వెబ్‌కాస్టింగ్‌కు సర్వం సిద్ధం | Web casting to prepare everything | Sakshi
Sakshi News home page

వెబ్‌కాస్టింగ్‌కు సర్వం సిద్ధం

Published Tue, Apr 22 2014 3:43 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

వెబ్‌కాస్టింగ్‌కు సర్వం సిద్ధం - Sakshi

వెబ్‌కాస్టింగ్‌కు సర్వం సిద్ధం

  •      1,118 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు
  •      కేంద్రాలు పెరిగే అవకాశం
  •      15 కళాశాలల నుంచి 2100 మంది విద్యార్థుల ఎంపిక
  •      ఇప్పటికే జిల్లాకు చేరిన వెబ్ కెమెరాలు
  •  కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, పోలింగ్ కేంద్రాల్లోని సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాటుచేస్తు న్న వెబ్‌కాస్టింగ్‌కు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను 2009 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి అమలుచేస్తోంది. అయితే, ఈసారి మా త్రం సమస్యాత్మకమని గుర్తించిన పోలింగ్ కేం ద్రాలన్నింటిలో వీడియో చిత్రీకరణ, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌కాస్టింగ్... ఈ మూడింటిలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో వెబ్‌కాస్టింగ్ నిర్వహించిన అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అమలుచేసేలా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
     
    విద్యార్థుల ఎంపిక.. శిక్షణ
     
    వెబ్ కాస్టింగ్‌కు అవసరమైన ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను పోలింగ్ కేంద్రాల వారీగా ఇప్పటికే గుర్తించారు. జిల్లాలోని 15 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి మొత్తం 2100 మంది ని ఎంపిక చేశారు. వీరిలో 1600మంది బాలు రు, 500మంది బాలికలు ఉన్నారు. ఇందులో కొందరు ఎంబీఏ విద్యార్థులను కూడా ఎంపిక చేశారు. కాగా, ఎంపిక చేసిన విద్యార్థులను మూడు బృందాలుగా విభజించి ఒకే రోజు హన్మకొండ అంబేద్కర్ భవన్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుండగా.. హైదరాబాద్ నుంచి గ్రీన్ టెక్నాలజీస్ ప్రతినిధులు రానున్నారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ బాధ్యతలను సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్నకు అప్పగించారు. డీడీ, శాఖ ఉద్యోగులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
     
    ఏర్పాట్లు ఇలా...
     
    ప్రస్తుతం సమస్యాత్మకమని గుర్తించిన జిల్లా లోని 1,118 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చివ రి క్షణంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఇక ఎంపిక చేసిన విద్యార్థులు ఎవరి లాప్‌టాప్ వారే తెచ్చుకోవాల్సి ఉండగా.. పో లింగ్ కేంద్రంలో ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం అధికారులు చేస్తారు.
     
    రూ.500... సర్టిఫికెట్
     
    వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనే ప్రతీ విద్యార్థికి పారితోషికంగా రూ.500 చె ల్లించడంతో పాటు ఎన్నిక ల సంఘం నుంచి గుర్తింపు పత్రం(సర్టిఫికెట్) అందజేస్తారు. అయితే, వెబ్ కాస్టింగ్ కోసం ప్రస్తుతం బాలికలను కూడా ఎంపిక చేసినప్పటికీ.. బాలురను ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రా లు మారుమూల ప్రాంతాల్లో ఉండడం, పోలిం గ్ పూర్తయి తిరిగొచ్చే సరికి రాత్రయ్యే అవకాశముండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, శిక్షణ మాత్రం అందరికీ ఇవ్వనున్నా రు. కాగా, పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ చేసే క్ర మంలో.. విద్యార్థులతో అధికారులు నేరుగా మాట్లాడే అవకాశముంది. ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాకుండా పూర్తి ప్రసారాన్ని సీడీలో రికార్డు చేసి అప్పగించాల్సి ఉంటుంది.
     
    బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ సేవలు
     
    పోలింగ్ కేంద్రం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కోసం బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ సంస్థల బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగించుకోనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సేవలే విని యోగించుకోనున్నా... సేవలు సరిగ్గా లేనిచోట ఎయిర్‌టెల్ సేవలను ఆశ్రయిస్తారు. కాగా, గ తంలో వెబ్‌కాస్టింగ్ సందర్భంగా పలు కేంద్రా ల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement