pantam gandhi mohan
-
జనసేనలో సీట్లు చిరంజీవి ఇచ్చారా?
సాక్షి, కాకినాడ: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ మంగళవారం జనసేనకు రాజీనామా చేశారు. పెద్దాపురం అసెంబ్లీ సీటు ఆశించి ఆయన భంగపడ్డారు. జనసేన అభ్యర్థిగా నిలిచిన తుమ్మల రామస్వామికి సహకరించమని కూడా పార్టీ నుంచి ఎవరు అడగకపోవడంతో అవమానంగా భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పంతం గాంధీమోహన్ (ఫేస్బుక్ ఫొటో) పవన్ అన్నయ్య చిరంజీవిని అందరు వదిలి వెళ్ళిపోయినా తాను ఒక్కడినే ఆయనను వదలలేదని గాంధీమోహన్ తెలిపారు. చిరంజీవికి చెప్పే జనసేనలో చేరానని, బహుశా ఆయనతో ఉండడం వల్ల తనకు టిక్కెట్ రాలేదని భావిస్తున్నట్టు తెలిపారు. ‘మా అన్నయ్య చిరంజీవికి అన్యాయం జరిగిందని ప్రతి సమావేశంలో పవన్ మాట్లాడతారు. ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి నాకు ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నాను. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని చెబుతున్న పవన్.. జనసేన పార్టీలో అభ్యర్ధులకు టిక్కెట్లు ఎలా ఇచ్చారో గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి. జనసేనలో సీట్లు చిరంజీవి ఇచ్చారా, టీడీపీ ఇచ్చిందా? నాకు చీకటి ఒప్పందాలు, రాత్రి రాజకీయాలు తెలియవ’ని పంతం గాంధీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
టీవీల్లో కనిపించడానికి నేనూ మాట్లాడగలను: సిఎం కిరణ్
కాకినాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో టిడిపి ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీల్లో కనిపించడానికి, పత్రికలకు ఎక్కాలంటే తాను కూడా గట్టిగా మాట్లాడగలనని హెచ్చరించారు. వరద ప్రాంతాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వరద సహాయంపై కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారుల పనితీరు బాగోలేదని పెద్దాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ సిఎంకు ఫిర్యాదు చేశారు. అదే సందర్భంలో రాజానగరం తెలుగు దేశం ఎంఎల్ఎ పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ అధికారులు మీ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు. దాంతో సీఎం అతనిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
కాంగ్రెస్ నేతల మధ్య బాహాబాహి
-
కాంగ్రెస్ నేతల మధ్య బాహాబాహి
కాకినాడ: పట్టణంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు అనుచురుడు అచ్యుతరామయ్యపై రూరల్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ దాడికి పాల్పడ్డారు. ఇరువురు కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కాస్తా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గత నాలుగు రోజుల కిందట పంతం గాంధీమోహన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు తాళం వేయడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు వేసిన తాళంను రెండు రోజుల కిందట కి అచ్చుతరామయ్య పగులగొట్టారు. ఈ ఘటనపై గుర్రుగా ఉన్న పంతం గాంధీ మోహన్ అవకాశం కోసం వేచి చూసి అతనిపై దాడికి దిగాడు. ఆదివారం కాపు సంఘం సమావేశం జరుగుతుండగా అచ్చుతురామయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న అనంతరం పంతం గాంధీ మోహన్ అచ్చతురామయ్యపై చేయి చేసుకున్నాడు. దీంతో జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటనతో పలువురు కాంగ్రెస్ నేతల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి