
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యుల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌కు దారి తీసిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఇవ్వాలని సీఎల్పీ కోరింది. బుధవారం ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారికి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ వేర్వేరుగా లేఖలు రాశారు.ఈ నెల 12న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన ఫుటేజీలను తమకు ఇవ్వాలని లేఖల్లో కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి గవర్నర్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఉన్న విజువల్స్ ఇవ్వాలని, అదే విధంగా ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఫుటేజీ కూడా ఇవ్వాలని కోరారు.