Russia's Ministry of Defence Share Video Footage on its official Channel: రష్యా ఉక్రెయిన్ పై కొనసాగిస్తున్న దురాక్రమణ యుద్ధం వేళ రష్యా ఉక్రేనియన్ బలగాల నుంచి తాను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించింది. రష్యాతో తలపడటానికి బ్రిటన్ అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు మిలటరీ సాయం తోపాటు శక్తివంతమైన ఆయుధ సామాగ్రిని కూడా పంపించి ఉక్రెయిన్‌కి సాయం అందించిన సంగతి తెలిసిందే. ఐతే తాము ఉక్రెయిన్ పై పట్టు సాధించేశాం అంటూ జబ్బలు చరుచుకుంటూ ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను రష్యన్ సైనికులడు ఒక వీడియో ఫుటేజ్‌లో చూపిస్తున్నాడు.
ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో రెండు నిమిషాల 15 సెకన్ల నిడివి గల ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో... రష్యా సైనికుడు యూఎస్, యూకే , పోలాండ్, స్వీడన్ దేశాల యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ లాంఛర్‌లతో సహా వివిధ రకాల ఆయుధాలను పట్టుకుని మాట్లాడుతున్నాడు. పైగా ఉక్రెయిన్‌కి మిగతా దేశాలు అందించిన ట్రోఫీలు ఇవిగో అంటూ వెటకరిస్తూ ... ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూపించాడు. ఐతే నివేదికలు ప్రకారం ఉక్రెయిన్ రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో పోల్చితే మాస్కో స్వాధీనం చేసుకున్నవి తక్కువేనని పేర్కోన్నాయి.
అదీగాక మిలటరీ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు దాదాపు ఐదు వేల మిలటరీ వాహనాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పాశ్చాత్య దేశాల మద్ధతుతో ఉక్రెయిన్ బలగాలు బాగా పోరాడటమే కాకుండా యుద్ధంలో చాలా వరకు విజయం సాధించినట్లు పేర్కొంది. కానీ రష్యా మాత్రం దీన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటూ రష్యాన్ మాట్లాడే వర్గాలను రక్షించడానికి సాగిస్తున్న యుద్ధంగా చెబుతుంది. ఐతే పాశ్చాత్య దేశాలు మాత్రం మాస్కో తన చర్యను సమర్థించుకుంటూ ఉక్రెయిన్ పై దూకుడుగా వ్యకవహరిస్తోందని మండిపడుతున్నాయి.
(చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment