కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 1,562 పోలింగ్ కేంద్రాలకే బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు అందుతున్నాయని తెలిపారు.
మిగిలిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వెబ్ క్యాస్టింగ్‌కు ఉన్న అవకాశాలను సమీక్షించాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్, నిక్ సాంకేతిక నిపుణుడు, సెక్టోరల్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన కమిటీ అన్ని పోలింగ్ కేంద్రాలను సమగ్రంగా పరిశీలించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్‌ఐసీ టెక్నికల్ డెరైక్టర్ నూర్జహాన్ కూడా పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
Published Wed, Mar 19 2014 4:55 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement