్రాచ్యంతో అమెరికా వర్తకమూ క్రమంగా క్షీణిస్తోంది. 2019లో 120 బిలియన్ డాలర్ల నుంచి 2021లో 80 బిలియన్ డాలర్లకు తగ్గింది. ► మరోవైపు మధ్య ప్రాచ్య దేశాలతో వాణిజ్య సంబంధాలను చైనా నానాటికీ పెంచుకుంటూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా చైనా అవతరించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
దుర్భేద్యమైన ఉక్కు సైన్యం: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
బీజింగ్: దేశ సార్వభౌమత్వమే పరమావధిగా అత్యంత పటిష్టతర ఉక్కు సైన్యంగా దేశ సాయుధబలగాలను శక్తివంతం చేస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. ఉప్పు– నిప్పుగా ఉండే సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంలో సఫలీకృతమై అంతర్జాతీయ సమాజంలో ప్రతిష్టను పెంచుకున్న చైనా.. దేశ సైన్యానికి ‘ఆధునిక’ జవసత్వాలను అందించడంపై దృష్టిపెట్టింది. చైనాకు మూడోసారి అధ్యక్షుడయ్యాక జిన్‌పింగ్ తొలిసారిగా ప్రసంగించారు. చైనా పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రజల నుద్దేవించి మాట్లాడారు. ‘ అంతర్జాతీయ వ్యవహా రాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించడంతోపాటు అమెరికాసహా పొరుగు దేశాల నుంచి ముప్పు, దేశ సార్వభౌమత్వ సంరక్షణ కోసం సైన్యాన్ని ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్ (ఉక్కు సైన్యం)’గా మారుస్తాం. చైనా ముందుకుతెచ్చిన గ్లోబల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్(జీడీఐ), గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ వంటి కార్యక్రమాల అమలు సహా ప్రపంచ పురోభివృద్ధి, సంస్కరణ పథంలో చైనా ఇకమీదటా గతిశీల పాత్ర పోషించనుంది. దాంతోపాటే దేశ భద్రత, అభివృద్ది ప్రయోజనాలను కాపాడుకునేందుకు దేశ భద్రత, సాయుధ బలగాలను అజేయశక్తిగా నవీకరించాలి. సుస్థిరాభివృద్ధికి భద్రతే వెన్నుముక’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ‘మీరు నాపై ఉంచిన నమ్మకమే నన్ను ముందుకునడిపే చోదకశక్తి. నా భుజస్కంధాలపై పెద్ద బాధ్యతల్ని మోపారు’ అన్నారు. ‘‘పొరుగు ప్రాంతాలతో శాంతియుత అభివృద్ధినే కోరుకుంటున్నాం. తైవాన్ స్వతంత్రత కోరే వేర్పాటువాదులను, బయటి శక్తుల జోక్యాన్ని అడ్డుకుంటున్నాం. చైనా ఆధునీకరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్దాం’ అని పార్లమెంట్లో సభ్యులనుద్దేశించి అన్నారు. -
రక్షణ రంగంలో సహకారం బలోపేతం
టోక్యో: రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్‌లు నిర్ణయించుకున్నాయి. జపాన్ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాల అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలుపుతూ మంత్రులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్ భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం. ‘రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పరిశ్రమలను రాజ్‌నాథ్ కోరారు. మరోవైపు, భారత్–జపాన్ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు.‘ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇతర దేశాలతో విభేదాలను పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, సైనిక చర్యలకు పాల్పడకూడదు. దేశాల మధ్య తగాదాలు, వాతావరణ మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతోంది. దీంతో ఇంథన, ఆహార భద్రత సంక్షోభంలో పడుతోంది’ అని జైశంకర్ అన్నారు. -
తీర్మానం జరిగింది.. ఒకవేళ ఆంక్షలు విధిస్తే..
వాషింగ్టన్: అఫ్గనిస్తాన్‌తో తమ దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ‘ఆగస్టు 30న అఫ్గన్ నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో ఒకటి ముగిసింది. కొన్ని వారాల వ్యవధిలోనే దాదాపుగా లక్ష 23 వేల మందికి పైగా అఫ్గన్ పౌరులను, 6 వేల యూఎస్ పౌరులను అమెరికా సంకీర్ణ దళాలు రక్షిత ప్రదేశాలకు తరలించాయి’’ అని పేర్కొన్నారు. ఇకమీదట కూడా తమ పనిని కొనసాగిస్తామని, అఫ్గన్ ప్రజలను సురక్షితంగా తరలించడానికి, కాబుల్ విమానాశ్రయం పునఃప్రారంభానికి యూఎస్ తమ వంతు సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఖతార్ రాజధాని దోహాలోని తమ కార్యాలయం నుంచి అఫ్గన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. దాదాపుగా వంద మంది అమెరికన్లు ఇంకా అఫ్గన్‌లోనే ఉన్నారని, వాళ్లను సురక్షితంగా దేశానికి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నెడ్ ప్రైస్ వెల్లడించారు. అదే విధంగా.. దేశం వీడాలనుకున్న వారికి ఇబ్బంది కలగకుండా.. తాలిబన్లు ఎటువంటి ఆంక్షలు విధించరాదని, ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఒకవేళ తాలిబన్లు ఇందుకు సానుకూలంగా స్పందించనట్లయితే, తమ పౌరులను ఎలా తీసుకురావాలో తెలుసునంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: US Afghanistan Exit: ఇకపై విదేశీ గడ్డ మీద అడుగుపెట్టకుండానే: బైడెన్ -
తాలిబన్లతో ఫలవంతమైన చర్చలు: చైనా ప్రకటన
బీజింగ్/కాబూల్: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో చైనా ద్వైపాక్షిక చర్చలు జరిపింది. కాబూల్‌లో జరిగిన భేటీ ద్వారా తాలిబన్లతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంబిన్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘‘అఫ్గనిస్తాన్ ప్రజల స్వతంత్ర నిర్ణయాన్ని, మెరుగైన భవిష్యత్తు కోసం ఎంచుకున్న మార్గాన్ని చైనా గౌరవిస్తుంది. అఫ్గనీయుల నాయకత్వంలో, అఫ్గన్ల చేత ముందుకు సాగాలనుకున్న వారికి మద్దతుగా నిలుస్తుంది. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, స్నేహపూర్వకంగా మెదులుతూ అన్ని రకాల సహాయం అందిస్తుంది. అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై, ఆ దేశ పునర్నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుంది. పొరుగు దేశమైన అఫ్గన్‌తో చర్చించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. చైనా, అఫ్గన్ తాలిబన్ల మధ్య ఫలవంతమైన చర్చలు, సంప్రదింపులు జరిగాయి’’ అని పేర్కొన్నారు. అయితే, ఏయే అంశాలపై చర్చించారన్న విషయాన్ని వెల్లడించలేదు. కాగా తాలిబన్ పొలిటికల్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ అబ్దుల్ సలాం హనాఫీ, అఫ్గనిస్తాన్‌లో చైనా రాయబారి వాంగ్ యూ మధ్య కాబూల్‌లో చర్చలు జరిగాయి. ఇక ఆగష్టు 15న తాలిబన్లు కాబూల్‌ను వశం చేసుకున్న తర్వాత అమెరికా, భారత్ సహా ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలు మూసివేయగా.. చైనా, పాకిస్తాన్, రష్యా మాత్రం ఎంబసీలను తెరిచే ఉంచాయి. కాగా తాలిబన్లతో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆగష్టు 16న ప్రకటించిన చైనా.. తాజాగా దానిని అమలు చేసింది. ఇక గత నెల 28న డ్రాగన్ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తాలిబన్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ చైనాలో సమావేశమైన విషయం తెలిసిందే. చదవండి: Anarkali Kaur Honaryar: ఒక్కో మెసేజ్ చూస్తుంటే గుండె పగిలిపోతోంది ‘కాదంటే కాల్చి చంపి, శవాలతో శృంగారం చేస్తారు’ -
దౌత్య లక్షణాలు
దూత కలహకారుడు కాకూడదు. తగాదాను పెంచడం, మాటల్ని ఎగదోయడం, యుద్ధాన్ని పురిగొల్పడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ దూత చేయకూడదు. అలాంటి కుటిలబుద్ధులుమంచి దౌత్యవేత్త కాలేరు. ఒకానొక సమయంలో దేవదత్తుడు బుద్ధునితో విభేదించాడు. బౌద్ధ సంఘాన్ని చీల్చాడు. ఐదువందల మంది భిక్షువులతో ప్రత్యేక సంఘాన్ని గయాశీర్షంలో స్థాపించాడు. అతని చెప్పుడు మాటలు విని, వెళ్లిపోయిన ఆ ఐదువందల మంది భిక్షువులకు నచ్చచెప్పి, వారి అనుమానాలను నివృత్తి చేసి తిరిగి వెనక్కు తీసుకురావాలని బుద్ధుడు భావించాడు. వారి దగ్గరకు దూతగా వెళ్ళి సమయస్ఫూర్తిగా దౌత్యాన్ని నెరపగలవారు ఎవరా అని ఆలోచించాడు. ఆ విషయం చెప్పగానే చాలామంది ‘మేము వెళ్తాం’ అంటూ ముందుకొచ్చారు. వారందరిలో ధమ్మ సేనాపతిగా పేరుపొందిన సారపుత్రుడు మాత్రమే తగినవాడని బుద్ధుడు భావించాడు. సారపుత్రుణ్ణి పంపేముందు, దూతకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పి పంపాడు బుద్ధుడు సారపుత్రునితో. ‘సారపుత్రా!’ మంచి దౌత్యవేత్త ఎనిమిది విషయాల్ని పాటించాలి. వాటిలో మొదటిది: దూతకు విసుగులేకుండా వినే లక్షణం ఉండాలి. వారు ఎంత చెప్తున్నా మధ్యలో ఆపకుండా, అడ్డుపడకుండా ఓర్పుతో వినాలి. ఇక రెండోది: దూత తాను చెప్పదలచుకున్నదంతా సమగ్రంగా చెప్పాలి. అస్తుబిస్తుగా, అరకొరగా, అసందర్భం గా చెప్పకూడదు. అలాగే సారపుత్రా! వినడం అంటే కేవలం చెవితో వినడం కాదు. దాన్ని హృదయంతో గ్రహించాలి. అప్పుడు ఎదుటివారు చెప్పే విషయాల్లో వారి సాధక బాధకాలు అర్థం అవుతాయి. ఇక నాలుగోది: దూత విషయ ధరుడు కావాలి. తాను ఏమి చెప్పాలో, ఆ విషయాన్నంతా ఒంటబట్టించుకోవాలి. అప్పుడు సమయాన్ని, సందర్భాన్ని బట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించడం సాధన అవుతుంది. ఇంకా, దూత విజ్ఞాత కావాలి. తాను మాట్లాడేప్పుడు విజ్ఞత కలిగి ఉండాలి. మాటలు తూలకూడదు, విషయాల్ని దాచి చెప్పకూడదు అలాంటి విజ్ఞుడే మంచి దౌత్యవేత్త! ఇంకా సారపుత్రా! దూత విజ్ఞాపయిత కూడా అయి ఉండాలి. అంటే... తాను విజ్ఞత కోల్పోకూడదు. ఎదుటివారు రెచ్చగొడుతున్నా ఎదురు తిరిగి మాట్లాడుతున్నా, తలా, తోకలేని ప్రశ్నలతో వేధిస్తున్నా తాను సంయమనం పాటించాలి. ఆ విధంగా దూతకి చతురత ఉండాలి. తన దౌత్యం ఫలించినా, ఫలించకపోయినా, తాను మాత్రం చలించకూడదు. తన ఔన్నత్యాన్ని కోల్పోకూడదు.సారపుత్రా! ఈ ఏడింటితో పాటు దౌత్యవేత్తకు ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమంటే... దూత కలహకారుడు కాకూడదు. తగాదాను పెంచడం, మాటల్ని ఎగదోయడం, యుద్ధాన్ని పురిగొల్పడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ దూత చేయకూడదు. అలాంటి కుటిలబుద్ధి ఉన్నవాడు మంచి దౌత్యవేత్త కాలేడు’’ అని ఈ ఎనిమిది విషయాలు చెప్పి పంపాడు. సారపుత్రుడు వెళ్ళి సమస్యను పరిష్కరించాడు. ఐదువందల మంది భిక్షువులూ తమ తప్పును గ్రహించి తిరిగి బౌద్ధ సంఘానికి వచ్చారు. దేవదత్తుడు మాత్రం వినక ఒంటరిగా మిగిలిపోయాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
చిక్కుల్లో భారత్–రష్యా బంధం
కాలం మారినప్పుడు, కొత్త అవసరాలు తరుముతున్నప్పుడు, అనుకోని సమస్యలు తలెత్తినప్పుడు మనుషుల మధ్య బంధాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. దేశాల మధ్య దౌత్య సంబంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్ సోమ, మంగళవారాల్లో మన దేశంలో జరిపిన పర్యటనను నిశితంగా గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. అంతేకాదు...పాకిస్తాన్లో నిన్న, ఈరోజు ఆయన సాగించిన పర్యటన కూడా దీన్నే వెల్లడిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధకాలానికి సోవియెట్ యూనియన్‌గా వున్న రష్యా మనకు అత్యంత ఆత్మీయ దేశం. ఎలాంటి సమస్యలు తలెత్తినా దృఢంగా మద్దతిచ్చిన దేశం. సోవియెట్ యూనియన్ కుప్పకూలి, అది వేర్వేరు దేశాలుగా ఏర్పడి అస్థిరత్వంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. అమెరికాతో చెలిమి అంకురించింది. సహజంగానే ఈ పరిణామాలు రష్యాను కలవరపరిచాయి. ‘ఇండో–పసిఫిక్ వ్యూహం’ ఇరుసుగా ఆవిర్భవించిన చతుర్భుజ కూటమి (క్వాడ్)లో భారత్, అమెరికాలు భాగస్వాములయ్యేలా ఈ స్నేహం విస్తరించింది. ఇదంతా రష్యాకు మింగుడుపడటం లేదని ఆ దేశం మాటలూ, చేతలూ నిరూపిస్తూనే వున్నాయి. అసలు ‘ఇండో–పసిఫిక్’ భావనకే రష్యా వ్యతిరేకం. అందుకు బదులు ‘ఆసియా–పసిఫిక్’గా వ్యవ హరించాలని... తనతోపాటు చైనా సహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలనూ భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం కోరుకుంటోంది. అఫ్ఘానిస్తాన్ శాంతిప్రక్రియలో తాలిబన్లు పాలు పంచుకోవటం సరైందేనని రష్యా అంటుండగా... అక్కడున్న అన్ని వర్గాలతోపాటు, ఇరుగుపొరుగు దేశాల భాగస్వామ్యం కూడా తప్పనిసరని మన దేశం భావిస్తోంది. ఈ నేపథ్యంలో లవ్రోవ్ పర్యటన మన దేశంలో మొక్కుబడిగానే సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా వుండటంతో లవ్రోవ్ ఆయన్ను కలవలేకపోయారు. లవ్రోవ్ సోమవారమే వచ్చినా ఆరోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలూ లేవు. ఆ మర్నాడు విదే శాంగమంత్రి జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన నేరుగా పాకిస్తాన్ వెళ్లారు. ఇక్కడికి రాదల్చుకున్నప్పుడు దాంతో పాకిస్తాన్‌ను జత చేయొద్దన్నది మొదటినుంచీ భారత్ కోరిక. 2012 డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి వచ్చినప్పుడు ముందుగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్తారన్న వార్తలొచ్చాయి. ఆ దేశం అందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంది కూడా. కానీ చివరి నిమిషంలో ‘మీ దేశం రావటం కుదరదంటూ పాకిస్తాన్‌కు వర్తమానం పంపి, ఆయన భారత్‌కు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత కాలంలోనూ అదే జరిగింది. కానీ ఈసారి మాత్రం లవ్రోవ్ అందుకు భిన్నమైన పంధాను అనుసరించారు. ఇది కూడా అలకలో భాగం కావొచ్చు. నిరుడు జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు రద్దయింది. కరోనా ఉగ్రరూపం దాల్చినందువల్ల రద్దయిందని ఇరు దేశాలూ చెప్పినా దాన్ని ప్రపంచం పెద్దగా విశ్వసించలేదు. దౌత్య సంబంధాల్లో ఏదీ దానికది స్వతంత్రంగా వుండదు. ఒక దేశం తీసుకునే నిర్ణయమైనా, విధానమైనా దానితో వివిధ దేశాలకుండే సంబంధాలను ప్రభావితం చేస్తుంది. 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు, అది క్రిమియాను దురాక్రమించ టంవంటి పరిణామాలతో ఆ రెండు దేశాల సంబంధాలూ బాగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచీ ప్రపంచంలో ఎవరూ రష్యాకు సన్నిహితం కారాదన్న విచిత్ర విధానానికి అమెరికా తెర తీసింది. తన నాయకత్వంలోని నాటోలో భాగస్వామిగా వున్న టర్కీ తన మాట బేఖాతరుచేసి నిరుడు రష్యా నుంచి అత్యంతాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిందన్న దుగ్ధతో ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించింది. మనపై కూడా ఎస్–400 విషయంలో చాన్నాళ్లపాటు ఒత్తిడి తెచ్చింది. పర్యవసానంగా మన దేశం సందిగ్ధంలో పడింది కూడా. చివరకు 2018 అక్టోబర్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆ ఒప్పందంపై సంతకాలయ్యాయి. దానిపై ఇప్పటికీ అమెరికా మనల్ని హెచ్చ రిస్తూనేవుంది. అయితే భారత్ తమ మిగ్ యుద్ధ విమానాలను కాదని, రఫేల్‌ను ఎంచుకోవటం రష్యాకు మింగుడుపడలేదు. అంతమాత్రాన భారత్–రష్యా సంబంధాలు పూర్తిగా అడుగంటాయని భావించనవసరం లేదు. తాజా పర్యటనలో రష్యా రక్షణ సామగ్రిని భారత్‌లోనే ఉత్పత్తి చేసేందుకు గల అవకాశాలపై చర్చించారు. ఈ ఏడాది ఆఖరులో జరగాల్సిన ఇరు దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుకున్నారు. తమనుంచి కొనుగోలు చేయాల్సిన రక్షణ సామగ్రిపైనా ఆ సందర్భంగానే ఇరు దేశాల రక్షణమంత్రులూ చర్చిస్తారని లవ్రోవ్ చెప్పారు. మనతో గిల్లికజ్జాలు పెట్టుకునే చైనాతో రష్యా అంటకాగటం, పాకిస్తాన్‌కు క్రమేపీ సన్నిహితం కావటం మన దేశానికి నచ్చటం లేదు. దానికి తగినట్టే తన తాజా పాక్ పర్యటనలో లవ్రోవ్ ఆ దేశానికి రక్షణ సామగ్రి విక్రయించటానికి, దాంతో కలిసి సముద్ర, పర్వత ప్రాంత సైనిక విన్యాసాలు జరపటానికి అవగాహన కుదుర్చుకున్నారు. కాలపరీక్షను తట్టుకుని నిలబడిన బంధాలు సడలకూడదనుకుంటే రెండు దేశాలూ చారిత్రక స్పృహతో మెలగాలి. తాత్కాలిక ఫలితాల కోసం కాక, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి నిలపాలి. భవిష్యత్తరాలకు సుస్థిరమైన, భద్రమైన ప్రపం చాన్ని... ఘర్షణలకు తావులేని ప్రపంచాన్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలి.