హమాస్ మిలిటెంట్లు గతేడాడి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. హమాస్ మిలిటెంట్లు 250 ఇజ్రాయల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు సరిహద్దులో ఉన్న ఐదుగురు ఇజ్రాయల్ మహిళా సైనికులను బంధీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘బంధీల కుటుంబ ఫోరం’ విడుదల చేసింది.
ఆ వీడియోలో నహల్ ఓజ్ బేస్ వద్ద విధలు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ మహిళా సైనికులు.. లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగామ్ బెర్గర్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ తెలుస్తోంది. మహిళా సైనికులు గాయాలతో, వారి చేతులు కట్టేసి ఉండటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అందులో ఒక హమాస్ మిలిటెంట్.. ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉద్దేశిస్తూ మీరంతా అమ్మాయిలు, మహిళలు. మీరు గర్భవతులు అవుతారు’అని అన్నాడు. మరో మిలిటెంట్ ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’అని అన్నాడు.
"No You're NOT beautiful" Hamas taunts female IDF terrorists.
Here's the part of the video Israel miss-translate to claim he said she was "So beautiful" God their desperation is CRINGE. pic.twitter.com/Iv3U1W3Jbi— Syrian Girl 🇸🇾 (@Partisangirl) May 23, 2024
అందులో ఓ సైనికురాలు మాట్లాడుతూ.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’అని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఓ మిలిటెంట్.. ‘ మా సోదరులు ప్రాణాలు కోల్పోడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము కాల్చేస్తాం’అని అన్నాడు. ఈ వీడియోను విడుదల చేసిన ‘బంధీల కుటుంబ ఫోరం’ హమాస్ చెరలో ఉన్న బంధీలను వెంటెనే విడిపించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును డిమాండ్ చేస్తున్నారు.
ఇజ్రాయెల్ మహిళా సైనికులు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిలో చెరలో ఉన్న బంధీలను స్వదేశానికి రప్పించటంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవండని ప్రభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సెర్ అన్నారు. ఇక.. ఈ వీడియోపై హమాస్ మిలిటెంట్లు స్పందించారు. ‘ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో నిజం కాదు. ఇజ్రాయెల్ కల్పిత కథనాల ప్రచారం. మహిళా సైనికులతో తప్పుగా ప్రవర్తించలేదు’అని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment