engineering college students
-
మురిసిన మువ్వన్నెల జెండా (ఫొటోలు)
-
అతివేగం ప్రాణాలు తీసింది!
దుండిగల్: వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారి బైక్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అనంత్ విశాల్(23), సుజిత్(21) బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. సుజిత్ స్థానికంగా ఉన్న మహాలక్ష్మీ బాయ్స్ హాస్టల్లో, విశాల్ మరో హాస్టల్లో ఉంటున్నారు. వీరిద్దరూ శనివారం రాత్రి 11 గంటల సమయంలో యమహా బైక్‌పై సూరారం ప్రాంతానికి వచ్చారు. తిరిగి బహదూర్‌పల్లి వైపు వేగంగా వెళ్తుండగా సూరారం కట్టమైసమ్మ దేవాలయం సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విశాల్, సుజిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కొడిగిరి మండలం దోమలెడిగి కాగా, తండ్రి విఠల్ పటేల్ ఎంపీటీసీ. సుజిత్ స్వస్థలం మంచిర్యాల. బైక్‌లో లభ్యమైన గంజాయి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న ఎరుపు రంగు బ్యాగ్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. మైసమ్మగూడలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు రాత్రి సమయంలో సూరారం ప్రాంతానికి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంజాయిని కొనుగోలు చేసేందుకే ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు.. విద్యార్థుల వద్ద కిలో గంజాయి దొరకడంతో దుండిగల్ పోలీసులు ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు సంచరించినట్లు అనుమానిస్తున్న సూరారంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే గతంలో ఇదే తరహాలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన, విక్రయించే పాత నేరస్తుల చిట్టాను సైతం వెలికితీస్తున్నారు. దీనికి తోడు గంజాయి క్రయవిక్రయాలపై హాస్టల్లోని తోటి విద్యార్థులను సైతం విచారించే అవకాశం ఉంది. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి ఫోన్ సంఘటన స్థలంలోనే ధ్వంసంకాగా, మరో విద్యార్థి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. బైక్ నడిపిన సమయంలో విద్యార్థులు గంజాయి సేవించారా.. లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని వారు పేర్కొంటున్నారు. -
కళ్లముందే కొట్టుకుపోయారు
‘‘అప్పటి వరకు మాతోపాటే ఆడిపాడిన మిత్రులంతా క్షణాల వ్యవధిలోనే కనుమరుగయ్యారు. కళ్లముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కాపాడమంటూ వారు కేకలు వేసినా మేమేం చేయలేకపోయాం. స్థానికుల సాయం కోసం మేము ఎంతగా ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు..పోలీసులు కూడా సకాలంలో స్పందించలేదు. ఆ దుర్ఘటన నుంచి తప్పించుకున్నందుకు ఆనందపడాలో...ప్రాణ స్నేహితులను కాపాడుకోలేకపోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు.’’ బియాస్ నది వద్ద జరిగిన ఘోర దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీకాంత్ ఆవేదన ఇది. మిరుదొడ్డి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గత ఆదివారం 24 మంది విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గల్లంతుకాగా, ఆ బృందంలోని శ్రీకాంత్ బుధవారం మిరుదొడ్డి మండలంలోని తన స్వగ్రామం మోతెకు సురక్షితంగా చేరుకున్నాడు. దీంతో అతనిరాక కోసం కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూసిన తల్లిదండ్రులు కోరంపల్లి నర్సింహారెడ్డి, అంజమ్మలు ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని కన్నీరుమున్నీరయ్యారు. బంధువులు, మోతె గ్రామస్తులు సైతం భారీగా తరలివచ్చి శ్రీకాంత్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన దుర్ఘటనకు సంబంధించి శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన విషయాలు అతని మాటల్లోనే... వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 48 మంది విద్యార్థులం ఈ నెల 3వ తేదీన విహారయాత్రకు బయలుదేరాం. మా వెంట కళాశాలకు చెందిన ముగ్గురు లెక్చరర్లు కూడా ఉన్నారు. మేమంతా హైదరాబాద్ నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 5వ తేదీ ఆగ్రా చేరుకున్నాం. అక్కడ చూడవలసిన ప్రదేశాలను వీక్షించి..అక్కడి నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లాం. డిల్లీలో కొన్ని ప్రదేశాలను తిలకించిన అనంతరం ఈ నెల 8వ తేదీఆదివారం ఉదయం కులూమానాలికి చేరుకున్నాం. సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి బియాస్ నది వద్దకు చేరుకున్నా. చూడగానే ఆకట్టుకున్న ఆ ప్రదేశంలో కాసేపు గడపాలని భావించి అందరం నది వద్దకు వెళ్లాం. నా మిత్రులంతా బియాస్ నదిలోకి దిగి ఫొటోలు దిగుతుండగా, మిగిలిన కొంతమంది మిత్రులకోసం నేను నది గట్టుపైకి వెళ్లాను. ఉన్నట్టుండి నదిలోని ఓ పెద్ద బండరాయిపై నిలుచున్న 15 మంది మా ఫ్రెండ్స్ కేకలు పెట్టడం వినిపించింది. వెంటనే ఆ వైపు చూడగా, ఉన్నట్టుండి ఉధృతంగా వచ్చిన నీరు మా ఫ్రెండ్స్ ఉన్న బండరాయి చుట్టూ చేరింది. వారిని రక్షించడానికి మేము చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. రక్షించమని కేకలు వేశాం. రెండు నిమిషాల్లోనే 15 మంది మిత్రులు వరదలో కొట్టుకుపోయారు. ఆ వరదనీటిలో సుమారు కిలోమీటర్ దూరం వరకు కనిపించిన వారు ఆపై కనుమరుగ య్యారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ, వారు పూర్తిస్థాయిలో స్పందించలేకపోయారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎముకలు కొరికే చలిలో నరకం అనుభవించాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు హిమాచల్ ఘటపై సీఎం కేసీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తీసుకున్న సహాయ చర్యల మూలంగా తాను పుట్టిన గడ్డపై అడుగు పెట్టానని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో ఆ విమానంలోనే తాను హైదరాబాద్ చేరుకున్నానని తెలిపాడు. దేవుళ్లందరికీ మొక్కుకున్నాం దుర్ఘటన గురించి తెలుసుకున్న వెంటనే మా కుమారుడ్ని కాపాడాలంటూ దేవుళ్లందరికీ మొక్కుకున్నాం. కొన్ని గంటలపాటు ఏమైందో... మా బిడ్డ ఎలా ఉన్నాడోనంటూ క్షణమొక యుగంలా గడిపాం. ఎట్టకేలకు నేను క్షేమంగా ఉన్నానంటూ శ్రీకాంత్ ఫోన్ చేసేవరకూ ఉగ్గబట్టి ఎదురుచూశాం. ఆ భగవంతుడి దయ వల్ల మా బిడ్డ క్షేమంగా ఇల్లు చేరుకోవడం సంతోషంగా ఉంది. -శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, అంజమ్మ -
వెబ్‌కాస్టింగ్‌కు సర్వం సిద్ధం
1,118 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు కేంద్రాలు పెరిగే అవకాశం 15 కళాశాలల నుంచి 2100 మంది విద్యార్థుల ఎంపిక ఇప్పటికే జిల్లాకు చేరిన వెబ్ కెమెరాలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, పోలింగ్ కేంద్రాల్లోని సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాటుచేస్తు న్న వెబ్‌కాస్టింగ్‌కు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను 2009 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి అమలుచేస్తోంది. అయితే, ఈసారి మా త్రం సమస్యాత్మకమని గుర్తించిన పోలింగ్ కేం ద్రాలన్నింటిలో వీడియో చిత్రీకరణ, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌కాస్టింగ్... ఈ మూడింటిలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో వెబ్‌కాస్టింగ్ నిర్వహించిన అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అమలుచేసేలా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విద్యార్థుల ఎంపిక.. శిక్షణ వెబ్ కాస్టింగ్‌కు అవసరమైన ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను పోలింగ్ కేంద్రాల వారీగా ఇప్పటికే గుర్తించారు. జిల్లాలోని 15 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి మొత్తం 2100 మంది ని ఎంపిక చేశారు. వీరిలో 1600మంది బాలు రు, 500మంది బాలికలు ఉన్నారు. ఇందులో కొందరు ఎంబీఏ విద్యార్థులను కూడా ఎంపిక చేశారు. కాగా, ఎంపిక చేసిన విద్యార్థులను మూడు బృందాలుగా విభజించి ఒకే రోజు హన్మకొండ అంబేద్కర్ భవన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుండగా.. హైదరాబాద్ నుంచి గ్రీన్ టెక్నాలజీస్ ప్రతినిధులు రానున్నారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ బాధ్యతలను సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్నకు అప్పగించారు. డీడీ, శాఖ ఉద్యోగులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లు ఇలా... ప్రస్తుతం సమస్యాత్మకమని గుర్తించిన జిల్లా లోని 1,118 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చివ రి క్షణంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఇక ఎంపిక చేసిన విద్యార్థులు ఎవరి లాప్టాప్ వారే తెచ్చుకోవాల్సి ఉండగా.. పో లింగ్ కేంద్రంలో ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం అధికారులు చేస్తారు. రూ.500... సర్టిఫికెట్ వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనే ప్రతీ విద్యార్థికి పారితోషికంగా రూ.500 చె ల్లించడంతో పాటు ఎన్నిక ల సంఘం నుంచి గుర్తింపు పత్రం(సర్టిఫికెట్) అందజేస్తారు. అయితే, వెబ్ కాస్టింగ్ కోసం ప్రస్తుతం బాలికలను కూడా ఎంపిక చేసినప్పటికీ.. బాలురను ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రా లు మారుమూల ప్రాంతాల్లో ఉండడం, పోలిం గ్ పూర్తయి తిరిగొచ్చే సరికి రాత్రయ్యే అవకాశముండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, శిక్షణ మాత్రం అందరికీ ఇవ్వనున్నా రు. కాగా, పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ చేసే క్ర మంలో.. విద్యార్థులతో అధికారులు నేరుగా మాట్లాడే అవకాశముంది. ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాకుండా పూర్తి ప్రసారాన్ని సీడీలో రికార్డు చేసి అప్పగించాల్సి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సేవలు పోలింగ్ కేంద్రం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కోసం బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సంస్థల బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగించుకోనున్నారు. బీఎస్ఎన్ఎల్ సేవలే విని యోగించుకోనున్నా... సేవలు సరిగ్గా లేనిచోట ఎయిర్టెల్ సేవలను ఆశ్రయిస్తారు. కాగా, గ తంలో వెబ్‌కాస్టింగ్ సందర్భంగా పలు కేంద్రా ల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. -
సీమాంధ్ర మంత్రుల వల్లే దుస్థితి
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రుల అసమర్ధత వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సోమవారం వర్సిటీలో నిరసన ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జునుడి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రిలే నిరాహారదీక్షలు చేశారు. ఈ దీక్షలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాష్ట్ర విభజన బిల్లు వచ్చినపుడు తాము వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోరుతూ సీమాంధ్రలో 110 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే, కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పదవులకోసం పాకులాడడం నీచమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ జి.రోశయ్య, ఆచార్య పి.వరప్రసాదమూర్తి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జాన్సన్, ఉద్యోగ జేఏసీ నాయకులు కోడూరి కనకరాజు, కన్యాకుమారి, యుగంధర్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వెంకటరమణ, ఏఎన్‌యూ జేఏసీ అధ్యక్షుడు కె. కిషోర్, బి.ఆశిరత్నం, పి.శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షలకు పలువురు సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మద్దతు పలికారు. దీక్షలను సాయంత్రం ఎమ్మెల్సీ కేఎస్. లక్ష్మణరావు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. -
ఎగిసిన ఉద్యమ జ్వాల
కర్నూలు, న్యూస్‌లైన్: విభజన జ్వాలల్లో జిల్లా అట్టుడుకుతోంది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అన్ని ప్రాంతాలు ఉద్యమాలతో రగిలిపోతున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్రంగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనన్న భావన ప్రజల్లోకి వెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా సమైక్యపోరు మహోద్యమంగా మారింది. నియోజకవర్గ, మండల కేంద్రాలే కాకుండా మారుమూల గ్రామాల ప్రజలు సైతం పోరుబాట పట్టడం ద్వారా ప్రజా జీవనం స్తంభించిపోతోంది. నిరసన కార్యక్రమాలకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు అవుతున్నారు. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలలు, కళాశాలలు సక్రమంగా తెరుచుకోవడం లేదు. ఉద్యోగులు కూడా ఆందోళనలో పాల్గొంటుండటంతో జిల్లా అంతటా ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన స్తంభించిపోయింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లాలో తొమ్మిదో రోజు గురువారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. కర్నూలు నగరంలో మెడికల్ దుకాణాలను బంద్ చేసి నిర్వహకులు సమైక్య ఆందోళనలో పాల్గొన్నారు. డ్రగ్ డీలర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. ర్యాలీలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేస్తూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగర ప్రధాన రహదారులన్నీ ఆందోళనకారులతో కిటకిటలాడాయి. పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించేందకు ప్రయత్నించినా ఉద్యమకారులు ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వైద్యులు, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. సమైక్య రాష్ట్రం కోసం వినాయక్‌ఘాట్ వద్ద అర్చక, పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఆదోనిలో దాదాపు కిలో మీటరు మేర రోడ్డుకు ఇరువైపులా సమైక్యవాదులు చేయిచేయి కలిపి మానవహారంగా నిలబడి సమైక్య నినాదాలు వినిపించారు. జేఏసీ పిలుపులో భాగంగా వైఎస్సార్సీపీ నేత సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మానవ హరంలో పాల్గొన్నారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. కాంగ్రెస్, పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేశారు. గోస్పాడులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఒంటెద్దు బండ్లతో ప్రదర్శన జరిపారు. కోడుమూరులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యోగులు సమైక్య ఆందోళన నిర్వహించారు. ఆలూరులో ఆర్ఎంపీల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. హాలహర్విలో జేఏసీ ఆద్వర్యంలో నడిరోడ్డుపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరులో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు గౌడుసెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కోవెలకుంట్ల ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ మాజీ చెర్మైన్ బుట్టా రంగయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చెర్మైన్ మాచాని నాగరాజు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వై.రుద్రగౌడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి. రిలే దీక్షల విరమణ కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర కన్వీనర్ సీ.హెచ్. మద్దయ్య చేపట్టిన రిలే దీక్షలను ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమీటి సభ్యులు తెర్నేకల్లు సురేందర్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మ్యుజియం ఎదుట చేపట్టిన రిలే నిరాహర దీక్షలు నాల్గో రోజుకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసమే తెలుగు జాతిని రెండు ముక్కలుగా విభజించేందుకు పూనుకుందన్నారు. దీక్షలకు ప్రముఖ సామాజిక వేత్త సంజీవరెడ్డి, పలు ప్రజా సంఘాలు సఘీభావం తెలిపారు. దీక్షలలో నాగన్న, సుధాకర్, ప్రభాకర్, ఏసు, గోపాల్లచే ఆ పార్టీ నాయకులు డా.సలీం, పులిజాకబ్, ఎస్.ఎ రేహ్మాన్, తోఫిక్ అహ్మద్‌లు పాల్గొన్నారు.