పట్టణంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు అనుచురుడు అచ్యుతరామయ్యపై రూరల్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ దాడికి పాల్పడ్డారు. ఇరువురు కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కాస్తా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గత నాలుగు రోజుల కిందట పంతం గాంధీమోహన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు తాళం వేయడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వేసిన తాళంను రెండు రోజుల కిందట కి అచ్చుతరామయ్య పగులగొట్టారు. ఈ ఘటనపై గుర్రుగా ఉన్న పంతం గాంధీ మోహన్ అవకాశం కోసం వేచి చూసి అతనిపై దాడికి దిగాడు. ఆదివారం కాపు సంఘం సమావేశం జరుగుతుండగా అచ్చుతురామయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న అనంతరం పంతం గాంధీ మోహన్ అచ్చతురామయ్యపై చేయి చేసుకున్నాడు. దీంతో జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో పలువురు కాంగ్రెస్ నేతల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి
Published Sun, Aug 4 2013 7:52 PM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement