అనుమానిత ఐఎస్‌ఐఎస్ చీఫ్ అబూ హుస్సేన్ అల్ ఖురాషి సిరియాలో మృతి చెందినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆపరేషన్‌లో హతమయ్యినట్లు పేర్కొన్నారు. తీవ్రవాద సంస్థలపై ఎలాంటి వివక్ష లేకుండా టర్కీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఎర్గోగాన్ అన్నారు. 2013లో డేష్/ఐసిస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన మొదటి దేశాలలో టర్కీ ఒకటిగా నిలిచింది.
ఇంటిలిజెన్స్ ఏజెంట్లు స్థానిక మిలటరీ పోలీసుల సాయంతో సిరియాలో ఆఫ్రిన్ వాయవ్య ప్రాంతంలో జిండిరెస్‌లోని ఒక జోన్‌ని మూసివేసి ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు ఎర్డోగాన్. ఈ ఆపరేషన్‌లో ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తున్న పాడుపడిన పోలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. టర్కీ 2020 నుంచి ఉత్తర సిరియాలో దళాలను మోహరించి ఈ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో సిరియన్ సహాయకుల సాయంతో మొత్తం జోన్‌లను నియంత్రిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఐఎస్‌ఐఎస్ మునుపటి చీఫ్ అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి మరణించినట్లు నవంబర్ 30న ప్రకటించింది టర్కీ. అతని స్థానంలోకి ప్రస్తుతం టర్కీ చనిపోయినట్లు ప్రకటించిన ఐఎస్‌ఐఎస్ అబూ హుస్సేన్ అల్-ఖురాషీ వచ్చాడు. కాగా, అమెరికా కూడా ఏప్రిల్ మధ్యలో హెలికాప్టర్ దాడులతో ఒక ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన అబ్ద్-అల్ హదీ మహ్మద్ అల్-హాజీ అలీని హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అంతేగాదు 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్‌లో ఐఎస్‌ఐఎస్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చంపినట్లు యూఎస్ ప్రకిటించింది. ఆ ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను ఒకప్పుడూ నియంత్రించి తరిమికొట్టినప్పటికీ ఇప్పటికీ సిరియాలో దాడలు చేస్తుండటం గమనార్హం.
(చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..)
Comments
Please login to add a commentAdd a comment