కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా తమ దాడులు ఆగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొంటున్నారు. హమాస్‌కు గట్టిపట్టున్న రఫాలో వారిని అంతం చేయటమే తమ సైన్యం లక్ష్యమని ముందుకు వెళ్లుతున్నాడు. అయితే మరోవైపు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా.. పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు కొలంబియా దేశం షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటామని తెలిపింది. జాతి విధ్వంస ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తమ దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటుమని కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు.
‘‘గురువారం నుంచి ఇజ్రాయెల్‌తో ఉన్న దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నాం. ఒక జాతి విధ్వంసక ప్రధానితో మేము ఇక సంబంధాలు కొనసాగించలేము. జాతి విధ్వంస ప్రవర్తన, జాతీ నిర్మూలనను ప్రపంచం అస్సలు ఆమోదించదు. ఒకవేల పాలస్తీనియా అంతం అయితే.. ప్రపంచంలో మానవత్వం అంతం అయినట్లే’’అని బుధవారం మే డే ర్యాలీలో గుస్తావో పెట్రో అన్నారు.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘‘గుస్తావో పెట్రో ఇజ్రాయెల్ పౌరుల ద్వేషి, వ్యతిరేకి. ప్రాణాలు తీసే, అత్యాచారాలు చేసే హమాస్ మిలిటెంట్లకు పెట్రో రివార్డులు ఇస్తానని హామీ ఇచ్చారు. వాటిని ప్రస్తుతం ఆయన బయటపెట్టారు’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అత్యంత నీచమైన రాక్షసుల (హమాస్ మిలిటెంట్లు) పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్న పెట్రోను చరిత్ర గుర్తుపెట్టుకుంటుదన్నారు. హమాస్ మిలిటెంట్లు చిన్నపిల్లను పొట్టనబెట్టుకున్నారని, మహిళలపై అత్యాచారం చేశారని, అమాయక ప్రజలను అపహరిచారని మండిపడ్డారు.
హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి.. 250 మందిని బంధీలుగా తీసుకెళ్లారు. కొంతమందిని హమాస్ మిలిటెంట్లు విడిచిపెట్టగా.. ఇంకా 129 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అక్టోబర్ 7 తర్వాత ప్రతీకారంతో ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నదాడుల్లో 34,568 మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment