CLP leaders
-
ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై చర్చించేందుకు పలువురు ముఖ్యనేతలు శనివారం భేటీకానున్నారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కోదండరెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిసింది. ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కమిటీలు, పీసీసీ ప్రతినిధుల ఎంపిక జరిగిన తీరు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారు భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. కొత్త కమిటీలు.. విమర్శల మధ్య.. టీపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించిన అనంతరం భట్టి నివాసం వేదికగా కొందరు సీనియర్ నేతలు భేటీ అయి చర్చించారు. అయితే తమది అసమ్మతి భేటీ కాదని, ఆత్మీయ సమావేశమని ప్రకటించారు. తాజాగా వారికి మాజీ ఎంపీ ఉత్తమ్ కూడా జత కలుస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శనివారం జరిగే సమావేశంలో నేతలు ఏయే అంశాలపై చర్చిస్తారు, సమావేశం అనంతరం ఏం చెప్తారనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ పార్టీలో నెలకొన్న పంచాయితీలను పరిష్కరించుకునే దిశగా కూడా చర్చలు జరిగే అవకాశముందని టీపీసీసీ కీలక నేత ఒకరు వెల్లడించారు. పార్టీలోని పరిణామాలను అధిష్టానానికి నివేదించేందుకు ఢిల్లీ వెళ్లాలా, లేక లేఖ రాయాలా అన్నదానిపైనా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ‘‘అంతా ఇదేదో సీనియర్ల సమస్య అను కుంటున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాతకాపులు అని అంటున్నారు. కానీ, ఇది సీనియర్ నాయకుల సమస్య కాదు. ఎందుకంటే మాకు అధిష్టానం దగ్గరి నుంచి అందరు నేతలు తెలుసు. మా వ్యక్తిగత సమస్యలు మేం పరిష్కరించుకోగలం. కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పాటుపడుతున్న కేడర్ గురించి మేం ఆలోచించాలి. గత ఎనిమిదేళ్లుగా అనేక కష్టాలకోర్చి టీఆర్ఎస్ను ఎదుర్కొంటున్న పార్టీ నేతల గురించి ఆలోచించాలి. ఆ బాధ్యత మాపై ఉంటుంది. అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియాలి. ఢిల్లీలో తప్పులు జరుగుతున్నాయా? ఇన్చార్జి కార్యదర్శుల వద్ద జరుగుతున్నాయా స్పష్టం కావాలి’’అని ఆ కీలక నేత పేర్కొనడం గమనార్హం. భేటీ అయిన ముగ్గురు నేతలు భట్టి విక్రమార్క, మాజీమంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు శుక్రవారం భట్టి నివాసంలో సమావేశమయ్యారు. రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. దేశ, రాష్ట్ర రాజకీయాలతోపాటు తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలు, పీసీసీ నూతన కమిటీల కూర్పుపైనా వారు మాట్లాడుకున్నట్టు వివరిస్తున్నాయి. (చదవండి: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి ) -
కరోనా నియంత్రణలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది
-
జూమ్ యాప్‌లో సీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: భట్టి విక్రమార్క నేతృత్వంలో జూమ్ యాప్‌లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తెలిపారు. సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘‘జగన్న.. గడ్డాలు, మీసాలు బాగా పెంచడంతో మాస్కు కూడా పెట్టాల్సిన పనిలేకుండా పోయిందని రాజగోపాల్ రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని కరోనా టెస్టు చేయించుకోమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. -
గవర్నర్ తమిళసై ను కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ బృందం గవర్నర్ తమిళసై ని శనివారం కలిసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎక్కడ చూసిన హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడి ఆదాయాన్ని పెంచేవిధంగా కాకుండా రెగ్యులేటేడ్ మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజల భద్రత కోసం వినియోగించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. -
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వడదెబ్బ
-
రేపు చత్తీస్‌గఢ్, రాజస్ధాన్ సీఎంల ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన మెజారిటీకి చేరువైన కాంగ్రెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో సాధారణ మెజారిటీ సాధించేలా దూసుకుపోతున్న కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లోనూ మేజిక్ మార్క్‌కు చేరుకుంది. ఇక చత్తీస్‌గఢ్, రాజస్ధాన్‌లో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. చత్తీస్‌గఢ్, రాజస్దాన్‌లో ఆ పార్టీ తరపున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాయ్‌పూర్, జైపూర్లలో బుదవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకోనున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్ధులను వీరు లాంఛనంగా ఎన్నుకునే అవకాశం ఉంది. చత్తీస్‌గఢ్‌లో పీసీసీ చీఫ్ భూపేష్ భాగల్ సీఎం రేసులో ముందుండగా, రాజస్ధాన్‌లో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్లు సీఎం పదవికి పోటీ పడనున్నారు. ఇక ఎన్నికల ఫలితాల్లో రాజస్ధాన్‌లో 199 స్ధానాలకు గాను మేజిక్ మార్క్‌ను దాటిన కాంగ్రెస్ పార్టీ 102 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, పాలక బీజేపీ కేవలం 70 స్ధానాలకే పరిమితమైంది. చత్తీస్‌గఢ్‌లో 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ మూడింట రెండొంతుల పైగా 63 స్ధానాల్లో ఆధిక్యత సాధించింది. ఇక్కడ బీజేపీ కేవలం 18 స్ధానాల్లోనే ముందంజలో ఉంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్‌కు అవసరమైన 116 స్ధానాలకు గాను కాంగ్రెస్ 117 స్ధానాల్లో ఆధిక్యం కనబరిచింది. బీజేపీ 103 స్ధానాల్లో బీఎస్పీ మూడు స్ధానాలు, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. -
ఆ వీడియో ఫుటేజీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ శాసనసభ్యుల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్‌కు దారి తీసిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఇవ్వాలని సీఎల్పీ కోరింది. బుధవారం ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారికి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ వేర్వేరుగా లేఖలు రాశారు.ఈ నెల 12న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన ఫుటేజీలను తమకు ఇవ్వాలని లేఖల్లో కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి గవర్నర్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఉన్న విజువల్స్ ఇవ్వాలని, అదే విధంగా ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఫుటేజీ కూడా ఇవ్వాలని కోరారు. -
'వలసలకు పీసీసీ, సీఎల్పీ నేతలదే బాధ్యత'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అధికార టీఆర్ఎస్లోకి వలస వెళ్లడానికి పీసీసీ, సీఎల్పీ నేతలే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లోని నేతల వలసలను పసిగట్టడంలో పార్టీ సమన్వయ కమిటీ విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవశ్యకతను వీహెచ్ ఈ సందర్భంగా విశదీకరించారు. బలోపేతం చేసే క్రమంలో తరచుగా సమావేశం కావాలని పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు వీహెచ్ సూచించారు.