kanna babu
-
భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా: Kanna Babu
-
విజయం వైఎస్సార్సీపీదే.. టీడీపీ బలం 200 మాత్రమే: బొత్స సత్యనారాయణ
సాక్షి, అనకాపల్లి: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది.. తప్పకుండా విజయం సాధిసస్తామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.కాగా, వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు శుక్రవారం అనకాపల్లిలోని ఎలమంచిలిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. టీడీపీ కంటే 400 ఓట్లు అధికంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీకి 620 పైగా ఓట్లు ఉన్నాయి. టీడీపీకి 200 ఓట్లు బలం మాత్రమే ఉంది. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే వైఎస్సార్సీపీ పోటీ నుంచి తప్పుకుంది. గత సాంప్రదాయానికి విరుద్ధంగా చంద్రబాబు పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. పెన్షన్ తప్పితే ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు.👉మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. టీడీపీకి బలం లేకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.👉మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ..‘బొత్స సత్యనారాయణ ఎన్నో గొప్ప పదవులు చేశారు. ఎమ్మెల్సీ అనేది ఆయనకు పెద్ద పదవి కాదు. చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగట్టేందుకు మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఫలితం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదిరించడానికి కేఏ పాల్ తప్పితే అందరూ ఏకమయ్యారు. బొత్సను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యల మీదనే కాదు రాష్ట్ర స్థాయి సమస్యల మీద కూడా పోరాటం చేస్తారు’ అని కామెంట్స్ చేశారు. -
దుమ్ములేపిన కన్నబాబు స్పీచ్
-
పవన్‌కళ్యాణ్ కు ఆ స్థాయి లేదు
-
చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు: కన్నబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై సోమవారం కూడా చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కన్నబాబు కీలక అంశాలను వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ అని ఆరోపణలు చేశారు. కాగా, కన్నబాబు మాట్లాడుతూ.. 201-19 మధ్య చంద్రబాబు కొన్ని సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి, ఫైబర్ నెట్ వంటి సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ. చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే రూ. 3,356 కోట్ల ప్రాజెక్ట్ అని మోసం చేశారు. సీమెన్స్ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు. 10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి డబ్బులు రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే ఆమోదం తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా నిధులు మళ్లించారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్ కంపెనీకి కాకుండా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలించారు. తప్పు జరినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరెత్తలేదు. స్కామ్‌తో మాకు సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. సీ అంటే చంద్రబాబు.. మెన్ అంటే వాళ్ల మనుషులని అర్థం. చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన ఒప్పందం ఇదే. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోనే స్కాం జరిగింది. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాం గురించి ఎల్లో మీడియా ఒక్క మాట కూడా రాయలేదు. మేం అధికారంలోకి వచ్చాకే స్కామ్ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు. తన బాబు తన స్కిల్ చూపించి రూ.371 కోట్లు కొట్టేశారు. ప్రజా ధనాన్ని చంద్రబాబు.. లూటీ చేశారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే స్కిల్ చంద్రబాబుకు ఉంది. ఈ స్కామ్‌పై పూర్తి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్! -
పవన్ కల్యాణ్ , చంద్రబాబుది ఫెవికాల్ బంధం : కన్నబాబు
-
టీడీపీ రోడ్ మ్యాప్ లో పవన్ కళ్యాణ్: మంత్రి కన్నబాబు
-
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. చదవండి: పేదలకు లబ్ధి చేకూర్చడానికే ఓటీఎస్ ‘‘ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలి. వరి పండిస్తే.. వచ్చే ఆదాయం మిల్లెట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి. దీని కోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలి. మిల్లెట్స్ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలి. మిల్లెట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. మిల్లెట్స్‌ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీంతో పాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలి. ►రసాయన ఎరువులు, పురుగుమందులు స్థానే ప్రత్యామ్నాయంగా సేంద్రీ పద్ధతులద్వారా పంట సాగును ప్రోత్సహించాలి. ►రసాయనాలు లేని సాగుమీద మంచి విధానాలను తీసుకురండి. ►ఆర్బీకే యూనిట్‌గా ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ►ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలి. ►సేంద్రీయ వ్యవసాయినికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఖరీఫ్‌లో 1.12 కోట్ల ఎకరాల ఇ–క్రాప్ ►45,35,102 మంది రైతులు ఇ– క్రాప్ చేయించుకున్నారు. ►రబీలో ఇ– క్రాప్ ప్రారంభించామని తెలిపిన అధికారులు ►ఆర్బీకేల ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్‌సర్టిఫికేషన్‌కూడా ఇచ్చేలా వ్యవస్థ రావాలన్న సీఎం. ►రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు: సీఎం ►రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు :సీఎం ►దీనికోసం చట్టంలో మార్పులు, అవసరమైతే ఆర్డినెన్స్ ►నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలన్న ఒక సదుద్దేశం.. క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారితీశాయి ►వీటిని నీరేగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయి ►ఈ వ్యవహారాల్లో ఉద్యోగులు ప్రమేయం ఉంటే.. వారిని తొలగించడమే కాదు.. చట్టంముందు నిలబెడతాం ►అక్రమాలకు పాల్పడ్డ వ్యాపారులపైనా కఠిన చర్యలు ఉంటాయి ►రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదనే మాట రాకూడదు ►డిమాండ్ మేరకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి ►కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో ఉంచాల్సిన పరికరాలపై హేతుబద్ధత ఉండాలి ►రైతులకు అందించాల్సిన పరికరాలు కూడా రైతుల సంఖ్య, సాగు చేస్తున్న భూమి , వేస్తున్న పంటల ఆధారంగా హేతుబద్ధతతో వాటిని అందుబాటులోకి తీసుకురావాలి దీనిపై మ్యాపింగ్ చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ►పశువులకు ఆర్గానిక్ ఫీడ్ కూడా అందుబాటులో ఉండాలి ►ఆర్గానిక్ మిల్క్‌పైన మార్కెటింగ్‌పైన దృషిపెట్టండి ►దీనివల్ల రైతులకు మంచి ఆదాయాలు లభిస్తాయి ►అలాగే ఆర్గానిక్‌ఉత్పత్తుల ప్రాససింగ్‌పైన కూడా దృష్టిపెట్టండి ►జిల్లాకు ఒక ప్రాససింగ్ యూనిట్కూడా పెట్టేలా చర్యలు తీసుకోవాలి జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపైనా సీఎం సమీక్ష ►డిసెంబరులో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం ►పాలవెల్లువ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 1,77,364 మహిళలకు లబ్ధి ►సగటున రోజువారీ పాలసేకరణ నవంబర్, 2020లో 2,812 లీటర్లు, నవంబర్ , 2021లో 71,911 లీటర్లు ►ఇప్పటివరకూ 1కోటి 32లక్షల లీటర్ల పాలు కొనుగోలు చదవండి: జగన్ ప్రభుత్వంలోనే ఎయిడెడ్‌కు జీవం సీఎం జగన్ మేలును మరువలేం.. కన్నబిడ్డలా ఆదుకున్నాడు.. -
రెండో రోజు వాణిజ్య ఉత్సవం
-
'సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది'
సాక్షి, అమరావతి: సహకార రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం డీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో చేపట్టిన సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సహకార వ్యవస్థని పూర్తిగా అవినీతిమయం చేసిందని విమర్శించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల తప్పుడు పత్రాలతో కోట్లాది రూపాయిలు దిగమింగేశారని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చోట్లా కుంభకోణాలని వెలికి తీసామన్నారు. బ్యాంకులని నష్టపరిచే చర్యలని ఏ మాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారని చెప్పారు. డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులని రాజకీయ పదవులగా చూడొద్దని, బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్ల పాత్ర కీలకమని తెలిపారు. రైతుకి అప్పుకావాలంటే కోఆపరేటివ్ బ్యాంకులే గుర్తుకు వచ్చేలా పనితీరు ఉండాలని అధికారులకు సూచించారు. అయిదేళ్లుగా ఒకే బ్రాంచ్‌లో పనిచేస్తున్న మేనేజర్లని తప్పనిసరిగా బదిలీ చేయాలని, రుణాల మంజూరులో చేతివాటానికి పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొసైటీ బైఫరికేషన్ త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. చదవండి: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారా? -
సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తాం: మంత్రి కన్నబాబు
సాక్షి, తూర్పుగోదావరి: సహకార వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా100 డీసీసీబీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులతో పాటుగా డ్వాక్రా సంఘాలకు సహకార రంగం ద్వారా ఋణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని, ఆయన వారసునిగా పోలవరం పూర్తి చేయడానికి సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వచ్చినా రాకపోయిన పర్వాలేదు.. కాంట్రాక్టులు తమకు వస్తే చాలన్న విధంగా ఆప్పుడు చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే. -
AP: ఏపీ సీడ్స్‌కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సామజిక బాధ్యత కింద జాతీయ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సర్టిఫైడ్ విత్తనాలను ఖరీఫ్ సీజన్‌కు ముందే పంపిణీ చేసి.. రైతుల ఆదరణను ప్రభుత్వం చూరగొందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా ఖర్చుల భారం లేకుండా ఊళ్లోనే విత్తనాలు అందాయని చెప్పారు. విత్తన పంపిణీ వల్ల 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకురిందన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, కమిషనర్ అరుణ్ కుమార్, సీడ్స్ ఎండి శేఖర్ బాబు ఇతర సిబ్బందిని మంత్రి కన్నబాబు అభినందించారు. -
నష్టం వచ్చినా కూడా రైతులనుండి అనేక పంటలను కొనుగోలు చేశాం : మంత్రి కన్నబాబు
-
రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు: కన్నబాబు
సాక్షి, అమరావతి: రైతుల కోసం 2,531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల మౌలిక వసతుల కల్పనకు రూ.1584 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలిదశలో రూ.659 కోట్లతో 1255 బహుళ ప్రాయోజిత కేంద్రాలను, రెండో దశలో రూ.925 కోట్లతో 1276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నవంబర్ నాటికి తొలిదశ నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కొత్తగా మరో 25 రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. చదవండి: రికార్డు స్థాయిలో వాక్సినేషన్ చేస్తున్నాం: ఆళ్ల నాని -
‘21 రోజుల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో ధాన్యం సొమ్ము’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో వేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిల్లర్లు, దళారులను రైతులు నమ్మొద్దని సూచించారు. ఆర్బీకేలకు వెళ్లి కనీస మద్దతు ధరకే ధాన్యం విక్రయించుకోవాలన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న రకాలనే రైతులు సాగు చేయాలి అందుకు సంబంధించిన విత్తనాలను కూడా సిద్ధం చేశామని తెలిపారు. వ్యవసాయ సలహా మండలి నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. వ్యవసాయ సలహా మండలిలో రైతులను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. సలహా మండలితో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చదవండి: గ్రామ వాలంటీర్ వ్యవస్థ: ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానం -
మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: మార్కెటింగ్ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు శుక్రవారం రోజున సమీక్ష నిర్వహించారు. కోవిడ్ దృష్ట్యా మామిడి, టమాట మార్కెట్లపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పండ్ల ధరలపై దృష్టి పెట్టామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులు మార్కెట్లలోకి రాత్రులు కూడా సరుకులు తీసుకురావచ్చునని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అంతేకాకుండా మార్కెట్ల నుంచి తిరిగి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని మంత్రి అధికారులకు సూచించారు. మామిడి ధరలను రోజూ పర్యవేక్షించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలిపారు. టమాట ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల టన్నుల టమాటలను ప్రాసెసింగ్ యూనిట్స్ కొలుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రైతు బజార్లలో మాస్క్ లేకుండా వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ‘నో మాస్క్ - నో ఎంట్రీ విధానం’ అమలులో ఉంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు. చదవండి: ‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’ -
సీఎంకు సవాల్ విసిరే స్థాయి లోకేష్‌కు లేదు
తిరుపతి: నిన్న అలిపిరిలో మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. నారా లోకేష్‌కు సంస్కారం లేదని, బుర్ర తక్కువ పనులు, పిచ్చి చేష్టలుగా పరిగణించాలని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యముంత్రి అయిన వైఎస్ జగనమోహన్రెడ్డికి సవాల్ విసిరే స్థాయి లేదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ప్రమాణం చేస్తావా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగలేదని మీరు ప్రమాణం చేయగలరా?.. పుష్కరాల్లో 29 మంది మృతికి కారణం చంద్రబాబు కాదని ప్రమాణం చేయగలరా? అంటూ లోకేష్‌ని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారణ చేస్తోందని చెప్పారు. ఇదే కాక, ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు. లోకేష్‌కు, సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, అది తెలుసుకుని నడుచుకోవాలని హితవు పలికారు. గడిచిన ఎన్నికల్లో టీడీపీని ప్రజలే పీకి పాడేశారు. ఇక ప్రస్తుతం టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే అన్నారన్నారు. ( చదవండి: మీ శ్రేయస్సు దృష్ట్యా సభకు రాలేకపోతున్నా: సీఎం జగన్ ) -
సీఎం జగన్ పాలనతో బాబు పలాయనం చేశారు : కన్నబాబు
-
ప్రభుత్వ పథకాలకు తోడ్పాటునందించాలి : మంత్రి కన్నబాబు
-
చంద్రబాబుపై గరు భక్తి చాటుకుంటున్నారు..
సాక్షి, కాకినాడ: టీడీపీతో కలిసి శవ రాజకీయాలు చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. చంద్రబాబుపై గురు భక్తిని చాటుకుంటున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గొల్లలగుంట ఘటనలో విచారణ జరగకుండానే ఎస్ఈసీ ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎస్ఈసీ, ట్రైనీ నాయకుడు లోకేశ్ బాబు గొల్లలగుంటలో ఒకేసారి వాలిపోవడంతో వీరి మధ్య చీకటి ఒప్పందం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొల్లలగుంట వ్యక్తి మృతి చాలా బాధాకరమని, దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్నికలు నిర్వహించలేని ఎస్ఈసీ..విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావిడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏకగ్రీవాల సాంప్రదాయం 1992లో గుజరాత్లో మోదీ ప్రవేశపెట్టారని, దేశంలో అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2600 స్థానాలు ఏకగ్రీవాలయ్యాయని గుర్తు చేశారు. ఏకగ్రీవాలు రాజ్యాంగ స్పూర్తి అని పేర్కొన్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబం హత్యారాజకీయాలకు పాల్పడుతూ.. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. టీడీపీ మేనిఫెస్టోపై నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకున్నారని కన్నబాబు ప్రశ్నించారు. -
వరద సహాయంపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి : తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆరా తీశారు. వరదలు, భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి మంత్రి కన్నబాబు సీఎం జగన్‌కు వివరించారు. తక్షణ సహాయంతో పాటు శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంపై అధికారుల నుంచి నివేదిక కోరారు. దీనిపై వచ్చే వారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. (సమగ్ర భూ సర్వేతో శాశ్వత భూ హక్కు) 40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం కాగా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కన్నబాబు ఇదివరకే పర్యటించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా ఇప్పటివరకు జిల్లాలో 40 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. వరదలతో గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. గండ్లు పడిన చోట పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలేరు వరదలతో పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఉద్యానవన పంటలు కుళ్లిపోయిన పరిస్థితి, తీవ్రంగా ఉందని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందజేశామని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహాయక చర్యల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. -
మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో మొదటి దశలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అమూల్ సహకారంతో పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ‘వైఎస్సార్ చేయూత’ లబ్ధిదారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమంపై తన సహచర మంత్రులతో కలిసి అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, సీదిరి అప్పలరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఇప్పటికే కొత్తగా 11,270 రిటైల్ (కిరాణా) దుకాణాలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ► అనంత, చిత్తూరు, కృష్ణా, తూ.గోదావరి, విశాఖ జిల్లాల్లో రిలయెన్స్ రిటైల్ సంస్థ రైతుల నుంచి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని అధికారులు వివరించారు. కర్నూలు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమైన రిలయెన్స్ జియో మార్ట్ మోడల్ ఇతర జిల్లాలకు విస్తరించాలని మంత్రులు ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ► వ్యాపారాలను ప్రారంభించే లబ్ధిదారులు, వ్యాపార దిగ్గజ సంస్థలను అనుసంధానం చేస్తూ సెర్ప్ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. -
‘కోవిడ్ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తద్వారా క్రిటికల్‌కేర్ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్ కేర్ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్ కేర్ ఆస్పత్రులుగా మార్చామన్నారు. కాగా, వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుని మరణాలు తగ్గిచండంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు. కోవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. (చదవండి: కొత్త మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు) రికార్డుస్థాయిలో పరీక్షలు రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, పాజిటివిటీ అంశాలను అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో రోజుకు రికార్డు స్థాయిలో 58వేల పరీక్షలు చేస్తున్నామన్నారు. కంటైన్ మెంట్ క్లస్టర్లు, కోవిడ్ సోకడానికి ఆస్కారం అధికంగా ఉన్న వారిపై దృష్టి పెట్టి ఈ పరీక్షలు చేస్తున్నామని, దీనివల్ల పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిందని వివరించారు. దాదాపు 90 శాతం పరీక్షలు వీరికే చేస్తున్నామన్నారు. రానున్న కొన్నిరోజులు కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు. ఈ అంకెలను చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. నిమ్మ ధరలపై కీలక ఆదేశం రాష్ట్రంలో నిమ్మ ధరలు పడిపోవడంపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్షించారు. రైతులకు మేలు చేసేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వమే నిమ్మ కొనుగోలు చేసి మద్దతు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. రేపటి నుంచి నిమ్మ కొనుగోలు చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. ఏలూరు, గుడివాడతో పాటు నిమ్మ మార్కెట్లలన్నింటిలో కొనుగోలు చేపడుతామని చెప్పారు. రైతుకు మద్దతు ధర వచేలా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. (ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి) -
అమరావతి ఉద్యమం ఏపాటిదో అందరికీ తెలుసు
సాక్షి, అమరావతి: ‘అమరావతి ఉద్యమం ఏపాటిదో.. ఉద్యమ వాస్తవ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. అనుకూల మీడియా ఉంది కదా అని 200 రోజుల ఉద్యమం పేరిట రాష్ట్ర ప్రజల మనోభావాలు మారిపోయేలా ప్రచారం చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమే’ అని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబూ.. వాస్తవాలకు రండి. 200 రోజుల నుంచి రెప్పవాల్చని పోరు జరిగిందని రకరకాల కథనాలొచ్చాయి. దాని ఉధృతి ఏంటన్నది అమరావతి ప్రాంతంలో ఉండి చూõసే వాళ్లకు తెలుస్తుంది. అమెరికాలోనో, అనకాపల్లిలోనో ఉండి చూస్తే కనిపించదు. 29 గ్రామాల్లో మొదలైన ఉద్యమం ఇప్పుడు మూడు గ్రామాల్లో కొన్ని ఇళ్లకు.. ఫొటోలకు పరిమితమైందని మేం మాట్లాడితే బహుశా కొన్ని విమర్శలు రావచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వాస్తవిక ధృక్పథంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొద్దిమందిలో బాధ ఉంటే ఉండొచ్చు గానీ.. ఎక్కువ బాధ పడింది చంద్రబాబే. రాజధాని పేరుతో జరుగుతున్న ఉద్యమానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబే’ అని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్ర విభజన వేళ కూడా బాబు ఇంతగా బాధపడలేదు ► ఉద్యమం చేసే వారిని కించపరచాలని నేను అనుకోవడం లేదు. కేవలం చంద్రబాబు కోసమో, ఆయన మద్దతుదారుల కోసమే జరుగుతున్న ఉద్యమ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో ఒక్కసారి అలోచించండి. ► రాష్ట్ర విభజన వేళలో కూడా చంద్రబాబు ఇంతగా బాధపడలేదు. అప్పట్లో రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్లు, రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరించారు. ► ఇప్పుడు అమరావతి ఉండాలని ఆయనే స్వయంగా కుటుంబ సభ్యులతో రోడ్డు మీదకు రావడం వెనుక స్వప్రయోజనాలు దాగి ఉన్నాయని ప్రజలంతా భావిస్తున్నారు ► 2018 నాటికి తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి చంద్రబాబు ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు. ► రైతులపై కేసులు పెట్టి, బలవంతంగా భూములు లాక్కుని ఎకరాకు బదులుగా రైతులకు ఇస్తానన్న 1,400 గజాల భూమిలో ఒక్క గజమైనా సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోయారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గుర్తించలేని నాయకత్వమా! ► అమరావతి డిజైన్లకు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టింది రూ.800 కోట్లు. కానీ, రైతులకు కౌలు రూపంలో రూ.800 కోట్లు కూడా ఇవ్వలేదు. దీంట్లోనే చంద్రబాబు ఉద్దేశం ఏంటో తెలియడం లేదా. ► విశాఖలో పరిపాలన రాజధాని రావడాన్ని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గుర్తించలేని నాయకత్వమా మీది. రాయలసీమకు జ్యుడీషియల్ క్యాపిటల్ వస్తుంటే.. అక్కడ పుట్టిన వాడిగా అడ్డుపడతారా. ఉద్యమాలు చేస్తే.. విచారణలు ఆగవు.. ► ఉద్యమాలు చేసినా.. అమరావతిలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలు ఆగవు. ► కొందరి స్వప్రయోజనాల కోసం చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు ఈ ఉద్యమం మాటున పోతాయని అనుకుంటే పొరపాటు ► ఉద్యమాలను గౌరవిస్తాం. చంద్రబాబు సృష్టించే ఈ కృత్రిమ ఆవేశాలను ప్రజలు గౌరవించరని మేం అర్థం చేసుకున్నాం. ఈ విషయాన్ని టీడీపీ వాళ్లు అర్థం చేసుకుంటే మంచిది. మూడుచోట్ల ‘యాంత్రీకరణ’ శిక్షణ కేంద్రాలు.. ► రాష్ట్రంలో కొత్తగా మరో మూడు చోట్ల వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ► శ్రీకాకుళం జిల్లా పాలకొండ, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట, కర్నూలు జిల్లా తగడవంచలో వీటిని ఏర్పాటు చేయనున్నాం. త్వరలో సీఎం జగన్మోహన్రెడ్డి ఈ మూడింటికీ శంకుస్థాపన చేస్తారు. -
అందుకే జీతాలు ఇవ్వలేకపోయాం: మంత్రి కన్నబాబు
సాక్షి, విజయవాడ: అధికారం కట్టబెట్టలేదని ప్రజలపై చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం కాకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీని వల్ల సకాలంలో జీతాలివ్వలేకపోయాం. ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా సభలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. బిల్లును ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకుంది. ఈ విషయంలో ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. (ఆ ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు) ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘క్షమాపణ చెబితే చంద్రబాబు సీనియార్టీని కాపాడుకున్న వారవుతారు. ఎక్కువ కాలం సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు... ఉద్యోగుల జీతాలను అడ్డుకుని ఆ విషయంలో కూడా చరిత్ర సృష్టించారు. పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంది కాబట్టే ఫించన్లు ఇవ్వగలిగాం. నగదు రూపంలో డ్రా చేసి.. ఫించన్లు అందివ్వగలిగాం. కానీ ఉద్యోగుల జీతాలను ఈ విధంగా అందివ్వలేం. పొగాకు కొనుగోళ్లను తొలిసారిగా ప్రభుత్వమే కొనుగోళ్ల చేసే ప్రక్రియ ప్రారంభించింది. రైతులకు నష్టం లేకుండా చర్యలు చేపట్టాం. రైతు భరోసా కేంద్రాలను మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చే ప్రక్రియను చేపట్టనున్నాం’ అని తెలిపారు. (ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు) -
కాపులపై బాబు ఉక్కుపాదం మోపినప్పుడు ఎక్కడున్నావ్ పవన్?
సాక్షి, అమరావతి: కాపులపై చంద్రబాబు ఉక్కుపాదాన్ని మోపినప్పుడు, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని లాఠీలతో కుళ్లబొడిచి ఆయన భార్యను, కుమారుడిని బండ బూతులు తిడుతూ నిర్బంధించినప్పుడు నోరు విప్పని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. ► వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కాపులకు మేలు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారా? పాత మిత్రుడు చంద్రబాబుతో చెలిమిని పోగొట్టుకోలేక పవన్ మాట్లాడుతున్నారా? ► కాపు రిజర్వేషన్ పోరాటాన్ని ఎవరు నీరు గార్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ► కాపులకు ఇచ్చిన మాట ప్రకారం 45–60 ఏళ్ల మధ్య వయస్కులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు అందించడం ప్రారంభమైంది. కాపు నేస్తం కింద దరఖాస్తు చేసుకున్న 2,35,873 మంది మహిళలకు రూ.354 కోట్లను అందించాం. ► ఇంకా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వాళ్లకీ ఇస్తాం. ► వాస్తవం ఇలా ఉంటే.. పవన్ లాంటి వాళ్లు మా ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించడం విడ్డూరం. కాపు రిజర్వేషన్ ఉద్యమం తిరిగి తలెత్తకుండా ఉండేందుకే ఈ సాయం అందిస్తున్నట్టు మాట్లాడడం దారుణం. ► ఐదేళ్లలో చంద్రబాబు రూ.1,879.64 కోట్లను 2.54 లక్షల మంది కాపులకు ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,770 కోట్లను ఇచ్చాం. -
అక్కడ పనిచేసే వారిని బదిలి చేస్తాం: మంత్రి
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కొంతమంది కేసులు వేసి ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని విశాఖ ఇంచార్జ్ మంత్రి కన్నబాబు అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై మంత్రి కన్నబాబు బుధవారం విశాఖలో అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి పారదర్శకంగా చేపడుతున్నాం. అర్హత ఉన్ననిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. విశాఖలో ప్రభుత్వ భూముల రక్షణపై చర్చించాం. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వ్యవహారాలపై ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నాం. (విశాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి) విశాఖలో ప్రభుత్వ భూముల రికార్డులపై ల్యాండ్ ఆడిటింగ్ చేయనున్నాం. విశాఖలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యాలయాలలో ల్యాండ్ రికార్డులు చూస్తూ, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయనున్నాం. పంచగ్రామాల సమస్యలపై చర్చించాం. భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకుంటాం. విశాఖలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను రక్షించేందుకు పూర్తి స్ధాయి ప్రణాళికతో ముందుకు వెళ్తాం. గత ప్రభుత్వంలో విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకి గురయ్యాయి. దీనికి సంబంధించి కలెక్టర్ పర్యవేక్షణలో త్వరలోనే లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి కన్నబాబు తెలిపారు. (‘ఆ కుట్రల్లో నిమ్మగడ్డ బలి పశువు కావొద్దు’) -
ఆక్వా రైతుకు ‘అథారిటీ’
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను తగ్గించడంతోపాటు కరోనా సమయంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్థ (డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసింది. నాణ్యమైన సీడ్,ఫీడ్ అందించడంతో పాటు విక్రయాల్లో రైతులు నష్టపోకుండా చూడటం అథారిటీ ప్రధాన లక్ష్యం రైతులు, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తూ వారి ప్రయోజనాలను అథారిటీ పరిరక్షిస్తుంది. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారుల దోపిడీ నుంచి రైతుల్ని కాపాడే రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆక్వా రంగం అభివృద్ధికి రైతులు, వ్యాపారులతో సామరస్య పూర్వకంగానే వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే పరిధి దాటిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అథారిటీ ఏమాత్రం వెనుకాడదు. ఈ మేరకు మత్స్య, పశు సంవర్థ్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో ప్రాధికార సంస్థ ఏర్పాటై విస్తారమైన కోస్తా తీరాన్ని అభివృద్ధికి ఆలవాలంగా, ఉపాధికి నెలవుగా తీర్చిదిద్దనుంది. గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే ఆక్వా అసిస్టెంట్లు సాగుదారులకు అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తుండగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సీడ్, ఫీడ్, సాంకేతిక సలహాలను కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమస్యలను పరిష్కరించే ‘అథారిటీ’.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ రూ.3.86 నుంచి ఏకంగా రూ.1.50కి తగ్గించిన ముఖ్యమంత్రి జగన్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. మత్స్యకార భరోసా, మరపడవల నిర్వాహకులకు డీజిల్ రాయితీ, చేపల వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు లాంటి పలు కార్యక్రమాలను తొలి ఏడాదిలోనే పూర్తి చేశారు. లాక్డౌన్ సమయంలో ఆక్వా వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేశారు. గత ప్రభుత్వాలేవీ ఆక్వా వ్యాపారుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధైర్యం చేయకపోవడంతో విపత్తులోనూ అదే రీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆక్వా రైతులు ఈ అంశాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తేవడంతో రొయ్యలకు ధరలను నిర్ణయించి అధికారుల పర్యవేక్షణలో తక్షణమే కొనుగోళ్లు జరిగేలా చేశారు. వ్యాపారులు, ఎగుమతిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారి సమస్యలనూ పరిష్కరించి విదేశాలకు ఆక్వా ఎగుమతులు జరిగేలా చర్యలు చేపట్టారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్ధ లేకపోవడంతో సీఎం జగన్ పలుదఫాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా చర్చలు జరిపారు. ఆక్వా రంగం ఇంకా అసంఘటితంగా ఉన్నందున సమస్యలు తలెత్తినట్లు గుర్తించి చట్టం తేవాలని నిర్ణయించారు. ఈ రంగానికి చెందిన వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని బిల్లు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు, మంత్రి మోపిదేవి తీర ప్రాంతాల జిల్లాల్లో పర్యటించి అన్ని రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. వ్యాపారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. సీడ్, ఫీడ్‌పై నియంత్రణ లేకపోవడంతో.. ► రాష్ట్రంలో మత్స్యసాగుకు అనువైన వనరులు సమృద్ధిగా ఉన్నా వ్యవస్థీకృత విధానాలు లేకపోవడంతో ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆక్వా సాగులో కీలకమైన సీడ్, ఫీడ్ నాణ్యతపై ప్రభుత్వ నియంత్రణ లోపించింది. మంచి రేటు వచ్చే వరకు రైతులు కోల్డ్‌స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. ► చేపలకు పెద్దగా విదేశీ ఎగుమతులు లేకపోవడంతో పూర్తిగా ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కరోనా విపత్తుతో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా మూతపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పరిస్థితిని నివారించి రాష్ట్రంలో చేపల వినియోగం, మార్కెట్ల విస్తరణకు చర్యలు చేపట్టడం అవసరం. ► రొయ్యల సాగుపై సరైన నియంత్రణ లేనందున నాణ్యతా లోపంతో విదేశీ ఎగుమతులు తరచూ తిరస్కరణకు గురవుతున్నాయి. సరైన ధర కూడా లభించడం లేదు. ► ఇవన్నీ పరిశీలించిన అనంతరం ఆక్వా సాగు, అనుబంధ రంగాల్లో సుíస్థిరత సాధించేందుకు ఒక చట్టం అవసరమని ప్రభుత్వం భావించింది. అథారిటీ విధులు ఇవీ ► రాష్ట్రంలో 2019–20లో 41.75 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి జరిగింది. 26.50 లక్షల మందికి ఈ రంగం ద్వారా ఉపాధి లభిస్తోంది. శాస్త్రీయ విధానాల ద్వారా దిగుబడిని మరింత పెంచేందుకు చట్టం అవకాశాలను కల్పిస్తుంది. ► ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ ఇతర ఇన్పుట్స్ సకాలంలో సరసమైన ధరలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందనుంది. ► విపత్కర పరిస్ధితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఆక్వా ఉత్పత్తుల నిల్వకు మౌలిక సదుపాయాలు కల్పించడం, కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవడం. ఆక్వా రైతులు, అనుబంధ పరిశ్రమలకు సులభంగా లైసెన్సులు మంజూరు. ► ఆక్వా ల్యాబ్‌ల ద్వారా సీడ్, ఫీడ్ నాణ్యతా పరీక్షలు చేపట్టి వ్యాధి నివారణ చర్యలపై రైతులకు సూచనలు చేస్తుంది. సాగులో మంచి యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా విదేశీ ఎగుమతులు, ఇతర రాష్ట్రాలకు మత్స్య సంపద చేరవేసేలా చర్యలు. ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం. అథారిటీ అధికారాలు ► రాష్ట్రంలో చేపల పెంపకం సామర్ధ్యం, సమస్యలు తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించడం ► ఆక్వా సాగుకు సంబంధించి అన్ని అంశాలపై చట్టాలు తయారు చేయడం, నియమ నిబంధనలు, విధి విధానాలు రూపొందించి అమలు చేయడం. జిల్లా, డివిజన్, ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ► ప్రాధికార సంస్ధ విధుల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు పొందడం ► లాబ్‌ల అనుసంధాన వ్యవస్థ, ఆక్వా టెక్నీషియన్లు, సంస్థలను ఏర్పాటు చేయడం ► దాణా, చేపలు, రొయ్య పిల్లలపై నాణ్యతా ప్రమాణాలను పాటించడం కోసం వ్యాపార సంస్ధలు, హేచరీస్ల్లో తనిఖీలు, ఆడిట్లు చేయడం. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన సంస్ధలపై పెనాల్టీలు విధించడం. ► అనధికారిక చేపల పెంపకం, ప్రాసెసింగ్, పంపిణీ, అమ్మకం యూనిట్లను క్రమబద్ధీకరించడం ► వ్యవసాయ ఉత్పాదక భూములను చేపల పెంపకం చెరువులుగా మార్పిడి చేయడాన్ని నియంత్రించడం ► స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరిపి చేపలు, సముద్ర ఉత్పత్తులకు రేటు నిర్ణయించడం ► శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్థికి చర్యలు తీసుకోవడం ► సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి రైతులకు అందించడం. ► చేపపిల్లలు, దాణా, ఆక్వా ఉత్పత్తులు, ఔషధాలు, ఇతర సేవలపై చార్జీలను విధించి వసూలు చేయడం ► విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు ఒప్పందాలు చేపట్టడటం. విపత్తులోనూ విదేశాలకు విక్రయాలు కేంద్రం లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుంచి ఆక్వా సాగుదారులను ఆదుకునేందుకు విదేశాలకు రొయ్యలు ఎగుమతి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విదేశీ ఎగుమతులకు సానుకూల పరిస్థితులు కల్పించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 8 జిల్లాల్లో 74,101 మెట్రిక్ టన్నులకుపైగా రొయ్యలను సేకరించగా విదేశాలకు 70,578 టన్నులు ఎగుమతి అయ్యాయి. విపత్తుకు ముందు సేకరించిన 96,536 టన్నులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లలో సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ వాటా 36.11 శాతంగా ఉంది. ఏటా ఈ వృద్ధి రేటు పెరుగుతూనే ఉంది. 2019–20లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రాష్ట్రానికి రూ.17,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. సేవలన్నీ ఒకే చట్రంలోకి.. ► రాష్ట్రంలో 30 శాతం మత్స్య ఉత్పత్తుల వినియోగం జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం. మంచి పోషక పదార్ధాలు కలిగిన ఆక్వా ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం. ► సరళీకృత విధానాలను అనుసరిస్తూ ఆక్వా రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం. ఆక్వా అభివృద్ధికి అవసరమైన అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రైతులు, అనుబంధ సంస్ధలకు మేలైన సేవలు అందించడం. ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటెలిజెన్స్ సేవలు అందించడం. ► జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో సాంకేతిక విజ్ఞానం బదిలీని ప్రోత్సహించడం. రైతులకు అండగా ఆక్వా అసిస్టెంట్లు ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న721 మంది మత్స్యశాఖ సహాయకులు (ఆక్వా అసిస్టెంట్లు) ఆక్వా రైతులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రానున్న రోజుల్లో ఆక్వా రైతులకు సీడ్, ఫీడ్, ఇతర సాంకేతిక సలహాలను కూడా అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 794 ఆక్వా అసిస్టెంట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయగా 721 పోస్టులు భర్తీ అయ్యాయి. వీరంతా ప్రస్తుతం సచివాలయాల్లో అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఆక్వా రంగం బలోపేతానికే చట్టం ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడానికే చట్టాన్ని తెచ్చాం. మాది స్నేహపూర్వక ప్రభుత్వం.అయితే రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో వెనుకాడం. ఆక్వా అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు రానున్న రోజుల్లో మంచి ఫలితాలనిస్తాయి. చట్టం పరిధిలోకి సముద్ర ఉత్పత్తుల వేటను కొనసాగించే మరపడవల నిర్వాహకులను కూడా చేర్చాం. ఫిష్‌ల్యాండ్ సెంటర్లు, హార్బర్ల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నాం. మత్స్యకారుల అభ్యున్నతికి పలు పథకాలు అందుబాటులోకి తెచ్చాం. – మోపిదేవి వెంకట రమణారావు (మత్స్య శాఖ మంత్రి) అన్ని వర్గాలకు ఉపయోగం... విపత్తుల సమయంలో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అధికారులు నిర్ణయించిన రేటుకు ఎగుమతిదారులు పంటను కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోకుండా ఉంటారు. ఎగుమతిదారులు, హేచరీస్, కోల్డు స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకుల సమస్యల పరిష్కారం, అభివృద్దికి చర్యలు తీసుకునేలా చట్టంలో విధివిధానాలున్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో నాణ్యమైన రొయ్యల్ని ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యం ఆర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. – మోహన్‌రాజు (రొయ్య రైతుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు) రెండు వారాల్లో విధివిధానాలు... ఆక్వా చట్టంపై రెండు వారాల్లో విధి విధానాలు రూపొందిస్తాం. బిల్లు తయారు చేసే సమయంలో అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. సాగుకు సంబంధించిన అన్నివర్గాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాం. సీడ్, ఫీడ్‌లో నాణ్యత పాటించని సంస్ధలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాగు లైసెన్సులను రెండు వారాల్లోనే మంజూరు చేస్తాం. విపత్తుల సమయంలో రైతులు నష్టపోకుండా ఆక్వా వ్యాపారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు జరిపి రేటు నిర్ణయిస్తాం. ప్రభుత్వం సీడ్, ఫీడ్‌ను అభివృద్ది చేసి రైతులకు సరఫరా చేస్తుంది. – కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్ -
విశాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం మారనున్న క్రమంలో నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ విజయసాయిరెడ్డి స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతున్నందున తదనుగుణంగా తాగునీటి వనరులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధానితో పాటు పారిశ్రామిక రంగం కూడా పెరిగే అవకాశం ఉన్నందున జీవీఎంసీ పరిధిలో 30 శాతం జనాభా పెరుగుతారని అంచనా వేశారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాబోయే అవసరాల కోసం తాగునీటిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికను తయారుచేయాలని ఎంపీ తెలిపారు. (సీఎం జగన్‌పై విజయ సాయిరెడ్డి ప్రశంసలు) ఇక ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ ఇన్ చార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనలో సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకి తగ్గట్టుగా విశాఖ తాగునీటిపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని, పరిపాలనా రాజధాని వస్తే విశాఖలో జనాభా పెరుగుతాయని పేర్కొన్నారు. (ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్) గోదావరి నుంచి విశాఖ వరకు పైపులైన్ సమీక్షలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్నం తాగునీటి అవసరాలని తీర్చాలని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ‘గోదావరి నుంచి విశాఖ వరకు పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించి తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్ట్ చేపట్టాలని సీఎం సూచించారు. 2050 వరకు తాగునీటి అవసరాలని ఈ ప్రాజెక్ట్ ద్వారా తీర్చే అవకాశాలున్నాయి. త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ చేపడితే విశాఖ నగరానికి తాగునీటి సమస్య తీరుతుంది’ అని పేర్కొన్నారు. -
‘రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాం’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పంటల ధరలు పడిపోకుండా కొనుగోలు చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి వెయ్యి కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నామని చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ‘రైతులు పండించిన పండ్లు, కూరగాయలు విక్రయించేందుకు కల్ గుడి యాప్ అవిష్కరించాం. ఆంధ్ర గ్రీన్స్ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారుల అందజేయనున్నాం. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఆంధ్ర గ్రీన్స్ ఆన్ లైన్ వ్యవస్థ ఉపయోగ పడుతుంది. ఇప్పటికే స్విగ్గీ, జొమోటో ద్వారా పండ్లు కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 8 లక్షల 11 వేల ఫ్రూట్స్ కిట్స్ ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలుకు 4 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా కేంద్రాలు రైతులకు నాలెజ్డ్ సెంటర్లు గా ఉపయోగపడతాయి.కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా వేరే చోట నుంచి కార్యకపాలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే గుంటూరు మార్కెట్ యార్డ్ ప్రారంభిస్తాం’ అని మంత్రి కన్నబాబు తెలిపారు. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు) -
40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు : కన్నబాబు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే విత్తన సరఫరా ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతు భరోసా డబ్బు వేశామని తెలిపారు. ఆ డబ్బు రైతుకు చేరగానే విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ‘నేటి నుంచి వేరుశనగ విత్తన కాయలు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నాం. వరి, ఇతర పంటల విత్తనాల సరఫరా కూడా జరుగుతోంది. నాణ్యతను అధిక ప్రాధాన్యం ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో విత్తనాలు అందిస్తున్నాం. గతంలోలా భారీ క్యూ లైన్లు లేకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి రైతుకు అందిస్తున్నాం. దీని వల్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా అరికడుతున్నాం. ఎక్కడైనా అవినీతి జరిగిందని మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విత్తన పంపిణీ కోసం జిల్లాకో ప్రత్యేక అధికారిని కూడా పంపాము. రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అవి రాగానే గ్రామ స్థాయి నుంచి రైతు సేవలు ప్రారంభం అవుతాయి. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆర్బీకేల ప్రారంభం ద్వారా రైతు సేవలో పునరంకితమవుతాం’ అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. -
కూలీలకు కరోనా పరీక్షలు
సాక్షి, అమరావతి: ఏపీకి తరలివచ్చే వలస కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు వైద్య సహాయం అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైన అనంతరం మంత్రి కన్నబాబు, సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్‌లతో కలిసి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. ► రాష్ట్రానికి చెందిన వలస కూలీలను రప్పించేందుకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే చెప్పారు. వేరే రాష్ట్రాల వారిని కూడా ఏపీ నుంచి సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న యాత్రికులు, విద్యార్థులను కూడా ప్రభుత్వమే ఖర్చులు భరించి రప్పించేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తెస్తాం. ► రాత్రివేళ పంట ఉత్పత్తులను వాహనాల్లో మార్కెట్‌కు తరలించే రైతులను పోలీసులు అడ్డుకోకుండా అనుమతించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించినట్టు మంత్రి కన్నబాబు చెప్పారు. ► అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పెద్ద ఎత్తున మార్కెట్‌కు వస్తున్న మామిడి, బత్తాయిని కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. వ్యవసాయ అధికారులు, సిబ్బందికి కోవిడ్ విధుల నుంచి మినహాయింపు కల్పించటంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ► మంత్రుల బృందం సమావేశంలో హోంశాఖ మంత్రి సుచరిత, సీఎంవో సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.జవహర్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్, అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, వ్యవసాయ,సహకార శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, హోంశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. మద్యం షాక్ కొడుతుందని ముందే చెప్పాం కరోనా విపత్కర పరిస్థితి తొలగే వరకైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఆపాలని మంత్రి కన్నబాబు సూచించారు. ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబు పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల ఏర్పాటుకు కారకుడని విమర్శించారు. షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచుతామని వైఎస్ జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పారన్నారు. -
పీపీఈ కిట్లు, మాస్కులకు కొరత లేదు
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులకు ఎలాంటి కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. విశాఖ జిల్లాలో కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన చర్యలపై ప్రభుత్వాధికారులు, వైద్యులు, ప్రత్యేక కమిటీల సభ్యులతో శుక్రవారం విశాఖలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లతోపాటు ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ► సమీక్ష అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైద్యులకు, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులందరికీ తగిన రక్షణ ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ► కొరత ఉన్నట్లుగా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ► రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ సరుకులు అందిస్తున్నట్లు చెప్పారు. ► రైతులకు మద్దతు ధరలు అందేలా పంటల కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దళారులు, ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు రైతుల నుంచి పంటలను కొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ► అన్యాయం జరిగితే రైతులు 1902, 1907 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ► అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామన్నారు. ► కాగా, లాక్‌డౌన్‌తో విశాఖ జిల్లాలో ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా తీసుకుంటున్న సహాయ చర్యల్లో పారిశ్రామికవేత్తలను మరింత భాగస్వాములను చేయడానికి ప్రయత్నిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ► రాష్ట్రంలో ఎక్కువగా విశాఖ జిల్లాలోనే పరిశ్రమలు ఉన్నాయని, కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇప్పటికే పలు పరిశ్రమల యాజమాన్యాలు విరాళాలు ఇచ్చాయన్నారు. ► ఆయా పరిశ్రమల కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) నిధులను ప్రజలకు సహాయం చేయడానికి వినియోగించాలని కోరారు. ► ఇందుకోసం ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో త్వరలోనే సమావేశం నిర్వహించాలని యోచిస్తున్నామన్నారు. -
రైతులకు న్యాయం జరిగేలా చర్యలు..
-
ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: పంటలకు గిట్టుబాటు ధరలపై సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు ఈ విషయంపై సమీక్షించారు. కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడిన కన్నబాబు, మంగళవారం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపిన ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏ రైతు ఇబ్బంది పడటానికి వీల్లేదని.. మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూడాలి అధికారులకు కన్నబాబు దిశానిర్దేశం చేశారు. ఇది చదవండి: రైతు చెంతకే వెళ్లి ధాన్యం కొనుగోలు -
ప్రభుత్వం తరుపున కంపెనీలను ఆదుకుంటాం
-
అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారించాలి
-
లాక్డౌన్ ను కఠినంగా...
-
చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు
-
డబ్బులు పంచినా...మద్యం సరఫరా చేసినా...
-
విచక్షణాధికారం ఉందని సభను రద్దు చేస్తారా?
సాక్షి, అమరావతి : అభివృద్ధిని అడ్డుకోవడమే లక్క్ష్యంగా చేసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని మంత్రి కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రాంతాల అభివృద్ధి గురించి కనీసం ఆలోచన చేయకుండా తాను, తన ఎదుగుదల మాత్రమే ఆయనకు ముఖ్యమని విమర్శించారు. సాంప్రదాయాలను తుంగలో తొక్కడం, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడంలో బాబుని మించిన వ్యక్తి మరొకరు లేరని మండిపడ్డారు. రూల్ 71పై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా కన్నబాబు మాట్లాడారు. అవసరం లేకపోయినా రూల్ 71 కోసం రోజంతా మండలిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. కనీస నిబంధనలు పాటించకుండా విచక్షణాధికారాన్ని మండలి చైర్మన్ ఎలా ఉపయోగిస్తారని మంత్రి ప్రశ్నించారు. సభలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘చైర్మన్‌ను ప్రభావితం చేయడానికే చంద్రబాబు గ్యాలరీలో కూర్చున్నారు. రూల్స్ ఒప్పుకోకపోయినా విక్షణాధికారాన్ని ఉపయోగిస్తున్నానని చైర్మన్ చెప్పారు. నిబంధనలు పాటించకుండా ఎలా ఉపయోగిస్తారు?. నిబంధనలు పాటించడమే చైర్మన్ బాధ్యత. విచక్షణాధికారం ఉందని సభను కూడా రద్దు చేస్తారా?. మండలి లోపల సెల్‌ఫోన్‌తో నారా లోకేష్ వీడియోలు తీశారు. ఇది సరైనది కాదు. గ్యాలరీలో చంద్రబాబు, సభలో లోకేష్, వీరిద్దరికి తోడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన యనమల రామకృష్ణుడు అందరూ కలిసి వ్యవస్థను భ్రష్టుపట్టించారు. (మండలి చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం లేదు) మంత్రులు తాగి వచ్చారని యనమల అంటుంటే.. మరో టీడీపీ బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీడియా చర్చల్లో శాసనసభ్యులను కించపరిచే విధంగా మాట్లాడిని వ్యక్తులపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలి. వంగవీటి రంగా వ్యవహారంలోనే చంద్రబాబు రౌడీయిజాన్ని చూశాం. అమరావతిలో పోటీచేసిన రెండు చోట్లా టీడీపీ ఓడిపోయింది. మంగళగిరిలో లోకేష్ కూడా ఓటమిచెందారు. ఇంతకంటే రెఫరెండం ఏం ఉంటుంది. శాసనమండలిని కించపరచడం మా ఉద్దేశం కాదు. పెద్దల సభకు లోకేష్ లాంటి సభ్యలు దొడ్డిదాని వస్తుంటారు. చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని, కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యారు.’ అని అన్నారు. -
సుజనా... తొందరపడకు..
సాక్షి, విజయవాడ : రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిపై వ్యవసాయ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఒక ఎంపీగా ఉంటూ దేశం వదిలి వెళ్లిపోతానని అనడం సిగ్గు చేటన్నారు. రాజధాని పేరుతో ఎన్ని వేల కోట్లు కుంభకోణం చేశారో సుజనా మాటలను చూస్తే అర్థమవుతుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో సుజనా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. (చదవండి : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు) దోపిడి చేసిన వాళ్లు చాలా మంది దేశం వదిలి వెళ్లారని.. సుజనా కూడా అలాగే పారిపోదామనుకుంటున్నారని విమర్శించారు. సుజనా చౌదరి తొందరపడవద్దని..త్వరలోనే ఆయన దోపిడీ అంతా బయటపెడతామన్నారు. కేసులకు భయపడే సుజనా బీజేపీలోకి వెళ్లాడని ఆరోపించారు. విశాఖ రాజధాని కావాలని ఎవరు అడిగారని చంద్రబాబు అంటూన్నారు.. మరి అమరావతి రాజధాని కావాలని ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. చంద్రబాబు మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. పవన్.. ఒక నాయకుడేనా? బినామీల కోసం చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర చేస్తున్నారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. చంద్రబాబు చెప్పు చేతుల్లో నడిచే పవన్ కల్యాణ్ ఒక నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలన్నారు. అమరావతిలోని బినామీలను బయటకు తీసి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను జైల్లో వేయాలని ఎమ్మెల్యే ద్వారంపుడి డిమాండ్ చేశారు. -
చంద్రబాబుపై చర్య తీసుకోవాల్సిందే
-
చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, అమరావతి: మార్షల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడితే కుదరని.. సభా సంప్రదాయాలు అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించడం సరికాదని తప్పుబట్టారు. సాధారణ ఉద్యోగులపై అనుచిత భాష వాడారని, ఉద్యోగుల పట్ల ఎంత చులకన భావంతో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని పేర్కొన్నారు. తన కేటాయించిన గేటులోంచి కాకుండా మరో గేటులోంచి ఎందుకు రావాల్సి వచ్చిందని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మార్షల్ అడ్డుకుంటే ఉదయం 9.15 గంటలకు సభలోకి ఎలా రాగలిగారు అని నిలదీశారు. తండ్రితో పాటు నారా లోక్‌శ్ కూడా మార్షల్స్‌పై నోరు పారేసుకోవడం దారుణమన్నారు. కుమారుడికి అదేనా నేర్పించేది అని కన్నబాబు ప్రశ్నించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని, దీనిపై స్పీకర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరాశ, నిస్పృశతో చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏమాత్రం గౌరవప్రదం కాదన్నారు. ఉద్యోగులను పట్టుకుని ఎంత తప్పుడు మాటలు మాట్లాడతారా? అంటూ నిలదీశారు. చంద్రబాబుపై చర్య తీసుకోవాల్సిందే మార్షల్స్‌ను బాస్టర్డ్ అని దూషించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యే జోగి రమేశ్ డిమాండ్ చేశారు. మానసిక రోగి ప్రవర్తించినట్టుగా చంద్రబాబు తీరు ఉందని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల అనుభవం, 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు.. మార్షల్స్‌ను బాస్టర్డ్ అనడం దారుణమన్నారు. మార్షల్స్ ఏమైనా తీవ్రవాదులా, పాకిస్తాన్లో పుట్టి ఇక్కడికి వచ్చారా? అంటూ ప్రశ్నించారు. అనుక్షణం భద్రత కల్పించే మార్షల్స్‌ను గొంతు పట్టుకుని పీక పిసికేసేలా దురుసుగా ప్రవర్తిస్తారా అంటూ దుయ్యబట్టారు. నిండు సభలో చంద్రబాబు తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్తలు.. నీ సంగతి తేలుస్తా.. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి: పేర్ని నాని -
పవన్.. ఎప్పుడైనా చిరంజీవి గురించి మాట్లాడావా?
సాక్షి, కాకినాడ: అధికారం చేపట్టిన కేవలం ఐదు నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసిన తమ ప్రభుత్వాన్ని చూసి ఒర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వం ఇసుకను దాచిపెట్టి కృతిమ కొరత సృష్టించినట్లు అవగహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలు వల్ల ఇసుక తీయడం సాధ్యం కాలేదని, రాష్ట్రంలో కొంత ఇసుక కొరత ఉందన్న విషయం వాస్తవమని మంత్రి వివరించారు. ఇసుక సమస్యను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ గుంటనక్కలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బయటకు వస్తారని విమర్శలు గుప్పించారు. ఇసుక సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. కన్నబాబు మంగళవారం కాకినాడలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖలో లాంగ్ మార్చ్ పేరుతో పవన్ షో చేశారు. ఒక్క అడుగు కూడా నడవకుండా వాహనంపై ఊరేగారు. పక్కన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి పెట్టుకుని మాట్లాడారు. ఇసుక దోపిడి చేసిన వారికి పక్కన పెట్టుకుని మాట్లాడారు. అక్కడున్న నాయకులంతా గతంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించిన వారే. అయ్యన్నపాత్రుడు కుమారుడు చిరంజీవిపై ఎన్నో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ గతంలో ఏరోజైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గళం ఎత్తారా?. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి కోసం గతంలో ‘ఛలో కాకినాడ’ చేపట్టినప్పుడు పవన్ కల్యాణ్ వారికి ఎందుకు వారికి మద్దతు ఇవ్వలేదు?. ఇసుక సమస్య మరో 15 రోజుల్లో పరిష్కారం కానుంది. ఈ విషయం తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలే అయింది. కానీ నెల తిరగక ముందు నుంచే చంద్రబాబు, ఆయన పార్టనర్ పవన్ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలిపెట్టినా డైలాగ్‌లు వదలడం లేదు. అదే విధంగా డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సీఎం జగన్‌ని చూసి సంస్కారం నేర్చుకోండి.. ఈ తరహా డ్రామాలు చంద్రబాబు డైరెక్షన్లో చేస్తే, వెంటనే వాటిని విడిచి పెట్టండి. ఎందుకంటే సినిమాల్లో మాదిరిగా నటిస్తూ డైలాగ్‌లు కొడితే ఓట్లు పడవు. జగన్‌ని చూసి సంస్కారం నేర్చుకోవాలి. 151 స్థానాలు, 22 ఎంపీ సీట్లు గెల్చినా ఎంత ఒదిగి ఉంటున్నారో చూడండి. ప్రభుత్వంలో తప్పులు ఉంటే చెప్పండి. పవన్ కల్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివానంటున్నారు. వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండి. వెంటనే ప్రయత్నిస్తాము. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తేనే ఈ విధంగా వ్యవహరిస్తే ఎలా?. జనసేనకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటీవల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభినందిస్తూ పాలాభిషేకం చేశారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుందని పవన్ అన్నారు. మరి అక్రమ కట్టడాలు కూల్చవద్దా?. నిజం చెప్పాలంటే చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కూలుస్తారని పవన్ భయం. రెండున్నర కిలోమీటర్ల నడకను లాంగ్ మార్చ్‌గా చెబితే, 3648 కి.మీ నడిచిన వైఎస్ జగన్ యాత్రను ఏమనాలి?. టీడీపీ అభ్యర్థిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నం., పవన్ స్థిరంగా నిలబడి ఎక్కడైనా కనీసం ఒక్క నిమిషం అయినా మాట్లాడగలుగుతాడా? ఆయన ఊపులు, అరుపులకు ఎవరూ భయపడరు. ఎన్నికలకు రెండు రోజుల ముందు కరప వచ్చిన పవన్.. నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. నన్ను తరిమి తరిమి కొట్టమని పిలుపునిచ్చారు. కానీ నన్ను 10 వేల ఓట్లతో ప్రజలు గెలిపించారు. మరి ఎవరిని రెండు చోట్ల ప్రజలు తరిమి తరిమి కొట్టారో అందరికి తెలుసు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 44 వేల ఓట్లు సాధించాను. ఆ తర్వాత 2019లో జగన్ గారు టికెట్ ఇచ్చి గెలిపించారు. మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా నేను ఎప్పటికీ తీర్చుకోలేని రుణగ్రస్తుడిని చేశారు. నేను మంత్రిగా తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా చిరంజీవిని గుర్తు చేశాను. ఆయనే తనకు రాజకీయ జీవితం ఇచ్చారని చెప్పాను. నేనూ, పవన్ కళ్యాణ్ ఒకేసారి 2008లో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ ఏనాడైనా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవి గురించి మాట్లాడారా? గాజువాకలో పవన్‌ను గెలిపించేందుకు, స్వయంగా టీడీపీ అభ్యర్థిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నించలేదా?. అదే విధంగా మంగళగిరిలో లోకేష్‌కు పోటీగా పవన్ కల్యాణ్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ రాజకీయాలన్నీ ఎవరికీ తెలియవా?’ అని అన్నారు. -
చంద్రబాబు పుత్రుడిది దీక్ష, దత్తపుత్రుడిది లాంగ్‌మార్చ్
సాక్షి, అమరావతి: వరదలు, వర్షాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడితే దానిని సాకుగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లేందుకు ఉబలాటపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వారిద్దరూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వారు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఇసుకను రాజకీయం చేస్తూ చంద్రబాబు పుత్రుడు లోకేశ్ దీక్ష చేస్తే.. ఇపుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో లాంగ్‌మార్చ్ చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందనే విషయం అందరికీ తెలుసన్నారు. వరదలు తగ్గాక ఇసుక తవ్వకం దిశగా అధికారులు పని చేస్తున్నారని చెప్పారు. జనసేనతో గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సీపీఐ, సీపీఎం ఇపుడు ఆ పార్టీతో కలిసి ప్రయాణించలేమని ప్రకటించాయని, తమ ఉద్యమాలేవో తాము చేసుకుంటామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు, పవన్ చాలా కాలంగా కలిసే లాంగ్ మార్చ్ చేస్తున్నారని, వీరి ఆత్మీయానుబంధం ఏమిటో రాష్ట్ర ప్రజలు ఐదేళ్లుగా చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక తవ్వకాల్లో ఇష్టానుసారం దోపిడీ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం అమలులోకి వచ్చే లోపు వరదలు వచ్చాయన్నారు. 267 రీచ్‌లలో అనుమతి ఇస్తే కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక తీయగలుగుతున్నారని మంత్రులు వివరించారు. వరదలు తగ్గగానే పుష్కలంగా ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. బాబు హయాంలో జరిగిన ఇసుక దోపిడీ, అరాచకాలపై పవన్ ఏనాడూ ప్రశ్నించలేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు చెందాల్సిన రూ.900 కోట్లను పక్కదారి పట్టించినపుడు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేస్తే పవన్ మద్దతు కూడా ప్రకటించలేదన్నారు. పవన్‌ది లాంగ్ మార్చ్ కాదని.. రాంగ్æ మార్చ్ అన్నారు. బాబు అజెండాను పవన్ అమలు చేస్తున్నారని, టీడీపీ నేతలు లాంగ్ మార్చ్‌కు హాజరవ్వాలనుకోవడాన్ని బట్టే వారి బంధం బయట పడిందన్నారు. -
భూసార పరికరాలను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ, ఉద్యానశాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. పురుగు మందులు, ఎరువుల సరఫరా, దుకాణాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షా పరికరాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం, వ్యవసాయం, విత్తనాల పంపిణి, గ్రామాల్లో ఏర్పాటు కానున్న వర్కషాపులు గురించి సీఎం ఆరా తీశారు. -
సీఎంగా జగన్ చరిత్రలో నిలుస్తారు
సాక్షి, నెల్లూరు: రైతు భరోసా పథకంతో తమకు ధీమా వచ్చిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఏటా పంట పెట్టుబడికి నిధులిచ్చేలా వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన వేదికపై పలువురు రైతులు, గ్రామ సచివాలయ ఉద్యోగి వారి మనోగతాన్ని వెల్లడించారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం రైతులకు అండగా ఉంటూ అన్ని విధాలా సాయం చేస్తున్న సీఎం జగన్‌కు రైతు కుటుంబాలతో పాటు ప్రజలంతా రుణపడి ఉంటారు. సీఎం రైతు పక్షపాతి. ఆయన రావడంతో వరుణుడు కూడా స్పందించడం శుభ సూచికం. ఐదారేళ్లుగా రైతులు పంటలు పండక, వర్షాలు పడక ఎన్నో కష్టాలు అనుభవించారు. ఈ రోజు జిల్లాలోని కండలేరు, సోమశిల జలాశయాలు నిండుగా కళకళలాడుతున్నాయి. సీఎం ముందుగానే ఆలోచించి చెరువులను నింపాలని ఆదేశించారు. అధికారులు కూడా స్పందించారు. – చాంద్‌బాషా, మాజీ సర్పంచ్, రైతు, చెరుకుమూడి, మనుబోలు మండలం రైతు సేవకుడిగా పనిచేస్తా నిరుద్యోగిగా ఉన్న నేను గ్రామ సచివాలయ పరీక్ష రాసి జిల్లాలో మూడవ ర్యాంకుతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించా. నేను రైతు కుటుంబంలో జన్మించాను. పేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద చదువులు ఎలా చదవాలనే సమయంలో దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. దీంతో ఎమ్మెస్సీ, బీఈడీ చదవగలిగా. జగన్ సీఎం అయిన 100 రోజుల్లోనే 1.35 లక్షల మందికిపైగా శాశ్వత ఉద్యోగాలిచ్చారు. ఇలా ఉద్యోగం పొందిన నేను ఇప్పుడు రైతులందరికీ రైతు సేవకుడిగా పనిచేస్తా. – సుబ్రహ్మణ్యం, సచివాలయ ఉద్యోగి, పాపిరెడ్డిపాళెం, టీపీగూడూరు మండలం రైతుల కళ్లలో ఆనందం పంట వేసుకునే సమయంలో రైతుభరోసా పథకాన్ని అమలు చేయడంతో రైతుల కళ్లలో ఆనందం కనపడుతోంది. సీఎం జగన్ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా. – రమణారెడ్డి, రైతు, మహ్మదాపురం, పొదలకూరు మండలం జగన్ పాలనలో ప్రాజెక్టులు నిండాయి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నెల్లూరు జిల్లాలో బీసీని మంత్రిని చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మాజీ సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిండలేదు. వైఎస్ జగన్ సీఎం కాగానే అన్ని ప్రాజెక్టులు నిండాయి. సోమశిలలో 10 ఏళ్ల తర్వాత ఈ ఏడాదే 75 టీఎంసీలు నిల్వచేసిన ఘనత మన ప్రభుత్వానిది. – అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి రైతు భరోసా సువర్ణ అధ్యాయం రైతు భరోసా పథకం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని రైతుల కోసం జగన్ చేశారు. వ్యవసాయ మిషన్ సమావేశంలో కొందరి విజ్ఞప్తి మేరకు సీఎం జగన్ రైతులకు ఆర్థిక సాయాన్ని మరి కొంత పెంచి ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఐదునిమిషాల్లోనే తీసుకున్నారు. ఈ సాయం పెంచడం వల్ల ఆర్థిక భారం పెరుగుతున్నా కూడా సీఎం వెనుకాడలేదు. – కన్నబాబు, మంత్రి ప్రతి రైతుకు పథకం అందించడమే లక్ష్యం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం రైతులను మోసగించినట్టు కాకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు పథకం అందించాలన్న లక్ష్యంతో జగన్ పని చేస్తున్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎలా తగ్గించుకోవాలా అని చూసేది. ప్రస్తుత ప్రభుత్వం అర్హులకు ఎలా పథకాన్ని అందించాలా అని చూస్తోంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి భూ యజమానుల హక్కుల రక్షణకు చట్టం రాష్ట్రంలో భూ యజమానుల హక్కుల పరిరక్షణకు, భూ యజమానికి మనోధైర్యం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. రైతుకు తెలియకుండానే ఎవరైనా భూమిని అమ్మితే ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారం ఆ రైతుకు పరిహారం చెల్లిస్తుంది. – బోస్, ఉప ముఖ్యమంత్రి -
చివరి మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి : గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీలో గల్లంతైన వారి సంఖ్య పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సంఘటన స్థలంలో చర్యలను బుధవారం సాయంత్రం మంత్రులు కురసాల కన్నబాబు, విశ్వరూప్ పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం మేరకు లాంచీలో ప్రయాణించిన 73 మందిని గుర్తించినట్లు వారిలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. 34 మృతదేహాలను గుర్తించారని తెలిపారు. కాగా ఈ రోజు మరో ఐదుగురు కనిపించడం లేదని వారి బంధువులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారని అన్నారు. దీనిని బట్టి చూస్తే బోటులో ఇంకా 18 మంది గల్లంతైన వారి ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. లాంచీ మునిగిన ప్రాంతంలో గోదావరి ప్రమాదకరంగా ఉందని, బురద ఉండడంతో సైడ్ సోనార్ స్కానర్ పంపించినా లాంచీ చిత్రాలు లభించలేదని అన్నారు. కచ్చులూరు నుంచి సముద్ర మొగ వరకు మిగిలిన 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని, ఘటన జరిగిన ప్రాంతం నుంచి లాంచీ ఎలా తీయలనే దానిపై నిపుణులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దీని కోసం ముంబై, జార్ఖండ్, విశాఖ, కాకినాడ నుంచి పలు బృందాలు లాంచీ వెలికితీసేందుకు పనిచేస్తున్నాయన్నారు. లాంచీలో ఏ ఒక్క మృతదేహం లభించినా తమకు ముఖ్యమేనని, చివరి మృతదేహం దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సంఘటన ప్రాంతంలో కొనసాగుతున్న చర్యలపై ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. -
‘కాపుల కోసం ఆయన ఒక పని కూడా చేయలేదు’
సాక్షి, విజయవాడ: గత టీడీపీ ప్రభుత్వం కాపులకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి..ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చుచేయలేదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఆదివారం కాపు ఛైర్మన్ జక్కంపూడి రాజా ప్రమాణా స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ..ఢిల్లీ పర్యటనలు తప్ప..చంద్రబాబు కాపుల కోసం ఒక పని కూడా చేయలేదన్నారు. కాపులు ఓసినో, బీసీనో చెప్పలేని విధంగా కాపులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ కాపులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించడం సీఎం జగన్ ఖచ్చితమైన నిర్ణయాలకు నిదర్శమని తెలిపారు.రాజకీయ,సామాజిక,విద్య,ఆర్థిక పరంగా కాపులను ఎదిగేలా చేస్తే కాపులు అన్ని రంగాల్లోనూ ముందుంటారని తెలిపారు. ఐక్యంగా ఉంటే అన్నీ సాధించుకోగలుగుతామన్నారు. చంద్రబాబులా కాపులను మోసం చేయం: అబంటి కాపు కార్పొరేషన్‌కు పదివేల కోట్లు ఖర్చు చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అబంటి రాంబాబు అన్నారు. అన్నికార్పొరేషన్ల కన్నా కాపు కార్పొరేషన్ ఆర్థిక పరిపుష్టి సంతరించుకుందన్నారు. కాపులను బీసీల్లోకి చేరుస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. దీంతో కాపులకు తీరని నష్టం కలిగిందన్నారు. మంజునాధ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో .. కమిషన్ సభ్యుల రిపోర్టు కేంద్రానికి ఇచ్చేలా చంద్రబాబు చేశారని మండిపడ్డారు. రెండు రిపోర్టులపై కేంద్రం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదన్నారు. చంద్రబాబు కాపులను నమ్మించి మోసం చేశారని..మా ప్రభుత్వం కాపులను మోసం చేయదన్నారు. కాపు సంక్షేమానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. -
రైతు సంక్షేమమే మా ధ్యేయం: కన్నబాబు
సాక్షి, కడప : రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుధ్ఘాటించారు వ్యవసామశాఖ మంత్రి కన్నబాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లాలోని జమ్మలమడుగులో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జయంతి రోజున రైతు దినోత్సవం వేడుకలు జరపబోతున్నామని, రైతు మిషన్‌లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయంపై చేసిన అశ్రద్ధ వల్లే ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడిందని మండిపడ్డారు. దీనికి పరిష్కారంగా ఒరిస్సా, బరోడా, కర్నాటక నుంచి విత్తనాలను తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం దురదృష్టకరమని, తీవ్రంగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. కడపలో 78.5 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపిన మంత్రి కన్నబాబు చీని రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందిస్తామని పేర్కొన్నారు. -
కాకినాడలో కన్నబాబు ఎన్నికల ప్రచారం
-
కాంగ్రెస్‌ను కౌగిలించుకుంటే తప్పనిపించడం లేదా?
కాకినాడ: కాంగ్రెస్‌తో జతకట్టి మరోసారి ఎన్టీఆర్ ఆత్మను వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. ఆనాడు అధికారం కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇవాళ మరోసారి ఎన్టీఆర్ ఆత్మను వెన్నుపోటు పొడిచారన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. ‘కేసీఆర్‌ను రాచ మర్యాద లతో రాష్ట్రానికి ఆహ్వానించింది మీరు కాదా?, అమరావతి శంకుస్థాపన కు కేసీఆర్ ను తీసుకువచ్చి సన్మానించారు. కాంగ్రెస్ కూటమిలో టీడీపీ కలిసినప్పుడు.. రాష్ట్రంలో ముఖ్య పార్టీ అయిన వైఎస్సార్సీపీని మరొకరు ఆహ్వానిస్తే తప్పెలా అవుతుంది. మీరు కాంగ్రెస్‌ను కౌగిలించుకుంటే తప్పనిపించడం లేదా. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను కాపీ కొట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. నిన్నటి వరకూ చంద్రన్న బాట.. నేడు జగనన్న బాటలో చంద్రబాబు. చంద్రబాబు సర్కారు ఫించన్లు రూ.2వేల పెంపుకు జగనన్న కానుక అని, రైతుల పెట్టుబడి సాయానికి జగనన్న భరోసా అని పేర్లు పెట్టాలి. సొంతంగా ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టలేని దిగజారుడు నైజం చంద్రబాబుది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో పసలేదని చెప్పిన చంద్రబాబు.. ఎన్ఐఎ దర్యాప్తును చూసి ఎందుకు వణికిపోతున్నారు. జగన్‌పై దాడి జరిగిన ప్రదేశం కేంద్రం పరిధిలోనిదని చెప్పిన బాబు.. ఎన్ఐఎ విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని కన్నబాబు ప్రశ్నించారు. -
బాబు తప్పిదాలపై నోరు పెగలదేం పవన్?
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం అపహాస్యం, ఆర్థిక నేరస్తులకు అండ, రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌కు ప్రస్తుత రాజకీయ పరిణామాలు కనిపించడం లేదా? లేక స్పష్టత లోపించిందా? లేక మరెవరి డైరెక్షన్ కోసమైనా ఎదురుచూస్తున్నావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. - ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా? - ప్రత్యేక హోదాపై జగన్ పోరాటం చేస్తూ యువభేరీలు నిర్వహిస్తుంటే వాటిల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ పెడతామని చంద్రబాబు హెచ్చరిస్తుంటే పవన్ నోరు విప్పాల్సిన అవసరం ఉందా? లేదా? పవన్ ప్రశ్నించలేదంటే వారిద్దరి మధ్య అనుబంధం ఉన్నట్టే కదా? - జనసేన పుట్టిన తరువాత సొంతంగా పోటీకి దిగాలి. లేదా ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటే సీట్ల సర్దుబాటు జరగాలి. కానీ పవన్ సొంతంగా అభ్యర్థులను పెట్టలేదు. టీడీపీకి మద్దతిచ్చారు. - రాజధాని పేరిట 19 గ్రామాల్లో భూసేకరణ చేస్తుంటే బేతపూడి గ్రామంలో మల్లెపూల తోటల్ని సాగుచేస్తున్న రైతులు తమ భూములు ఇవ్వబోమని ఆందోళన చేశారు. జేసీబీలు, బుల్డోజర్లతో భూములు అక్రమంగా దున్నుతున్న విధానాన్ని చూసిన పవన్.. సీఎంని ప్రశ్నిస్తానంటూ మల్లెపూల తోటల రైతులకు వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి భూసేకరణ మంచిదని ప్రకటన ఇచ్చిన మాట నిజం కాదా? అది టీడీపీకి అందించిన స్నేహహస్తం కాదా? - సర్పంచ్‌లను పక్కకునెట్టి జన్మభూమి కమిటీలు వేసి పాలన చేస్తుంటే ప్రశ్నించావా? జన్మభూమి కమిటీల అక్రమాలపై ఏనాడైనా మాట్లాడావా? ఇసుక దగ్గర నుంచి నీరు–చెట్టులో మట్టి అమ్మకాలు, బెల్టుషాపులు, ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోచుకుంటున్నా, పోలవరంపై కాగ్ ఇచ్చిన రిపోర్టుపై, అమరావతి భూసేకరణ, విశాఖ భారీ భూ కుంభకోణంపై ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా? - చంద్రబాబుతో స్నేహబంధం సజావుగా ఉండాలనే ఉద్దేశంతోనే పవన్ రాజకీయం చేస్తున్నది నిజంకాదా?. - స్థానిక సంస్థలు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు సర్కార్ తూట్లు పొడుస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్‌కు లేదా? - మీకు ఇల్లు, స్థలం ఇచ్చిన లింగమనేని వారు దౌత్య నడుపుతూ ఉంటే వాళ్లు ఏమి చెబితే అదే చేస్తావా? - బాబే నిన్ను (పవన్) అడ్డంపెట్టి నాటకాలు ఆడుతున్నట్టు జనం అనుకుంటున్నారు. అది నిజమా? కాదా? - పన్నులు ఎగ్గొట్టిన వాళ్లపై ఐటీ దాడులు చేస్తుంటే నీవు నోరు మెదపకపోవడానికి కారణం నీ వాళ్లకు ఉపయోగపడుతుందనా? - సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వనని సీఎం అంటుంటే అది మంచిది కాదని ఎందుకనలేదు? - రూ.6వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సుజనాకి ఈడీ ఇస్తే ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్పలేదు? - గత నెల 25న వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే దానిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్నడైనా ముఖ్యమంత్రిని డిమాండ్ చేశావా? దాన్ని కోడికత్తి డ్రామా అన్నప్పుడైనా ప్రజాజీవితంలోకి వస్తున్న పవన్ కళ్యాణ్ ఖండించాల్సిన పని లేదా? చంద్రబాబుకు కోపం వస్తుందని మాట్లాడడం లేదా? - జనసేనను పిల్ల టీడీపీగా భావించాలా? బాబు రుణమాఫీ చేయకపోయినా, కాపుల్ని బీసీల్లో చేర్చకపోయినా పవన్ మాట్లాడలేదన్నది నిజంకాదా? - నాలుగేళ్లు చంద్రబాబును ఎందుకు పొగిడారో, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో పవన్ చెప్పాలి? ఇద్దరి మధ్య అవినాబంధం లేకుండానే చంద్రబాబు పంపిన ప్రత్యేక హెలికాఫ్టర్లు, విమానాలలో ఎందుకు తిరిగారు? రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడకపోవడం అంటే బాబుకు ఆమోద ముద్ర వేస్తున్నట్టు కాదా? - టీడీపీ అన్యాయాలు, అక్రమాలపై నాలుగున్నర ఏళ్లుగా వైఎస్సార్సీపీ పోరాడుతుంటే సమర్థించాల్సింది పోయి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తావా? - రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రిని వదిలి ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం ఎందుకో ఆత్మవిమర్శ చేసుకో అంటూ పవన్‌కు ఉమ్మారెడ్డి సూచించారు. జనసేన టిక్కెట్లు బాబే ఇస్తారేమో! రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య మిత్రుడని, వచ్చే ఎన్నికల్లో జనసేన టిక్కెట్లను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు రూ. 6,700 కోట్లను దోచుకున్న సుజనా చౌదరి లాంటి వాళ్ల మోసాన్ని ఖండించడానికి కూడా పవన్ కళ్యాణ్‌కు నోరు రావడం లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ దోపిడీకి సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోకి సీబీఐని ఎందుకు రానివ్వనని చంద్రబాబు చెప్పారో, సీబీఐ, ఈడీ అంటే ఎందుకు కంగారు పడుతున్నారో సుజానా చౌదరి కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమవుతోందన్నారు. 126 డొల్ల కంపెనీలతో ప్రజల సొమ్మును టీడీపీ ఎంపీ దోపిడీ చేసినట్టు అంకెలు, సంఖ్యలతో సహా బయటకు వస్తుంటే దాన్ని పట్టించుకోకుండా.. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్‌ను పవన్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం ఏరులై పారుతున్నా, మైనింగ్ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోకుండా రాజకీయం చేస్తావా పవన్ అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకే ఆ పార్టీతో విడిపోయినట్టుగా నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పవన్‌పై మండిపడ్డారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని రూ. 20 లక్షలకే లింగమనేని రమేష్ జనసేన అధినేత పవన్‌కు ఎందుకిచ్చారో ప్రజలు అర్థంచేసుకున్నారని, పవన్ నిర్మాత ఎవరో తేలిపోయిందని వివరించారు. ఇవన్నీ మరిచి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లే.. స్కూటర్‌పై తిరిగిన తాను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
బలి గోరుతున్న ‘బాబు’ ప్రచారార్భాటం
కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచారార్భాటం అమాయకులకు ప్రా ణాంతకంగా మారుతోందని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పశువుల్లంక వద్ద శనివారం పడవ బోల్తాపడి ఆరుగురు చిన్నారులు, ఓ మహిళ గల్లంతైన ఘటనకు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. గల్లంతైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల కిందట రాజమహేంద్రవరంలో పుష్కరాల ప్రారంభం సందర్భంగా దుర్ఘటన జరిగిన రోజే పశువుల్లంక ప్రమాదం జరిగిందని అన్నా రు. అప్పుడు కూడా వీఐపీ ఘాట్‌ను వదిలి పుష్కరఘాట్ వద్ద చంద్రబాబు ప్రచారం కోసం చేసిన ఆర్భాటం వల్లే 29 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆదివారం కన్నబాబు స్థానిక డి కన్వెన్షన్ హాలులో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కర దుర్ఘటనపై వేసిన సోమయాజులు కమిషన్ నివేదిక మూడేళ్ళు గడిచినా బయటకు రాలేదని, వీడియో ఫుటేజ్‌లు కూడా కనిపించకుండా పోయాయని విమర్శించారు. ఆ నాటి ఘటనపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా చంద్రబాబుపైనే తీసుకోవాలని, అందువల్లే ఆ వ్యవహారానికి ము గింపు పలికారని ఆరోపించారు. పైగా ఆ నాటి ఘటనలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి సహాయం అందించలేకపోయారని విమర్శించారు. కాగా రెండవ శనివారం సెలవు అయినా వనం–మనం కార్యక్రమం కోసం వెళ్లిన విద్యార్థులు నాటుపడవలో వరద గోదావరి దాటుతున్న క్రమంలోనే పశువుల్లంక ప్రమాదం జరిగిందన్నారు. ప్రచారం కోసం చంద్రబాబు సర్కారు చేస్తోన్న దిగజారుడు వ్యవహారాల వల్ల ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఎన్ని విషాదాలు జరిగినా కానరాని కదలిక కొద్దిరోజుల క్రితం దేవీపట్నం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారని కన్నబాబు అన్నారు. అంతకు ముందు కృష్ణానదిలో బోటు మునక ప్రమాదం జరిగిందన్నారు. ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. పశువుల్లంక వద్ద వంతెన పిల్లర్‌ను ఢీకొని ప్రమాదం జరగడాన్ని ప్రస్తావిస్తూ.. వైఎస్ హయాంలో ప్రారంభించిన వంతెన పనులను ఆ తరువాతి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత ఘటనకు కారణమన్నారు. కమీషన్ల కోసం పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి పథకాలను ఆగమేఘాలపై చేపట్టిన టీడీపీ సర్కార్ ఈ వంతెన విషయంలో కమీషన్లు రావని నిర్లక్ష్యం చేసిం దా.. అని నిలదీశారు. విశాఖలో కేవలం ఐదు గంటల్లో సొరంగమార్గం ఏర్పాటు చేసేంతగా సాంకేతికత అందుబాటులో ఉండగా ఇలాం టి పనుల విషయంలో వెనుకడుగు వేయడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా అని ప్ర శ్నించారు. ఎండాకాలంలో మంచినీటి ప్ర ణాళిక, వర్షాకాలంలో రోగాలు, వ్యాధులు ప్ర బలకుండా కార్యాచరణ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, కార్పొరేషన్ ఫ్లో్లర్లీడర్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే సభలోనే దాడులా?
కాకినాడ: బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అధికార పార్టీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషణలకు దిగడం ఆ పార్టీ నేతల నైజాన్ని బయటపెడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. జెడ్పీ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. గురువారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పట్ల రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహరించిన తీరు అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యే పట్ల అత్యంత దూకుడుగా వ్యవహరించి నీళ్ల బాటిళ్లతో విసిరికొట్టడం చూస్తుంటే జిల్లాలో టీడీపీ నేతల్లో నెలకొన్న అసహనానికి అద్దం పడుతుందన్నారు. తాము ఎన్ని తప్పులు చేసినా ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. ఇంతకాలం తమ అవినీతికి అడ్డువచ్చే అధికారులపై దాడులకు దిగిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కూడా దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. టీడీపీ నేతల తీరు మారకపోతే తాము కూడా తగిన రీతిలో స్పందించాల్సి ఉంటుందని కన్నబాబు హెచ్చరించారు. -
టీడీపీకి షాక్: కన్నబాబు రాజీనామా
రాంబిల్లి(యలమంచిలి): మాజీ ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు), ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ యు. సుకుమారవర్మలు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర, రూరల్ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్‌బాబులకు పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. తమ అనుచరులతో కలసి శనివారం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. తాజాగా కన్నబాబురాజు వైఎస్సార్సీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధిష్టానం పలు దఫాలు ఆయనతో చర్చలు జరిపి పార్టీని వీడవద్దని ఒత్తిడి తెచ్చింది. అయితే తాను వైఎస్సార్సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నానని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తెలిపారు. -
మే 5న వైఎస్సార్సీపీలో చేరుతున్నా: టీడీపీ నేత
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మే 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు టీడీపీ నేత, యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ప్రకటించారు. జగన్ నాయకత్వంలో ఓ సామాన్య కార్యకర్తగా పనిచేసేందుకు బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరంలో సోమవారం నిర్వహించనున్న వంచన వ్యతిరేక దీక్ష ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం ఆయన సభాస్థలి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని యత్నాలు చేసినా వైఎస్సార్సీపీలోకి వెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు. యు.వి.రమణ మూర్తిరాజు (కన్నబాబురాజు) 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. -
‘ఆనం’ సాక్షిగా తమ్ముళ్ల గలాటా
ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఇన్చార్జి కన్నబాబు వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. సోమశిల ఉత్తరకాలువ ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను పరిశీలించేందుకు బుధవారం ఆనం ఆత్మకూరు చెరువు వద్దకు వచ్చారు. తొలుత పూజలు చేసి నీటి సరఫరాపై సోమశిల ప్రాజెక్ట్ ఈఈ, సాగునీటి శాఖ డీఈలతో మాట్లాడారు. ఈ క్రమంలో కన్నబాబు వర్గానికి చెందిన చెరువు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు మాదాల మస్తాన్‌నాయుడు మాట్లాడేందుకు ప్రయత్నించగా సాగునీటి సంఘం అధ్యక్షుడు ఎక్కడంటూ ఆనం ప్రశ్నించారు. అదే సమయంలో ఆనంకు అనుకూలంగా ఉన్న రైతులు ‘గతంలో 2వ నంబర్ తూముకు నీళ్లు వచ్చేవని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని’ ఉపాధ్యక్షుడిని నిలదీశారు. ‘మీ వల్లే నీళ్లు రావడం లేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, ఆ తూము కింద 350 ఎకరాలు సేద్యం నీరు లేక ఆపామని’ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరుకు చెందిన ఆనం అనుకూలుడు, రైతు చిట్టమూరు వెంకురెడ్డి ‘మీ వంటి వాళ్లు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడిగా పనికి రారని, మీ అధ్యక్షుడు నీళ్ల సమస్య అడుగుతారనే ఇక్కడికి రాలేదని, ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని’ చెప్పారు. స్పందించిన నీటి సంఘం ఉపాధ్యక్షుడు ‘మేము రాజీనామా చేస్తాం. మీకిష్టమొచ్చిన వారిని పెట్టుకోండి’ అని రుసరసలాడారు. అధికారులు మాత్రం 75 క్యూసెక్కుల నీటిని వదిలామని అంటున్నారే తప్ప ఒక్క చుక్క కూడా చెరువుకు నీరు రావడం లేదని, పొలాలు బీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తనిఖీ చేయాలి ఆనం మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కాలువపై తనిఖీలు చేయాలని, ఆత్మకూరు చెరువుకు కచ్చితంగా 60 క్యూసెక్కులు ఇవ్వాల్సిందేన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ, ఏఈ, సోమశిల ప్రాజెక్ట్ డీఈ, కమిషనర్ శ్రీనివాసరావు, డీఎస్పీ రామాంజనేయులరెడ్డి, టీడీపీ నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య, ఐవీ రమణారెడ్డి, చల్లా రవి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు పాల్గొన్నారు. ఒకేలా ఉన్నామని చెబుతున్నా.. ఆనం వర్గీయులు తమ వారిపై విమర్శలు చేయడంపై కన్నబాబు వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినుంచి పార్టీలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారితీసింది. గతంలో ఈ రెండు వర్గాల నాయకులు వాదనలకు దిగిన సందర్భాలున్నాయి. పైకి తామంతా ఒకేలా ఉన్నామని చెబుతున్నా అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. వీరి వల్ల పార్టీ పరువుపోతోందని కొందరు జిల్లా పార్టీ నేతలకు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు వీరి వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లింది. కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆనం వర్గీయులు కన్నబాబు వర్గ నేతలపై విరుచుకుపడ్డారని ప్రచారం జరుగుతోంది. -
ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం
-
'టీడీపీకి కచ్చితంగా బుద్ధిచెబుతారు'
సాక్షి, కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అధికార పార్టీ నాయకులు వేల రూపాయలు పంచారని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోవున్నా ఇతర జిల్లాల టీడీపీ నేతలు కాకినాడలోనే మకాం వేశారని తెలిపారు. వార్డులవారీగా ప్రలోభాలకు గురిచేశారని అన్నారు. టీడీపీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైఎస్సార్ సీపీదే విజయమన్నారు. ప్రభుత్వానికి కాకినాడ ప్రజలు కచ్చితంగా బుద్ధిచెబుతారన్నారు. కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ తీరును మేధావులు కూడా అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఆయన అన్నారు. కాగా, కాకినాడ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 1న వెలువడనున్నాయి. -
కాపులు ఏమైనా టెర్రరిస్టులా?
హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పోలీసులను మోహరించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. జిల్లాలో పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు చంద్రబాబు సర్కారును నిలదీశారు. కాపుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వం చిత్రీకరిస్తున్నదని మండిపడ్డారు. పోలీసులు ఏ చట్టపరిధిలో వ్యవహరిస్తున్నారో డీజీపీ చెప్పాలని నిలదీశారు. చట్టాలను ప్రభుత్వం గౌరవించదా? అని ప్రశ్నించారు. కాపులను అవమానిస్తున్న చంద్రబాబు సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదని కన్నబాబు హెచ్చరించారు. కాపులు ఏమైనా టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు. పోలవరంపై కాకి లెక్కలు! పోలవరం ప్రాజెక్టుపై పెరిగిన అంచనా వ్యయం వివరాలు తమకు అందలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, పెరిగిన అంచనా వ్యయం వివరాలను కేంద్రానికి ఎందుకు పంపలేదని కన్నబాబు నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు చెప్తున్న కాకిలెక్కలను కేంద్రం గుర్తిస్తుందని భయమా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటున్నదని మంత్రి దేవినేని ఉమ అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కోర్టులో పిటిషన్లు వేశాయని, మరి పిటిషన్లు మీరు వేయించారా? అని కన్నబాబు ప్రశ్నించారు. -
కాపులు ఏమైనా టెర్రరిస్టులా?
-
ప్రత్యేక హోదా కోసం రేపు కొవ్వొత్తుల ప్రదర్శన
కాకినాడ రూరల్ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26 సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. మంగళవారం సాయంత్ర రమణయ్యపేటలోని తన నివాస గృహంలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలంతా కేంద్రాన్ని ఒప్పించే విధంగా పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యువతీ, యువకులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు మద్దతు తెలిపి కొవ్వొత్తుల ప్రదర్శనలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు వైఎస్సార్ బ్రిడ్జి వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీగా భానుగుడి జంక్ష¯ŒSకు చేరుకొని ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రంపచోడవరం : గురువారం కాకినాడ లో జరగనున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు అనంతబాబు పిలుపునిచ్చారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
కాకినాడ రూరల్ : క్రీస్తు మార్గం అనుసరణీయమని వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. ఏపీఎస్పీ చర్చిలో ఆదివారం క్రిస్మస్ సంబరాల్లో ఆయన మాట్లాడారు. ఇది క్రైస్తవులు మాత్రమే కాదని, ప్రపంచ మానవాళి జరుపుకొనే గొప్ప పర్యదినంగా భావించాలన్నారు. క్రీస్తు సందేశం ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. శాంతాక్లాజ్ పిల్లలకు బహుమతులు ఇవ్వడం, బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలుత కేక్‌ను కట్ చేసి, క్యాండిల్స్‌ను వెలిగించి క్రిస్మస్కు స్వాగతం పలికారు. చర్చివారు ఏర్పాటు చేసిన దుప్పట్లు, చీరలు, పంచెలను కన్నబాబు, ఏపీఎస్పీ కమాండెంట్ జె.కోటేశ్వరరావు 350 మందికి అందజేశారు. వ్యవసాయశాఖ డీడీ పి.ఆదరణకుమార్, సంఘం అధ్యక్షులు పి.దేవకుమార్, ఉపాధ్యక్షులు జా¯ŒSసన్, కార్యదర్శి ఐఎస్పీ కుమార్, కోశాధికారి బి.శ్రీధర్ తదితరులు మాట్లాడారు. మాజీ సర్పంచ్‌లు బొమ్మిడి శ్రీనివాస్, కోమలి సత్యనారాయణ, శెట్టి బాబూరావు, భాషా, కురసాల సత్యనారాయణ, జంగా గగారి¯ŒSతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇదేనా బాబూ! ఆరోగ్యాంధ్రప్రదేశ్!!
ఏజెన్సీ మరణాల ప్రస్తావనే లేదు ప్రచార ఆర్భాటంగా ‘దోమలపై దండయాత్ర’ సీఎం సభ తీరుపై కన్నబాబు మండిపాటు కాకినాడ : ఏజెన్సీ ప్రాంతంలో మరణాలు, అక్కడి ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎటువంటి ప్రస్తావనా లేకుండా, ఆరోగ్యాంధ్రప్రదేశ్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాకినాడలో సభ నిర్వహించిన తీరు హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. స్థానిక రమణయ్యపేటలోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దోమలపై దండయాత్ర – ఆరోగ్యాంధ్రప్రదేశ్’ పేరిట ఏర్పాౖటెన సభలో చంద్రబాబు వ్యవహరించిన తీరును ఆయన తప్పు పట్టారు. జిల్లా ఏజెన్సీలో వ్యాధులతో గిరిజనులు మృతి చెందుతున్నారని, విలీన మండలాల్లో కాళ్లవాపులతో 10 మంది మరణించి, వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారని, ఈ విషయాలు ముఖ్యమంత్రి దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. రాజవొమ్మంగి ప్రాంతంలో పౌష్టికాహార లోపంతో 10 మంది చనిపోయారని, జిల్లాలో 4 వేల మలేరియా కేసులు నమోదయ్యాయని.. వీటిల్లో ఏ ఒక్క అంశాన్నీ సీఎం ఏమాత్రం ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. ఏజెన్సీలో అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవడంలో సీఎం ఘోరంగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. ఇదేం దండయాత్ర? దోమలపై దండయాత్ర పేరుతో డ్వాక్రా మహిళలు, విద్యార్థులతో ర్యాలీలు చేయించడం వల్ల ప్రయోజనం లేదని కన్నబాబు విమర్శించారు. ‘‘నిజంగా దోమలను నియంత్రించాలన్న చిత్తశుద్ధి ఉంటే జిల్లా కేంద్రంలో ఫాగింగ్ మెషీన్లు ఉన్నాయా? అవి పని చేస్తున్నాయా? ఏ షెడ్యూల్ ప్రకారం ఎక్కడ ఫాగింగ్ యంత్రాలు పని చేశాయో చెప్పగలరా?’’ అని నిలదీశారు. నిల్వ నీటివద్ద లార్వాను చంపేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. చెత్త తొలగించడంలో ఘోరంగా విఫలమయ్యారని, కాకినాడ నగరానికి కనీసం డంపింగ్ యార్డును కూడా సమకూర్చలేకపోయారని ధ్వజమెత్తారు. కోనసీమ అభివృద్ధిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా కన్నబాబు మండిపడ్డారు. ‘కోనసీమ రైతులు దాదాపు 50 వేల ఎకరాల్లో గతంలో పంట విరామం ప్రకటించిన విషయం చంద్రబాబుకు తెలియదా?’ అని ప్రశ్నించారు. జిల్లాకు సంబంధించిన ఇలాంటి ప్రధాన సమస్యలు, గిరిజన ప్రాంతాల ఇబ్బందుల గురించి కనీస ప్రస్తావన కూడా లేకుండా.. కేవలం ప్రచార ఆర్భాటంతో ముఖ్యమంత్రి వ్యవహరించారని విమర్శించారు. -
చంద్రబాబు అవినీతిని ప్రజలకు వివరించిన కన్నబాబు
-
రాజమండ్రిలో యుద్ధ వాతావరణం..!
ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ చూసి.. ఈ రాష్ట్రంలో టీడీపీకి ఓటేసి తప్పు చేశామని జనం అనుకుంటున్నారని ఆయన అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో యుద్ధ వాతావారణం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముద్రగడకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. టీడీపీ మేనిఫెస్టోలో కాపులను బీసీలలో చేరుస్తామని స్పష్టంగా చెప్పారని, ఏడాదిన్నర పాటు కాలయాపన చేయకుండా ముందే మంజునాథ కమిటీని నియమించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. ఈవాల్టి వరకు నిబంధనలు, షెడ్యూలు రూపొందించలేదని, ఇప్పుడు ఆదరాబాదరాగా నివేదిక ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని, దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వానికి ఈ అంశంపై చిత్తశుద్ధి లేదని తెలుస్తోందని ఆయన చెప్పారు. నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఐదు రోజుల తర్వాత ముద్రగడ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని తెలిసినా.. ఇలా చేయడం తగునా అని ప్రశ్నించారు. తానూ 20 ఏళ్లు మీడియాలో పనిచేశానని, కానీ ఎప్పుడూ మీడియాపై ఇంతటి నిర్బంధం లేదని చెప్పారు. ముద్రగడ కుమారుడిని, కోడలిని లాఠీలతో కొట్టడం స్పష్టంగా వీడియోలలో కనిపిస్తోందని, ఇదంతా వ్యూహం ప్రకారం చేస్తున్నారని అన్నారు. ముద్రగడను కనీసం ఒక మనిషిగా కూడా చూడటం లేదని.. ప్రభుత్వం చాలా తప్పు చేస్తోందని కన్నబాబు తెలిపారు. ముద్రగడ కుమారుడిని చూస్తుంటే.. మీ అరాచక పాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక.. దానిపై ఒక నాయకుడు ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమాన్ని అణిచేస్తున్నారని విమర్శించారు. కొన్ని కులాలను ఎస్సీలలో చేరుస్తామన్నారు, రేపు వారిని కూడా ఇలాగే అణిచేస్తారా అని ప్రశ్నించారు. గతంలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు దీన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని చెప్పారని, కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదని అన్నారు. మీ ఇష్టానుసారంగా కొందరు వ్యక్తులను, ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నారని, ఏ ఆధారాలు లేకుండా ఎలా అభాండాలు వేస్తారని నిలదీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తాము ప్రోత్సహించబోమని.. అయితే ఇప్పుడు అరెస్టు చేసినవాళ్ల ప్రమేయం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ముద్రగడను చూసేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ఆయన కోసం వచ్చినవారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారని, అసలు రాజమండ్రికే వెళ్లనివ్వకుండా.. యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదని అన్నారు. ముద్రగడ ఆరోగ్యం ఏమైనా తేడా వచ్చి ఇబ్బంది అయితే కొత్త సమస్యలు మీ పీకకు చుట్టుకుంటాయని హెచ్చరించారు. ఎవరైనా దీనిపై మాట్లాడితే అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలను రంగంలోకి దించి తిట్టిస్తున్నారని, కులవ్యవస్థనే కొనసాగిస్తాం అన్నట్లుగా ఈ ప్రభుత్వ పాలన ఉందని మండిపడ్డారు. కులాల వారీగా మీరు చేస్తున్న కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించకుండా, రాజకీయ సమస్యలా భావిస్తే ఎప్పటికీ పరిష్కారం కాదని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆయన చెప్పారు. -
'యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు'
తూర్పుగోదావరి జిల్లాలో ఏదో జరిగిపోతోందని అంటూ.. ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకుడు కన్నబాబు మండిపడ్డారు. సీనియర్ నేతలను రిసీవ్ చేసుకోడానికి రాజమండ్రి ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చిన తమను రోడ్డుమీదే ఆపేశారని, ఈ నిర్బంధంతో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకిలా ప్రవర్తిస్తోందో కూడా అంతుబట్టడం లేదని, అందరినీ ఎయిర్ పోర్టు వద్ద రోడ్డుమీదే ఆపేశారని చెప్పారు. దాసరి నారాయణరావును కూడా హోటల్లోనే హౌస్ అరెస్టు చేశారని, ఇదంతా చూస్తుంటే ఇక్కడి వారిని, ఈ కమ్యూనిటీని ఇతర ప్రాంతాల వారికి దోషుల్లా చూపించే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. దారి పొడవునా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు, వేలాదిగా పోలీసులను మోహరించారని అన్నారు. తాము నక్సలైట్లు నాయకులను కిడ్నాప్ చేయడం నుంచి కాల్దరి కాల్పుల దాకా చాలా పెద్ద ఘటనలు చూశామని, చివరకు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఇంత తీవ్ర పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ముద్రగడను పరామర్శించడానికి వచ్చిన నాయకులను కూడా నిర్బంధించారని.. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా రోడ్డు మీదే నిలబెట్టేస్తున్నారని చెప్పారు. బాహ్యప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. నిర్బంధంతో శాంతి భద్రతలను కాపాడగలమని ప్రభుత్వం అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉంటుందని అనుకోవడం లేదని, సాధారణంగా నిర్బంధం వల్ల ప్రజల్లో ఎప్పుడూ వ్యతిరేకత పెరుగుతుందని తెలిపారు. శాంతియుత ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లాను కల్లోలిత ప్రాంతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కమ్యూనిటీని బోనులో నిలబెట్టాలని చూస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. పద్మనాభం నవంబర్లోనే కాపు ఐక్యగర్జన తేదీని ప్రకటించారని.. ఆ సభకు ఎంతమంది వస్తారో అంచనా వేయలేని ప్రభుత్వం.. ప్రజలు ఇప్పుడు ఆగ్రహానికి గురై రోడ్ల మీదకు వస్తే ఆపగలుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికి మాత్రం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని, మధ్యాహ్న భోజనాల సమయంలో కంచాల మీద గరిటెలతో కొడుతున్నారని, వాళ్లు ఆగ్రహానికి గురైతే ఈ సర్కారు ఏం చేయగలదని నిలదీశారు. -
వైఎస్ఆర్సీపీకి కట్టుబడి పనిచేస్తాను
-
మాజీ ఎమ్మెల్యే కన్నబాబుకు నివాళి
అనకాపల్లి : మాజీ ఎమ్మెల్యే శ్రీ రాజా వత్సవాయి వెంకట పతిరాజు బహుదూర్ (కన్నబాబు) ఆదివారం అనకాపల్లిలోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని పట్టణ ప్రముఖులు కడిమిశెట్టి రాంజీ, డాక్టర్ నారాయణరావు, బుద్ద నాగజగదీశ్వరావు, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ ఫాన్స్ వెంకటేశ్వరావు, సత్తిబాబు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయ్యన్న సంతాపం : అనకాపల్లి మాజీ ఎమ్మెల్యేల రాజా కన్నబాబు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కన్నబాబు విజయం సాధించి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. -
బిజీ బిజీ ...కలెక్టర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కూల్ కలెక్టర్‌ని, మీరు కూడా కూల్‌గా పనిచేయండి. అయితే విధుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించను. ఏది అత్యవసరమో దానిని వెంటనే పరిష్కరించండి. ప్రజలు మనపై నమ్మకంతో సుదూర ప్రాంతాల నుంచి అవస్థలు పడి ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వారిని ఆదరించండి. సమస్యను శ్రద్ధతో వినండి. వెంటనే పరిష్కారం అవుతుందంటే దానిపై దృష్టి పెట్టండి. మిగిలిన సమస్యలకు సమయం తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయండి. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్.. కార్యక్రమాలపై ప్రజలకు నమ్మకాన్ని కల్గించేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలి.’ అని అధికారులకు సూచించారు. ఆ తర్వాత ప్రజాదర్బార్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సుమారు రెండున్నర గంటల పాటు జనం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డితో చర్చించారు. సాయంత్రం తాగునీటి సమస్యపైనా, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపైనా అధికారులతో సమీక్షించారు. తొలి రోజు ఇలా ఉదయం 10.15 - కలెక్టరే ట్లో వినాయకునికి పూజలు 10.25 - జిల్లా కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ 10.35 - మీడియా, ప్రతికా ప్రతినిధులతో పరిచయ కార్యక్రమం 10.45 - అధికారులతో పరిచయ కార్యక్రమం. 11.15 - కలెక్టర్ చాంబర్లో జేసీ, ఇతర అధికారులతో సమీక్ష 11.30 నుంచి 2 గంటల వరకు- సునయనలో ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరణ సాయంత్రం 3 నుంచి 4.15 వరకు - స్వాతంత్య్ర వేడుకలపై అధికారులతో సమీక్ష 4.30 నుంచి 5.45 వరకు - తాగునీటి సమస్యపై అధికారులతో సమీక్ష సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు ఎవరైనా నేరుగా నన్ను కలవవొచ్చు. స్లిప్‌లు పంపి బయట నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా సిబ్బంది తలుపు తీసి లోపలికి పంపుతారు. ఈ విధానాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తాను. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలి. అధికారులు ప్రజల్ని తమ చుట్టూ తిప్పుకోరాదు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే వాటిని వెంటనే సూటిగా చెప్పాలి. సమస్యలతో వచ్చే వారిని ఆదరించాలి. జిల్లా అధికారైనా, మండల అధికారైనా సమన్వయంతో పనిచేయాలి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణే తన తొలి ప్రాధాన్యత అని కొత్త కలెక్టర్ విజయమోహన్ వెల్లడించారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు, తాగునీటి సరఫరాకు కూడా ప్రాధాన్యత ఇస్తానన్నారు. సోమవారం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సాక్షి’తో మాట్లాడారు. జిల్లా ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా అగ్రగామిగా ఉండేలా కృషి చేస్తామని వెల్లడించారు. సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఆదరించేలా.. అధికారుల పనితీరులో మార్పులు తీసుకొస్తానని అన్నారు. సాక్షి : కలెక్టర్‌గా మీ ప్రాధాన్యతలు ఏమిటి? కలెక్టర్ : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది. అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తాం. జిల్లాలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అయితే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి? వాటి సర్వే నంబర్లు ఏమిటి? విస్తీర్ణం ఎంత? వాటి అనుకూలతలు ఏంటి? అన్నది ఓ స్పెషల్ డ్రైవ్ ద్వారా గుర్తించి నివేదిక సిద్ధం చేస్తాం. ప్రణాళిక తయారు చేయడం వరకే కాకుండా కచ్చితంగా దాన్ని అమలు చేయడానికి కలెక్టర్‌గా మొదటి ప్రాధాన్యత ఇస్తాను. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహకారంతో జిల్లాలో మంచి ప్రాజెక్టులు వచ్చేందుకు కృషి చేస్తాను. సాక్షి : జిల్లాలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది? కలెక్టర్ : నిజమే. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఒకటి. 6 నెలల్లో ఈ పథకాన్ని జిల్లాలో 100 శాతం అమలు చేసి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను మొదటి స్థానంలో నిలపేందుకు కృషి చేస్తాను. మరో వారంలో దీనికి సమగ్ర ప్రణాళిక ను సిద్ధం చేస్తాం. తాగునీటి సమస్య ఉన్న మండలాలను గుర్తించి, ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై ఒక మ్యాప్ తయారు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. సాక్షి: పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యానికి ఎలాంటి చర్యలు చేపడతారు? కలెక్టర్ : వైద్యానికి వెన్నుదైన పీహెచ్‌సీల్లో రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడతాను. 104, 108 పనితీరు, పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయా? నిపుణులైన వైద్యులు పనిచేస్తున్నారా? అన్న అంశాలను పరిశీలించి వాటిని గాడిన పెడతాను. ముఖ్యంగా పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. ప్రజలకు వైద్యసేవలు అందించాలి అన్న చైతన్యం వారిలో రావాలి. మొదట వారి బాధ్యతలు గుర్తెరిగేలా వివరిస్తాం. అప్పటికీ వినకపోతే.. చర్యలు ఉంటాయి. ఐసీడీఎస్‌ల పనితీరు ఎలా ఉందో పరిశీలిస్తాను. సాక్షి : సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారా? కలెక్టర్ : ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, వాటి ప్రయోజనాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే విషయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. దీని కోసం ప్రతి రోజూ 18 గంటలు పనిచేస్తాను. అలాగే జిల్లాలో వారంలో ఐదు రోజులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాను. పీహెచ్‌సీలు, హాస్టళ్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి పెడతాను. హాస్టళ్లలో పిల్లలతో కలిసి భోజనం చేస్తాను. దీంతో ఆ విభాగాల్లో పనితీరు మెరుగవుతుంది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తాగునీటి, మరుగుదొడ్లు తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. సాక్షి : పాఠశాలల పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తారా? కలెక్టర్ : ప్రాథమిక విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను. గతంలోని కార్యక్రమాలను కొనసాగించి, మరికొన్ని కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సామ్యర్థాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తాను. ఇక గతంలో ఉన్న కలెక్టర్ చేపట్టిన మంచి పనులన్నీ కొనసాగిస్తాను. వాటితో పాటు కొత్తగా ఏయే పనులు చేపట్టాలన్న దానిపై రెండు మూడు వారాల్లో అన్ని విభాగాల అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటాను. మూడు నెలల్లో పాలనను గాడిలో పెడుతాను. సాక్షి : శాంతి భద్రతలు.. ధరల నియంత్రణపై కామెంట్? కలెక్టర్ : ఎస్పీతో సంప్రదించి శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఈవ్‌టీజింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ ప్రభుత్వ ప్రాధాన్యత. ఇందుకోసం సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల సమన్వయంతో కృషి చేస్తాను. ముఖ్యంగా నిత్యావసరాలను నిల్వ చేసి, కృత్రిమ ధరల పెరుగుదలకు పాల్పడే వారిపై, నకిలీ విత్తన వ్యాపారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం. -
బొకేలొద్దు.. మొక్కలివ్వండి
కర్నూలు (ఓల్డ్‌సిటి) : ఫంక్షన్లలో బొకేలకు బదులు చిన్నమొక్కలు ఇచ్చే సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. కోరారు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలో కృషి చేయాలన్నారు. ఆంద్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్టక్చర్ కర్పొరేషన్ అండ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కల్లూరు ఏస్టెట్స్‌లో పారిశ్రామిక పర్యావరణ మెరుగుదల కార్యక్రమం నిర్వహించారు. ఏపీఐఐసీ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి జూలై 5వ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమంలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే అంశంపై చర్చించారు. పరిశ్రమలే ప్రధానం: వాతావరణ కాలుష్యానికి చాలా వరకు పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, ఇతర వాయువులే కారణమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని జేసీ కన్నబాబు పారిశ్రామిక వేత్తలకు సూచించారు. ప్రతీ కుటుంబం నాలుగు కార్లను వాడడం ఫ్యాషన్‌గా మరిందని, ఒక్కకారు వాడితే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించిన వారవుతారన్నారు. కార్యక్రమంలో సుందర్రావ్ (జీఎమ్‌డీఐసీ), రమణ (సెట్కూర్ మేనేజర్), సుభాన్ (ఏపీపీసీబీ), శ్రీనివాసరావ్ (ఏపీఎస్ఎఫ్సీ), సిల్వర్జూబ్లి కాలేజీ లెక్చరర్ రంగనాథ్, సర్వీస్ సొసైటీ చైర్మన్ జీఆర్‌కెరెడ్డి, రంజిత్(జడ్‌ఎమ్ ఏపీఐఐసీ) తదితరులు పాల్గొన్నారు. -
నిండా మునిగాం
కన్నబాబు,చింతలపూడి వేదన పంచకర్ల,అవంతి తీరూ అంతే గంటా తీరుపై గరం గరం సాక్షి, విశాఖపట్నం : పది మంది బాగు కోసం ఒకర్ని చంపడానికైనా లేదా చావడానికైనా.. సిద్ధం! ఇది ఓ హిట్ సినిమా డైలాగ్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరు దీనికి పూర్తిగా వ్యతిరేకం. నలుగుర్ని ఇబ్బందిపెట్టయినా తను బాగుపడితే చాలనుకుంటారు. ఇదీ ప్రస్తుతం ఆయన్ని నమ్మి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల ఆవేదన. తనకు నచ్చిన స్థానాన్ని దక్కించుకుని,ఆయన వెం ట నడిచిన తమను మాత్రం నట్టేట ముంచారంటూ వీరు వాపోతున్నారు. ఎన్నికలకో పార్టీని/స్థానాన్ని మార్చే ఆయన తీరును ఇప్పటికి గుర్తించగలిగామని చెప్తున్నారు. గంటాను పూర్తిగా నమ్మి,ఆయనపైనే భారం వేసిన ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబులకు టీడీపీలో స్థానం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు,పంచకర్ల రమేష్‌బాబులు గంటా వెంట పార్టీలో చేరినా తమ ‘అర్థ’బలాన్ని నమ్ముకున్నారు. దీనికి ప్రతిఫలంగా అవంతికి అనకాపల్లి లోక్‌సభ, పంచకర్లకు యలమంచిలి అసెంబ్లీ కేటాయించేందుకు అధిష్టానం అంగీకరించినట్టు తెలిసింది. గంటా పుణ్యమా అని అనకాపల్లిలో పార్టీ శ్రేణులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నాయి. అవంతికి కేటాయించారన్న వార్తలొచ్చిన వెంటనే అనకాపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి విధ్వంసం సృష్టించారు. యలమంచిలిలో కూడా ఇదే పరిస్థితి. తనకు కనీస అవగాహనలేని ప్రాంతాన్ని కేటాయిస్తే ఎలా నెగ్గుకొచ్చేదని పంచకర్ల ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెపైచ్చు ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్న సుందరపు విజయ్‌కుమార్ వర్గం పార్టీకి వ్యతిరేకంగా ఆదివారం ఆందోళనకు దిగింది. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, రోడ్డుపై బైఠాయించారు. కిరోసిన్ పోసుకుని కొందరు ఆత్మహత్యాయత్న హెచ్చరికలు కూడా చేశారు. చింతలపూడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు పావులు కదుపుతున్నారు. కన్నబాబు కూడా ప్రత్యామ్నాయాల ఆలోచనల్లో ఉన్నారు. ఇంకా అనకాపల్లి లోక్‌సభ, అసెంబ్లీ, భీమిలి, యలమంచిలి స్థానాలపై అధికారిక ప్రకటన రాకముందే పరిస్థితి ఇలా ఉంటే అభ్యర్థుల్ని ప్రకటిస్తే పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో నెలకొంది. మరోవైపు నగరంలో ఉన్న గంటా ఇంటి ముందు అనకాపల్లికి చెందిన కొందరు కార్యకర్తలు గంటా అనకాపల్లిలోనే పోటీచేయాలంటూ ఆదివారం నినాదాలు చేశారు. ఎన్నికలకో నియోజకవర్గం మార్చే గంటా శ్రీనివాసరావు అనకాపల్లిలో తన చరిష్మా తగ్గలేదని నిరూపించుకునేందకు ఈ ఎత్తుగడ వేశారని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. -
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 1,562 పోలింగ్ కేంద్రాలకే బీఎస్ఎన్ఎల్ టవర్లు అందుతున్నాయని తెలిపారు. మిగిలిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వెబ్ క్యాస్టింగ్‌కు ఉన్న అవకాశాలను సమీక్షించాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బీఎస్ఎన్ఎల్, విద్యుత్, నిక్ సాంకేతిక నిపుణుడు, సెక్టోరల్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన కమిటీ అన్ని పోలింగ్ కేంద్రాలను సమగ్రంగా పరిశీలించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్ఐసీ టెక్నికల్ డెరైక్టర్ నూర్జహాన్ కూడా పాల్గొన్నారు. -
యలమంచిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబుకు షాక్
అక్రమ ఇళ్ల నిర్మాణాలపై విశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. అక్రమ నిర్మాణాలపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు యలమంచిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబుకు షాకిచ్చింది. నగరంలోని అక్రమ నిర్మాణలకు ఎమ్మెల్యే పాల్పడినట్టు ట్రిబ్యునల్ తప్పపట్టింది. అక్రమంగా నిర్మించిన ఇంటిని జూన్ 29లోగా ఖాళీ చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ట్రిబ్యునల్ తీర్పుపై ఎమ్మెల్యే కన్నబాబు ఇంకా ఏమి స్పందించలేదు. ఇటీవల ఓ ప్రయివేటు కేసుకు సంబంధించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై పోలీసు అధికారులతో పాటు ఎమ్మెల్యే కన్నబాబు, మరో ఇద్దరు పట్టు పరిశ్రమ ఉద్యోగులు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేయాలని విశాఖ జిల్ఆ పాడేరు కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదంతోపాటు తాజాగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పుతో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. -
యలమంచిలి ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
పాడేరు : యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రయివేటు కేసుకు సంబంధించి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై పోలీసు అధికారులతో పాటు ఎమ్మెల్యే కన్నబాబు, మరో ఇద్దరు పట్టు పరిశ్రమ ఉద్యోగులు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేయాలని విశాఖ జిల్ఆ పాడేరు కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాడేరు పోలీసులు నిన్న ఎనిమిదిమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో పాడేరులో పనిచేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు బాలసూర్యారావు, వెంకట అప్పారావు, ఎస్ఐలు శోభన్ బాబు, శంకరరావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, సెరీకల్చర్ ఉద్యోగులు ధనలక్ష్మి, రత్నకుమారిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాడేరుకు చెందిన సామాజిక కార్యకర్త అల్లాడి శ్రీనివాసరావుకు రెండేళ్ల కిందట కన్నబాబు ఫోన్లో బెదిరించారనే ఆరోపణలపై పాడేరు నాయ్యస్థానంలో ప్రయివేటు కేసు నమోదు అయ్యింది. దీనిపై అప్పట్లో పనిచేసిన వీరంతా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అల్లాడి పలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి తదుపరి చర్యలకు పాడేరు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
అక్రమార్కుల దెబ్బకు తరిగిపోతున్న ఇసుక దిబ్బలు
తుంగభద్ర నదీతీరప్రాంత గ్రామాలకు పెట్టని కోటగా.. ప్రకృతి ప్రసాదించిన రక్షాకవచంగా నిలిచిన ఇసుక దిబ్బలు అక్రమార్కుల దెబ్బకు కరిగిపోతున్నాయి. వారికి కాసులు కురిపిస్తూ.. జనాన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట పడకపోతే.. భారీ వర్షాలకు ఊళ్లన్నీ జలఖడ్గానికి బలయిపోతాయి. అప్పుడు ప్రజలకు మిగిలేది కన్నీళ్లే.. పర్యావరణవేత్తలు చేస్తున్న ప్రమాద హెచ్చరికలివి. అయినా కొందరు అధికారులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక్క పంచలింగాల గ్రామంలోనే ఇసుక అక్రమరవాణా వ్యాపారం నెలకు రూ. 20కోట్లపైమాటే. ఇసుకాసురుల నుంచి వచ్చే నజరానాలు వారి కళ్లు కప్పేస్తున్నాయని జనం దుమ్మెతిపోస్తున్నారు. జాతీయ రహదారిపైనే నిత్యం వందల వాహనాల్లో ఇసుక తరలిపోతున్నా సంబంధిత శాఖలేవీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జేసీ ఆదేశాలు బేఖాతర్.. తుంగభ్రద నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. అక్రమార్కులు అనుమతులు లేకుండా తవ్వుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు రంగంలోకి దిగారు. తానే స్వయంగా అర్ధరాత్రి వేళ తనిఖీలు చేశారు. నిజమేనని నిర్ధారించారు. ఇసుక మాఫియాకు అధికారుల సహకారాన్ని నిగ్గు తేల్చారు. పద్ధతి మార్చుకోవాలని కఠినంగా హెచ్చరించారు. అయినా ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. ఇసుక రవాణాదారులతో చేతులు కలిపి ‘రాత్రి వేళల్లో తరలించండి.. తనిఖీలుండవు’ అని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే జేసీ తనిఖీల తర్వాత కూడా అక్రమ రవాణా ఆగలేదు. పైగా మాఫియానే ఉన్నతాధికారుల కదిలికలపై కౌంటర్ నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. వీరికి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల నుంచి మంచి తోడ్పాటు అందుతోంది. పంచలింగాల, మునగాలపాడు, దేవమడ గ్రామాల వద్ద నుంచి రోజూ రాత్రి వేళ 50 నుంచి వంద లారీల ఇసుక తరలిస్తున్నారు. నిజానికి పంచలింగాలలో అధికారికంగా ఇసుక రేవులు లేవు. ఇక్కడ తవ్వుతున్నవన్నీ అనధికారిక క్యారీలే. ఇక్కడ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి రాత్రి వేళ క్షణాల్లో జేసీబీల ద్వారా లారీలకు లోడింగ్ చేసి హైదరాబాద్‌కు పంపుతున్నారు. ప్రైవేటు స్థలాల్లో డంపింగ్.. ఉన్నతాధికారులు తనిఖీ చేసినా దొరకకుండా ఇసుకాసురులు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రైవేటు స్థలాల్లో డంప్ చేసి రహస్యంగా అక్కడి నుంచి అవసరం మేరకు తరలిస్తున్నారు. పంచలింగాలలో నిత్యం మూడు, నాలుగు డంప్‌లలో 40, 50 లారీలకు సరిపడా ఇసుక నిల్వలు ఉంటాయి. ఈ ఇసుకను స్థానిక నిర్మాణాల కోసం అన్నట్లుగా ఇసుక కుప్పలు పోస్తున్నారు. రాత్రివేళ తరలిస్తున్నారు. ఇటీవల అక్రమార్కులపై ఉన్నతాధికారులు నిఘా పెట్టడడంతో పంచలింగాల నదిలో నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అవతలి గట్టున ఉన్న పుల్లూరు గ్రామంలోని బీడు భూములను లీజుకు తీసుకొని అక్కడ డంపింగ్ చేసి.. అక్కడ్నుంచి లారీల్లోకి లోడింగ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజు 50 లారీలకు పైగా అక్రమంగా తరలిస్తున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్ల లోపు దూరంలోనే ఇదంతా జరుగుతున్నా.. కర్నూలు నుంచి జేసీ కన్నబాబు వచ్చి తనిఖీ చేయడం మినహా.. ఏ అధికారీ పట్టించుకోవట్లేదు. ఇసుక డంపులను సీజ్ చేసిన కలెక్టర్... అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్టే వేసేందుకు స్వయంగా కలెక్టర్ సుదర్శనరెడ్డి నడుంబిగించారు. గురువారం కలెక్టర్, ఎస్పీ రఘురామిరెడ్డితో కలిసి పంచలింగాల గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఆ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు డంపులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని, రవాణా శాఖ అధికారుల సహకారంతో గురువారమే అక్కడ్నుంచి వీలైనంత ఇసుకను తరలించాలని హౌసింగ్ పీడీ రామసుబ్బుకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక తనిఖీలు చేయాలని కలెక్టర్ నిర్ణయించడంతో.. జాతీయ రహదారిపైన నిరంతరం నిఘా పెట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. -
కాంగ్రెస్ నేతల మధ్య బాహాబాహి
-
కాంగ్రెస్ నేతల మధ్య బాహాబాహి
కాకినాడ: పట్టణంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు అనుచురుడు అచ్యుతరామయ్యపై రూరల్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ దాడికి పాల్పడ్డారు. ఇరువురు కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కాస్తా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గత నాలుగు రోజుల కిందట పంతం గాంధీమోహన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు తాళం వేయడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వేసిన తాళంను రెండు రోజుల కిందట కి అచ్చుతరామయ్య పగులగొట్టారు. ఈ ఘటనపై గుర్రుగా ఉన్న పంతం గాంధీ మోహన్ అవకాశం కోసం వేచి చూసి అతనిపై దాడికి దిగాడు. ఆదివారం కాపు సంఘం సమావేశం జరుగుతుండగా అచ్చుతురామయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న అనంతరం పంతం గాంధీ మోహన్ అచ్చతురామయ్యపై చేయి చేసుకున్నాడు. దీంతో జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో పలువురు కాంగ్రెస్ నేతల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి