
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షనేత జానారెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం ఆయనకే మేలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ జానారెడ్డిని సస్పెండ్ చేయకుంటే టీఆర్‌ఎస్‌తో కలసిపోయారని కాంగ్రెస్‌వాళ్లే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారన్నారు. మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేసే అంశం స్పీకరు, శాసనసభ పరిధిలోని అంశమన్నారు.