కౌంటింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం
ప్రజలకు ఎన్నికల కమిషన్‌పై నమ్మకం కల్పిస్తాం
సీఈవో ముఖేష్‌కుమార్‌మీనా, డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా
నరసరావుపేట/బాపట్ల: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. మంగళవారం పల్నాడు జిల్లా నరసరావుపేటతో పాటు బాపట్లలో ఆయన పర్యటించారు. నరసరావుపేట మండలం కాకాని సమీపంలోని జేఎన్‌టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన మీనా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక జిల్లా అయినా పల్నాడులో రీపోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ అధికారులను అభినందించారు. వెబ్‌కాస్టింగ్ వంటి ఏర్పాట్లు చేసినా కొన్ని బూత్‌లలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ పలు కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు.
కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించి.. ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు నమ్మకం తీసుకొస్తామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత రిటరి్నంగ్ అధికారి వెంటనే స్పందించాలని ఆదేశించారు.
మద్యం అమ్మకాలను నిషేధించాలి
డీజీపీ హరీ‹Ùకుమార్‌గుప్తా మాట్లాడుతూ.. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ శ్రీకేశ్ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు 700 మందికి పైగా కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,196 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏడు ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసుల్లో 59 మందిని అరెస్టు చేశామని చెప్పారు. సమావేశంలో పోలీస్ అధికారులు గోపినాథ్ జెట్టి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్, జేసీ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్రక్టానిక్ పరికరాలను అనుమతించొద్దు
అలాగే బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను సీఈవో ముఖే‹Ùకుమార్ మీనా మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సీహెచ్ శ్రీధర్, ఆర్‌వోలతో మీనా సమావేశమయ్యారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్‌లున్న వారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆయన ఆదేశించారు. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించవద్దని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్‌వోలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment