Webcasting
-
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేశాం
నరసరావుపేట/బాపట్ల: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటతో పాటు బాపట్లలో ఆయన పర్యటించారు. నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన మీనా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక జిల్లా అయినా పల్నాడులో రీపోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ అధికారులను అభినందించారు. వెబ్‌కాస్టింగ్ వంటి ఏర్పాట్లు చేసినా కొన్ని బూత్‌లలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించి.. ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు నమ్మకం తీసుకొస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత రిటరి్నంగ్ అధికారి వెంటనే స్పందించాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలను నిషేధించాలి డీజీపీ హరీ‹Ùకుమార్‌గుప్తా మాట్లాడుతూ.. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ శ్రీకేశ్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు 700 మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,196 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో 59 మందిని అరెస్టు చేశామని చెప్పారు. సమావేశంలో పోలీస్ అధికారులు గోపినాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్, జేసీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించొద్దు అలాగే బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను సీఈవో ముఖే‹Ùకుమార్ మీనా మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సీహెచ్ శ్రీధర్, ఆర్వోలతో మీనా సమావేశమయ్యారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్‌లున్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆయన ఆదేశించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్వోలు ఉన్నారు. -
స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు
సాక్షి, అమరావతి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలుస్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎస్ సమీక్షించారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని, కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ఉన్న కేంద్రాలు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానమై ఉంటాయని, వాటిలో పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. జనవరి నుండి ఇప్పటివరకు రూ.78 కోట్ల నగదు, రూ.41 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, రూ.30 కోట్ల విలవైన వివిధ డ్రగ్స్ వంటివి మొత్తం రూ.176 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన గత నాలుగు రోజుల్లోనే వివిధ రూ. 3.39 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు సహా 121 చెక్ పోస్టులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు 1.50 లక్షల మంది రాష్ట్ర పోలీసులు, 522 కంపెనీల స్టేట్ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, 465 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వు పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి హోంగార్డు తదితర స్థాయి పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది, వాహనాలు సిద్ధం: మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 4,09,41,182 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి 12,683 వాహనాలు, పోలింగ్ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరమని చెప్పారు. 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్ రిటర్నింగ్ అధికారులు, 829 మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్ ఎఆర్ఓలు, 5,067 మంది సెక్టోరల్ అధికారులు, 5,067 మంది సెక్టోరల్ పోలీస్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్ అధికారులు, 2,48,814 మంది పోలింగ్ అధికారులు, 46,165 బూత్ స్థాయి అధికారులు, 416 మంది జిల్లా స్థాయి నోడల్ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించామన్నారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గాల పరిధిలో మోడల్ కోడ్ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో హోం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులు హరీశ్ కుమార్ గుప్త, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాశ్, స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, విద్యా శాఖ కమిషనర్ సురేశ్ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, సీడీఎంఏ శ్రీకేశ్ బాలాజీ రావు, అదనపు సీఈవో హరీంద్ర ప్రసాద్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ రవి ప్రకాశ్ పాల్గొన్నారు. -
23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రం
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రోజు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముమ్మరం చేసింది. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటునకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 50 శాతం మేర అంటే 23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా 25 లోక్‌సభ నియోజకర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 23,090 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ స్ట్రీమింగ్ (ఆడియో, వీడియో, రికార్డు, వీక్షణ, సీసీటీవీ తదితర సేవలు అందించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే నెల 1వ తేదీలోగా ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేసింది. సాంకేతిక బిడ్‌ను వచ్చే నెల 2న, ఆర్థిక బిడ్‌ను వచ్చే నెల 3న తెరుస్తామని పేర్కొంది. ఎంపికైన బిడ్డర్ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏకకాలంలో జరిగే ఎన్నికల పోలింగ్ రోజు ప్రత్యక్ష వెబ్ ప్రసారాన్ని (ఆడియో–వీడియోతో కూడిన)టర్న్‌కీ ప్రాతిపదికన చేపట్టాలి. ఇందుకు అవసరమైన వెబ్ అధారిత వెబ్ స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు సంబంధిత వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. సురక్షిత క్లౌడ్ వాతావరణంలో సెటప్ చేసిన సర్వర్‌లోని ఆడియో–వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో సర్వర్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన స్థలాన్ని తప్ప ఎలాంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం అందించదు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజు తగిన సిబ్బందితో సహా లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయాలి. రికార్డు చేసిన బ్యాకప్‌ను సమర్పించాలి. అలాగే రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో 55 ఇంచుల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ రోజు ఒక్కో కార్యాలయంలో ఒక్కో సిబ్బంది ఉండాలి. మొత్తం 26 జిల్లాల ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో టీవీ స్క్రీన్స్‌ను అమర్చాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో రెండు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలి. నిరంతరాయంగా లైవ్ వెబ్ కాస్టింగ్ అందించడానికి అవసరమైన బ్యాటరీ బ్యాకప్ అందించాల్సి ఉంటుంది. -
మునుగోడు ఉపఎన్నికపై ఈసీ డేగ కన్ను
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి పోలింగ్‌పై ఈసీ డేగ కన్ను వేసింది. హైదరాబాద్ ఎన్నికల కమిషన్ ఆఫీస్‌లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 298 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని దగ్గరుండి ఎన్నికల ప్రధానాధికారి పర్యవేక్షించనున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలలో టెక్నికల్ సమస్యలు వెంటనే తొలగించేలా టెక్నికల్ టీమ్‌ను అధికారులు అప్రమత్తం చేశారు. ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రలోభాలు జరగకుండా ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకురూ.8 కోట్లు సీజ్ చేశామన్నారు. చదవండి: లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం -
విద్యార్థులతో వెబ్ కాస్టింగ్
వైరా: పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘంతో పాటు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల్లో సరళిపై నిఘా పెట్టనుంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నెట్ వర్కే పెద్ద సమస్య జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెబ్‌కాస్టింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు పని చేయాలంటే నెట్వర్క్ తప్పనిసరి. ప్రతీ కేంద్రంలో నెట్వర్క్ పనిచేస్తుందా.. లేదా అన్నది సమస్యగా మారింది. ఎన్నికల సంఘం సూచించిన దాని ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం లేని చోట్ల బీఎస్ఎన్ఎల్ డేటా కార్డులు, వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఆదేశాలున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్టెల్, ఇతర నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయని గ్రామాలున్నాయి. ఏ పోలింగ్ కేంద్రంలో ఏనెట్వర్క్ పని చేస్తుందో ముందుగా ఆ గ్రామానికి అధికారులు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏదో ఒక నెట్‌వర్క్‌తో తప్పకుండా పోలింగ్ సరళిని పరిశీలించాలి. ఇందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వెబ్ కెమెరాల ఏర్పాటుతో పోలింగ్ కేంద్రాల నుంచి కలెక్టరేట్‌కు, కలెక్టరేట్ నుంచి హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయానికి, అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి అనుసంధానం చేస్తారు. ఒక కేంద్రంలో పోలింగ్ సరళిని ఒకేసారి మూడు చోట్ల ఉన్నతాధికారులు పరిశీలించే వీలవుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరపవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల సాయం గత అసెంబ్లీ ఎన్నికల్లో వీడియో, ఫొటోగ్రఫీతో పోలింగ్ ప్రక్రియను రికార్డు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 3,419 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నింటీలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో సుమారు 3,450 మంది ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులు వెబ్‌కాస్టింగ్‌కు అవసరమవుతుందని అంచనా వేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో విద్యార్థిని కేటాయించినా.. రిజర్వుగా మరో 30 మంది విద్యార్థులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. -
సిగ్నలే కరువు.. ఇక ఇంటర్నెట్ గతేంటో..?
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల నిర్వహణలో పారదర్శక, వేగవంతమైన నిర్ణయాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అవసరం. అయితే సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో అతి ముఖ్యమైన ఇంటర్నెట్ జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందా? తాత్కాలికంగా అయినా అందించడానికి, బీఎస్ఎన్ఎల్, ఇతర ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం లేదు. జిల్లాలోని వందలాది గ్రామాల్లో ఇంటర్నెట్ లేని మాట అటు ఉంచితే సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా రాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయంతో పనిచేసే పరికరాలను ఏ విధంగా వినియోగిస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి. అందుబాటులో లేని బీఎస్ఎన్ఎల్ సేవలు ప్రభుత్వరంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎ ల్ 3జీ సేవలు జిల్లావాసులకు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులో రాని దుస్థితి నెలకొంది. దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తున్నా ఈ సేవలను జిల్లా మొత్తానికి అందించడానికి వెనుకబడ్డారు. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలంలోని కాట్నగల్లు, గొల్లపల్లె, నిలువరాతిపల్లె, బాగేపల్లె, కమ్మచెరువు, చెట్లవాండ్లప ల్లె ప్రాంతాల్లో 3జీ సేవలు, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నేటికీ అందడం లేదు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని మరికొన్ని సరిహద్దు మండలాల్లోని గ్రామాల్లో ఉంది. బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్న ప్రాంతంలో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంటున్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) పర్యవేక్షణ, నిర్వహణ వైఫల్యాలతో అది కూడా అంతంతగానే ఉంది. చిన్నపాటి మరమ్మతులను రోజుల తరబడి చేయడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యధికంగా, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు సంస్థ అందిస్తున్న అంతర్జాల సేవలు విసుగు పుట్టిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వినియోగానికి అనుగుణంగా అధునాతన మార్పులు తేవడంలో బీఎస్ఎన్ఎల్ వెనుకబాటుతనం కనిపిస్తోంది. సాంకేతిక వినియోగంతో ఎన్నికల నిర్వహణను సంతృప్తికరంగా పూర్తి చేయాలని భావిస్తున్న జిల్లా యంత్రాంగానికి ఫోన్ సిగ్నల్స్ సమస్యలతోపాటు, ఇంటర్నెట్ సమస్యలు తప్పకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వెబ్‌కాస్టింగ్‌కు ఆదేశాలు గతంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన వెబ్‌కాస్టింగ్ సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వినియోగించాలని ఆదేశాలందాయి. ఈ ప్రక్రియలో కంప్యూటర్ల ను ఇంటర్నెట్తో అనుసంధానం చేసి, ప్రత్యేక సాఫ్ట్వేర్లతో పోలింగ్ నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పరిశీ లించడానికి, రికార్డు చేయడం వీలవుతుంది. ఎక్కడైనా ఇబ్బందికరమైన ఘటనలు తలెత్తితే కంట్రోల్ రూమ్ నుంచి వేగంగా స్పందించడానికి ఉపయోగపడుతుంది. సాంకేతిక అంశాలపై పట్టు ఉన్న విద్యార్థుల సహకారాన్ని గతంలో తీసుకున్నారు. అయితే ఈసారి ఎలా నిర్వహించనున్నారో తెలియని పరిస్థితి. స్పష్టత కరువు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తితే సమాచారాన్ని జిల్లా యంత్రాగానికి ఎలా చేరవేస్తారన్న విషయంలో స్ప ష్టత లేకుంటే కష్టమే. వైర్లెస్ సెట్ల వినియోగం స మాచారాన్ని చేరవడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయాన్ని పునఃసమీక్షించుకోవాల్సినవసరం ఎంతైనా ఉంది. తీవ్రతను తెలిపేలా ఫొటోలు, వీడియోలు, డ్యాకుమెంట్లు పంపే విషయంలో ఇ బ్బందులు తప్పకపోవచ్చు. వెబ్‌కాస్టింగ్ విషయంలో ఇంటర్నెట్ అవసరమే కీలకమనే విషయాన్ని జి ల్లా యంత్రాంగం గుర్తించాల్సి ఉంది. దీంతోపాటు ఎంతమంది పోలింగ్ సిబ్బందికి వైర్లెస్ సెట్ల విని యోగంపై అవగాహన ఉందనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏదీ ఏమైనప్పటికీ కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా లేని ప్రాంతాల్లో వి«ధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఇబ్బందిగా మారుతుంద న్న విషయాన్ని గుర్తించి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. జిల్లాలో నెట్వర్క్ పరిస్థితి ఇదీ.. ♦ జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. నెట్‌ను అందించడంలో ప్రధాన పాత్ర పోషించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ తెగిపోతుండడం సమస్యగా మారుతోంది. దీంతో సిగ్నల్స్ సమస్య అధికమవుతోంది. ♦ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ల్యాండ్‌లైన్ కనెక్షన్లు అందుబాటులో లేవు. త్వరలో జరిగే ఎన్నికలకు 95 శాతం ప్రభుత్వ పాఠశాలలే పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. ఈ సందర్భంలో సమస్య ఉత్పన్నమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ♦ హైస్పీడ్ ఇంటర్నెట్, బ్రాండ్‌బ్యాండ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఎలా అనుసంధానిస్తారన్న అంశంపై స్పష్టత లోపించింది. -
నేడు పోలింగ్
ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్ భారీగా భద్రతా సిబ్బందినియామకం 20 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో చిత్రీకరణ ‘అచ్చంపేట నగర చాయతీ’కి సర్వం సిద్ధం ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బహిరంగ ప్రచారం పూర్తయినప్పటికీ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి చివరి నిమిషం వరకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నాగర్‌కర్నూల్ ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిచేశారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే అచ్చంపేట పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరిని పంపించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 18,614 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1085 ఎస్టీ, 2792 ఎస్సీ, 8755 బీసీ, 5982 జనరల్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 20 వార్డులకు 17వార్డులు రిజర్వేషన్లు కాగా 3వార్డులు జనరల్‌కు కేటాయించారు. భారీ బందోబస్తు ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. నగరపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా స్థానిక పోలీసులను భారీగా వినియోగించుకుంటున్నారు. జిల్లా ఆడిషనల్ ఎస్పీతో పాటు మరో ఆడిషల్ ఎస్పీ, 6గురు సీఐలు,30 మంది ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు,300ల మంది పీసీలు, హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. రెండు స్పెషల్ పార్టీ టీంలు, రెండు వాహన తనిఖీ బందాలు, 6తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్, వనపర్తి డీఎస్పీలు ప్రవీణ్‌కుమార్, జోగుల చెన్నయ్యలు ఇక్కడే మకాం పెట్టి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 200మంది ఎన్నికల సిబ్బంది నియామకం 20 వార్డుల ఓటర్లుకు 20 పోలింగ్ కేంద్రాల్లో 200మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. పీఓలు 25, ఏపీలు 25, ఓపీఓలు 65 మంది, 4రూట్లలో నలుగురు జోనల్ అధికారులు, 8 మంది మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. మరో 70 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 20 వార్డుల్లో పది సమస్యాత్మకంగా, అతి సమస్యాత్మకమైనవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారి సాబేర్ అలీ తెలిపారు. 20 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో కవరేజ్ ద్వారా పర్యవే క్షించనున్నారు. ఇవీ రెండింటితోపాటు కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకులను నియమించారు. అవసరాన్ని బట్టి అదనంగా వెబ్‌కాస్టింగ్ చేసేందుకు వీలుగా సామగ్రి, సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అచ్చంపేటలో ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేకంగా డీఎస్పీలను, సీఐలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 16గుర్తింపు కార్డుల్ల ఏదో ఒకటి తప్పని సరి.. పట్టణంలో ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశామ ని, ఎవరికైన అందని పక్షంలో 16 గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తప్పని సరిగా పో లింగ్ కేంద్రాలకు తీసుకురావాలని ఎన్నిక ల అధికారి సాబేర్ అలీ, సహాయధికారి జ యంత్కుమార్రెడ్డి తెలిపారు. పోలింగ్ జ రుగుతున్నందున పట్టణానికి లేబర్ హాలీడే ప్రకటించామని, ఎవరు కూడా దుకాణాలు తెరిచి ఉంచవద్దని చెప్పారు. పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే.. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి అటు ఐక్యకూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయా పార్టీలకు చెందిన జిల్లా, రాష్ట్ర నేతలు వారం రోజులుగా అచ్చంపేటలోనే మకాం పెట్టి విజయానికి కావాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నం చేస్తూ మద్యం, డబ్బును ఎరగా వేస్తున్నారు. -
నేడు వెన్నంపల్లిలో రీపోలింగ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, జేసీ వెన్నంపల్లి(సైదాపూర్ రూరల్) న్యూస్‌లైన్ : సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి 170వ పోలింగ్ కేంద్రంలో మంగళవారం రీపోలింగ్ జరగనుంది. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎం మొరారుుంచింది. మరో ఈవీఎం ఏర్పాటుచేసినా మొదటి ఈవీఎం ఎర్రర్ అని చూపడంతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మంగళవారం నిర్వహించే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాటుచేశారు. రీపోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ సోమవారం తనిఖీచేశారు. పోలింగ్ కేంద్రంలోని సౌకర్యాలను, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్, తహశీల్దార్ మల్లేశం ఉన్నారు. కిడ్నాప్‌లకు పాల్పడితే చర్యలు: ఓఎస్డీ కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : కార్పొరేటర్లుగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను కిడ్నాప్‌లు, శిబిరాలకు తరలించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓఎస్డీ సుబ్బారాయుడు హెచ్చరించారు. రామగుండంలో సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజేతలతో ఓఎస్డీ సమీక్ష జరిపారు. ఒక్కో ఇండిపెండెంట్‌కు ఒక్కో కానిస్టేబుల్‌ను సెక్యూరిటీ నియమిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బెదిరించినా, ఇతర అసౌకర్యాలు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఎవరైనా ఓడిపోయిన అభ్యర్థులను రెచ్చగొట్టే తరహాలో ప్రవర్తించినా, నినాదాలు చేస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీ, డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి, కమిషనర్ ఎస్.రవీంద్ర, సీఐలు పాల్గొన్నారు. -
వెబ్‌కాస్టింగ్‌కు సర్వం సిద్ధం
1,118 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు కేంద్రాలు పెరిగే అవకాశం 15 కళాశాలల నుంచి 2100 మంది విద్యార్థుల ఎంపిక ఇప్పటికే జిల్లాకు చేరిన వెబ్ కెమెరాలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం, పోలింగ్ కేంద్రాల్లోని సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాటుచేస్తు న్న వెబ్‌కాస్టింగ్‌కు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను 2009 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి అమలుచేస్తోంది. అయితే, ఈసారి మా త్రం సమస్యాత్మకమని గుర్తించిన పోలింగ్ కేం ద్రాలన్నింటిలో వీడియో చిత్రీకరణ, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌కాస్టింగ్... ఈ మూడింటిలో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని జిల్లా యం త్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులతో వెబ్‌కాస్టింగ్ నిర్వహించిన అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అమలుచేసేలా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విద్యార్థుల ఎంపిక.. శిక్షణ వెబ్ కాస్టింగ్‌కు అవసరమైన ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను పోలింగ్ కేంద్రాల వారీగా ఇప్పటికే గుర్తించారు. జిల్లాలోని 15 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి మొత్తం 2100 మంది ని ఎంపిక చేశారు. వీరిలో 1600మంది బాలు రు, 500మంది బాలికలు ఉన్నారు. ఇందులో కొందరు ఎంబీఏ విద్యార్థులను కూడా ఎంపిక చేశారు. కాగా, ఎంపిక చేసిన విద్యార్థులను మూడు బృందాలుగా విభజించి ఒకే రోజు హన్మకొండ అంబేద్కర్ భవన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుండగా.. హైదరాబాద్ నుంచి గ్రీన్ టెక్నాలజీస్ ప్రతినిధులు రానున్నారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ వెబ్‌కాస్టింగ్ ప్రక్రియ బాధ్యతలను సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్నకు అప్పగించారు. డీడీ, శాఖ ఉద్యోగులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లు ఇలా... ప్రస్తుతం సమస్యాత్మకమని గుర్తించిన జిల్లా లోని 1,118 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చివ రి క్షణంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఇక ఎంపిక చేసిన విద్యార్థులు ఎవరి లాప్టాప్ వారే తెచ్చుకోవాల్సి ఉండగా.. పో లింగ్ కేంద్రంలో ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం అధికారులు చేస్తారు. రూ.500... సర్టిఫికెట్ వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనే ప్రతీ విద్యార్థికి పారితోషికంగా రూ.500 చె ల్లించడంతో పాటు ఎన్నిక ల సంఘం నుంచి గుర్తింపు పత్రం(సర్టిఫికెట్) అందజేస్తారు. అయితే, వెబ్ కాస్టింగ్ కోసం ప్రస్తుతం బాలికలను కూడా ఎంపిక చేసినప్పటికీ.. బాలురను ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రా లు మారుమూల ప్రాంతాల్లో ఉండడం, పోలిం గ్ పూర్తయి తిరిగొచ్చే సరికి రాత్రయ్యే అవకాశముండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, శిక్షణ మాత్రం అందరికీ ఇవ్వనున్నా రు. కాగా, పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ చేసే క్ర మంలో.. విద్యార్థులతో అధికారులు నేరుగా మాట్లాడే అవకాశముంది. ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాకుండా పూర్తి ప్రసారాన్ని సీడీలో రికార్డు చేసి అప్పగించాల్సి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సేవలు పోలింగ్ కేంద్రం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కోసం బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సంస్థల బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగించుకోనున్నారు. బీఎస్ఎన్ఎల్ సేవలే విని యోగించుకోనున్నా... సేవలు సరిగ్గా లేనిచోట ఎయిర్టెల్ సేవలను ఆశ్రయిస్తారు. కాగా, గ తంలో వెబ్‌కాస్టింగ్ సందర్భంగా పలు కేంద్రా ల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. -
నూరుశాతం ఓటరు స్లిప్పులు అందించాలి
కలెక్టర్ చిరంజీవులు కలెక్టరేట్, న్యూస్‌లైన్, ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫొటో ఓటరు స్లిప్పులను ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు నూరుశా తం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇంటింటికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినప్పటికీ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని సూచించారు. ఓటు వేసేందుకు ఫొటో ఓటరు స్లిప్పు ఉంటే సరిపోతుందన్నారు. ఎన్నికల డ్యూటీ ఉన్న సిబ్బంది అందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందజేసే విధంగా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని, ఈ నెల 23, 24, 25వ తేదీలలో ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ స్పెషల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పీఓలకు ఈ నెల 20, ఏపీఓలకు 21న నియోజకవర్గ స్థాయిలోనూ, ఓపీఓలకు 22వ తేదీన మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రతి 50 మంది పీఓలు, ఏపీఓలకు ఒక ట్రైనింగ్ హాలు ఏర్పాటు చేసి ఈవీఎం వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో టెంట్, మంచినీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అలాగే ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో ప్రథ మ చికిత్స శిబిరం ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఆరు వందల పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వెబ్‌కాస్టింగ్‌కు అనువుగా లేని పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ తీయించాలని ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్ చేసే విద్యార్థులకు ఎన్నికల కమిషన్ రెమ్యునరేషన్ 500 నుంచి 600 వరకు పెంచినట్లు వివరించారు. రిటర్నింగ్ అధికారులు ఎంసీఎంసీ టీముల ద్వారా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఇచ్చే పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్‌ను పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, 12 శాసనసభా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
మోగనున్న ‘సార్వత్రిక’ నగారా
12 నుంచి నామినేషన్ల స్వీకరణ 21న పరిశీలన 23న ఉపసంహరణ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా రిటర్నింగ్ అధికారులు భారత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పగడ్బంధీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్వోలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల నామినేషన్లు,వాటి పరిశీలన, ఉపసంహరణ, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. సెలవు రోజులైన ఈ నెల 13, 14, 18 తేదీల్లో నామినేషన్లను స్వీకరించరాదన్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని వివరించారు. రిటర్నింగ్ అధికారులు ప్రతీ నియోజకవర్గానికి పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ విధిగా చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు వేసే నామినేషన్ల పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా ఖాళీలు వదిలితే వారికి చెప్పి రాయించాలన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు పార్లమెంట్ స్థానానికి రూ.25 వేలు, అసెంబ్లీ స్థానానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు సమర్పించే కులధ్రువీకరణ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘పుర’ పోరు ప్రశాంతం
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాలు, ఒక నగరపాలక సంస్థలో ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌తో పాటు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జేసీ జె.మురళీ, ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ బీడీవీ సాగర్ ఎన్నికలను పర్యవేక్షించారు. నందిగామ 19వ వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా అనాసాగరం, హనుమంతపాలెం ప్రాంతాలకు చెందిన ఓటర్ల జాబితాలు తారుమారయ్యాయి. దీంతో ఇక్కడ పోలింగ్‌ను నిలిపివేశారు. అనాసాగరం పోలింగ్ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన అనంతరం 200 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. హనుమంతుపాలెం ప్రాంతానికి చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రాకపోవటంతో ఇక్కడ ఎన్నిక నిలిచిపోయింది. దీంతో 19వ వార్డులో పోలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు నందిగామ పురపాలక సంఘం ఎన్నికల అధికారి పి.పల్లారావు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల తరువాత వచ్చినవారిని అనుమతించలేదు. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. అనంతరం కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. చెదురుమదురు ఘటనలు... నందిగామ 17వ వార్డులో పోలింగ్ ఏజెంట్లకు ఫారాలు ఇవ్వకపోవటంతో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు పురపాలక సంఘ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూజివీడులో 24వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చందర్‌ను పోలీసులు మెడపట్టుకుని గెంటేయటంతో వివాదం నెలకొంది. మచిలీపట్నం పురపాలక సంఘంలోని 5వ వార్డులో టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఎస్పీ జె.ప్రభాకరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి పరిస్థితిని చక్కదిద్దారు. మచిలీపట్నంలోని టౌన్‌హాలులో అనారోగ్యంగా ఉన్నవారిని సైతం వాహనంలో పోలింగ్ వద్దకు తీసుకువెళ్లనివ్వటం లేదంటూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 42వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఓటర్లకు చికెన్ పంపిణీ చేయటం వివాదాస్పదమైంది. 42వ వార్డులో ఓ మహిళ ఓటువేసే సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఒకటో నంబరును నొక్కాలని సలహా ఇచ్చారు. అక్కడ ఒకటో నంబరులో టీడీపీ గుర్తు ఉండటంతో ఆ మహిళ ప్రిసైడింగ్ అధికారిని నిలదీసింది. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ధనికొండ నాగమల్లేశ్వరి ఈ విషయాన్ని ఏజేసీ, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏజేసీ పోలింగ్ కేంద్రానికి వచ్చి ప్రిసైడింగ్ అధికారిని మందలించారు. మచిలీపట్నంలోని ఐదో వార్డులో ఈవీఎం మొరాయించటంతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గుడివాడ 35వ వార్డులో ఈవీఎం మొరాయించటంతో 40 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. మచిలీపట్నంలోని 35వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని పల్లపోతు లలితకుమారిని 14వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోటమర్రి వెంకట బాబాప్రసాద్ తోసివేశారు. దీంతో వైఎస్సార్ సీపీ బాబాప్రసాద్పై ఆర్.పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన కలెక్టర్, జేసీ... కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మచిలీపట్నంలోని 9వ వార్డులోని కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో, జేసీ జె.మురళి 11వ వార్డులోని లేడీస్ క్లబ్లోనిపోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1వ తేదీన ఓట్ల లెక్కింపు విషయంపై ఎన్నికల సంఘం ఇచ్చే మార్గదర్శకాలను బట్టి చర్యలుంటాయని కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఓటరు తీర్పు ... మున్సిపల్ ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకువచ్చిన ఈవీఎంలను ఆయా పురపాలక సంఘాల రిటర్నింగ్ అధికారులు, కమిషనర్లకు ప్రిసైడింగ్ అధికారులు అప్పగించారు. ఆయా పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందా లేదా అన్న అంశంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 1,562 పోలింగ్ కేంద్రాలకే బీఎస్ఎన్ఎల్ టవర్లు అందుతున్నాయని తెలిపారు. మిగిలిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వెబ్ క్యాస్టింగ్‌కు ఉన్న అవకాశాలను సమీక్షించాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బీఎస్ఎన్ఎల్, విద్యుత్, నిక్ సాంకేతిక నిపుణుడు, సెక్టోరల్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన కమిటీ అన్ని పోలింగ్ కేంద్రాలను సమగ్రంగా పరిశీలించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్ఐసీ టెక్నికల్ డెరైక్టర్ నూర్జహాన్ కూడా పాల్గొన్నారు.