video footage
-
హమాస్ చెరలో ఇజ్రాయెల్ మహిళా సైనికులు! వీడియో విడుదల
హమాస్ మిలిటెంట్లు గతేడాడి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. హమాస్ మిలిటెంట్లు 250 ఇజ్రాయల్ పౌరులను బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు సరిహద్దులో ఉన్న ఐదుగురు ఇజ్రాయల్ మహిళా సైనికులను బంధీలుగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘బంధీల కుటుంబ ఫోరం’ విడుదల చేసింది.ఆ వీడియోలో నహల్ ఓజ్ బేస్ వద్ద విధలు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ మహిళా సైనికులు.. లిరి అల్బాగ్, కరీనా అరివ్, అగామ్ బెర్గర్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ తెలుస్తోంది. మహిళా సైనికులు గాయాలతో, వారి చేతులు కట్టేసి ఉండటం ఆ వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. అందులో ఒక హమాస్ మిలిటెంట్.. ఇజ్రాయెల్ మహిళా సైనికులను ఉద్దేశిస్తూ మీరంతా అమ్మాయిలు, మహిళలు. మీరు గర్భవతులు అవుతారు’అని అన్నాడు. మరో మిలిటెంట్ ‘నువ్వు ఎంతో అందంగా ఉన్నావు’అని అన్నాడు."No You're NOT beautiful" Hamas taunts female IDF terrorists. Here's the part of the video Israel miss-translate to claim he said she was "So beautiful" God their desperation is CRINGE. pic.twitter.com/Iv3U1W3Jbi— Syrian Girl 🇸🇾 (@Partisangirl) May 23, 2024 అందులో ఓ సైనికురాలు మాట్లాడుతూ.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’అని అన్నారు. దీంతో వెంటనే స్పందించిన ఓ మిలిటెంట్.. ‘ మా సోదరులు ప్రాణాలు కోల్పోడానికి కారణం మీరే. మిమ్మల్ని మేము కాల్చేస్తాం’అని అన్నాడు. ఈ వీడియోను విడుదల చేసిన ‘బంధీల కుటుంబ ఫోరం’ హమాస్ చెరలో ఉన్న బంధీలను వెంటెనే విడిపించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహును డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్ మహిళా సైనికులు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిలో చెరలో ఉన్న బంధీలను స్వదేశానికి రప్పించటంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవండని ప్రభుత్వ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సెర్ అన్నారు. ఇక.. ఈ వీడియోపై హమాస్ మిలిటెంట్లు స్పందించారు. ‘ఇజ్రాయెల్ విడుదల చేసిన వీడియో నిజం కాదు. ఇజ్రాయెల్ కల్పిత కథనాల ప్రచారం. మహిళా సైనికులతో తప్పుగా ప్రవర్తించలేదు’అని వివరణ ఇచ్చారు. -
టన్నెల్లో హమాస్ అగ్రనేత! ఐడీఎఫ్ వీడియో విడుదల
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని హమాస్ దళాలపై దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) మంగళవారం ఓ వీడియోను విడుదల చేసింది. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడిచేసిన చేసినప్పటి నుంచి హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్ దొరకకుండా ఇజ్రాయెల్ సైన్యానికి తలనొప్పిగా మారాడు. అయితే తాజాగా ఐడీఎఫ్ విడుదల వీడియోలో.. గాజాలోని ఓ టన్నెల్ యాహ్యా సిన్వార్ తన కుటుంబసభ్యులతో కనిపించాడు. ఐడీఎఫ్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఓ టన్నెల్లో యాహ్యా సిన్వార్‌ను, తన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడు ఇబ్రహీంతో కనిపించారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి తాము యాహ్యా సిన్వార్‌ను టన్నెల్‌లోని వీడియోలో గుర్తించామని ఐడీఎఫ్ పేర్కొంది. ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక వీడియోలో హమాస్నేను చూసింది ఏమాత్రం పెద్ద విషయం కాదు. మేము.. హమాస్ నేతలు, వారి చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల వద్దకు చేరుకోవటమే చాలా ముఖ్యమైన విషయం. మేము హమాస్ నేతలు, సిన్వార్‌ను పట్టుకునే వరకు ఈ యుద్ధం ఆపము. అతను చనిపోయి ఉన్నా? సజీవంగా ఉన్నా? అతన్ని పట్టుకోవటమే మా లక్ష్యం’ అని డేనియల్ తెలిపారు. Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f — Israel Defense Forces (@IDF) February 13, 2024 61 ఏళ్ల యాహ్యా సిన్వార్.. హమాస్ మాజీ ఎజ్డైన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌కు కమాండర్‌గా పనిచేశారు. 2017లో పాలస్తీనాలోని హమాస్ గ్రూపు చీఫ్‌గా ఎన్నికయ్యారు. అతను 2011లో విడుదలకు ముందు ఇజ్రాయెల్ జైళ్లలో 23 ఏళ్లు యుద్ధ ఖైదీగా ఉన్నారు. హమాస్ చేత బందీగా ఉన్న ఫ్రెంచ్-ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ అనే యుద్ధ ఖైదీ మార్పిడిలో సిన్వార్ విడుదల అయ్యారు. చదవండి: ఇజ్రాయెల్ అరాచకం.. హమాస్ అగ్రనేత కుమారుడు మృతి! -
వితిన్ వన్ మంత్... డాడీ మళ్లీ నవ్వుతాడు!
వరల్డ్ కప్ ఫైనల్ ఫలితం ‘అయ్యయ్యో’ అనిపించింది. కన్నీళ్ల పర్యంతం అయిన రోహిత్‌శర్మను చూసిన తరువాత ఈ ‘అయ్యయ్యో’లు రెట్టింపు అయ్యాయి. ఈ అయ్యయ్యోల సంగతి ఎలా ఉన్నా రోహిత్‌శర్మ కూతురు సమైర వీడియో క్లిప్ ఇంటర్నెట్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో... సమైర తల్లితో కలిసి వస్తుంటే రోహిత్ గురించి ‘ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?’ అని ఎవరో అడిగారు. ‘రూమ్‌లో ఉన్నారు. వితిన్ వన్ మంత్ ఆయన మళ్లీ నవ్వుతాడు’ అన్నది సమైర. ఈ చిన్నారి పెద్దరికానికి నెటిజనులు మురిసిపోతున్నారు. ఇంతకీ ఇది తాజా వీడియో కాదు. గత ఏడాది ఏదో సందర్భంలో ఒక అభిమాని షేర్ చేసిన వీడియో. అయితే మాత్రం ఏమిటీ తాజా పరిస్థితికి జిరాక్స్‌లా ఉంది. The way she answered 🥹❤ Samaira said : He is in a room, he is almost positive & within one month he will laugh again.@ImRo45 pic.twitter.com/yt3iSQa6MP — 46thcenturywhenRohit (@RohitCharan_45) November 23, 2023 -
‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లలో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ మీడియా ముందు ఫుటేజ్ పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సహా పలువురు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు 65బీ సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సీఎం మీడియో సమావేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను న్యాయమూర్తి ప్రశ్నించారు. 65బీ ఇచ్చేందు కు సమయం కావాలని కోరడంతో.. సాయంత్రం 4.30 గం. వరకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సాయంత్రం వరకు వాయిదా వేశారు. పిటిషనర్లు ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేం.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చట్టంలో లేదని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది జోగినపల్లి సాయికృష్ణ వాదించారు. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొని వచ్చిన వీడియోను ఎవిడెన్స్‌గా పరిగణించలేమని చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 65బీ ప్రకారం సర్టిఫికెట్ లేకుండా ఎవిడెన్స్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి వీలులేదని చెప్పారు. అసలు సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలి అనడానికి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధం లేదన్నారు. ఇలాంటి ఎవిడెన్స్‌ను ట్రయల్ కోర్టులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని నివేదించారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి.. నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అక్టోబర్ 26న ముఖ్యమంత్రి మీడియా భేటీ నిర్వహించగా, నవంబర్ 9న సిట్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు దృష్టికి తేచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మెటీరియల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీని కోసం సాయంత్రం 4.30 గంటల వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. సాయంత్రం వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వు చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
అప్పుడు పొగిడిన మీడియానే... నన్నిప్పుడు తిడుతోంది: రాహుల్
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు. రాజస్తాన్‌లోకి జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు. -
Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయేనని జైరాం అన్నారు. -
గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్
Russia's Ministry of Defence Share Video Footage on its official Channel: రష్యా ఉక్రెయిన్ పై కొనసాగిస్తున్న దురాక్రమణ యుద్ధం వేళ రష్యా ఉక్రేనియన్ బలగాల నుంచి తాను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించింది. రష్యాతో తలపడటానికి బ్రిటన్ అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు మిలటరీ సాయం తోపాటు శక్తివంతమైన ఆయుధ సామాగ్రిని కూడా పంపించి ఉక్రెయిన్‌కి సాయం అందించిన సంగతి తెలిసిందే. ఐతే తాము ఉక్రెయిన్ పై పట్టు సాధించేశాం అంటూ జబ్బలు చరుచుకుంటూ ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను రష్యన్ సైనికులడు ఒక వీడియో ఫుటేజ్‌లో చూపిస్తున్నాడు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో రెండు నిమిషాల 15 సెకన్ల నిడివి గల ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో... రష్యా సైనికుడు యూఎస్, యూకే , పోలాండ్, స్వీడన్ దేశాల యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ లాంఛర్లతో సహా వివిధ రకాల ఆయుధాలను పట్టుకుని మాట్లాడుతున్నాడు. పైగా ఉక్రెయిన్‌కి మిగతా దేశాలు అందించిన ట్రోఫీలు ఇవిగో అంటూ వెటకరిస్తూ ... ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూపించాడు. ఐతే నివేదికలు ప్రకారం ఉక్రెయిన్ రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో పోల్చితే మాస్కో స్వాధీనం చేసుకున్నవి తక్కువేనని పేర్కోన్నాయి. అదీగాక మిలటరీ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు దాదాపు ఐదు వేల మిలటరీ వాహనాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పాశ్చాత్య దేశాల మద్ధతుతో ఉక్రెయిన్ బలగాలు బాగా పోరాడటమే కాకుండా యుద్ధంలో చాలా వరకు విజయం సాధించినట్లు పేర్కొంది. కానీ రష్యా మాత్రం దీన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటూ రష్యాన్ మాట్లాడే వర్గాలను రక్షించడానికి సాగిస్తున్న యుద్ధంగా చెబుతుంది. ఐతే పాశ్చాత్య దేశాలు మాత్రం మాస్కో తన చర్యను సమర్థించుకుంటూ ఉక్రెయిన్ పై దూకుడుగా వ్యకవహరిస్తోందని మండిపడుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం) -
రష్యా హెలికాప్టర్‌ను కూల్చి.. పైలట్‌ను పట్టుకున్నాం: ఉక్రెయిన్ రక్షణశాఖ
Russia-Ukraine crisis: తమ వైమానిక రక్షణ దళ నిపుణులు రష్యా హెలికాప్టర్‌ను శనివారం కూల్చేశారని ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్లో వెల్లడించింది. చెర్నిహివ్ నగర శివారులో ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. రష్యా హెలికాప్టర్లో ఒక పైలట్ మరణించాడని, అతడిని మేజర్ క్రివోలాపోవ్‌గా గుర్తించినట్లు తెలిపింది. మరో పైలట్ క్రస్నోయర్టెసెవ్ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు సంబంధిత వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇదిలా ఉండగా, చెర్నిహివ్ ప్రాంతం లో రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి శిథిలాల నుంచి 22 మృతదేహాలను వెలికి తీసినట్లు ఉక్రెయిన్ అధికార యంత్రాంగం తెలిపింది. రెండు పాఠశాలలు, ప్రైవేట్ ఇళ్లపై జరిగిన రష్యా దాడుల్లో కనీసం 9 మంది చనిపోయారని చెర్నిహివ్ స్థానిక గవర్నర్ చెప్పారు. #stoprussia ⚔️ Так гинуть російські окупанти. Цього разу у вертольоті! Слава Україні та її захисникам! Разом до перемоги! 🇺🇦@GeneralStaffUA pic.twitter.com/raFOepF06P — Defence of Ukraine (@DefenceU) March 5, 2022 -
మీ ప్రేమను తిరిగి ఇస్తా!
కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన హీరోయిన్ తమన్నా నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నన్ని రోజులు పిచ్చి పిచ్చిగా అనిపించింది. ఎప్పుడెప్పుడు నార్మల్ లైఫ్‌లోకి వస్తానా అనిపించింది. ఈ టైమ్‌లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ రొటీన్ లైఫ్‌లోకి వస్తాను. నా మీద మీరు (అభిమానులను ఉద్దేశించి) చూపించిన ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇస్తాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను. ఫుల్ స్టామినాతో మీ ముందుకొస్తాను’’ అని పేర్కొన్నారు తమన్నా. వీడియోలో ఈ బ్యూటీ తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుకుంటూ కనిపించారు. -
నా భూమి దక్కడం లేదు.. చనిపోతున్నా..!
-
నా భూమి దక్కడం లేదు.. చనిపోతున్నా..!
వర్గల్ (గజ్వేల్): రైతు వేదిక నిర్మాణం కోసం తన భూమి పోతుందని మనస్తాపం చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నా భూమి దక్కడం లేదు. ఇక నేను చనిపోతా’.. అంటూ క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ దిగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో జరిగిన ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి నర్సింలు తల్లిదండ్రులకు సర్వే నంబర్ 370లో లావుని పట్టా భూమి ఉంది. తమకున్న ఎకరం మూడు గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తులకు విక్రయించారు. దీంతో ఆ భూమిని 2013లో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోగా.. అక్కడ సబ్‌స్టేషన్ నిర్మించారు. తాజాగా దాని పక్కనే ఉన్న 13 గుంటల స్థలం రైతు వేదిక కోసం కేటాయించారు. అయితే.. ఈ స్థలం తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిందని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని నర్సింలు కోరాడు. రెవెన్యూ అధికారులు, సర్పంచ్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. రెండు రోజుల క్రితం అధికారులు జేసీబీతో వేదిక నిర్మాణ పనులు చేపడుతుండగా నర్సింలు అడ్డుకున్నాడు. దీంతో బుధవారం పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణ పనులు చేపట్టడం చూసి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక భూమి తనకు దక్కడం లేదని తీవ్ర మనస్తాపం చెందిన నర్సింలు క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ దిగాడు. ‘వారసత్వంగా వచ్చిన భూమి నాకు దక్కడం లేదు. ఇక నేను చనిపోతున్నా.. నా ఆత్మహత్యకు సర్పంచ్, పట్వారీ, ఎమ్మార్వో బాధ్యులు’అని ఆడియో రికార్డు కూడా పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నర్సింలును గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి సిద్దిపేటకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. వేలూరులో ఉద్రిక్తత రైతు నర్సింలు మృతి చెందిన సమాచారం తెలియడంతో గురువారం ఉదయం నుంచే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నర్సింలు మృతికి సర్పంచ్, రెవెన్యూ అధికారులే కారణమని ఆరోపిస్తూ మృతుని కుటుంబీకులు, బంధువులు సర్పంచ్ పాపిరెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బలగాలను మోహరించారు. గజ్వేల్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ బాలాజీలు పరిస్థితిని సమీక్షించారు. మృతుని కుటుంబ సభ్యులను రైతుబంధు సమితి కన్వీనర్ రవీందర్ ఓదార్చారు. వారితో మంత్రి హరీశ్‌రావును ఫోన్ ద్వారా మాట్లాడించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, గురువారం రాత్రి పోలీసు బందోబస్తు మధ్య నర్సింలు అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
తెరపైకి మరో ఘర్షణ వీడియో
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచు కొండల నేపథ్యంలో భారత సైనికులు చైనా జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఆ వీడియో ఏ రోజు తీసిందనే వివరాలు అందులో లేవు. భారత సైనికుల బృందం చైనా ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్న మరో బృందంతో ఘర్షణ పడుతూ, వారిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అలాగే, వెనక్కు వెళ్లిపోవాలంటూ చైనా జవాన్లను భారత సైనికులు గట్టిగా చెబుతున్న మాటలు కూడా వినిపించాయి. ఆ తరువాత వారు బాహాబాహీకి దిగినట్లుగా కనిపించింది. భారత సైనికుల మాటను వినకుండా, చైనా జవాన్లు అక్కడే ఉండటం, పైగా, భారత సైనికులపై వారు దాడి చేయడం 5.30 నిమిషాలున్న ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో దృశ్యాల్లో డేట్, టైమ్ లేవు కానీ, సైనికులు మాస్క్‌లు ధరించి ఉండటం కనిపించింది. దాన్నిబట్టి ఆ వీడియో కరోనా ముప్పు ప్రారంభమైన తరువాత తీసిన వీడియోగానే భావించవచ్చు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే.. ఆ ఘటన సిక్కింలో జరిగి ఉండొచ్చని ఆర్మీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అక్కడ కూడా మే తొలి వారం నుంచి ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మే 9న సిక్కింలోని నకూ లా ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అయి ఉండవచ్చనుకుంటున్నారు. ये सही था सर पहले पटक के चीनियों को बलभर कचर दिए फिर बोले Don't fight... don't fight 😂 https://t.co/sDoSZVjqI3 — Abhinav Pandey (@AbhinavABP) June 22, 2020 -
రండి.. దీపాలు వెలిగిద్దాం
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వాజ్‌పేయి కవితను మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో క్లిప్‌లో ఓ వేదికపై వాజ్‌పేయి తన కవితను చదువుతూ కనిపించారు. వైద్య పరికరాల కొరత లేకుండా చూడాలి కరోనా వైరస్ బాధితులకు, వారికి వైద్య సేవలందించే డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, సాధారణ ప్రజలకు సరిపడా నిత్యావసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మాస్కులు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన 11 సాధికార బృందాలతో, సంబంధిత అధికారులతో ప్రధాని మోదీ శనివారం సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా టెస్టింగ్, క్రిటికల్ కేర్ ట్రైనింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. రక్షణ పరికరాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం ఫోన్లో ట్రంప్–మోదీ సంభాషణ ప్రాణాంతక కరోనా మహమ్మారిని తుద ముట్టించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. వారిద్దరూ శనివారం ఫోన్ ద్వారా పరస్పరం సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై తమ మధ్య విస్తృతమైన చర్చ జరిగిందని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. -
ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం!
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ అధికారులను బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియ బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. బీజేపీ శుక్రవారం నిర్వహిస్తున ర్యాలీ సందర్భంగా కైలాశ్ అధికారులను ఉద్దేశించి.. ‘మా సంఘ్(ఆరెస్సెస్) నేతలు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం. లేదంటే ఈ రోజు ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం’ అని బెదిరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సంస్థ అంతర్గత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఇతర నేతలు ఇండోర్‌కు వచ్చారు. పార్టీ కార్యకర్తలపై అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను ఆహ్వానిస్తే.. జూనియర్ అధికారు లు రావడంపై కైలాశ్ ఆగ్రహం చెందారు. -
పౌరసత్వ చట్టం తేవాలి : అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ గురువారం కీలక వీడియో విడుదల చేసింది. 2003లో రాజ్యసభలో కాంగ్రెస్ తరపున సభాపక్షనేతగా ఉన్న మన్మోహన్ సింగ్ పౌరసత్వ బిల్లు ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ చట్టంపై పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పిన మాటలనే అప్పట్లో మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఆ వీడియోలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురవుతున్న మైనార్టీలకు ఉదారభావంతో భారత పౌరసత్వం ఇవ్వాలని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వీడియోను విడుదల చేయడం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని, ఓటు బ్యాంకు రాజకీయాలను దేశ ప్రజల ముందు ఆవిష్కరించినట్లైంది. ఈ వీడియోతో బంతి కాంగ్రెస్ కోర్టులో పడింది. మరి ఈ వీడియోపై ఆ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి : (షాహి ఇమామ్ సంచలన వ్యాఖ్యలు) -
ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద
న్యూఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి రెచ్చి పోయారు. ఏ వెదవ కోర్టూ తనను ఏమీ చేయలేదని, తానే పరమశివుడినని వ్యాఖ్యానించారు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నన్నెవరూ ముట్టుకోలేరు. నేను మీకు నిజం చెబుతా. నేనే పరమ శివుడిని. అర్థమైందా? ఈ నిజాన్ని ప్రకటించినందుకు ఏ వెదవ కోర్టూ నన్ను విచారిం చలేదు. నేనే పరమశివుడిని. నాదీ గ్యారెంటీ. మీకెవరికీ మరణం లేదు’అంటూ నిత్యానంద వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది. ఇదిలా ఉండగా దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతిని రవీశ్‌కుమార్ మాట్లాడుతూ అన్ని దేశాల్లోని కార్యాలయాలను అప్రమత్తం చేశామని, నిత్యానంద గురించి స్థానిక ప్రభుత్వాలకు వివరించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. -
హనీట్రాప్: ఎమ్మెల్యేలు, మాజీల రహస్య వీడియోలు
ఎమ్మెల్యేలు, బడా నాయకులతో పరిచయాలు పెంచుకుని రహస్య వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘరానా హనీ ట్రాప్ ముఠా చరిత్రను తవ్వుతున్న కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న ముఠా కీలక సభ్యుల సెల్ఫోన్లు, కంప్యూటర్లు తదితరాల్లో నాయకుల శృంగార వీడియోలు అనేకం బయటపడినట్లు సమాచారం. కొందరు అధికారులు కూడా వలపు ముఠాకు చిక్కడం గమనార్హం. బనశంకరి: రాష్ట్రంలో పదిమందికి పైగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హనీ ట్రాప్‌లో చిక్కుకున్న కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. గత ఆగస్టు నుంచి జరుగుతున్న హనీట్రాప్ దందాలో సీరియల్ నటి బృందానికి మాజీమంత్రులు, శాసనసభ్యుల రాజకీయ ప్రత్యర్థులకు లక్షలాది రూపాయలు అందించి సహకారం అందించినట్లు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగుచూసింది. హనీట్రాప్ వెలుగులోకి వచ్చిన అనంతరం పలువురు ప్రజాప్రతినిదులు, ప్రముఖులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేసు లేకుండా పరిష్కరించుకోవడానికి పోలీస్‌శాఖను ఆశ్రయిస్తున్నారు. ట్రాప్ చేసేవారిలా కీలక నిందితుడు రాఘవేంద్ర, అతని ప్రియురాలు తదితరుల నుంచి సీసీబీ పోలీసులు స్వాదీనం చేసుకున్న ఎల్రక్టానిక్స్ పరికరాల్లో పదిమందికి పైగా ప్రజాప్రతినిధులు, మాజీమంత్రుల వీడియోలు లభ్యమయ్యాయి. ఇంకా అనేకమంది హనీట్రాప్ ఇరుక్కుని డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. హనీట్రాప్‌లో ఎమ్మెల్యేలు, అధికారులను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన మహిళలు రాత్రి 10 గంటల అనంతరం మొబైల్‌ఫోన్‌కు ఫోన్ చేసి అర్ధరాత్రి వరకు సంభాషించడం, ఎమ్మెల్యేలు మద్యం మత్తులో ఉండటాన్ని ధ్రువీకరించుకుని మహిళలు రంగంలోకి దిగేవారు. హనీట్రాప్ వలలో పడిన ఎమ్మెల్యేలు, యువతులను ఎమ్మెల్యేలు తరచుగా పిలిపించుకునేవారు. ఈ నీచకృత్యాలను పెట్టుబడిగా పెట్టుకున్న వంచకముఠా వీడియోలు తీసి భారీనగదును ఇవ్వాలని నాయకులను ఒత్తిడి చేసేవారు. రాఘవేంద్ర వద్ద ఏడుకు పైగా మొబైల్స్, 15 సిమ్‌కార్డులను స్వాదీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. పరారీలో ముఠా సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన హనీట్రాప్ ముఠా తమ బృందంలోని ప్రముఖులు అరెస్ట్ కావడంతో కొందరు పరారీలో ఉన్నారు. వీరి అరెస్ట్‌చేయడానికి ప్రత్యేక పోలీస్‌బృందం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీసీబీ పోలీస్ వర్గాలు తెలిపాయి. నిందితులు వీడియో రికార్డింగ్, మొబైల్ కాల్స్ వివరాలు, సంబాషణలను నాశనం చేశారు. వాటి డిజిటల్ సాక్ష్యాల కోసం విచారణ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గదగ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హనీట్రాప్ ముఠాలో చిక్కుకోగా రహస్యంగా చిత్రీకరించడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని సీరియల్ నటి ఆ ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థిని అడిగారు. చివరకు రూ.1 లక్ష చెల్లించారు. ఏదో వంకతో పరిచయం పెంచుకుని నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించి క్యాంప్ నిర్వహించాలని, వారం రోజుల పాటు ఉండటానికి వ్యవస్థ కల్పించాలని అని గదగ్ జిల్లా ఎమ్మెల్యే వద్ద హనీట్రాప్ ముఠా సభ్యులు విన్నవించారు. ప్రారంభంలో మహిళ పట్ల అసక్తి చూపని ఎమ్మెల్యే అనంతరం మహిళ ట్రాప్‌లో పడ్డారు. ఎమ్మెల్యే రాసలీలను సీరియల్ నటి రహస్యంగా చిత్రీకరించి తన అనుచరులకు అందజేశారు. ఆ సీడీని ఎమ్మెల్యేకు చూపించి రూ.50 కోట్లకు డిమాండ్ పెట్టారు. అంత డబ్బు తన వద్దలేదనడంతో కనీసం రూ.10 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఉడుపి జిల్లా, ఉత్తర కన్నడ జిల్లా ఎమ్మెల్యేల వీడియోలు కూడా బయటపడ్డాయి. రహస్య కెమెరా కలిగిన హ్యాండ్‌బ్యాగ్‌ల సాయంతో రికార్డింగ్ చేసేవారని తెలిసింది. సమాచారం ఇవ్వండి: పోలీసులు హనీట్రాప్ వలలో పడిన వ్యక్తులు ఎవరైనా తమకు సమాచారం అందించి విచారణకు సహకరించాలని పోలీస్‌శాఖ కోరింది. ఫిర్యాదుదారుల సమాచారం రహస్యంగా ఉంచి విచారణ చేపడతామని చెబుతున్నారు. హనీట్రాప్ కేసులో చిక్కుకుని కంగారుపడిన అనేకమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. వీడీయోలు, సమాచారం ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కొందరు కోర్టులో పిల్ వేశారు. -
ఢంకా బజాయిస్తున్న రాజ్‌ఠాక్రే
ఆయన లోక్‌సభ బరిలో లేరు ఆయన పార్టీ కూడా ఎన్నికలకి దూరంగా ఉంది. అయినా ఆయన ప్రచార సభలకి జనం వెల్లువెత్తుతున్నారు. ఒక్కో మాట తూటాలా పేలుతుంటే ఈలలు, చప్పట్లతో సభలు మార్మోగిపోతున్నాయి. ఆయన లక్ష్యం ఒక్కటే. ప్రధానమంత్రి మోదీ మళ్లీ అధికారం చేపట్టకూడదు. ఒకప్పుడు మోదీకి వీరభక్తుడే. కానీ ఇప్పుడు శత్రువు. తన సరికొత్త ప్రచారంతో రాత్రికి రాత్రి మోదీకి పక్కలో బల్లెంలా మారారు. ఆయనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌ఠాక్రే. ఆయన చేస్తున్న ప్రచారం ఎలా ఉంది ? దాని ప్రభావం ఎంత ? అది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా లో హరిశాల్ అనే గ్రామం. అక్కడ ఓ భారీ ఎన్నికల బహిరంగ సభ జరుగుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. తమ ప్రియ తమ నాయకుడు ఏం చెబుతారా అన్న ఆసక్తి అక్కడికొచ్చిన వారందరిలోనూ కనిపిస్తోంది. అప్పుడు వేదిక మీదకి వచ్చా రు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే. అప్పటికే ఆయన వెనకాలే భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంది. రాజ్‌ఠాక్రే వచ్చిన వెంటనే తన అనుచరుడిని ఉద్దేశించి ‘యే.. లగావోరే వీడియో’ (ఏయ్.. ఆ వీడియో ప్లే చెయ్యి) అని ఆదేశించగానే దానిని ప్లే చేస్తారు. ఆ తెర పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షమవుతారు. గత అయిదేళ్లలో ఆయన ఇచ్చిన హామీలు, ప్రకటిం చిన పథకాలు, పేపర్ క్లిప్పింగులు, అవి ఎంత విజయవంతమయ్యాయో స్వయంగా మోదీ చెప్పిన మాటలు, అన్నీ ఒక్కొక్కటికిగా వస్తూ ఉంటాయి. క్రమంగా వీడియో ఆగిపోతుంది. రాజ్‌ఠాక్రే మైక్ అందుకుంటారు. అప్పుడు మొదలవుతుంది ఆయన ప్రసంగం. సూటిగా సుత్తి లేకుండా . సింపుల్‌గా చెప్పాలంటే అది ప్రసంగం కాదు. అదొక రియాల్టీ చెక్. మోదీ చెప్పిన మాటల్లో నిజానిజాలెంతో సాక్ష్యాధారాలతో సహా చెప్పే ప్రయత్నం. మోదీ చెప్పిన ప్రతీ మాటకి రాజ్ ఠాక్రే నుంచి కౌంటర్ తూటాలా పేలుతుంది. మోదీ ఇచ్చిన హామీలు ఎలా గాల్లో కలిసిపోయాయో, మోదీ, షా ద్వయం ఎన్ని అబద్ధాలు చెప్పారో, ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారో గణాంకాలతో సహా వివరిస్తారు. 51 ఏళ్ల వయసులోనూ రాజ్ ఠాక్రే తన ప్రసంగాలతో జనంపై సమ్మోహనాస్త్రం వేస్తున్నారు. ప్రచారంలో నవపథం మహారాష్ట్రలో హరిశాల్ను మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మొదట ఆ వీడియోలో ప్రభుత్వం చేసిన ప్రకటన వస్తుంది. ఆ తర్వాత ఆ గ్రామంలో కరెంట్ లేక జనం పడుతున్న అవస్థలు, ఇంటర్నెట్ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆ వీడియోలోనే చూపించారు. అంతేకాదు ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కూడా స్టేజ్ మీదకి తీసుకువచ్చారు. తమ గ్రామంలో అసలు పరిస్థితి ఎలా ఉందో ఆయన నోటివెంటే చెప్పించారు. ఇదంతా చూశాక కూడా మోదీకి ఓటు వెయ్యాలని మీరు భావిస్తున్నారా అని జనాన్ని సూటిగా ప్రశ్నిం చారు. మరాఠీ భాషలో చమత్కారాలని ఉపయోగిస్తూ మోదీపై వ్యంగ్యబాణాలు విసురుతారు. అవన్నీ జనం గుండెల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయి. ముంబై, సోలాపూర్, లాతూర్, సతారా, పుణె ఇలా మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సరికొత్త ప్రచారంతో కొన్నేళ్లుగా నిస్తేజంగా ఉన్న రాజ్‌ఠాక్రే, ఆయన పార్టీ ఎంఎన్ఎస్కి మళ్లీ కొత్త జీవం వచ్చినట్టయింది. ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టగలరా ? రాజ్‌ఠాక్రే రూపొందించిన ఒక వీడియో క్లిప్‌కి వచ్చిన ప్రతిస్పందన చూసి కాషాయ శిబిరంలో కలవరం రేగుతోంది. తమకి అసలు సిసలు ప్రత్యర్థి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమా ? లేదంటే రాజ్ ఠాక్రేయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరిశాల్ గ్రామంలో ఒక్క వారంలో 8 లక్షల 50వేలు టాయిలెట్లు నిర్మించామని మోదీ చెప్పిన విజువల్ బైట్ మొదట ప్లే అవుతుంది. దానికి గణాంకాలని హాస్యాన్ని కలగలిపి తిప్పి కొట్టారు రాజ్ ఠాక్రే. మోదీ అరచేతిలో ఎలా స్వర్గం చూపిస్తున్నారో సోదాహరణంగా చెబుతున్నారు. ‘‘ఒక్క వారంలో 8.50 లక్షల టాయిలెట్లు అంటే, ఒక నిమిషానికి 84 టాయిలెట్లు కట్టాలి. అంటే ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టారన్న మాట. ఇదెలా సాధ్యం అంటూ జనం చప్పట్ల మధ్య ప్రసంగాన్ని ముగించారు. ఈ ప్రచారం ప్రభావం ఎంత ? మహారాష్ట్ర మీడియా రాజ్ సభలకి అద్భుతమైన కవరేజ్ ఇస్తోంది. అదే సమయంలో మోదీ సభ లైవ్ వస్తున్నా కట్ చేసి మరీ రాజ్‌ఠాక్రే సభనే చూపిస్తున్నారంటే ఆయన చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం ఎంతలా జనంలోకి చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. జనానికి అర్థమయ్యేలా వీడియోలు రూపొందించడం చూసి ఆశ్చర్యపోయిన ఒక జర్నలిస్టు రాజ్‌ఠాక్రేతో మాట్లాడినప్పుడు మీడియా తాను చేయాల్సిన పని చేయకపోవడంతో తానే స్వయంగా ఈ తరహా ప్రచారానికి దిగానని సమాధానం ఇవ్వడం విశేషం. అయితే రాజ్ చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఓట్లు వేసినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన పెద నాన్న, మరాఠీ టైగర్ బాల్‌ఠాక్రే తనని శివసేనకు వారసుడిగా ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్న రాజ్‌ఠాక్రే అవి అడియాసలు కావడంతో 2006లో పార్టీకి గుడ్‌బై కొట్టేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొత్త పార్టీ పెట్టాక రాజ్‌ఠాక్రే చేసే రెచ్చగొట్టే ప్రసంగాలకు జనం మంత్రముగ్ధులయ్యారే తప్ప ఆయనకు ఓట్లు మాత్రం రాలలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు సాధించిన ఎంఎన్ఎస్ 2014 అసెంబ్లీ ఒక్క సీటుకే పరిమితమైపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేస్తే 5శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు కూడా రాలేదు. రాజ్‌ఠాక్రే జనాకర్షక నాయకుడే కానీ ఓట్లు రాబట్టే నాయకుడు కాదన్న పేరు కూడా ఉంది.. మరి ఈ సారి ఠాక్రే చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఏ మేరకు ఓట్ల పంట పండిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
వీడియో ఫుటేజీకి సభ తీర్మానం అవసరం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఈ నెల 12న గవర్నర్ ప్రసంగం నాటి వీడియో ఫుటేజీలను తీసుకునేందుకు శాసనసభ తీర్మానం అవసరమని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో వీడియో ఫుటేజీలను సమర్పించేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఈ నెల 22న ఫుటేజీని తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ఈ విషయంపై అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారని ఆయన తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు వీడియో ఫుటేజీల సమర్పణకు ఈ నెల 27 వరకు గడువునిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతో పాటు, నల్లగొండ, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఆ వీడియో ఫుటేజీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యుల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌కు దారి తీసిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఇవ్వాలని సీఎల్పీ కోరింది. బుధవారం ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారికి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ వేర్వేరుగా లేఖలు రాశారు.ఈ నెల 12న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన ఫుటేజీలను తమకు ఇవ్వాలని లేఖల్లో కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి గవర్నర్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఉన్న విజువల్స్ ఇవ్వాలని, అదే విధంగా ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఫుటేజీ కూడా ఇవ్వాలని కోరారు. -
మెరుపు వేగంతో ప్రాణాలు కాపాడాడు
సాక్షి, ముంబై : మెరుపు వేగంతో, సాహసం ప్రదర్శించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఓ బాలుడి ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు. రన్నింగ్ ట్రెయిన్ నుంచి కింద పడిపోయిన బాలుడిని పట్టాల మధ్య పడిపోకుండా రక్షించాడు. ముంబైలోని నైగావ్ రైల్వే స్టేషన్లో ఫ్రిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకుంది. సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఏడేళ్ల బాలుడు తన తల్లితో కలిసి రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. అంతలో రైలు కదలగా.. తల్లి ఎక్కేసింది. అయితే తల్లిని అనుసరించే క్రమంలో పిల్లాడు కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య అతను ఇరక్కుపోగా.. అది గమనించిన సునీల్ నాపా అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ చాకచక్యంగా అతన్ని పక్కకు లాగాడు. ఆ బాలుడిని గమనించి ముందు కంపార్ట్మెంట్లో ఉన్న మరో వ్యక్తి సైతం కింద పడటం వీడియోలో గమనించవచ్చు. స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజీలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి మరీ బాలుడి ప్రాణాలు కాపాడిన సునీల్ నాపాపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
మెరుపు వేగంతో వెళ్లి బాలుడి ప్రాణాలు కాపాడాడు
-
మెడలో కెమెరా వేసి మట్టుబెట్టారు!
సిరియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నరమేధం కొనసాగిస్తున్నారు. తమకు చిక్కిన వారిని అత్యంత కిరాతంగా చంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్కడితో ఆగకుండా తాము సాగించిన మారణకాండ వీడియోలను ఇంటర్నెట్ లో పెడుతూ దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలు భీతి గొల్పుతున్నాయి. తమకు చిక్కిన జర్నలిస్టులను ఐసిస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. జర్నలిస్టుల కెమెరాలు, ల్యాప్ టాప్ ల్లో పేలుడు పదార్థాలు నింపి.. వాటిని వారి మెడలో వేసి పేల్చేశారు. జర్నలిస్టుల చేతులను బేడీలతో ఇనుప రెయిలింగ్ కు కట్టేసి ఈ కిరాతకానికి పాల్పడ్డారు. మెడకు ఇనుప గొలుసు బిగించి అంతమొందించారు. నాలుగో జర్నలిస్టును పదునైన కత్తితో గొంతు కోసి చంపేశారు. ఐసిస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారని, ఫండ్స్ అందుకుంటున్నారన్న ఆరోపణలతో జర్నలిస్టులను చంపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది అక్టోబర్ లో దీర్ ఇల్-జొవర్ నగరంలో వీరిని బందీలు పట్టుకుని డిసెంబర్ లో హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. -
ప్రాణాలకు తెగించి ఇద్దరు మహిళల సాహసం
రక్కా: ఐదేళ్లుగా అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా ప్రస్తుతం ఐసిస్ టెర్రిరిస్టుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడిపోతోంది. అలాంటి సిరియాలో, ముఖ్యంగా రక్కాలో టెర్రిరిస్టుల పైశాచికత్వంలో ఛిద్రమైన ప్రజా జీవితం ఎలా ఉందో బయటి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇద్దరు మహిళలు సాహసించారు. బయటపడితే మరణ శిక్ష తప్పదని తెల్సినా ఆ ఇద్దరు మహిళలు ఓ వీడియో కెమేరాను రహస్యంగా తమ దుస్తుల్లో దాచుకొని అక్కడి జీవన చిత్రాన్ని ఓ డాక్యుమెంటరీగా తీశారు. దాన్ని స్వీడన్‌ను చెందిన ‘ఎక్స్‌ప్రెసెన్ టీవీ’ ప్రసారం చేసింది. తమ ఖాలీఫా రాజ్యానికి రాజధానిగా ఐసిస్ టెర్రిరిస్టులు చెప్పుకుంటున్న రక్కా నగరంతోపాటు పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఆ డాక్యుమెంటరీ తెలియజేస్తోంది. మూడేళ్ల క్రితం కళకళలాడుతూ కనిపించిన రక్కా ఇప్పుడు పూర్తిగా బోసిపోయింది. జనం అక్కడక్కడా తప్పించి ఎక్కడా కనిపించడం లేదు. సాయుధులు ఓ పక్క నడుచుకుంటూ కనిపించారు. మరో పక్క శిథిల భవనాలు కనిపించాయి. వాటిలో సూఫీలకు, సున్నీలకు పవిత్రమైన ఉవాయిస్ అల్ ఖర్నీ మసీదు శిథిలాలు కూడా ఉన్నాయి. ఇంకోపక్క ఆర్మీనియన్ క్యాథలిక్ చర్చి రూపురేఖలు మార్చేసి ఇస్లాం టెర్రిరిస్టులు దాన్ని తమ సైన్యం ప్రధాన కార్యాలయంగా మార్చుకున్నారు. డాక్యుమెంటరీని చిత్రీకరించిన ఇద్దరు సాహస మహిళలు ముఖాలకు కూడా బురఖాలు ధరించి కనిపించారు. రక్కాపై దాడులు తీవ్రమయ్యాయి. ఎక్కడికెళ్లాలో తెలియని వారు తప్పించి అందరూ నగరాన్ని విడిచి పారిపోయారని, ఐసిస్ టెర్రిరిస్టుల తరఫున పోరాడుతున్న విదేశీ సాయుధులు స్థానికుల ఐడి కార్డులు లాక్కొని టర్కీకి పారిపోతున్నారని ఆ మహిళలు తెలిపారు. తాము ప్రత్యక్షంగా చూసిన హింసాత్మక సంఘటనల గురించి వారు వివరించారు. తాము ఓ యువకుడి తలనరికి అత్యంత కిరాతంగా చంపేసిన దృశ్యాన్ని చూశానని ఇద్దరు మహిళల్లో ఊమ్ మొహమ్మద్‌గా చెప్పుకున్న మహిళ వివరించారు. ఓ యువకుడిని మోకాళ్ల మీద కూర్చోబెట్టి, నల్లటి దుస్తులు ధరించిన ఐసిస్ టెర్రిరిస్టులు ఓ పక్క వరుసగా లైన్లో నిలబడి ఉండగా, ఓ పెద్ద కరవాలం ధరించిన ఓ వ్యక్తి ఆ యువకుడి తల నరకి చంపేశాడని, ఆ తర్వాత మొండెం నుంచి వేరువడిన తలకు ఓ బరిసే గుచ్చి కూడలిలో వేలాడదీశారని, మొండెంతో ఉన్న శరీరాన్ని నడిరోడ్డులో పడేశారని, దానిపై నుంచి వాహనాలను నడిపించి ముక్కలు ముక్కలయ్యేలా చేశారని ఆ మహిళ గద్గద స్వరంతో వివరించారు. డాక్యుమెంటరీ మొదటి నుంచి చివరి వరకు వారిద్దరి స్వరం గద్గదంగానే వినిపించింది. ఒకప్పుడు సిరియాలో మహిళలు ముఖాలకు బురఖాలు లేకుండా స్వేచ్ఛగా సంచరించేవారని, ఇప్పుడు వారికి ఏ హక్కులు లేవని రెండో మహిళ అన్నారు. ఏ నాటికైనా సిరియాకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సిరియాలో గత ఐదేళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు రెండున్నర లక్షల మంది మరణించగా, దాదాపు కోటి మంది వలసపోయారని ఐక్యరాజ్యసమితి లెక్కలు తెలియజేస్తున్నాయి. 2013లో ఐసిస్ టెర్రిరిస్టులు రక్కాను స్వాధీనం చేసుకున్నారు. -
కీచక గురువు
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తన సెల్ఫోన్లు, వీడియో చిత్రీకరణ నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నానంటూ వేధింపులు నిలదీసిన సర్పంచ్, బాధితురాలి బంధువులు నక్కపల్లి: విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడిని ఆమె బంధువులు, గ్రామస్తులు నిలదీశారు. మండలంలోని జానకయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలావున్నాయి. ఇదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న చినతీనార్లకు చెందిన బాలికపై ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లీష్ టీచర్ ఈశ్వరరావు కొద్దికాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్‌ఫోన్‌తో ఫొటో లు, వీడియోలు తీస్తూ నువ్వంటే నాకు ఇష్టమని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ ఇబ్బంది పెడుతున్నాడు. ఉపాధ్యాయుడు కావడంతో భయపడి ఈవిషయాన్ని ఆమె ఎవరికి చెప్పలేదు. ఇతని చేష్టలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. నిన్ను చూస్తూ బైక్ నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నానని చెప్పేవాడు. అతని బర్త్‌డే కేక్‌పై బాలిక ఫొటోను డిజైన్ చేశాడని వేధిస్తున్నాడని విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. వేధిస్తాడన్న భయంతోనే ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె వాపోయింది. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రి వేట నిమిత్తం పూరీ వెళ్లాడు. ఆమె తల్లి వద్ద ఉంటోంది. విద్యార్థిని వేధింపుల విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎరిపల్లి శ్రీను, పెదతీనార్ల సర్పంచ్ కొర్లయ్య, గ్రామ నాయకులు ముసలయ్య తదితరులు పాఠశాలకు వెళ్లి వేధిస్తున్న ఉపాధ్యాయుడిని నిలదీశారు. విద్యాబుద్ధులు నేర్పుతూ కన్నపిల్లలా చూడాల్సింది పోయి ఇలా దుర్బుద్ధితో ప్రవర్తించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి బాగా చదువుతుందని దానివల్ల నువ్వంటే నాకిష్టమని చెప్పానని అంతే తప్ప మరో ఉద్దేశం లేదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. ఫోటోలు, వీడియోలు ఎందుకు తీశారని ప్రశ్నిస్తే పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సందర్భంగా తీశానని తెలిపాడు. ఇలా చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు. పాఠశాల హెచ్ఎం నూకరాజుతోపాటు, గ్రామస్తులు అతనిని మందలించారు. అయితే బాదితురాలు మాత్రం ఈశ్వరరావు ఈ పాఠశాలలో పనిచేస్తే తాను ఇక్కడ చదవనని చెబుతోంది. ఇటువంటి సమస్య మరే ఆడపిల్లకు రాకూడదని తక్షణమే సదరు ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.