సిరియా అధ్యక్షుడి ఆచూకీ గల్లంతు.. రష్యా కీలక ప్రకటన | Russia Says President Assad Has Left Syria As Rebels Take Control Of Damascus | Sakshi
Sakshi News home page

సిరియా అధ్యక్షుడి ఆచూకీ గల్లంతు.. రష్యా కీలక ప్రకటన

Published Sun, Dec 8 2024 7:55 PM | Last Updated on Sun, Dec 8 2024 8:07 PM

Russia Says President Assad Has Left Syria As Rebels Take Control Of Damascus

డమాస్కస్: సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ చెందారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్‌ అల్‌-అసద్‌ బ్రతికే ఉన్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. కానీ ఆయన జాడ గురించి ప్రస్తావించలేదు.  

ఆదివారం సిరియా దేశం మొత్తాన్ని రెబల్స్ పూర్తిగా ఆక్రమించారు. దీంతో బషర్‌ ఆల్‌-అసద్‌ అధ్యక్ష పదవిని రెబల్స్‌కు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో పరారయ్యారు. ఆ విమానాన్ని రెబల్స్‌ కూల్చి వేశారని, కూల్చి వేతతో బషర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే, అనూహ్యంగా రష్యా కీలక ప్రకటన చేసింది. శాంతియుతంగా అధికారాన్నిఅప్పగించాలని రెబల్స్‌ ఆదేశాలు ఇవ్వడంతో బషర్ అల్ అసద్‌ తన పదవిని విడిచిపెట్టారని, ఆపై దేశం విడిచి వెళ్లినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

కానీ, అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రష్యా చెప్పలేదు. దేశం వదిలే వెళ్లే సమయంలో జరిపిన చర్చలలో తాము పాల్గొనలేదని పేర్కొంది. మరోవైపు, సిరియాని రెబల్స్‌ స్వాధీనం చేసుకున్న పరిణామల నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలను హై అలర్ట్‌లో ఉంచామని, అయితే ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని పేర్కొంది.

అసద్‌కు అండగా రష్యా
సిరియాలో 2015లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్‌ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. బషర్‌ ఆల్‌-అసద్‌ పదవి విడిచి పెట్టిన అనంతరం జరుగుతున్న వరుస పరిణామలపై రష్యా గమనిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement