రష్యా హెలికాప్టర్‌ను కూల్చి.. పైలట్‌ను పట్టుకున్నాం: ఉక్రెయిన్‌ రక్షణశాఖ | Defence of Ukraine Shares Video Of Russian Helicopter Gunship Shot Down In Flames | Sakshi
Sakshi News home page

రష్యా హెలికాప్టర్‌ను కూల్చి.. పైలట్‌ను పట్టుకున్నాం: ఉక్రెయిన్‌ రక్షణశాఖ

Published Sun, Mar 6 2022 8:17 AM | Last Updated on Sun, Mar 6 2022 8:36 AM

Defence of Ukraine Shares Video Of Russian Helicopter Gunship Shot Down In Flames - Sakshi

Russia-Ukraine crisis: తమ వైమానిక రక్షణ దళ నిపుణులు రష్యా హెలికాప్టర్‌ను శనివారం కూల్చేశారని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది. చెర్నిహివ్‌ నగర శివారులో ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. రష్యా హెలికాప్టర్‌లో ఒక పైలట్‌ మరణించాడని, అతడిని మేజర్‌ క్రివోలాపోవ్‌గా గుర్తించినట్లు తెలిపింది. మరో పైలట్‌ క్రస్నోయర్టెసెవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. ఈ మేరకు సంబంధిత వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఇదిలా ఉండగా, చెర్నిహివ్‌ ప్రాంతం లో రష్యా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడి శిథిలాల నుంచి 22 మృతదేహాలను వెలికి తీసినట్లు ఉక్రెయిన్‌ అధికార యంత్రాంగం తెలిపింది. రెండు పాఠశాలలు, ప్రైవేట్‌ ఇళ్లపై జరిగిన రష్యా దాడుల్లో కనీసం 9 మంది చనిపోయారని చెర్నిహివ్‌ స్థానిక గవర్నర్‌ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement