ప్రస్తుతం ఎన్నికల జాతర నడుస్తోంది. మునిసిపల్, స్థానిక, సాధారణ ఎన్నికలు ఒకేసారి వచ్చిపడ్డారుు. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈ తరుణంలో అందరి చూపు బడా రాజకీయ నేతలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భారీ బకారుులపై పడింది.
ప్రధానంగా తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పలువురు రూ.18.98 లక్షల మేర విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందని కలెక్టర్ కిషన్‌కు ఆ శాఖ అధికారులు నివేదించడంతోపాటు వారిని అప్పుల జాబితాలో పెట్టాలని విన్నవించడమే ఇందుకు కారణం. ఎన్నికల బరిలో ఉండాలంటే... ప్రభుత్వానికి ఒక్క రూపారుు బకారుు ఉండొద్దని నిబంధనలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కరెంట్ అధికారులు వసూళ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో విద్యుత్ శాఖ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. ఎవరైనా సామాన్య తరగతి చెందిన వినియోగదారులు ఒక నెల బిల్లు కట్టకపోతే చాలు... ఫైన్‌లు వేయడం, సర్వీస్ కట్ చేయడంతోపాటు వారిని ఆగమాగం చేసి బిల్లు పూర్తిగా కట్టేవరకు నిద్రపోరు. అలాంటిది కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధులపై కనికరం చూపించడం వివక్ష కాదా.. అని ప్రశ్నిస్తున్నారు.
నోటీసుల జారీ...
జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధులు నెల నెలా కరెంటు బిల్లులు చెల్లించని జాబితాలో ఉన్నారు. పార్టీలకతీతంగా వీరిలో కొందరు ప్రముఖులు తమ పేరిట... తమ కుటుంబీకుల పేరిట లక్షలాది రూపాయలు ఎన్పీడీసీఎల్‌కు బకాయి పడ్డట్లు రికార్డులు చెబుతున్నారుు. రాష్ట్ర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామ ఏరియాలో ఉన్న సర్వీసుపై రూ. 6,387 బిల్లు నాలుగైదు నెలలుగా పెండింగ్‌లో ఉంటే.. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న మాజీ మంత్రి, ఓ మాజీ ఎమ్మెల్సీ, ఆయన కుటుంబీకులు అత్యధికంగా రూ.8 లక్షల వరకు బాకీ పడ్డారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, కొండేటి శ్రీధర్, మాలోతు కవిత, ఎంపీ గుండు సుధారాణి భర్త గుండు ప్రభాకర్ పేరిట బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇటీవలే విద్యుత్ రెవెన్యూ విభాగం తయారు చేసిన జాబితాలో ఈ వివరాలున్నాయి. అధికార, విపక్షాలకు చెందిన వీఐపీ నేతలు కావడంతో వారి నుంచి బిల్లులు వసూలు చేసేందుకు అధికారులు వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. తాజాగా సాధారణ ఎన్నికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు నియోజకవర్గాల వారీగా కరెంట్ బిల్లు పెండింగ్ ఉన్న నేతలందరి జాబితాను కలెక్టర్‌కు సమర్పించారు. అంతేకాకుండా... ఇప్పటివరకూ బాకీ పడిన బిల్లు మొత్తం చెల్లించాలని వారికి నోటీసులు జారీ చేశారు. కాగా, ప్రజాప్రతినిధుల విద్యుత్ బాకీలను గత ఏడాది సెప్టెంబర్‌లో ‘సాక్షి’ బహిర్గతం చేసింది. హడావుడిగా విద్యుత్ బిల్లులన్నీ చెల్లించి నట్లు చేసినా... అప్పటినుంచి వారు మళ్లీ అదే పంథాలో నడిచారు. ఎవరేమనుకున్నా... మనకేంటి అనే తరహాలో దులుపేసుకున్నారు.
బాకీ పడ్డ వారు వీరే...
బాకీ పడిన రాజకీయ నేతల జాబితాను కలెక్టర్, ప్రభుత్వానికి విద్యుత్ శాఖ అధికారులు పంపించారు. వీరితోపాటు ఆయా నేతల బినామీల జాబితాను కూడా అందజేశారు. ఈ జాబితా ప్రకారం...
పి.జగన్‌నాయక్ (మాజీ మంత్రి) రూ.1,95,190
ఆజ్మీరా చందూలాల్ (మాజీ మంత్రి) రూ.1,10,715
మాలోతు కవిత (ఎమ్మెల్యే) రూ.35,612
దాస్యం వినయ్ భాస్కర్ (ఎమ్మెల్యే) రూ.28,251
కొండేటి శ్రీధర్ (ఎమ్మెల్యే) రూ.20,609
సిరిసిల్ల రాజయ్య (ఎంపీ) రూ.17,759
గుండు సుధారాణి (ఎంపీ) రూ.15,142
కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు (మాజీ మంత్రి) రూ. 14,622
రేవూరి ప్రకాష్‌రెడ్డి (ఎమ్మెల్యే) రూ.11,582
పొన్నాల లక్ష్మయ్య (తాజా, మాజీ మంత్రి) రూ.6,387
తాటికొండ రాజయ్య (ఎమ్మెల్యే) రూ.6,272
దుగ్యాల శ్రీనివాసరావు (మాజీ ఎమ్మెల్యే) రూ.4,685
గండ్ర వెంకటరమణారెడ్డి (ఎమ్మెల్యే) రూ.4,201
టి.రాజేశ్వర్‌రావు (మాజీ మేయర్) రూ.3,565
పొదెం వీరయ్య (మాజీ ఎమ్మెల్యే) రూ.2,713