మెడలో కెమెరా వేసి మట్టుబెట్టారు! | ISIS fanatics blow up journalists by packing their cameras and laptops with explosives | Sakshi
Sakshi News home page

మెడలో కెమెరా వేసి మట్టుబెట్టారు!

Published Mon, Jun 27 2016 4:10 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

మెడలో కెమెరా వేసి మట్టుబెట్టారు!

మెడలో కెమెరా వేసి మట్టుబెట్టారు!

సిరియా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నరమేధం కొనసాగిస్తున్నారు. తమకు చిక్కిన వారిని అత్యంత కిరాతంగా చంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్కడితో ఆగకుండా తాము సాగించిన మారణకాండ వీడియోలను ఇంటర్నెట్ లో పెడుతూ దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన వీడియోలు భీతి గొల్పుతున్నాయి.

తమకు చిక్కిన జర్నలిస్టులను ఐసిస్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. జర్నలిస్టుల కెమెరాలు, ల్యాప్ టాప్ ల్లో పేలుడు పదార్థాలు నింపి.. వాటిని వారి మెడలో వేసి పేల్చేశారు. జర్నలిస్టుల చేతులను బేడీలతో ఇనుప రెయిలింగ్ కు కట్టేసి ఈ కిరాతకానికి పాల్పడ్డారు. మెడకు ఇనుప గొలుసు బిగించి అంతమొందించారు. నాలుగో జర్నలిస్టును పదునైన కత్తితో గొంతు కోసి చంపేశారు.

ఐసిస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్నారని, ఫండ్స్ అందుకుంటున్నారన్న ఆరోపణలతో జర్నలిస్టులను చంపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గతేడాది అక్టోబర్ లో దీర్ ఇల్-జొవర్ నగరంలో వీరిని బందీలు పట్టుకుని డిసెంబర్ లో హతమార్చినట్టు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement